ఎంత దౌర్జన్యమో కదా నా ఆలోచనలను కబ్జా చేసేసావు
వశమే అయ్యానో వశం చేసుకున్నావో..
నియంతలా నువ్వు మారినా
నీ నీడన ఉండాలనే ఈ బేలతనం దేనికో..
నీ పంతాలను నెగ్గిస్తూ నే ఓడుతున్న ప్రతీసారి
నన్ను నేను పోగొట్టుకుంటునే ఉన్న..
నీకోసం నన్ను నేను తగ్గించుకుంటు
నీ చెంతన చెమ్మ అంటని చెలమలా మిగిలా..
ఏదో ఆశ.. ఏదో ఒక రోజు అర్థం చేసుకోవా అని..
అర్ధం కాక కాదని తెలుసు..కానీ మనసును మాయ చేస్తున్న..
అవును ఆడించేది అదే కదా...
తగ్గమంటు, తలొగ్గమంటు బంధమంటూ, జీవితం అంటూ చెవిలో పోరు పెడుతా ఉంటుంది..
అహంకారాల గోడల నడుమ
అనుబంధాలకు ప్రాణం పోయడానికి
చిన్ని మనుసును ఎన్నెన్ని సార్లు చిదిమేయాలో..
చిరునవ్వును పులుముకుంటు
దుఃఖాన్ని దాచేస్తు
నాకేం తక్కువ అని
లోకానికి చూపించడంలో
ఆరి తేరిన నటులం కదా పడతులం..
✍️అరుణిమలు
No comments:
Post a Comment