ఒక చిన్న చిరునవ్వు చాలు నీ పేదవిపై పుట్టి నా పెదవిపై విరబూసేందుకు
Sunday, 16 April 2017
Tuesday, 11 April 2017
అరుణిమ
అ..ఆ.. : "అ "రుణిమలు "ఆ"రంభిస్తూ..
...................................................
నెవర్ ఫీల్ లైక్ దట్
ఐ యామ్ విత్ యూ
ఏంటీ కబురు ఎక్కడిది ఇదిగో అరుణా జీ చెబుతున్నారు విను.
ప్రతిరోజూ ఆమె ఓ కొత్త వివరం మోసుకువస్తారా.. మేఘం గారికో సందేశం పంపుతారా .. గాలి గారికో గంధం పూస్తారా..
అదే ఆమె ప్రత్యేకం.
నేనంటానా ప్రేమ కోసం ప్రేమ
రసరే రసరే రామ రసం పిబరే పిబరే హ్యూమరసం అని అంటానా..
ఆమె అలా కాదు ఓ హృదయగత నివేదనతో మాత్రమే మాట్లాడుతారు
వెరీ సింపుల్ వర్డ్స్ బ్యూటీఫుల్ ఎక్స్‌ప్రెషన్ వెరీ ప్రెష్ ఫీల్ అండ్ నో ఫ్రస్టేటివ్ ఎఫెర్ట్
చూడండి నా నేస్తం ఏమంటున్నారో..
"మొదలైన ప్రతిసారీ
సరికొత్త ముగింపు దొరకడం మన కథకే చెల్లింది.." అని..!
...................................................
ఇంకా..వినండి ..
"నీ ఆలోచనలకు మెదడును ఇవ్వవే కొంచెం ఓ మనసా.. " అని..!
బాగుంది ఓ సరికొత్త పంథాకో శ్రీకారం. ఇలా ఆలోచనకు ఆలోచనను జత చేయడం
లవ్వాలజీలో మాత్రమే చదివే చాప్టర్. మెదడు గారి వాకిట మెడుల్లా ఆంబ్లాగేటాలో ఏముంది కానీ గాఢత నిండిన ఏకాంతాన్నే కోరుకోని
అందుకే అంటున్నారుగా.. అరుణాజీ..
"ఓ మనసా!
నీ చుట్టూ ఒక లోకం ఉంది ...కోరి వచ్చిన వాళ్ళ వేపు చూడటానికి ఎందుకే భయం...
అన్ని అనుభవాలు ఒకటి కావు కదా...
ఇంకొకరికి చోటిచ్చే అంత చోటు లేదు ఈ మదిలో...
కాస్త మైమరుపునకు అలవాటు పడి నువ్వు బతుకు,నన్ను బతకనివ్వు.. " అని!!
...................................................
అదీ వినుతి అంటే..! బాగుంది..! గాయపడిన గుండె చెంత ఊసులిలానే ఉండును
వేదనో విరహమో మన అనుకునే విహాయస వీధుల చెంత ఉన్నప్పుడు మాత్రమే ఒక లాలి స్వరం అవసరం అగును. ఆఖరిగా.. ఇలా ముగించేయ్ అదీ ఆమె గారి మాటల్లో నే.. నిన్ను నువ్వు తెల్సుకో ఆ పలుకు తేనియల్లోనే.."ఎవరికీ ఏం కానిదానిలా నాకు నేను దూరమైపోయి ఇలా మిగిలాను ... / మేల్కో తొందరగా నన్ను నాకు మిగుల్చు కనీసం.." ఇదీ ఇవాళ్టి అరుణిమ. మధురిమ.మనసు , భావన, ఆలోచన అనే సంగమ క్షేత్రం చెంత వింటూ వింటూ ఆనందించగరా.. నేస్తం!!
#శుభాకాంక్షలతోశంభుమహంతి
Monday, 10 April 2017
అరుణిమ
మనసు పలికే : సరికొత్త అరుణిమ ఇలా..
...................................................................
"నిర్లక్ష్యం ఎంత నిర్దాక్షిణ్యంగా చంపేస్తుందో ఆదరణ అలిసిన వాళ్ళని కూడా
సేద తీరుస్తుంది...కొందరికి ఇవి అర్థం కావు కమర్షియల్ పీపుల్.. " - అరుణ మజ్జి
.................................................................................................
