Saturday, 9 November 2019

తాను నేను

ఏదో అడగాలని ఉంటుంది...
అదేంటో తెలియదు..
ఎలా మొదలు పెట్టాలో తెలియదు...

మనసు తొందర పెడుతుంది
పెదవి జంకుతుంది..
కళ్ళల్లో కలవరం
ఎద శరవేగంతో పరుగులు పెడుతుంది..

చుట్టూ వేడేక్కుతున్న వాతావరణాన్ని
నిట్టూర్పులతో ఆర్పుతూ..

నేనే అడగాలా
నువ్వే ఏదైనా అడగొచ్చు కదా..

ఏదోకటి..
నువ్వే ముందుకు అడుగేసి
ఈ గుండె వేగాన్ని అదుపు చేయొచ్చు కదా..

ఇలా...
నీకోసం ఎన్ని ఆలోచనలో
ఎన్ని తలపులో
చెప్పాలని ఉన్న చెప్పుకోలేక పోయిన మాటలు ఎన్నో..

ఈ మనసు పుస్తకంలో
లిఖిస్తునే ఉన్న...

నీ చేతులతో ఎప్పుడు సంతకం చేసావో
ఈ ఎదపై...
ఆనాటి నుండి నువ్వనే భావాల అక్షరాలలో తప్పిపోయా...

ముగింపు ఎరుగని పదాలివి
మరో ప్రారంభానికి త్వర పడుతూ
నువ్వనే గమ్యాన్ని వెతుకుతూ సాగుతున్నాయి..

✍️అరుణిమలు

No comments:

Post a Comment