Sunday, 11 October 2020

మది మధనం

నిజంగా నిన్ను ప్రేమించే వారిని చూసి ఉండవు..

నీ కోసం సర్దుకుపోవడం
నీ పలుకు కోసం అర్ధించడం
అంటే ప్రేమ కాదు..

నువ్వు ఎవరిని ప్రేమించి ఉండవు..

నిన్ను మెప్పించే వారందరు నీ వారనుకుని
నీ మాట మీరని వారందరు‌ మంచోళ్ళు అనుకున్నావేమో..

వీటిలో ప్రేమ ఎక్కడ ఉంది... అవసరాలు, బంధాలు తప్ప..

తాను నేను

ప్రశాంతంగా ఉన్న మనసులోకి
కొన్ని పరిచయాలు నవ్వుతూ వస్తాయి..

ప్రశ్నలలో ప్రశ్నగా
మనల్ని వదిలి పోతాయి..

మన ప్రపంచంలో
మనం ఆనందంగా ఉండటం
కాలానికి కూడా నచ్చదేమో..

సాఫీగా సాగే జీవితంలోకి
బాటసారులకు ఆతిధ్యం ఇమ్మంటుంది..

అనుభవాలను నేర్పడానికో దేనికో 
పరిచయాలను ఎరగా వేస్తుంది
పరీక్ష పెడుతుంది..

నిన్ను నువ్వు పోగొట్టుకుంటావ
నిన్ను నువ్వు నిలబెట్డుకుంటావ అంటుంది..

బంధాలను గెలవడం అంటే
ఎదుటివారిని లొంగదీయడం కాదు
లొంగిపోవడం కాదు..

ఎవరికి లొంగి గెలవకు
ఎవరిని లొంగదీసి ఓడిపోకు..

నిన్ను నిన్నుగా
స్వీకరించని బంధంలో బంధీ కాకు..

✍️అరుణిమలు

Monday, 21 September 2020

తాను నేను

తనివి తీరదోయ్
నీతో నే గడిపే కాలానికి..

నీ మాటలకి
నీ ఆలోచనలకు‌ తనివి తీరదుగా..

నీ జ్ఞాపకాల ఆయుష్షు నూరేళ్ళు ఏమో
నీతో నా అడుగుల తోడు జన్మలనే దాటేసింది..

తనువు తెల్లారే వరకు
నీకై నిరీక్షణకు తనివి తీరదు..

మన మధ్య దూరాలలో
తరగని దారులలో
నా నడకలకు తనివి తీరదే..

నీకై రాసే అక్షరాలలో
నీ భావాలలో నా పదానికి తనివి తీరదుగా..

తనివి తీరనంతగా మదిని తడిమేసావు
తనువులు కలవని బంధానికి నేనో బానిసత్వం చేస్తున్నా తనివి తీరడం లేదు..

ఎన్నాళ్ళో‌ ఈ దాహం
నా దేహాన్ని దహించే వరకు..

✍️అరుణిమలు

Tuesday, 15 September 2020

తాను నేను

చేతి గీతలు కలిసాయి
చేతి రాతలు కలవలేదు ఏమో..

ఒకటవ్వ లేని మనం
ఒకటైన నువ్వు, నేను..

ఏకాంతంలో
మన మౌనాలు మాట్లాడు కుంటున్నాయి..

మాటలకు దూరంగా
మనసుకు దగ్గరగా హత్తుకుని ఉన్నాం..

ఒకరికొకరు ఎదురైతే ప్రమాదం
దూరమైతే విచారం..

కలిసి విడిపోయే అలవు నువ్వు
కోతలను కూడా వరమనుకునే తీరాన్ని నేను..

✍️అరుణిమలు

Tuesday, 8 September 2020

తాను నేను

నీ ఆలోచనల మహత్తు ఏమో
నా చుట్టూ నీ ధ్యాసే 
నీ చుట్టూ నా ఊహలే..

