కొన్ని ఆనందాలను కొలవ లేము
కొనడానికి ఆత్మీయతే మూలకం
దాచుకునే కొద్ది పెరిగేదే
ఆ ఙ్ఞాపకాల సంపద
ఇందనం మన ఇష్టమే
ఏ కష్టం చెదర గొట్టలేనంత
నిండుగా ఉంది కదూ..
రాసులుగా పోసిన నవ్వులలో
ముసిముసి సిగ్గులన్ని దాగున్నాయి..
ఇద్దరం ఒకటై నడయాడిన కాలాన్ని తిరిగి చూడు
తవ్వే కొద్ది బయట పడే నిధి నిక్షేపాలు ఎన్నో అక్కడ
అప్పుడప్పుడు నా మౌనాన్ని కూడా
చదివి చూడవోయ్..
విప్పి చెప్పలేని పిచ్చి ప్రేమ ఎంతుందో నీపై తెలుస్తుంది..
✍️అరుణిమలు
No comments:
Post a Comment