Friday, 15 May 2020

తాను నేను

చీకటికి చాలా చెప్పుకుంటా...
దానికి పక్కవారికి పంచే అలవాటు లేదనే ధైర్యంతో..

నిశ్శబ్దంగా ఉన్నచోట
గుండె సడి ఎన్నో చెబుతుంది..

అలుపో....ఆశలో
ఎదలో‌ దాగిన కందకాన్ని తవ్వుతుంది..

ఇన్నాళ్ళు మన మధ్య ఉన్నది అబద్దమా
నువ్విచ్చిన మాట నిజమేనా..

మన దారులు వేరంటు
నా నీడ నన్ను వదిలి పోతుంది నేడు..

గుండెల మీద గుద్ది
నువ్వు కదిలి పోతుంటే...

మనసెందుకో ఇంకా బతికే ఉంది
మరుజన్మ దేనికి ఈ జన్మకు నా మనసుకు తోడు నువ్వనుకున్నందుకా...

నిన్ను ఎంత ఎత్తున నేను ఊహిస్తే దేనికి...
నాకు నువ్వు ఇచ్చిన‌ చోటు నీ పాదాల దగ్గర అని తెలిసాక...

అంతా శూన్యంలా ఉంది
మనం అనే మాట మూగబోయింది..

కత్తి మీద సాము చేస్తుంది ఈ మనసు ఇప్పుడు
గాయాలు తప్ప ఙ్ఞాపకాలు లేవు అక్కడ..

కంటిలో ఏ నలుసు ఉందో
కళ్ళకు‌ అలసట తీరడం లేదు..

అధికారం దండించడానికే కాదు 
దగ్గర తీసుకోవడానికి కూడా ఉండాలి..

కొట్టడానికి తప్ప 
కళ్ళు తుడవ లేని చేతులు దేనికి...

రాత్రి వెళ్ళిపోయింది చీకటిని చెరిపేసి
ఏ కన్నీరుతో కడుగుతున్నావో వేకువ కోసం...

✍️అరుణిమలు

1 comment:

  1. అరుణిమలు ఎక్కడ ఉన్నా మరల పూర్తి కొత్త ఉత్సాహం నింపగలుగుతారని ఆశిస్తున్నాము...ధన్యవాదాలు...తెలుగోడు.

    ReplyDelete