ఎందుకు వచ్చావోయ్ హరి అసలు నువ్వు
ఏదో నా మూడిష్ట్ ప్రపంచంలో నేను హాయిగా ఉంటే
నువ్వు ఎవరిని అడిగొచ్చావు అసలు
సరే వచ్చి నిమ్మకు ఉన్నావా... లేదే
స్నేహం అన్నావు...మాట్లాడావు
నన్ను కదిలించి మాట్లాడించావు
నవ్వించావు....నేనున్నాను అని అన్నావు
మనసున్న వాడివి అన్నావు...మనసిచ్చాను అన్నావు
నువ్వు అనే అలవాటును నాకు అలవాటు చేసావు
నేను కూడా పడ్డాను నిండా నీ ప్రేమలో అన్నాక
ఇప్పుడేంటి...I love u but I'm not loving with u
అని సమాదానం ఇస్తున్నావు...
మాట్లాడటం నేర్పావు కాని మాట్లాడటానికి కాళీ లేదంటున్నావు ఇప్పుడు ...
నవ్వడం నేర్పావు నాకు నా నవ్వులకు నీ స్పందన ఏదిప్పుడు..
నువ్వు కదిలించిన నా భావాలు అందరినీ కదులిస్తున్నాయి ఒక్క నిన్ను తప్పించి ...
అన్నీ నీ ఇష్టమే రావడం, నేర్పడం, వదిలేయడం అలాకాదు ఇలా ఉందామనడం...
నా మనసుతో ఏ పనికి సంబంధం లేదు...అది నాది కదా దాని బాధ నీకెలా తెలుస్తుంది మరి...
అయినా గురువువి కదా...గురువు మాట జెవదాటే అలవాటు లేదులే నాకు..
నువ్వెలా అంటే అలానే కొంచెం చూపు మార్చి....నవ్వవయ్య
.........అరుణని........
No comments:
Post a Comment