నాకు జానపద చిత్రాలు ఇష్టం అలాగే ష్రేక్, ఆలిస్ ఇన్ వండర్ ల్యాండ్ లాంటివి ఇష్టమే....
జంధ్యాల గారి హాస్యం చాలా ఇష్టం, మిస్టర్ బీన్ హస్యం ఇష్టమే....
పునాది రాళ్ళు సినిమా నుండి నగరం నిదురపోతున్న వేళ లాంటివి ఇష్టమే...
దెయ్యాల సినిమాలంటే పిచ్చి అది రాత్రులు పెద్ద సౌండు పెట్టుకొని చూసేంత....
మేఘసందేశం లాజిక్ నచ్చకపోయిన mr and mrs iyer లాంటి సినిమాలొ మీనాక్షి వెళ్ళిపోతే బాగుండేది అనిపించింది ....
జీవనతరంగాలు లాంటి ఫ్యామిలి మూవీసు ఇష్టమే page 3 లాంటి మూవీస్ ఇష్టమే ....
చారిత్రాత్మక మూవీస్ నుండి ఏలియన్స,ప్రడేటర్స్ లాంటివి ఇష్టమే.....
అవేకళ్ళు లాంటివే కాదు when a stranger calls లాంటివి ఇష్టమే
Rambo,first blood లాంటి వాటితో పాటు twilight లాంటివి ఇష్టమే...
అర్ధవంతమైన సాహిత్యం వినసొంపుగా ఉండే సంగీతం ఉంటే భాషతొ పనిలేకుండా అన్నింటిని వినేస్తాను...
తిండి విషయానికి వస్తే ఆ పూటకి కంచంలో ఏదుంటే అదే ఇష్టం ...నేను బతకడానికే తింటాను కనుక
రంగులంటారా కాంబినేషన్ మాత్రమే చూస్తాను షాపు వాడిని బాద పెట్టడం ఇష్టం లేక పది నిమిషాల్లో సెలెక్టు చేసేసుకుంటాను ఏదో ఒకటి...
అలంకరణ మీద మక్కువే లేదు....
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని అనడమే కాదు అలా ఉండగలే దమ్ము కూడా ఉంది నాకు...
సంప్రదాయాలు,కట్టుబాట్లు వీటిని గుడ్డిగ నమ్మను...
హద్దులు దాటని స్వేచ్ఛ నాకు ఇష్టం...
అందుకే అందరూ నాకు ఇష్టమే అందులో కొందరిని అభిమానిస్తాను,అందులో కొందరిని ప్రేమిస్తాను ఒక్కరినే ఆరాదిస్తాను...
అందుకే నా స్నేహంలో మొదటి రోజు నేను ఎలా ఉన్నానొ అలానే ఉంటాను అందరితో ...
ఒకడుగు ముందుకు వేసానంటే వెనక్కి వేసే ప్రసక్తి లేదు..
ఆశలు పుట్టించను నేను నేనుగానే ఉంటాను....ఒకవేళ ఆశ కలిగించాక ఆశించకు అనే అంత హీనబుద్ది నాకు లేదు...
అవసరాలకు వాడుకోవడం,కోపంతో కక్షలు పెంచుకోవడం నాకు చేతకాదు..నా మనసులో ఉన్నది మొహం మీద చెప్పేయడమే వచ్చు...
నా ప్రయత్నం లేకుండానే ఏదో ఊహించేసుకొని ఆశలు పెంచుకొని నీకు మాట్లాడటం చేతకాదు,అసలు మనసే లేదు,ప్రేమంటే తెలియదు,ఫీలింగ్స్ ఉన్నాయా మనిషివేనా,భాదపెట్టడం వచ్చు అంటే నవ్వుకుంటాను కాని చీమ కుట్టి నట్టు కూడా నాకు ఉండదు...
పొగరు,గీర,గయ్యాళి,గర్వం,మెంటల్,తింగరి,తలతిక్క వెరసి ఇదో మూడిష్ట్ అనే పేర్లకు తోడుగా ఇంకొన్ని పేరులు వచ్చాయి అనుకుంటాను అంతే ...
పైన చెప్పిన టేష్టులు విన్నారుగా ఇంకా ఉన్నాయి కాని ఎందుకంత భాగోతం అని ఊరుకున్న...
ఇంక అడగకండి నీ టేష్టు ఏంటని....నాకు అన్నీ ఇష్టమే అంతే...
Simple ga I'm a tasteless fellow 😄 😄 😄
కనుక నాలాంటి దానిని కదపకండి...మీరే confuse. అయ్యి బుర్ర గోక్కోవాలి...
నేను ఎంతలో ఉంటున్నానో అంతలోనే మీరు ఉంటే నన్ను తిట్టుకునే పని తప్పుతుంది.......
నేనింతే...ఏం చేయలేను
Saturday, 18 March 2017
నేనింతే ఏం చేయను
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment