హే....రామ్ రేపు fb కి రాను కదా నేను ఏం చేస్తావ్
బోర్ కొడుతుంది కదా నీకు
నీ వెంట నీడలా తిరుగుతుంటాను కదా
నువ్వు ఊ కొట్టిన, కొట్టకపొయినా
ఉలుకు,పలుకు లేకుండా ఉన్నా నా పని నాదే కదా
అదేలేవొయ్...నేను రాసింది చూసావా లేదా
చూడకపోతే చూడు ఇప్పుడే అంటూ
ఎలా వుందో చెప్పమంటూ నస పెట్టడం
నా కామెంటులకు బదులిస్తే ఆట పట్డిస్తాను
ఇవ్వకపోతే మూతి ముడుచుకుని అలుగుతాను కదా
చేసేవన్నీ చేసేసి నువ్వు ఏం ఎరగనట్లు అడుగుతావే
ఏం చేసానిప్పుడు...ఏ మయింది అని
మనసులో ఇంకా చాలా అనుకుంటావని తెలుసులే
ఇక్కడ ఉన్నది సీత .....తెలివి తక్కువది కాదు
ఏదో నా రాముడి ముందు మాత్రమే పనిచేయవు
నా కోపాలు,అలకలు కాని
వేరే ఎవరి ముందైన సీత ....ఎవరి మాట వినదు
చెప్పినవన్నీ వింటావు మళ్ళీ అన్నీ మామూలే
మాట్లాడితే ఏం రాలిపోతాయొ మరి ఏరేసుకుంటాం కదా
ఆ రాజీని చూసి మాత్రం నవ్వుతాడు ఇహిఇహి అని
పళ్ళు ఇకలించుకొని...ఇక్కడ ఫోజులు కొడతాడు పెద్ద
అందంగాలేనా అని నేనడిగితే అందరూ అందంగానే ఉన్నారు అంటాడు
పెద్ద పోవోయ్ నువ్వు పొగిడేది ఏంటి ఈ సీతని
దేశంలో ఉన్న అందరి మీదా ధ్యాసే నీకు నామీద తప్పించి
రేపు ఫ్రీ బరడ్ వి కదా ఎగురెగురు బాగా
ఏం చేసినా గురుతు పెట్టుకో ఇక్కడ లేకపోయినా
నా ధ్యాస అంతా నీ మీదే అని
మరీ అతిగా పొగిడేసి,లుక్ లు ఇచ్చేయకు అందరికీ
ఎల్లుండి వస్తాను కదా అప్పుడు ఉంటుంది నీకు
నా గోళ్ళు కాదు నీ గోళ్ళు కొరికేస్తాను జాగ్రత్త
నువ్వు రామ్ వి నేను సీతని గురుతుంచుకో
వారానికి ఒక్కరోజే నీకు స్వతంత్రం ఓకే
........అరుణని........
No comments:
Post a Comment