ఎన్నాళ్ళో అయ్యింది మాట్లాడి అంటావు
నిజమే........
చెప్పమంటే...
ఏముంది అంతా ఓకే
అంటావు...
ఇంకేంటి
అనే కంచె ఒకటి మధ్యలో...
కలుసుకోలేం...
కనీసం మాటకు కూడా కాలమే
లేనిచోట చెరో వేపు ఉన్నాం...
నువ్వు లేని
సమయంలో పోగేసిన ఊసులు ఎన్నో
నేను ముందు అంటే నేను ముందు అంటుంటే..
గడియారం చప్పుడుతో పాటు
పరిగెత్తడం నచ్చక నీరసించి పోతుంటాయి
నా మాటలు, నా రాతలు..
నా చూపులు నిను
వెతికినంత సమయం కూడా
నువ్వు నా ముందు నిలవవు...
గాలిలా వచ్చి
మెరుపులా మాయం అవ్వడం
నీ గొప్పతనం ఏమో...
నీతో కన్నా
నీ ఙ్ఞాపకాల సహవాసం అలవాటుగా మారితే
రేపు నువ్వు ఎదురుగా ఉన్న
ఏ చోటనున్న ఒకటే ఏమో నాకు...
కావాలని ఎదురుచూసే వారు
ఎప్పుడు ఉంటారు
కాకపోతే ఎదురుచూపులే ఉండవు తర్వాత...
నీ లోకం వేరైనప్పుడు
నీ దారి నా వేపు కానప్పుడు
నా పరిధిలోకి ఎందుకు వచ్చావోయ్..
✍️అరుణిమలు
No comments:
Post a Comment