నీకు ఇంత కోపం ఏంటి,పొగరా,గీరా,గయ్యాళివి,రాక్షసివి,ఇంత మొండి తనం పనికిరాదు,మగరాయుడిలా ఉంటావే,సైకో,సాడిష్టు,పెంకి పిల్లవి,నా ఇష్టం నేనింతే అంటాది ఇలా .....అన్ని స్తోత్రాలు చదివాక అరుణమ్మ మంచిది అంటారు హహహహ...ఇన్ని పేరలు సంపాదించుకోడానికి కారణం...అరుణిక్కడ అనగలిగే పొగరుకి ప్రాణం పోసింది ఇదిగో ఇతనే మా నాన్న 😍
మొన్న ఒక పోస్టు చదివాను..ఆడపిల్లని పెంచే పద్ధతి గురించి...అది చదువుతుంటే నాన్నే గుర్తుకు వచ్చారు..
నేను ఈ రోజు ఇలా నిలబడటానికి, నాకున్న ఆత్మవిశ్వాసం అతని వరమే...జీవం మాత్రమే పొయ్యలేదు నన్ను తీర్చి తిద్దిన నా మొదటి గురువు మా నాన్నే....వసపిట్టను కదా బాగా ప్రశ్నలు వేసేదాన్ని ఒక్కరోజు విసుక్కోలేదు,చేయెత్త లేదు...ఏదైన వివరించి చెప్పడం, దగ్గర ఉండి చూపించి చేయించడం అతని పద్ధతి.
నువ్వు ఇలా ఉండని గిరి గీయలేదు...తప్పుఒప్పులను తెలుసుకో...నువ్వు ఎలా ఉండాలో నీ ఇష్టం నిర్ణయం నీదే...నువ్వేమి తక్కువ కాదు...తప్పు చేస్తే ఒప్పుకో కాని తలవంచకు...నీ అభిప్రాయం నువ్వు చెప్పుకోవచ్చు...నీ విలువ నువ్వే నిలబెట్టుకో...ప్రశ్నించాలి అంటే ప్రశ్నించు..
నేనున్నాను నీవెనుక అంటూ నూరి పోసింది నాన్నే.
నా ప్రశ్నలకు సమాధానాలు పుస్తకాల రూపంలో తెచ్చి ఇచ్చేవారు చదువు నీకు నువ్వే అర్థం చేసుకో అని చెప్పేవారు...ఎవరన్నా వచ్చి అరుణ ఇలా అడిగింది, అన్నాది అంటూ నేరాలు చెబితే అన్నీ విని...ఇంతకి కారణం చెప్పలేదు మీరు...కారణం లేకుండా అది జవాబు ఇవ్వదు,ప్రశ్నించదు ఆ నమ్మకం నాకుంది...తప్పు మీదైతే నాకేం చెప్పక్కర్లేదు...సమాధానం దానికి చెప్పుకోండి లేదా ఊరుకోండి అంతే కాని విసిగించకండి దాన్ని ఇంకో నాలుగు పడాలి మీరే మళ్ళీ అని జవాబు ఇచ్చేవారు...అది అతను నాకు ఇచ్చిన నమ్మకం,బలం...
ఏ కుర్రాడైన కామెంటు చేసాడు అంటే చెయ్యి చూపించు కాని భయపడకు నేనున్నాను అని వెనకే ఉండేవారు...నీ కట్టు,బొట్టు నీ ఇష్టం అని చిన్నప్పటి నుండి పాంటూ చొక్కాలు వేయించారు....భావలను నేను వరస పెట్టి పిలవను అంటే సరే వాళ్ళకి చెప్పేసి ఎలా పిలవమంటారో వాళ్ళనే అడిగేయు అనేవారు...స్కూల్లో టీచరుని ఇమిటేట్ చేస్తూ దొరికిపోయి నాన్నకి చెప్పాను నాలుగు రోజులు స్కూలుకి వెళ్ళను ఇలా చేసాను అని...మర్నాడు స్కూలుకి తీసుకువెళ్ళి సార్ తో మాట్లాడి సారి నాతో చెప్పించి...తప్పు నుండి తప్పించుకోకు ఒప్పుకొని మళ్లీ జరగకుండా చూసుకోవాలి అంటూ చెప్పారు...ఇలా ఎన్నో
నేను నాన్న కూచిని...ఎంతపనున్న ఒకపూట అన్నం అతనే తినిపించేవారు...బోలెడు ముద్దు పేర్లతో నాన్న మాత్రమే పిలిచేవారు మిగతా అందరు అరుణమ్మ అనేవారు... ఇద్దరం ఒకపార్టి...కొన్నిసార్లు అతన్ని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి అమ్మ తరుపున...కూతురుకి ఇచ్చిన స్వేచ్ఛ భార్యకు ఇవ్వలేరు ఎందుకో...ఇప్పటికి ఇలాగే ఉంది...ఆడదాన్ని స్వేచ్ఛగా ఉండమని చెప్పడం కాదు స్వేచ్ఛను ఇవ్వాలి అది కూతురా,భార్య,తల్లా,చెల్లా ఎవరైనా ....మాటలు ఆచరణలోకి రానంత వరుకు కూతురికి ఒక న్యాయం కట్టుకున్న దానికి ఒక న్యాయం..
ఈ రోజు నాన్న చనిపోయిన రోజు...బోలెడు పని అసలే అన్నీ పర్ఫెక్టుగా ఉండాలి ఏ పని చేసినా అతనికి...అన్నీ ఓకే గారెలతో కుస్తీ పట్టాలి ఎన్ని ఒంపులలో వస్తాయో ఏమో...miss u అనడానికి అసలు మిస్సయ్యింది ఎక్కడా అనుక్షణం నాతోనే ఉంటారు...see u అనడానికి అది జరగనిది కదా....love uuuuuuuuuuuu నాన్న....ఆ పిలుపు మాత్రమే కరువైంది....నువు దూరమైన దుఃఖం ఎప్పటికీ తీరదు అంత శక్తి నాకు లేదు....నా పిలుపు నీకు వినపడేంత గట్టిగా నిన్ను పిలవాలనుంటుంది నా పిలుపు వింటే నువ్వు ఎక్కడ ఉన్న వచ్చేస్తావని నమ్మకం...ఎంత మొండి దాన్నొ అంత ఎమోషనల్ పూల్ ని....నేనింతే.
RIP అని రాయకండి మా నాన్న ఎక్కడికి పోలేదు ...అతని పేరు చెడకొట్టనంత కాలం ఎక్కడున్న ప్రశాంతంగానే ఉంటారు కదా ఇంకెందుకు rip లు....!!!
No comments:
Post a Comment