మారాలని ఉంది.....మరచిపోవాలని ఉంది
మారాడానికి ఏం లోపముందో తెలియట్లేదు
నమ్మడం మానేయాల..నిజాయితీని వదిలేయాల
ప్రేమను వాడుకోవాలా...పగ పెంచుకోవాలా
ఉపయోగించుకోవడం నేర్చుకోవాలా...ఉపయోగపడటం మానేయాలా
ఏం మారాలి అసలు.....
నిలువెల్ల అవలక్షణాలతో నిండిన వాళ్ళకి లేదు మారాలని..మరి నేనెందుకు
మారలేను నేనింతే...
కాని మరచిపోవాలి....నిన్ను కాదు అది కుదరని పని
అందుకే నిన్ను దాచుకున్న నన్ను నేనే మరచిపోవాలి అనుకుంటున్న
నీ నిజాలు...నీ అవాస్తవాలు...నీ అలవాటులు నాకు నీ మీద కోపాన్ని మాత్రమే కలిగించాయి
నేను నీకు ఒక అవసరాన్ని అని తెలిసి కృంగిపోయాను
నేనేంటి నీకు అన్న ఆలోచనకి కూడా నేను సాహించలేదు
ఎందుకు నిన్ను పొందలేకపోయాను అనే ప్రశ్న నుండి
నిన్నా...నిన్నెందుకు ఇంతలా ప్రేమించాను అనే స్థాయికి తీసుకొచ్చినా ఎక్కడో... ఏదో ఆశ ఉండేది
కానీ...నేనిచ్చిన విలువలో అణువంత విలువ నాకు నువివ్వకపోయినా..నా వాడి దగ్గరేగా నేను తక్కువైంది అనుకుని..
పెదవి చాటు పొంగుతున్న దుఃఖాన్ని మౌనంగా అణిచివేసాను...
ఇన్ని జరిగినా ఇంకా దూరం జరగదేం...నా కాళ్ళకు అడ్డుగా ఇలా ఎన్నాళని ఆలోచించావేమో
నా విలువేంటో, ఎంత విలువ నలుగురిలో ఇవ్వగలవో
చూపించావు చూడు ....చంపేసావు ఊపిరితో ఉండగానే
మనసు మౌనాన్ని వీడి మరీ రోదిస్తునే ఉంది
ఏం పొందాను నీ నుండి అంటే....
మాటలు రావుగా నా కన్నీళ్ళకు వివరించడానికి
ఇంత నిర్థయుడినా నేను ఇష్టపడింది అని నా మీద నాకే అసహ్యం కలుగుతుంది
మనసుకి ఇవన్నీ అర్థం కాదు కానీ నాకు అర్థమయింది బాగా
అందుకే నిన్ను మరచిపోలేని నన్ను నేను మరచిపోవాలని నిర్ణయం తీసుకున్నాను
మానని గాయాలే ఇచ్చావో...విలువ తీసి వెలకట్టావో కానీ
సరైన శిక్ష వేసావు నీకు మనసిచ్చిన నాకు..
ఒకప్పుడు నువ్వంటే ఇష్టం అని నువ్వు నావెంట పడిన సంగతి నీ అబద్దాలలో ఒక అబద్దంగా ఎక్కడికో కొట్టుపోయుంటుందిలే...
ఇప్పుడు మనిద్దరి మధ్య ఉన్న నిజం ఇదే
నేను నమ్మింది ఒక అవసరం ముసుగులో ఉన్న అబద్దాన్ని అని
నీ కాళ్ళకు భందాన్నీ ఏనాడు కాలేదు...ఈనాడు కాలేను
మరచిపోతాను నన్ను..........మరచిపోనిది ఒక్కటే నువ్విచ్చిన విలువను ఎప్పటికీ
............అరుణని............
No comments:
Post a Comment