Wednesday, 8 August 2018

తాను నేను

ఆలోచనలను తవ్వి అందులో నీ ఙ్ఞాపకాలను పాతేయాలని ఉంది...

పాతుకుపోయిన నీ తలపులను తరిమేయ లేక...
తల వంచని నా అభిమానాన్ని తక్కువ చేయలేక...

అహంకారాల నడుమ నలిగే మనసు వేదన
మస్తిష్కానికి తప్ప ఎవరికి ఎరుక...

హ్మ....మాటలకే మనం
చేతలలో
ఎవరు మనం....

అయినా మనసు కెందుకో ఈ అలజడి...
నేనే నిజం అనే మూర్ఖత్వం కోసమా...

నేనో అబద్దానిగా నీ ముందు నిలవ లేను..
నిన్నో అబద్దానిగా చూపించను లేను..

మర్యాదలు గడప దాటనంత వరుకే
నీకోసం నీ ముందు తలవంచేది..
నలుగురిలో కాదురా..!!

ఎవరికి వారమే...
ఒకరికొకరు ఎవరమో ఇక...!!

✍️అరుణిమలు

No comments:

Post a Comment