Saturday, 9 November 2019

తాను నేను

ఏదో తెలియని
ఎద యాతనను ఏమని చెప్పేది..

ఆ భావానికి భాష లేదా
అన్నట్టు ఉంది..

కానీ, కదిలిస్తునే ఉంది
కన్నీటి కొలనను..

మనసు విప్పి చూస్తే
మౌనం దాగుంది..

పెదవి తెరవమంటే
తడబడుతుంది నీ ముందు..

ఏకాంతంలో కూడా బయట పడని
ఈ కాంత మనసులో
ఏ కాస్తంత చోటు ఉంది అంటే
అది ఈ అక్షరాలకే కదా..

అల్లంత దూరాన ఉన్న నువ్వు
కనులలో బందీగా మారావు కానీ
బాహువులలో కాదుగా..

బంధం బలమైనదే
కానీ సమయమే లేదు దానికంటు..

ఇష్టాలు, కష్టాలు, కోపాలు
అన్ని నిరీక్షణలో నిర్వీర్యం అవుతున్నాయి
నిను చేరకుండా
నీతో పంచుకో కుండానే..

రాలిన చుక్కలలో రాతలు
ఆరిపోతుంటే..
నన్ను పలకరిస్తుంది
ఓ అరనవ్వు..

ఆశలే ఉన్నాయో
ఆవేదనే ఉందో
అందులో..

అభిమానం అడుగు ముందుకు వేయనివ్వదు
మనసు దూరాన్ని చూపించి నుసి చేయడం మానదు..

ఎలా మొదలైందో తెలియని ఈ గాధ
ఎటు వైపు పోతుందో చూస్తూ ఉన్న ఇలా..

ఙ్ఞాపకాలే మిగులుతాయో
నిర్వేదమే మిగులుతుందో చివరకు..

✍️అరుణిమలు

No comments:

Post a Comment