ఎన్నో పంచాలి, పంచుకోవాలి అనుకున్న..
ఆశతో వచ్చావని ..ఆశించింది దక్కాక ఉండవని తెలియక..
నీకేం కావాలో అడిగావు కానీ...
నాకేం కావాలో అడగలేక పోయావు..
అడిగిన తీర్చలేవని తెలుసేమో ఈ మనసుకు....
ఇవ్వడమే నేర్పింది కానీ... ఆశించడం నేర్పలేదు
అడగని విలువను మాత్రం ఇవ్వలేక పోయావు
నీ మాటలన్ని నీటి మూటలే
నీ చేతలన్ని శిలాక్షరాలే
నీ బాసలన్ని గాలిలో రాతలే
ఇంకా ఇక్కడ ఇంతింతై మిగిలిపోయింది ఏంటో
నీపై నా ప్రేమ....ఇదేం ప్రేమ
ఆట గాడివై వచ్చి...మనసును వేటాడి పోయావు
గాయాలు కదా మరచిపోనివ్వవు
అలాగని మానిపోనివ్వవు
✍️అరుణిమలు
No comments:
Post a Comment