రాస్తాలు విస్తుబోవునిపుడు.ప్రపంచం చిన్నబోవునిపుడు.కాలాలు కంకాళాలు ఇంకా ఇంకొన్ని మౌనమనే ఆశ్రమ ధర్మాన్ని పాటించునిపుడు. ఔను! నీ కోసం నువ్వు.. ఎంతగా పరితపిస్తున్నావో తెల్సుకుని వసంతం కూడా తన గమనం మార్చుకుంటుందేమో! సోకాల్డ్ మనిషిని చూసి..! కోయిల కూజితం కూడా షడ్జమ స్థానం మరిచిపోవునేమో! ఎంతగా నీలో నువ్వు ఎదిగి ఒదిగిపోతున్నావే తెల్సుకుని జన్యుగతాలు సంబంధిత జనితాలు ఎలా..ఎలా.. తమలో తాము కుదించుపోతున్నాయో కదా! పదార్థానికో స్థితి కొత్త స్థితి ప్లాజ్మాని మించిన స్థితి ఇవాళ మాత్రమే నీలో లోలో చూస్తున్నాన్నోయ్. ఔను! కదూ! ఒకరి పతనం నీ పతాక స్థాయి సంతోషానికి సంకేతం. ఔను! కదూ! నిన్ను నువ్వు భూస్థాపితం చేసుకోవు కదూ! అదే నా అనే అహాన్ని ఏటికో కాటికో అప్పగించవు కదూ! బూడిద లాంటి ఈ జీవితానికి కలర్ ఫుల్ లైఫ్ అని పేరెందుకు అబ్బా య్! ఏదీ రంగులమయం కాదు బాస్ మనమే చేసుకోవాలి.చిత్తం గారి చిత్తగింపులు చిత్రంగా వినాలి. ఆదర్శాల మాటకేం గానీ నిన్ను నువ్వు ఇలానే ఇలానే తగ్గించుకుంటూ కుదించుకుంటూ ఒకానొక శిథిలావస్థకు చేరిపో..! ఎక్కడా నీకు ప్రశాంతత నిండిన నీడలు, ఆప్యాయతను నింపుకున్న గాలులూ కానరావు.
.................................................................................................
నా అనుకున్న నీ భావం ఈ భూమండలం మొత్తం పరివ్యాప్తితం చేయాలనుకుంటున్నావ్ కదూ! బాగుంది. నీ అనే ఓ కొత్త సంవాదన పలాయనం చిత్తగించనంత వరకూ..! నీకై నువ్వు ఒంటరిగా పోరాడు బాస్ పోరాడు.లాజికల్ డైమెన్షన్స్ ఎలా ఆవిష్కృతం చేయాలో ఆలోచిస్తూ పోరాడు. కపటం ప్రదర్శించు. నటన ప్రదర్శించు.. ఇంకా ఏవేవో ఎన్నెన్నో చేశాక నీ నుంచి నువ్వు నిష్కృమించు. దీనినే మహాభినిష్కృమణ అని అంటారు వైదిక పరిభాషలో..! ఆనక లోకం నిన్నూ పట్టించుకోదు..ఈవెన్ ఇఫ్ నీ అనుకున్నవారినీ పట్టించుకోదు గాక కోదు.కొంత కాలం ఆగి చూడు ఇదే సత్యమగున్.ఇదే జయాపజయాలకు అతీతమై గొప్ప వాక్కుగా పరిఢవిల్లున్..ఇప్పుడు విను .. వీలుంటే వినిపించు.. నీలో సంస్కారం ఉంటే..
పంచే గుణమే పోతే ప్రపంచ మే శూన్యమన్న కవి వాక్కు.. రుక్కును.. అయినా నీలో మార్పు సాధ్యమా..? మా భ్రమలు తొలిగితే బాగుండు.. ఆకశమా మమ్మల్ని క్షమించు.. నేలమ్మా మమ్మల్ని క్షమించు.తీసుకోవడం ఒక్కటే తెలిసిన మనుషులు ఉన్నంత కాలం మీరు అలానే.. అలానే కొన్ని యుగాల దూరం పాటు క్షమిస్తూ ఉండండి. కొందరి స్వార్థానికి పచ్చందనాలను ఫణంగా పెడుతున్నా.. పెరిగే నీడలను విరగొడుతున్నా చూస్తూ ఊరుకుంటూ ప్రకృతిని చూసి పరిహసిస్తున్నా సహిస్తూ ఉండండి. ఇంకా..ఇంకా..మాలో దుర్బుద్ధికో గొడ్డలి వేటు వేయొద్దు గాక వేయొద్దు . మాకు జ్ఞానం లేదు మా కనులలో కాంతి లేదు శూన్యమయ ప్రపంచం మాదే! తెలియని చోట దాక్కుని తెలిసిన వాటితోనే సరిపెట్టుకునే జీవం మాదే! ఆధునికులుగా చెప్పుకునే మేమంతా అనాగరిక జంతుకులానికి ప్రతినిధులం. మమ్మల్ని మన్నించండి పెద్దలారా! పతితులారా! ఇప్పుడో పరివర్తనకు ఇక్కడో మార్పునకు ప్రారంభ స్థానం నిర్మితం కావాలంటే మహాత్ముడు మళ్లీ పుడితే బాగుండు. పుడతాడా లేడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.సమీప భవిష్యత్‌లో సమూహం మహాత్ముడి లాంటి తోటి మనిషిని ఆదరించే సందర్భాలు పరిచయం అవుతాయా?మళ్లీ ప్రశ్న. సందేహభావుకత వీడితే సంశయాత్మకత వీడితే లోకం అంతా కొత్తగా అగుపించు. సాధ్యమేనా? ఏమో!! కాలం గారికి ఎరుక. వీర బ్రహ్మం గారికి ఎరుక. ఇంకా ఎవరికి ఎరుకనో నాకైతే ఎరుక లేదు. డియర్ ఆల్ నో యువర్ సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్. వేసంగి ఎండలో అదిగో ఆమె గారి నీడ కోసం నేను.. నా నీడ గారి కోసం ఆమె నిరీక్షిస్తూ ..నిరీక్షిస్తూ.. పెరిగి విరిగే మనుషుల గురించి ఆరా తీస్తే ఇదిగో ఇలా తానూ.. నేనూ..
