కొన్ని అనుభవాలు
నీటి తరంగాలు లాంటివి..
కదులుతూ ఉంటాయి
కదిలిస్తుంటాయి..
కంటిలో వాన చినుకులా
మదిలో ఆశ తునకలా..
ఏ పరిచయం ఏ జన్మ వరమో
గుండెలకు హత్తుకున్న అనుభూతులు..
ఎదను కదిలించిన
రేపటి జాడలు..
నిన్నటితో
ముడి వేసిన ఙ్ఞాపకాలు..
నమ్మకాల జాడలలో
నమ్మించలేని వాస్తవాలలో
నలిగిన మనసు చేజారింది..
నిన్ను విడిచి
నిజాన్ని చూసానేమో..
నన్ను విడిచి నా నమ్మకం వదిలి పోయింది..
అవాస్తవాల నీడన
హాయిగా గడిచిన కాలం ఒకపక్క..
వాస్తవాల నిప్పులపై
ఒంటరి నడకలు నేడు ఇక్కడ..
అవసరాల లోకంలో
అన్ని అంగడి సరుకులే
నమ్మకమే పెట్టుబడి
మనసే లోకువ ఇక్కడ
గెలుపోటముల గాలి వానలో
ఈ మనసు ఏ గూటికి చేరేనో..
నిన్ను అందుకోవాలని లేదు
భవిష్యత్తులో నువ్వో అలజడి కాకూడదు
ఈ మనసులో..
పొరపాటు మాటున
నువ్వో మరుపువైన పాఠానివి ..
అంతే..!!
✍️అరుణిమలు
No comments:
Post a Comment