నువ్వు ఎదురు పడనన్ని రోజులు మనసు వెతికింది..
నీకోసం క్షణక్షణం ఆరాటం...
ఎలా ఉన్నావో అని తపన...
లోలోన గుబులు రేపే ఆలోచనలు
నువ్వు ఎదురైతే ఏం చేయాలని..
ఏం అడగాలని...
ఎలా నీకు నేనేంటో...నా మనసేంటో చెప్పాలని
నా ఊపిరిని వేణువై మలచి
రాగాలే పలికించనా...
నా కనుల లోగిలిలో
జాబిలివి నీవని చూపించనా...
అరచేతి గీతలలో నా రాతవని
నొసటి రాతలో నా జీవిత భాగం నీదని చెప్పనా..
నీ పేరు పలికితే
చిరుగాలి తాకిన లతనై తూలనా..
నిను తాకితే
విరిసిన పువ్వులో పుప్పొడి నై అంటనా..
ఓయ్.............
వచ్చాక ఇవేం జరగక పోయినా పర్వాలేదు
ఎవరు నువ్వు అనకు
అంగీకరించలేని మనసు నిర్జీవమై పోతుంది ఇక్కడ
✍️అరుణిమలు
No comments:
Post a Comment