- నీరెండల చెంత రత్నకిశోర్ శంభుమహంతి
Sunday, 9 April 2017
బలం ...బలగం
నిర్లక్ష్యం ఎంత నిర్దాక్షిణ్యంగా చంపేస్తుందో... ఆదరణ అలిసిన వాళ్ళని కూడా సేద తీరుస్తుంది...కొందరికి ఇవి అర్ధం కావు కమర్షియల్ పీపుల్...
Sunday, 2 April 2017
పిచ్చి మనసు
కొత్తగా మొదలైన ప్రతీసారీ
సరికొత్త ముగింపు దొరకడం మన కధకే చెల్లింది..
నీతో నేను సంతోషంగా ఉండటం నీకే కాదు కాలానికి కూడా ఇష్టం లేదేమో..
ఆశ నిరాశలు నాకు రెండు కళ్ళు లావుంది ...
నువ్వు నా సొంతం నా ఊహ వరుకే...
నువ్వెంత విలువైన వాడివైనా నాకు...
నేను నీకు ముఖ్యం కాదనీ తెలిసాక...
నిన్ను పలకరించడానికి కూడా మనసు జంకుతుంది...
చుట్టూ ఎందరుంటే ఏంటి నా చుట్టూ ఏకాంతం గిరిగీసుకుని ఉంది అందులో మాత్రం నువ్వు ఒక్కడివే నా తోడు...
నా భావంలో,నా అక్షరాలలో,నా ఊహల్లో సగభాగం నువ్వు...
నా మనసులో మాత్రం నాకు కూడా స్థానం లేనంతగా ఆక్రమించేసింది నువ్వు ...
నాలో నిన్ను కలిపేసుకున్నాను అనే మాట ఒట్టిమాటే గట్టిమాట కాదులే ...
అన్నింటికి సిద్దపడి ఉన్న మనసే నాది కాని సర్దుబాటుకి ససేమిరా అంటుంది ...
ఎప్పుడు దీనికి అర్ధమవుతుంది నేనేంటి నీకనేది..
ఎప్పుడు తెలుసుకుంటుంది...
ఇంకా ఎన్నాళ్ళు...
ఇంకా చెప్పించుకోవాలా పదేపదే తెలిసిన నిజాన్ని
నీ ఆలోచనలకు మెదడును ఇవ్వవే కొంచెం ఓ మనసా..
నీ చుట్టూ ఒక లోకం ఉంది ...కోరి వచ్చిన వాళ్ళ వేపు చూడటానికి ఎందుకే భయం...
అన్ని అనభవాలు ఒకటి కావు కదా...
ఇంకొకరికి చోటిచ్చే అంత చోటు లేదు ఈ మదిలో...
కాస్త మైమరుపుకు అలవాటు పడి నువ్వు బతుకు,నన్ను బతకనివ్వు..
ఒంటిలోని నీరంతా కన్నీరుగా మారి పోతుంది..
పోతే పోనివ్వు నా మనసుకన్నా ఈ నీళ్ళు ఎక్కువా నాకు
కాని ఫలితాన్ని ఇవ్వవే పిచ్చి మనసా ...నీకు ఇదేం పిచ్చే తల్లీ
తల్లడిల్లుతున్న నా మీద ఇసుమంత జాలైన లేదు నీకు
ఎవరికీ ఏం కానిదానిలా నాకు నేను దూరమైపోయి ఇలా మిగిలాను ...
మేల్కో తొందరగా నన్ను నాకు మిగుల్చు కనీసం..
...........అరుణని........
