ఎలా ఉన్నావు ...ఏం చేస్తున్నావు అంటూ
ప్రతిక్షణం ఆలోచిస్తుంటాను
అవును ఇంతకు నువ్వెవరివి,నేనెవరిని నీకు
మనసు పదే పదే వేసే ప్రశ్న ఇది
జీవితానికి ఒక తోడు అవసరమా అనుకున్నాను
కాని మనసుకు ఒక తోడు కావాలని నువ్వు వచ్చేవరకు తెలియలేదు
నువ్వు అబద్ధంతో వచ్చినా నా జీవితంలో చెరపలేని నిజానివై పోయావు ఈరోజు
లోకానికి తెలియని, తెలియాల్సిన అవసరం లేని బంధం మనది
స్నేహితులను మించిన వాళ్ళం... ఆలుమగలం మించని బంధం మనది
అవసరమా ఇలా ఈ బంధం అంటే ఏమో
ఏదో తెలియని తోడు,ధైర్యాన్ని ఇస్తుంది మనసుకి
తప్పు చేస్తున్నానా అనే ప్రశ్న కొన్ని వేల సార్లు వేసుకున్నాను
నీ గౌరవానికి, నీ భవిష్యత్తకు, నీ కుటుంబానికి నావలనంటూ ఏ భంగం కలగనివ్వనుగా
నీ సంతోషంలో నా సంతోషాన్ని వెతుకుతున్నాను కదూ కనుక ఆ స్థితి ఏ నాటికి రాదు,రానివ్వను
మరి నే కోరేది ఏంటి, ఏం పొందుతున్నాని ఈ బంధం నుండి అంటే
ఒక పలకరింపు మనసారా, నీ మనిషిగా నీ మనసులో ఉన్న విలువ చేతల్లో అంతే
అదీ నువ్వు ఇవ్వని రోజున నా కన్నీటి చెమ్మ కూడా నిను తాకనివ్వను
దూరంగా ఉండి నిను చూస్తుండిపోతాను
ఇది నా ఆరాధన....నా మనసు నిండిన మనిషిపై నాకున్న ఆరాధన
లోకానికి ఇది నేరమే కాని
నా మనసుకు కాదు
ఇచ్చిందాన్ని తిరిగి తీసుకునే అలవాటు లేదు కదా
అందుకే నీకిచ్చేసిన మనసుని తీసుకోలేక
ఒక ఆరాదకురాలిగా మిగిలిపోయాను
చెవులారా విని ఎన్నో రోజులు అయింది నీ మాట
వినాలని కోరను కూడా
నాలుగు అక్షరాల మెసేజుని కోరుకోను
ముక్తసరి పలకరింపు మనసుని నలిపేస్తుంది
ఇదేమి బంధం .....ఇలాంటి ఆలోచనలు
ఈ రోజు కొత్తా నాకు
నీ ఆలోచన నాకు దూరమయ్యేది ఏనాటికి
నా స్థానం ఏంటని అడగను
నీ చేతలు నాకు చెబుతునే ఉంటాయి
రేయింబవళ్ళు నను వీడని ఈ ఆలోచనలకు అంతం ఎక్కడ అని వెతుకుతున్నాను