నా చూపులు వెతికేది నిన్ను ....ప్రేమించాను కదా నిను చూడాలని తపిస్తుంటాయి...
నీ చూపులు కాదు ఆలోచనలు కూడా ఇటు లేవని చెబుతునే ఉన్నావు చేతలలో...
మారిపోయే మనసున్న వాడివి ప్రేమ పాటాలు ఎందుకు ఆనాడు వల్లెవేసావోయ్ అనాలనుంది...
నా మనసును తప్పుగా అంచనా వేసుంటావులే...నీలాంటి మనసే అయ్యుంటుంది అని...
నువ్వేంటో తెలిసాక కూడా ముందుకు వేసిన అడుగు వెనక్కి తీయలేక నీ ముందు ఇంకా ఇలా ఉన్నాను...
ఇంకా ఆ రోజుల్లోనే ఉండిపోయానురా అందుకే వర్తమానం వెక్కిరిస్తుంది తేడాను చూసావా అంటూ...
కదిలిపోయిన ఆ కాలం నన్ను ఖైదు చేసేసిందోయ్ నీ ఙ్ఞాపకాలను శిక్షగా వేసి మరీ...
ఊహలను ప్రేమిస్తున్నావు కదూ...వాస్తవంలో నిన్ను దాచుకున్న నా మనసు ఆ రోజు ఇలానే ఉండేదని అర్ధంకాలేదా...
ఆ ఊహల్లో నా పాత్ర ఈరోజు నువ్వు పోషిస్తున్నావు...
ఒక్కసారి ...నన్ను పక్కన పెట్టిన నీ మనసు నా మనసుకు ఇచ్చిన కానుక చేతనైతే ఊహించుకో...
భరించలేవులే...వద్దు
నీ నిర్ణయాలు నాపై చూపించే ప్రభావం నీకు తెలుసు ...
కనీసం తేరుకోడానికి కూడా చేయూతనివ్వడానికి మనసు రాదు నీకు....
ఏమంత నేరం చేసానోయ్...నిన్ను ప్రేమించడమేనా
మనసులో విలువ ఉందంటావు.. ఉందిలే అందుకే ..అందరిలా చూడలేక ...అయిన దానిలా చూడలేక...కానిదానిలా పక్కన పెట్టేశావు..
కారణం నాకు అంతుపట్టనిదే ఎప్పుడూ...నీకే తెలియాలి
అయినా ఇంత నిక్కచ్చిగా నువ్వు ఉన్నాకైనా నాకర్ధం కాకపోతే ఎలా...
నీ మీద ప్రేమను చంపేయలేక పోయినా నీకు దూరంగా జరిగిపోయి నువ్వు చూపించిన ఆ పరాయి స్థానంలో పరాయి దానిలా ఉండాలి అనుకుంటున్నాను...
చాలా కష్టమైన పని...నాకు నేను దూరంగా ఉండటం..
కాని ఇంకొక దారి ఏమి మిగిల్చావోయ్ నాకు...
................అరుణని..............
No comments:
Post a Comment