నువ్వు ఇక్కడ వదిలిన పరిమళాలు
నీ ఊహలను వాడిపోనివ్వడం లేదు...
నీ ఙ్ఞాపకాలతో సాగుతున్న పయనంలో
అడుగడుగునా నువ్వే కదా...
నీ పిలుపు వినపడలేదేమో కానీ
నీ మాటల మకరందం నన్ను అంటుకుని వదల లేదే...
తేనెలూరే పెదవుల నడుమ నలుగుతున్న
నీ పేరు మీద ఒట్టు...
ఇది మన ఇద్దరి గుట్టు
ఆ పెరుమాళ్లకే ఎరుక...
✍️అరుణిమలు
No comments:
Post a Comment