Friday, 2 February 2018

తాను నేను

నా అక్షరాలను చూస్తే ఆవేశం..
నీ అనుభవాలను రాస్తే రోషం..
నువ్వు చేసిన గాయాలకు మూలిగితే ఆక్రోషం..
నే ఎదురైతే నటించడం కూడా మరిచేంత కసి..

నా కన్నీళ్ళు నిన్ను కదిలించలేదు..
నువ్వు చిదిమేసిన కలలు నిన్ను కలవర పెట్టలేదు..
నువ్వు ఆడిన ఆటలలో చిదిగిన నా మనసు మూలుగు నిన్ను తాకలేదు..
నువ్వు  ఇచ్చిన నమ్మకాన్ని నువ్వే చిదిమేసినప్పుడు.. నా ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవ్వడం నీ ఊహకు కూడా అందలేదు..

పాలలో నీళ్ళను వేరు చేయడం ఎలాగో నువ్వు చేసి చూపిస్తుంటే.. చిధ్రమైన నా ప్రాణం నీ ఊహకు తట్టలేదు..

కానీ, గతం గతః అని వదల లేని నా ఙాపకాల అక్షరాలలో ఒదిగిన.. నువ్వనే భావం చూసి మాత్రం ఎంత ఆవేదన చెందుతున్నావో‌ కదూ...
మరి నువ్వు నా స్థానంలో ఉంటే ఎమౌతావసలు...
నేనే నీ స్థానంలో ఉంటే...
ఏం చేసే వాడివి...
చూడాలని ఉంది కానీ వద్దులే...

✍️అరుణిమలు

No comments:

Post a Comment