Wednesday, 8 August 2018

తాను నేను

నా చూపులను నీతో ముడి వేసుకున్నావేమో
నిను వీడి రానంటున్నాయి..

నా కోరికలను‌ కదిలించావేమో
కనికరం లేకుండా నీ తలపులలో ముంచేస్తున్నాయి..

నీ ఊహ వెచ్చగా తాకుతుందోయ్
అధరాలకు చెమట పట్టిదామనే అత్యాశతో..

నీ తలపులలో నా స్థానం ఏమిటి
నీ ఊహలలో నా చర్యలు ఏమిటి
నీ కలల్లో నా కవ్వింపులు ఏమిటి

ఇవి ప్రశ్నలా...పరీక్షా
లేక పరోక్షంగా నా కోరికలా..

నీతో గడచిన ఒక గడియ కూడా
గమ్మున ఉండదే
గుండెలో గుట్టుగా దాగిపోవాలనే ఆరాటం..

ఎన్నెన్ని దారులలో నా తలుపులు
పయనించిన
అవి చేరేది నువ్వున్న చోటుకే కదా...

అక్షరాలలో ఉన్న ఈ హింస
నాకు ఆమోదమే
నువ్వనే బాధ నాకు ఇష్టమే..

✍️అరుణిమలు

No comments:

Post a Comment