Wednesday, 8 August 2018

తాను నేను

నీ విశాల హృదయంలో వే వేల తారలలో నేనో తారను మాత్రమే నీకు..
నా మది గగనంలో మాత్రం నువ్వో జాబిలివి...

వెన్నెల సాక్షిగా వరించి
నన్ను హత్తుకున్న నేరేడువి..

నా ఎదురు చూపులన్ని నీ ముందర ఒంపేస్తూ
నా తలపులతో కబురంపుతూ..

అలకల మబ్బుల మాటున
రాలి పోతున్న ఆశల తోకచుక్కలు ఎన్నో..

నీకై తపించే ఒకానొక చుక్కనే నేను
నీ అలంకరణకు దూరంగా ఉన్న తూర్పున పొడిచే పడమటింటి బొట్టును...

✍️అరుణిమలు

No comments:

Post a Comment