Saturday, 1 April 2017
బంధాలు అనుబంధాలు
నేను ఎక్కువ బంధాలు, బందుత్వాలు,స్నేహం ఇలా
మానవ సంబంధాల మీద పోస్టులు పెడుతుంటాను
ఇది ఇప్పుడు కొత్తగా కాదు గత మూడు సంవత్సరాల క్రితమే నేను రాయడం మొదలు పెట్టాను ఇక్కడ
నేను గమనిస్తుంటాను నన్నే కాదు అందరిని
అలా గమనించి, చూసి, విని లేదా అనుభవించినవే ఇక్కడ రాస్తుంటాను
ఎదిగే వయసులోనే ఈ బంధుత్వాలు, స్నేహలు ఇలా ఒకరు ఒకరికి చేసే మోసాలు...అవసరానికి వాడుకోవడాలు చాలా దగ్గరగా చూసి,అనుభవించాను...
ఈ బంధాలు చాలా సున్నితమైనవి గట్టిగా బంధించకూడదు అలాగని వదిలేయకూడదు
ఏ పరిచయం అయినా నిలబడాలంటే శ్రద్ద పెట్టాలి
అరచేతిలోకి ప్రపంచం వచ్చి పడ్డాక కనికష్టంగా మారాయి వీటి పరిస్థితి
నిర్లక్ష్యం, ధీమా, అహంకారం లేదా అవసరం ఇవే ఈ బంధాలు చెడిపోవడానికి కారణం
ఒకరి ప్రయత్నం ఇంకొకరి అశ్రద్ధ ఇదే ఇప్పటి తీరు
దొడ్డిలో కట్టేసిన గొడ్డుకు రెండు పూటలు ఇంత గడ్డి పడేసి పాలు పితుకు పోతుంటే అది ఎక్కువ పాడి ఇవ్వలేదు
ఒక విత్తు నాటి రెండు పూటలు కాసిన్ని నీళ్ళు పోసేస్తే ఆశించిన ఫలసాయం ఇవ్వదు
నోరు లేని వాటికి కూడా ఆదరణ, ఆపేక్ష చూపించే వాళ్ళు కావాలి
మరి నోరున్న మనిషికి అదెంత అవసరం ??
నేను ఈ సున్నితమైన విషయాలనే ఇక్కడ పెడుతుంటాను
ఈ విషయంలో ఆడవాళ్ళదే పై చేయి ఎదురు చూస్తూ ఓర్చుకొని భరించేది తానే ఎక్కువ
మగాడికి లోకం అంతా కావాలి,ఆడదానికి వాడొక్కడే లోకం
నీ నిర్లక్ష్యం మాటల్లో చెప్పలేదు చేతల్లో చూపించ లేక కరిగి కన్నీరు అవుతుంటుంది
ఆ కన్నీటికి మాటలు రావుగా అదెంత బాదో చెప్పడానికి
రంగు లేదు ఇంత బాధకి ఇంత రంగని వస్తే అర్ధమయ్యేది ఏమొ
సుఖం అందరిది ఒకటే... కష్టం మాత్రం ఒకటి కాదు
మనిషి సాదించలేనిది ఏమి లేదు కాని అది జరగాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి
గుండెల్లో ఇంతింత అగాధాలను పెట్టుకొని ఏ విజయం వేపు పరుగులు తీయగలడు మనిషి
చాలా చిన్నచిన్న విషయాలే ఎక్కువ భాద పెట్టేది
గట్టిగా అరిచి తిట్టుకొని, కొట్టుకునే దానిలో శారీరక శ్రమ మాత్రమే ఉంటుంది
నిర్లక్ష్యం ఇచ్చే గాయాలు పగిలిన ఆ గుండె చప్పుళ్లు పక్కవాళ్ళకు కూడా వినిపించదు
ఎన్నో వస్తువులను వాడి పారెయ్యడానికి అలవాటు పడ్డ మనిషి సాటి మనిషిని అదే దృష్టితో చూస్తుంటే
ఏం మిగులుతాయి ఇక్కడ ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన మనసులు తప్పించి
మనం చేసే పనుల ఫలితం మనకి తెలియదు, చూసినా అనవసరం
కనీసం వింటే అయినా ఎక్కడైనా మనసుకు గుచ్చుకుని తనని తాని ఒక్క గడియ ప్రశ్నించుకుంటే
నా ప్రయత్నం ఫలించినట్టే
కొత్తగా వచ్చే వాళ్ళకు నాలో అల్లరి, వాగుడు మాత్రమే చూడొచ్చు అందుకే చెబుతున్నాను
నాకంటు ఒక ఆలోచన ఉంది,స్వేచ్ఛ ఉంది
స్వేచ్ఛ ఉంది కదా అని ఆకాశాన్ని అందుకోవాలి అనే వెర్రి లేదు
...........అరుణని..........