నేను అలిగాను ....బుంగమూతి పెట్టాను
ఏం అర్థం కావట్లేదు నాకు...
అవునంటే కాదంటారు..
మాట్లాడితే వసపిట్ట అంటున్నారు..
ప్రశ్నిస్తే గయ్యాళి అంటున్నారు..
అల్లరి చేస్తే ఏంటి ఈ అల్లరి అంటున్నారు...
అసలు నాకు నచ్చినట్టు నన్ను ఉండనివ్వరా...😄 😄
ఫిజిక్స్ చదువుకుందామని Mpcలో జాయిన్ అయ్యాను, పుస్తకం కూడా కొనేసాను...
వాళ్ళేమో ఇక్కడ కాదు B.comలో జాయిన్ అవ్వు అన్నారు...
బ్యాట్మింటన్ నేర్చుకుందామని వెళ్ళి నేను సింధు అంత అవ్వాలి అనుకుంటున్నాను అంటే...
ఇక్కడ కాదమ్మా బుజ్జీ వాలీబాల్ నేర్పేది అని నవ్వుతున్నారు సచ్చినోళ్ళు...
రెండు రెళ్ళు ఎంతని అన్న అడిగితే ఆరు అన్నాను..
నెత్తిమీద ఒకటి మొట్టి పిచ్చిమొద్దు ఇరవైరెండు అవుతాయే అని ఆటపట్టిస్తున్నాడు...
అసలు ఏం జరుగుతుంది ...నాకు అర్థం కాక ఇలా బుంగమూతి పెట్టుకూర్చున్నాను 😩
చిన్నపిల్లని ఇలా confuse చేస్తారా పొండి ఖచ్చి అందరితోను 😁 😁 😁
No comments:
Post a Comment