Wednesday, 8 August 2018

తాను నేను

నేనేంటి నీకని ఎప్పుడు అడగకు
చెప్పడానికి మాటలు చాలని భావం నాది..!!

నేనెంత వరకు నీకని అడగకు ఎప్పుడు
నా నీడను కూడా వదిలేసేంత పిచ్చని చెప్పలేను..!!

గతం గతః అని నువ్విచ్చే సలహా
భవిష్యత్తు మీద మరకలా కనిపిస్తుంది..!!

మరకను చెరిపేయ్ వీలైతే...గతమనే గాయం
మానిపోతుంది, మరుపై మరుగున పడిపోతుంది..!!

✍️అరుణిమలు

No comments:

Post a Comment