Thursday, 20 April 2017

తాను నేను

కొన్ని ప్రశ్నలు...కొన్ని జవాబులు...ఒక్క హెచ్చరిక
ఆడది అంటే హేళన,చులకన,బలహీనురాలు కొందరి దృష్టిలో
దేనిలో బలహీనులం... బంధాలకు,అనుబంధాలకు,మనసుకు ఇందులోనేగా
కూతురుగా,తోబుట్టువుగా,ఆలిగా,బిడ్డగా నా భాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నాను అందుకేగా బలహీనురాలిగా కనిపిస్తున్నాను
తండ్రి చాటు బిడ్డగా నా ఇంటి గౌరవం ముఖ్యంగా బావించి చెప్పినట్డు నడచుకోవడం వలనా
నా తండ్రి కష్టాన్ని చూసి నా అవసరాలు వదులుకోవడం వలనా
కట్టపెట్టిన వాడి వెంట కన్నీటిని దాచి చిరునవ్వుతో మీ ఇంటి గౌరవాన్ని నాది అనుకొని వెళ్ళడం వలనా
తోబుట్టువుగా నీ తప్పొప్పులను దాచి నీ బలం నా బలంగా అనుకోవడం వలనా
నా ఇల్లు నా సంసారం అనుకుని నిన్ను నమ్మడం వలనా
విసుగుతో వచ్చి, చిరాకు పడినా నన్ను కాకపోతే ఎవరిని అంటారులే అని కారణం కూడా అడకుండా నిను కనిపెట్డుకు ఉండటం వలనా
పర స్త్రీతో నువ్వు తిరిగొచ్చినా నా పిల్లలో లేదా లోకం కోసమో అంటూ అసలులో నిన్ను వదులుకోలేక ఆదరించడం వలనా
నా సంపాదన నా ఇష్టం అంటూ నువ్వు చేసే పనులను మౌనంగా భరించడం వలనా
నీ ఇంటి గుట్టును నీ లీలలు నీ చేతలను నీ వ్యసనాలను అన్నింటినీ పెదవి దాటనివ్వకుండా నలుగురిలో నిన్ను నీ గౌరవాన్ని నిలబెట్టడం వలనా

నేను తిరిగొస్తే ఆదరించగలవా,నీ విసుగు నేను ఖాతరు చేయకుండా ఉంటే ఊరుకోగలవా
నా సంపాదన నా ఇష్టం అంటే తిరిగి ప్రశ్నించకుండా ఉండగలవా
అసలు ఆడది తను ఇన్నాళ్ళూ నా బాధ్యత అంటూ చేసినవి చేయను అంటే నీ ఇంటిని నిన్ను ఊహించగలవా
బంధం ఏదయినా మనసుతో ముడివేసుకోవడమేగా నా బలహీనత
నేను భరించే ఇవన్నీ నువ్వు భరించలేవు
మరి బలహీనురాలిని నేనా నువ్వా
ఆడదానికి ఆత్మాభిమానం,ధైర్యం అవసరం అంటారు ఆదర్శవాదులు
నా బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి నేను ఎన్నైనా సహిస్తాను గెలుస్తాను కూడా అది కాదా నా ఆత్మాభిమానం
అందరి దగ్గర తలొంచడానికి అంగట్లోని వస్తువును కాను మనిషిని
ఎక్కడ తగ్గాలొ ఎక్కడ తలెత్తాలో ఎరిగిన దానిని
నీ బలహీనత నాపై అధికారం చేయడం, నన్ను తగ్గించడం అలా ఉంటేనే నువ్వు నాతో ఉంటాననడం
ఇక్కడ ధైర్యంగా నిలబడింది నువ్వా నేనా
వ్యవస్థను ప్రశ్నించే వాళ్ళు ముందు మనమేంటి అని ప్రశ్నించుకోండి
మార్పు మీ నుండి మొదలు పెట్టుకోండి అందులో నువ్వు నేను భాగమే
Feminists మీరు.. మొగుడుకి వడ్డిస్తున్నావ,పిల్లలను సాకుతున్నావ లాంటి ప్రశ్నలు దేనికి అవి
ఇక్కడ ఆడ,మగ ఇద్దరం సమానమే.. బాధ్యతలు నిర్వహించే సాటి స్త్రీని ఆశయాల పేరు చెప్పి చేతకాని దానివా అంటూ అవహేళన చేయడం దేనికి
వరకట్నం,భ్రూణ హత్యలు,అత్యాచారాలు ఇలా చాలా ఉన్నాయి వాటి మీద పోరాడితే అందరూ కలిసొస్తారు

ప్రేమ పేరుతోనో, పెళ్ళి పేరుతోనో, అవసరాలకో,కోరికలకో,ఇష్డాలకో మాతో ఆడేవాళ్ళకి జవాబు చెప్పడం కూడా వచ్చు
మీ వెనకున్న మీ కుటుంబాలను దృష్టిలో పెట్టుకోకపోతే మీ బాగోతాలు నగ్నంగా నడి రోడ్డు మీద పెట్టగలం
మనసుతో ముడి వేసుకున్నాను ఎన్ని ఆటలైనా ఆడు భరించగలను,నిన్ను గెలిపిస్తునే ఉంటాను... నాకు ఓడి గెలవడమే ఇష్టం నీ దగ్గర కాని..
ఈ గెలుపు గర్వంతో ఇంకొకరితో కూడా ఆడతాను అంటే నా మౌనాన్ని నేను వదిలి రాగలను
నిజంగా ఆడదాన్ని...ఆడ దాన్ని అయ్యి నిన్ను యాడ పెట్టాలో పెట్టి చూపించి నా ప్రేమను నాతోనే తీసుకుని నీ నుండి ఆమడ దూరం జరిగిపోతాను
నా విలువ నీకు నేను చెప్పక్కర్లేదు ఆ దూరమే నీకు నేర్పుతుంది
నేను విలాస వస్తువును కాదు.. బొమ్మను కాదు.. నీకన్న ఎక్కువ కాదు
నీ సాటి మనిషిని అది గ్రహించుకో చాలు
......అరుణని.....

No comments:

Post a Comment