Thursday, 20 April 2017

తాను నేను

పంచుకునే నాతోడు తోడుంటే చాలు ప్రపంచం తలకిందులైన ఉలుకే ఉండదు నా మనసుకు
ఆత్మీయంగా ఒకమాట..నేనున్నాను అనే ధైర్యం..మనసు పంచుకొనే నాలుగు పలుకులు
ఇంకేం కావాలయ్యా ఈ చిన్ని మనసుకు..
మాటిమాటికి మారేది మనసే కాదు...ఉన్నది ఒకటేగా అందులో చోటు కూడా ఒక్కరికే
భవిష్యత్తు నాకు తెలియదు..ఈ క్షణం మాత్రం ఇలా ఇది చాలు
ఆ ఏటి మీద అలల్లా మనమధ్య ఎన్ని అలజడులో కాని ఒక చిరునవ్వుతో తీరం చేరి చెదిరేవే అవి..
నీ మనసు అలికిడి ఈ మదిని చేరి కలవరింత పెడుతుందోయ్..
నా కోసమే అనుకోనా అవి ...పిచ్చిదాన్నో,తింగరబుచ్చినో నీ పాలుబడి ఇలా అయ్యానయ్యా
గాలివాటు మనిషివి ఏ తీరం చేరుతావో,ఎప్పుడు ఎలా ఉంటావో...
నిను నడిపించే తెరచాపను మాత్రం నేనౌతానోయ్..అలా అయినా నీవెంట నీతో కలిసి సాగొచ్చని బుజ్జీ
నువ్వెలా ఉంటే అలా నీవెంట నేను..నిను వదులుకునే అంత సాహసం నాకెక్కడ ఉంది
మంచిచెడులను కలిపి ప్రేమించే వాళ్ళని వదలుకోవడం,వదిలించుకోవడం కష్టమే తెలుసు కదా
ఇక్కడ నీకు కావలసినంత చోటుంది.. ఏలుకో మహరాజువై
అక్కడ చోటు నే కోరను...కోరితే వచ్చేది కాదు నాదన్నది నే కోరకనే వచ్చేది కదా
నీది కాని దానిమీద ఇంత ప్రేమా అంటే...ఏమని చెప్పను నాదని నమ్మేసాను ఒకనాడు
ఇప్పుడు ఇదే వాస్తవం...నాది కాని దానిని ఆరాదించడం
ఆశగా ఎదురు చూడటం ఒక్క పలుకు ఎప్పుడు దొరుకుతుందా అంటూ

..........అరుణని..........

No comments:

Post a Comment