ఆ ఆకాశం చూడు ఎలా చూస్తుందో ఎంతో ఆశక్తిగా...
తన నీడలో మన ఈ కలయికని...
ఆ తారలన్ని చూడు మనల్ని చూసి ఎలా గుసగుసలు ఆడుకుంటున్నాయొ...
నువ్వు నా చెంతనుంటే ఆ మామ అలిగి మబ్బుల చాటుకి పోయి తొంగి తొంగి చూస్తుంటాడు దొంగ చూపులు...
పంచభూతాలు పరవశించిపోతున్నాయి నువ్వు నేను పంచుకున్న ఈ ఘడియలను చూసి...
అందుకు ఈ చల్లని వేళే సాక్ష్యం...
ఆ నీటిపై కెరటాలు ఎలా అలలు అలలుగా కదిలి అలజడులు సృష్టిస్తున్నాయొ...
నను తాకుతున్న నీ శ్వాస నాలో అంతకు రెట్టింపు అలజడి రేపుతుంది....
ఎదురుగా నువ్వుంటే చాలు నాలోని నన్ను చూసి ప్రకృతి సైతం పులకించి పోతుంది....
నీకు నాకు వినిపించే మన మనసు మాటలు ఈ గంగమ్మకు వినపడుతున్నాయొ ఏమో...వయ్యారాలు పోతుంది తెగ..
మాటలన్నీ నావే గలగలమని ....ఏ మంత్రమేసావో చూపులతో, నీ చేతలతో నీ ఆరాధనే నా తపమైనది..
ఇది కల కాదు కదా....కలే అయితే శాశ్వత నిద్రనే కోరుకుంటాను....
ఇది వాస్తవం అయితే కాలాన్ని కోరుకుంటాను కాస్త కరుణించమని....
ఈ క్షణాలను నా ఊపిరికి ఆయువుగా నాలో నింపేసుకుంటానని....
నువ్వే దరిని ఉన్నా...నిను చేరలేకపోయినా... ఈ దరిని నీకోసం, కాలాన్ని రుజువుగా ఉంచి మరీ ఎదురుచూస్తాను...మళ్ళీ ఈ ఘడియల కోసం
నీ తలపే నా పరధ్యానం...నీ వలపే నాకొక వరం..
గురుతుంచుకో....ఎదురు చూసేది నేనని అదీ నీకోసమని..
గమనించుకో నీవేపే నా ధ్యాసని...
వెళుతూ వెళుతూ వెనుతిరిగి చూడటం మాత్రం మరువకే...
............అరుణని..........
Thursday, 20 April 2017
తాను నేను
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment