Thursday, 20 April 2017

తాను నేను

నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను....
ఎన్నో ప్రశ్నల మధ్య నన్ను వేదించే ప్రశ్న ఒకటే...
నువ్వు ఆడుకోటానికి నా నమ్మకమే దొరికిందా అని...
నమ్మితే ఇంత పెద్ద శిక్ష వేస్తారా...అదంత పెద్ద నేరమా....
పరిచయాలు మొదలయ్యేది ఈ నమ్మకం మీదనేగా...
నీటి మీద రాతలలా నీ మాటలను కనిపించనివ్వని...
నీ తెలివీకి జోహరులు....
అవసరాల కోసం అన్ని అబద్దాల గోడలు కట్టాలా...
అవసరం తీరాక నువ్వు ఒక్కొక్కటిగా కూలుస్తున్న ఆ గోడలను చూస్తుంటే....
నా నమ్మకాన్ని నిర్థాక్షిణ్యంగా నీ పాదాల క్రింద వేసి నలిపేస్తున్నట్టు... ఇక్కడ నా ఊపిరి ఆగిపోతుందా అనిపించింది....
వస్తువులను అవసరాలకు వాడుకోండి కానీ మనుషులను కాదు
ఇక్కడ ఏది సాస్వతం....ఏది కాదని తెలిసిన నాకెందుకు నీ గురించి ఇంత వేధన....
నీ గురించి కావడానికి నేను నమ్మిన నువ్వు ...నువ్వు కాదే ఈ రోజు....
నేనిచ్చిన నమ్మకం ఈ రోజుకీ ఎంతో పదిలంగా ఉంది కదా నీ దగ్గర....
మరి నువ్విచ్చిన నమ్మకం నా దగ్గర ఎలా ఉంచావో చూసావా....
ఒకప్పటి ఆ అంధమైన అబద్దం ఈ రోజు వికృత రూపం దాల్చి నన్ను చూసి పగలబడి నవ్వుతుంది...
నువ్వు నమ్మింది నన్నేనా అంటూ....
నా నమ్మకం మీద ఆడి గెలిచిన నీకు విజయమే వరించింది....
నీ నమ్మకంతో నీతో ముడిపడ్డ నాకు నువ్విచ్చిన బహుమానం ఈ ప్రశ్నలు...అంతు లేని వేధన...
నిశ్శబ్దాన్ని భరించలేకున్నాను...అందుకే నాతో నేను మాట్లాడుకుంటున్నాను పిచ్చిదానిలా...
ఏమాత్రం సమయం దొరికినా నన్ను చూసి పగలబడి నవ్వుతుంది...ఎంత తెలివైన దానివి నువ్వంటూ
నేను పోగొట్టుకున్నది నమ్మకాన్ని...అందుకే ఈ వెతుకులాట..
నీకేంటి లోటు నీ దగ్గర దాచుకోడానికి కానీ...పోగొట్టుకోడానికంటూ ఏముందని..
కావలసిన దాని కోసం కష్ట పడండి... అంటే ఇలా నమ్మకాలని చంపేయడంలో కాదు అని తెలుసుకో
లేదా నాకిది కావాలని చేయి చాపేయండి...ఎవరో ఒకరు జాలి పడైన పడేస్తారు....
నమ్మకాలతో ఆటలు...కన్నీటి బహుమానాలు...విలువ తీసేయడం....తిరిగి నీకు బ్రతకడం చేతకాదా అంటూ నవ్వడం....
ఏం మనుషులురా....

                                ............అరుణని............

No comments:

Post a Comment