నా అక్షరాలు నాకు ఔషదం
నువ్విచ్చే గాయాలకు లేపనం
తోలుబొమ్మను కానే ఆడించడానికి
తోలు మీద ఉన్న వ్యామోహం
అది కప్పుకున్న ఆత్మమీద ఆవ గింజంత కూడ లేదు
తప్పు నాదే అందుకే ఈ తిప్పలు
ప్రేమించిన వాళ్ళని ద్వేషించలేని నిస్సహాయత నాది
అయినవాళ్ళ తప్పులని పొరపాట్లు అని పొరబడటం ఏంటి
నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నాతో అలా నీతో నేను మనగలిగితే
నువ్వు అసహ్యించుకొకుండా ఉండగలవా నన్ను
నువ్వు మనిషివే అని నేను మరచిపోలేదు
నేనూ మనిషినే అది గమనించావా ఎప్పుడయినా
హత్తుకున్నప్పుడు నా గుండె లయలు వినపడలేదా
నీతో గడిపిన ఘడియలలో గమనించ లేదా నా స్పందనలను
నీ పిలుపు విన్న క్షణమే నీ ముందు వాలిపోయిన నా మనసు
ఆరాటం అణువంతైనా నిను తాకలేదా
నీ మనసుని అడుగు ఒకసారి సాటి మనసు మనోవేదన చెబుతుందేమొ
అదీ మొండి బారి పోయిందా ఏంటి నీతొ గడిపి బహుశా
దానికి అందుకోవడమే కాని ఇవ్వడం అలవాటు చేసుండవులే
అందుకోవాలి అనుకున్నప్పుడు అందలం ఎక్కించడం
అందాక అటక పైన పనికిరాని దానిలా పడేయడం
ఎలా ఉంటుందో అలా చేస్తే నీకు తెలిసుండదులే
నా బలహీనతను చూసి నువ్వు అవహేళన చేయడం ఏంటిలే
నన్ను నేనే నిందించుకుంటుంటే
నీ చేతలతో ఎంత హింస పెడతావో పెట్టు,నా సహనం చచ్చి
నీ మీద అసహ్యం కలిగితే అయినా నేను ఈ చెరనుండి బయటపడి
వెనుదిరిగి చూడటానికి కూడా ఇష్టపడకుండా ముందుకు అడుగేస్తానేమొ
వ్యాపారేత్తవి కదా వెల మాత్రమే తెలుసు విలువ తెలియదు
నష్టం రుచి చూడనంత వరుకు అంతేలే అలాగని
ఆ ఘడియ నీ జీవితంలో ఎప్పటికీ రాకూడదు
ఎప్పటికీ విజేతగానే ఉండిపో.. ఆ బాధని రుచి చూస్తున్న దానిని
అంత కష్టం నీకు రావాలని నేను కోరుకుంటే నా ప్రేమ
ప్రేమే కాదు...మాటల్లో ఉన్న నా బాధ నీ కష్టాన్ని కోరుకోవట్లేదు
నా కష్టాన్ని కడిగేసుకోడానికి మాత్రమే సుమీ..
.........అరుణని..........
No comments:
Post a Comment