Monday, 10 April 2017

అరుణిమ

మ‌న‌సు ప‌లికే : స‌రికొత్త అరుణిమ ఇలా..

...................................................................

"నిర్లక్ష్యం ఎంత నిర్దాక్షిణ్యంగా చంపేస్తుందో ఆదరణ అలిసిన వాళ్ళని కూడా
సేద తీరుస్తుంది...కొందరికి ఇవి అర్థం కావు కమర్షియల్ పీపుల్.. " - అరుణ మ‌జ్జి

.................................................................................................

రాస్తాలు విస్తుబోవునిపుడు.ప్ర‌పంచం చిన్న‌బోవునిపుడు.కాలాలు కంకాళాలు ఇంకా ఇంకొన్ని మౌన‌మ‌నే ఆశ్ర‌మ ధ‌ర్మాన్ని పాటించునిపుడు. ఔను! నీ కోసం నువ్వు.. ఎంతగా ప‌రిత‌పిస్తున్నావో తెల్సుకుని వ‌సంతం కూడా త‌న గ‌మ‌నం మార్చుకుంటుందేమో! సోకాల్డ్ మ‌నిషిని చూసి..! కోయిల కూజితం కూడా ష‌డ్జ‌మ స్థానం మ‌రిచిపోవునేమో! ఎంత‌గా నీలో నువ్వు ఎదిగి ఒదిగిపోతున్నావే తెల్సుకుని జ‌న్యుగ‌తాలు సంబంధిత జ‌నితాలు ఎలా..ఎలా.. త‌మలో తాము కుదించుపోతున్నాయో క‌దా! ప‌దార్థానికో స్థితి కొత్త స్థితి ప్లాజ్మాని మించిన స్థితి ఇవాళ మాత్ర‌మే నీలో లోలో చూస్తున్నాన్నోయ్‌. ఔను! క‌దూ! ఒక‌రి ప‌త‌నం నీ ప‌తాక స్థాయి సంతోషానికి సంకేతం. ఔను! క‌దూ! నిన్ను నువ్వు భూస్థాపితం చేసుకోవు క‌దూ! అదే నా అనే అహాన్ని ఏటికో కాటికో అప్ప‌గించ‌వు క‌దూ! బూడిద లాంటి ఈ జీవితానికి క‌ల‌ర్ ఫుల్ లైఫ్ అని పేరెందుకు అబ్బా య్‌! ఏదీ రంగులమ‌యం కాదు బాస్ మ‌న‌మే చేసుకోవాలి.చిత్తం గారి చిత్త‌గింపులు చిత్రంగా వినాలి. ఆద‌ర్శాల మాట‌కేం గానీ నిన్ను నువ్వు ఇలానే ఇలానే త‌గ్గించుకుంటూ కుదించుకుంటూ ఒకానొక శిథిలావ‌స్థ‌కు చేరిపో..! ఎక్క‌డా నీకు ప్ర‌శాంతత నిండిన నీడ‌లు, ఆప్యాయ‌త‌ను నింపుకున్న గాలులూ కాన‌రావు.

.................................................................................................

నా అనుకున్న నీ భావం ఈ భూమండలం మొత్తం ప‌రివ్యాప్తితం చేయాల‌నుకుంటున్నావ్ క‌దూ! బాగుంది. నీ అనే ఓ కొత్త సంవాద‌న ప‌లాయ‌నం చిత్త‌గించ‌నంత‌ వ‌రకూ..! నీకై నువ్వు ఒంట‌రిగా పోరాడు బాస్ పోరాడు.లాజికల్ డైమెన్ష‌న్స్ ఎలా ఆవిష్కృతం చేయాలో ఆలోచిస్తూ పోరాడు. క‌పటం ప్ర‌ద‌ర్శించు. న‌ట‌న ప్ర‌ద‌ర్శించు.. ఇంకా ఏవేవో ఎన్నెన్నో చేశాక నీ నుంచి నువ్వు నిష్కృమించు. దీనినే మ‌హాభినిష్కృమ‌ణ అని అంటారు వైదిక ప‌రిభాష‌లో..! ఆన‌క లోకం నిన్నూ ప‌ట్టించుకోదు..ఈవెన్ ఇఫ్ నీ అనుకున్న‌వారినీ  ప‌ట్టించుకోదు గాక కోదు.కొంత కాలం ఆగి చూడు ఇదే స‌త్య‌మ‌గున్‌.ఇదే జ‌యాప‌జ‌యాల‌కు అతీత‌మై గొప్ప వాక్కుగా ప‌రిఢ‌విల్లున్‌..ఇప్పుడు విను .. వీలుంటే వినిపించు.. నీలో సంస్కారం ఉంటే..
పంచే గుణ‌మే పోతే ప్ర‌పంచ‌ మే శూన్య‌మ‌న్న క‌వి వాక్కు.. రుక్కును.. అయినా నీలో మార్పు సాధ్య‌మా..? మా భ్ర‌మ‌లు తొలిగితే బాగుండు.. ఆక‌శ‌మా మ‌మ్మ‌ల్ని క్ష‌మించు.. నేల‌మ్మా మ‌మ్మ‌ల్ని క్ష‌మించు.తీసుకోవ‌డం ఒక్క‌టే తెలిసిన మ‌నుషులు ఉన్నంత కాలం మీరు అలానే.. అలానే కొన్ని యుగాల దూరం పాటు క్ష‌మిస్తూ ఉండండి. కొంద‌రి స్వార్థానికి ప‌చ్చంద‌నాల‌ను ఫ‌ణంగా పెడుతున్నా.. పెరిగే నీడ‌లను విర‌గొడుతున్నా చూస్తూ ఊరుకుంటూ ప్ర‌కృతిని చూసి ప‌రిహ‌సిస్తున్నా స‌హిస్తూ ఉండండి. ఇంకా..ఇంకా..మాలో దుర్బుద్ధికో గొడ్డ‌లి వేటు వేయొద్దు గాక వేయొద్దు . మాకు జ్ఞానం లేదు మా క‌నుల‌లో కాంతి లేదు శూన్యమ‌య ప్ర‌పంచం మాదే! తెలియ‌ని చోట దాక్కుని తెలిసిన వాటితోనే స‌రిపెట్టుకునే జీవం మాదే! ఆధునికులుగా చెప్పుకునే మేమంతా అనాగ‌రిక జంతుకులానికి ప్ర‌తినిధులం. మ‌మ్మల్ని మ‌న్నించండి పెద్ద‌లారా! ప‌తితులారా! ఇప్పుడో ప‌రివ‌ర్త‌నకు ఇక్క‌డో మార్పున‌కు ప్రారంభ స్థానం నిర్మితం కావాలంటే మ‌హాత్ముడు మ‌ళ్లీ పుడితే బాగుండు. పుడ‌తాడా లేడా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.స‌మీప భ‌విష్య‌త్‌లో స‌మూహం మ‌హాత్ముడి లాంటి తోటి మ‌నిషిని ఆద‌రించే సంద‌ర్భాలు ప‌రిచయం అవుతాయా?మ‌ళ్లీ ప్ర‌శ్న‌. సందేహ‌భావుక‌త వీడితే సంశ‌యాత్మ‌కత వీడితే లోకం అంతా కొత్త‌గా అగుపించు. సాధ్య‌మేనా? ఏమో!! కాలం గారికి ఎరుక. వీర బ్ర‌హ్మం గారికి ఎరుక‌. ఇంకా ఎవ‌రికి ఎరుక‌నో నాకైతే ఎరుక లేదు. డియ‌ర్ ఆల్ నో యువ‌ర్ సెల్ఫ్ చెక్  యువ‌ర్ సెల్ఫ్‌. వేసంగి ఎండ‌లో అదిగో ఆమె గారి నీడ కోసం నేను.. నా నీడ గారి కోసం ఆమె నిరీక్షిస్తూ ..నిరీక్షిస్తూ.. పెరిగి విరిగే మ‌నుషుల గురించి ఆరా తీస్తే ఇదిగో ఇలా తానూ.. నేనూ..

- నీరెండ‌ల చెంత ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

1 comment: