Friday, 10 December 2021

తాను నేను

ఊహించి రాయడానికి
ఊహవు కావు

వాస్తవం రాయడానికి
నువ్వు నిజానివి కావు

కథ రాయడానికి
గొప్పగా చెప్పుకునేంత ఏం లేదు

కవిత అల్లడానికి
నువ్వు కడ వరకు నిలిచే తోడువి కావు

ప్రస్తుతానికి నీ అనుభూతి నిజం
రేపటికి నువో గతానివో, జ్ఞాపకానివో

కాలానికే తెలియాలి
మన గాథ

#అరుణిమలు

3 comments:

  1. సూపర్ అరుణ గారు, చంద్రుడు నీ చూపిస్తూ గోరు ముద్దలు తినిపిస్తుంటెంది మీ కూల్ లిరిక్స్

    ReplyDelete
  2. చాలదా ఈ జన్మకు అరుణ గారి పోయెట్రీ చదివే భాగ్యం కలిగినది చాలదా? Xlent

    ReplyDelete