Thursday, 20 April 2017

తాను నేను

బదులు కోరని భావాన్ని నేను
బదులివ్వలేని భాసవి నువ్వు
చెరిసగమే మనం మన మనసుల్లో
చెరగని రేఖలమే మన చేతి గీతల్లో
జవాబు లేని ప్రశ్నలం మనం
భరోసా ఎరుగని బంధం మనది
దారులు వేరైనా మన గమ్యం ఒకటే
భవిష్యత్తు తెలియని బాటసారులమే కాని
నిను తనలో నింపుకున్న ఈ మనసుకు తెలుసు
నా శ్వాసలో శ్వాసవై నువ్వు నాతోనే ఉన్నావని
నా బలం, నా బలగం నువ్వేనని తెలుసుకో
ఇరు మనస్సుల్లో ఇరుక్కున్న ప్రేమ మనది
మాటిస్తాను నా ఎదలో చోటు ఎప్పటికీ నీదేనని
మాటిస్తావా ఎప్పుడూ నా మనసులోనే ఉంటావని
ఇంకేం కోరను నిన్ను ....ఎక్కడున్న నీ చిరునవ్వు చాలు
నాకు ఆయువు పోయడానికి ....
ఇద్దరం ఒక్కరమై....ఇరువురిగా జీవించే వాళ్ళం
ఇప్పటికి ఇంతే ఈ రెండు అక్షరాల ప్రేమ
మనల్ని వరించింది ఇంత వరుకే మరి...
కాని మనసంతా మనమే ఒకరికొకరం..
ఇప్పటికి .... ఎప్పటికీ

.............అరుణని............

No comments:

Post a Comment