కబురంపనా పదాలతో
పేచీ పెట్టనా పలకరింపులతో..!!
పిలిచేయనా ఒకసారి మూగబోయావో
మసక బారావో తెలిసిపోతుంది..!!
వద్దులే పలికితే నీతో తంట
పలకక పోతే నా మనసుతో మరో తగువంట..!!
తాత్కాలికమే అయినా
నీ తలపుల తుంపరులలో తడిసి పోవాలని ఉంది..!!
తడిగానే ఉంది
మనసుతో పాటు కనుల లోగిలి కూడా..!!
చదివేసావనుకున్న నా మనసుని
ఎక్కడ నన్నే తెలుసుకోలేదు ఇంకా..!!
ఊసుపోని రాతలే ఇవి
ఊహాలకే చోటిక్కడ..!!
నువ్వు
నేనెక్కడ.. !?
✍️అరుణిమలు
No comments:
Post a Comment