ఏమ్మా కోపమా అని అడగకు....నాకెందుకు కోపం
అటు ఎందుకు చూస్తున్నావని అడగకు నేనేమి అలగలేదు..
మరి ఆ మూతి ముడుపులు ఏంటి అనకు నేను మామూలుగానే ఉన్నాను
నీ ముందు నాకు అలక...బెట్టు చేయడం కూడా చేతనౌనా
అంత ఉంటే ఇలా ఎందుకు ఉంటాను...
నచ్చినప్పుడు వచ్చినా ఏమన్నా అన్నానా..
నచ్చినప్పుడు నచ్చినంత మాట్లాడినా కాదన్నానా..
ఉలుకు పలుకు లేని రోజున విసిగించానా...
నీ మూడ్ మారుద్దామని ప్రయత్నం చేసి చీవాట్లు తిన్నా కూడా పొంగే, సగం విజయం పొందానని..
నిర్ణయాలు అన్నీ నీవే అయినా నీ నీడనై నీ వెంట నడవడం నాకు ఇష్టం...
పాల పొంగులాంటి నా కోపాన్ని చల్లార్చే అంత కష్టం నీకెందుకులే...
నీ పిలుపుకు బదులివ్వకుండా ఆగలేనని బాగా తెలుసు కదా..
నీ పిలుపు విన్న మనసు ఉరకలు వేస్తుంది ..దానిని ఆపే అంత శక్తి నాకెక్కడిదిలే..
ఆడపిల్లనే నీ ముందర ...కాని ఆడించడం చేతకాని దానిని...
ఎంతైనా తగువాడివే కదా నాకు..తగువు తగదని తెలుసులే నాకు
అయినా ఎంతసేపు అటు ఇటు చూడను ఇంకా...నిను చూడకుండా ఉండలేనుగా ఎదురుగ నువ్వుంటే
ఒకసారి చూసానా నా కోపం కాని కోపం కొట్టుకుపోతుంది నా నవ్వులో..
అందుకే సాగుతున్నాయి నీ ఆటలన్నీ నా ముందర...
ఇంతకీ ఈ అలక కాని అలక దేనికని అడగకు నాకే తెలియదు కదా....
నీ నవ్వు హాయిగుంటుంది..పెదవి విరుపు మనసును విరిచేస్తుంది..
ఇంతకన్నా ఇంకేమని చెప్పేది స్వామి...నీ మీద నా ప్రేమ ఎంతని ఇంతని అంతని
చాలా.....నీకు ఎలాగూ చేతకాదు కదా చెప్పడం నీకేముందనేది నా మీద..
అడగను కూడా నిన్ను.... ఇదే కాదు, ఏది కూడా
..............అరుణని...............
No comments:
Post a Comment