వినిపించని పిలుపు విన్నట్టు
కనిపించని రూపం కదిలినట్టు

నీ ఊపిరి నన్ను తాకినట్టు
నీ చూపులు నన్ను చుట్టేసినట్టు

నీ నవ్వులు నన్ను గిచ్చినట్టు
నీ పెదవులు నా చెంపను హత్తుకున్నట్టు

నీ చేతలు రాసే లేఖలు
నీ చేతుల్లో చిక్కిన మేను

నీ తీపి గాయాల తుఫానులో
నన్ను ఏ తీరం చేర్చేవో కదా

✍️అరుణిమలు

తాను నేను

నా అరచేత చందమామవి కదా
నా చేతి గీతలలో నీ పేరు రాసి ఉందేమో..

పండిన గోరింట చూసుకున్న ప్రతీసారి
ఆ ఎరుపులో ఏదో మెరుపులా కనిపించే రూపానివి..

నిజంగా...
నన్ను నువ్వు ఎక్కువ ప్రేమిస్తావ
అని నవ్వుకునే నవ్వులు..

ఈ రంగులలో మన ఊహలు
కదలాడుతుంటే..
నా కళ్ళల్లో మెరుపులు, పెదవుల్లో సిగ్గులు దాచేదెలా...

ఏ అమావాస్యకు అందకుండా
నిన్ను అరచేతిలో దాచేసుకోవాలనే చిలిపి ఆశ..

రేపటిని ఆ రంగుల్లో చూసుకుని
నా చందమామని ముద్దిచ్చి మురిసే కళ్ళల్లో
కొలువయ్యేది నువ్వేనా...

జాడ తెలియని దారి వైపు చూస్తూ
పేరు తెలియని నిన్ను మౌనంగా
తలంచుకుందోయ్ ఓ తారక...

✍️అరుణిమలు

Sunday, 6 September 2020

తాను నేను

మనసే లేని మనిషికి మనసులో చోటు ఇచ్చాక
గాయాలు కాకుండా ఉంటాయ..

తనువంతా గాయాలే
మనసంతా విలయాలే

నవ్వే నా కళ్ళల్లో
నీటి చెలమలే నువ్వు మిగిల్చిన ఙ్ఞాపకాలు..

మనువాడిన మనసు మోడుగా మిగిలింది
మనసంతా చీకటి నిండింది..

అక్షరం మీద శ్రద్ధ లేదు
భావం‌‌లో‌ అనుభూతి లేదు..

అనుభవాలు అంధకారంలో నిలబెట్టాయి
ప్రశ్నలను శరాలుగా వదులుతూ..

ఎవరిని నిందించలేను..
ఆయుధానికి తెగ నరకడమే వచ్చు కానీ 
ఆదరించడం తెలియదుగా..

ఆయుధాన్ని వరించి
గాయాలు కాకూడదంటే ఎలా...

తెలియక వరించినా
తెలిసాక భరించాక
బాధ వద్దంటే ఎలా..

చీకటిని పలకరించే నీ ఙ్ఞాపకాలు
నీ ఆలోచనలను పలకరించే కన్నీటి చుక్కలు..

ఇవే నువ్వు మిగిల్చిన ఆనవాళ్ళు నాలో
బతుకంతా బాధ్యతగా మోస్తాలే వీటిని..

నిన్ను మరచిపోయే రోజు వరకు..
నీ తలపు కూడా నన్ను తట్టి లేపని చివరి గడియల వరకు..

✍️అరుణిమలు

Wednesday, 2 September 2020

తాను నేను

అచ్చు కానీ భావాలు
అక్షరాలుగా మారని జ్ఞాపకాలు ఎన్నో..

తనతో తాను 
మౌనంగా పెదవులు పలికే ఊసులు..

పదాలుగా మారి
మనసును ఊరడిస్తాయి..

ఒక్కోసారి అక్షరాలు కూడా అలసిపోతాయి
ఎదలో చెక్కిన గాయాన్ని రచించ లేక..

మరచి పొమ్మని మస్తిష్కం అంటుంటే
మరచిపోలేనని మతి చేసే మారాన్ని..

బాధని భరించలేని నిస్సహాయత
మరోసారి గుండెల్లో గాయపు రాతని కదిలించలేను అంటుంది..

నాతో నేను మాట్లాడకూడదు
నన్ను నేను ఓదార్చకూడదు
నన్ను నేను మరచిపోవాలి

ముఖ్యంగా ...
నువ్వు చేసిన గాయాన్ని నీ కళ్ళ బడనివ్వకూడదు

అందుకే... అక్షరాలు కూడా ఆశ్రయం ఇవ్వనంటున్నాయి నా భావాలకు...

నీ తలపో చిరునవ్వులా మిగిలిపోవాలని వరమడిగా
నొప్పిగా మిగిలిపోవాలి అనుకున్నావేమో..

ప్రతీక్షణం నన్ను కదిలిస్తూ
కాల్చేస్తూ
శాపంగా మిగిలావు..

✍️అరుణిమలు

మది మథనం

కావాలి అనుకున్న వారి కోసం కారణాలను వదిలేస్తాం.... కానీ అకారణంగా ఎంతకాలం బాధ పడుతుంది మనసు...

ఒకరోజు వస్తుంది 
ఆ బాధకు అసలు కారణాన్ని వదిలేయడానికి...

ఆ రోజు ఏ కారణం
తన అడుగులకు అడ్డుపడదు ఆగమని..

Sunday, 30 August 2020

తాను నేను

ముసురేసిన మనసు
వర్షిస్తుంది..

చీకటి తాకిడికి
చెల్లాచెదురు అవుతుంది..

తెల్లారేసరికి
తీరం చేరిన తుఫానులా మారిపోతుంది..

ప్రతీ రాతిరి
చీకటి సాక్షిగా
ఆ మనసు ఓ తుఫానులో
చిక్కుకుని విలవిల లాడుతుంది..

తనని తాను
ఓదార్చుకుని తెల్లారికి తేరుకుంటుంది.. 

✍️అరుణిమలు

తాను నేను

నువ్వు నడిచే దారి
గమ్యం నేను కాకపోవచ్చు..

కానీ
నీ ప్రయాణంలో
నేనో ఙ్ఞాపకంగా నిన్ను పలకరిస్తూనే ఉంటా..

నువ్వు అలసిన వేళ
నిన్ను లాలించే తలపును నేనౌతా.. 

✍️అరుణిమలు

తాను నేను

కలలో కథలా 
కదిలిందో బాధ..

కటిక చీకటిలో
కన్నులలో కలహాల తాకిడి..

కవ్వించిన ఓ నవ్వు
కసురుకున్న ఓ మాట..

కనురెప్పల మాటున
కలవరింతలలో కదిలిందో రూపం..

కాటుక గడప ఆవల
కనుచూపు దూరంలో నిలిచింది..

కలలన్ని తీరాన్ని తాకాలని
ఎదపై దాడి చేస్తుంటే..

నువ్వో కన్నీరు చుక్కవై
జారుకుంటున్నావు..

ప్రతీ రేయి
నువ్వో కథలా పలకరిస్తావు..

ప్రశాంతతను
ప్రకోపంలా మార్చి తప్పుకుంటావు..

✍️అరుణిమలు

తాను నేను

నువ్వు నీలానే ఉన్నావు
నేనే నిన్ను నిన్నుగా చూడలేదు ఏమో..

పదే పదే నువ్వేంటో చెబుతానే ఉన్నావు
మాటల్లో, చేతల్లో..

గాయాలైన ప్రతీసారి కన్నీరై కరిగాను
నువ్వు వద్దంటు వెనుతిరిగాను..

నాకు నేనే ఓదార్పు నై 
నన్ను నేనే నిలబెట్టుకుని మళ్ళీ నీవైపే అడుగులు వేసా...

పిచ్చి తనమో, వెర్రి తనమో
అహం, ఆత్మాభిమానం కలిసి ఉండలేవని తెలిసినా కూడా మరొక అవకాశం అనుకున్న..

గతాన్ని తిరిగేసి చదివా
నా అక్షరాలలో నిన్ను ఎంత అందంగా మలుచుకున్నానో..

నాలో నా కన్నా ఎత్తులో నిన్ను రచించా
నా ఆశలకు మరో రూపంగా మలిచా..

వాస్తవాలకు చాలా కోసుల దూరంలో
అతిశయోక్తికి దగ్గరగా ఉన్నాయి నాలో నీ ఊహలు..

నీ దూరం పెట్టిన పరీక్షలను చదివా
కొట్టిన చేతికి కారుణ్యం లేదని కనిపించింది..

అక్షరాలలో లక్షణాలు
అతనిలో ఎక్కడ కనిపించలేదు..

నీ జ్ఞాపకాలలో నన్ను వదిలేసి
నువ్వు నీ దారిన వెళ్ళిపోయావు అతిధిలా..

నీపై కోపమా....కోపానికి చోటు ఎక్కడ ఉంది
దేనికి చోటు లేనంత బాధలో నన్ను నిలబెట్టేసావుగా..

✍️అరుణిమలు

Thursday, 20 August 2020

తాను నేను

ఎందుకు వచ్చావో
ఎందుకు వెనుతిరిగావో

నీ రాకపోకలు మధ్య
నలిగిన నా మనసుకు
జవాబు ఉందా నీ దగ్గర

నువ్వు వచ్చి వెళ్ళిన మధ్య కాలంలో
జరిగింది అంతా మాయ

ఏమని నిన్ను ప్రశ్నించేది
మాటలు రాని మూగ దానిని చేసేసావు

ఏమని నిందించేది
మనసును చీకటి చేసాక

ఏమని బదులు కోరేది
మన బంధమే నీటి బుడగని తెలిసాక

ఏమని సర్దిచెప్పుకునేది
నీ మాటల్లో మసక బారిన మనసుకు

ఏమని చెప్పేది కన్నీటికి
ఇక చాలని
చలించకే ఏ ఙ్ఞాపకానికని

నన్ను నేను 
సర్దిచెప్పుకోలేని చోట నిలబెట్టి
నీ దారిన నువ్వు సాగిపోయావు

✍️అరుణిమలు

Wednesday, 19 August 2020

నేనిలాగే చెబుతా

ఏ గొడవలోకి దూరి న్యాయ అన్యాయాలు మాట్లాడనంత వరకు అందరికి ఐన వారమే...మంచి వారమే...

నేనిలాగే చెబుతా

ఎంత దగ్గరయ్యావని కాదు...ఎంత అర్థం చేసుకున్నావు అనే దాని మీద ఆదారపడి ఉంటుంది

ఇద్దరి మధ్య సాగే బంధమనే ప్రయాణం..

నేనిలాగే చెబుతా

మన రూపాన్ని మలిచేది ఆ బ్రహ్మ ఐతే...ఆ రూపాన్ని మళ్ళీ చిత్రించగలిగేది చిత్రకారుడే... ఫొటోగ్రఫీలో ఆర్ట్ కూడా ఒక భాగమే...ఏ రూపానికైనా సజీవ రూపం ఇస్తారు కనుక..

నేనిలాగే చెబుతా

నిజాన్ని సమాధి చేయలేం..
అబద్దాన్ని ఊరేగించలేం ఎక్కువ కాలం..

నేనిలాగే చెబుతా

ప్రకృతిని ఆస్వాదించే వారికే ఫొటోగ్రఫీ మీద ఆశక్తి ఉంటుంది...  భావాన్ని బందించడమే కెమెరా కన్ను చేసే పని... మనం ఆ అనుభూతిని ఫీల్ ఐతేనే ఆ చిత్రం తీయగలం‌..

నేనిలాగే చెబుతా

గుంట నక్క ఎదురు దాడి చేయదు.... సింహం దొంగ దెబ్బ తీయదు.... కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి... కొన్ని గుణాలు వ్యక్తిత్వం వలన వస్తాయి..

తాను నేను

నువ్వు నడిచే దారి
గమ్యం నేను కాకపోవచ్చు..

కానీ
నీ ప్రయాణంలో
నేనో ఙ్ఞాపకంగా నిన్ను పలకరిస్తూనే ఉంటా..

నువ్వు అలసిన వేళ
నిన్ను లాలించే తలపును నేనౌతా.. 

✍️అరుణిమలు

Tuesday, 18 August 2020

మది మధనం

కలలకు సంకెళ్ళు వేయనిదే
దరి చేరనంటుంది 
కునుకు
😚😚😚

మది మధనం

కలలకు సంకెళ్ళు వేయనిదే
దరి చేరనంటుంది 
కునుకు
😚😚😚

మది మధనం

కలలకు సంకెళ్ళు వేయనిదే
దరి చేరనంటుంది 
కునుకు
😚😚😚

మది మధనం

వివరణలు..సవరణలు
దేనికి నీ మనసుకు తెలియదా నీ గురించి..
సవరించి,వివరించి
పలుచన చేయకు బంధాన్ని.. చిన్నబోయే మనసుకు ఏ వివరణలు వినపడవు..

మది మధనం

నీ ఉఛ్వాస నిశ్వాసల వేణు గానం 
నా మెడ ఒంపును మీటుతూ ఈ మేనులో సరిగమలు పలికిస్తుందోయ్
❤❤❤

మది మధనం

వేడి వేడి సెగల పొగలు కక్కే నీ చేతలను తొరిపితే..
వచ్చే పాల నురుగేనోయ్ నా కోపం
;) ;) ;)

మది మధనం

కళ్ళు మూసుకొని కలవరించా నీకై 
ఏకాకి నై.
కనులు తెరిచి చూసానా ఏకాకి లా నువ్వు కనిపించావు, నేనున్నది  సమూహంలో అని అప్పుడు తెలిసింది

మది మధనం

కలహాలు,విరహాలు సమపాళ్ళుగా జోడించా కను రెప్పల్లా..
కనుపాప లాంటి మన బంధానికి
❤❤❤

మది మధనం

నా భావంలో నువ్వో బందీవి..
 నువ్వనే ఊహను ఇష్టంగా నా గుండెలకు హత్తుకునన్నాళ్ళు..

మది మధనం

పత్తా లేని పత్తా కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో నా అక్షరాల లేఖలు
ఈ నీశీది వీదులలో
😄😄😄

మది మధనం

తలవాలంటే నిను మరవాలి కదా..
మరవాలి అన్నా కూడా నిను తలంచాలి కదా..
నువ్వే ఙ్ఞాపకానివోయ్.. రావడమే కానీ పోవడం మరిచి ఇలా నిలిచావు నాలో

మది మధనం

దూరమవ్వడం నీ ఇష్టం..
ఆ దూరాన్ని సైతం గుండెలకు హత్తుకోవడం నాకు ఇంకా ఇష్టం..
ఆ కష్టంలో కూడా నువ్వున్నావనేమో ఇంత ఇష్టం
❤❤❤

మది మధనం

నీ ఒరలో ఒదిగిన అస్త్రాన్నే నేను..
 నువ్వు చే'పడితే నే హరివిల్లునై సంధించమని నను నేను మలుచుకునే అందాన్ని కూడా
🌈💘💘🌈

మది మధనం

నా మాటలు దెప్పిపొడుపులే నీకు !!
నాకు మాత్రం నాలో ఎగసే నిప్పు రవ్వల మీద జల్లే నీటి తుంపరలు మాత్రమే

మది మధనం

వెన్నెల తానాలే మనసుకు
నీ నేరేడు కళ్ళలో నన్ను దాచుకుంటే
😍😍😍

మది మధనం

నిన్నటి కథలు మళ్ళీ వల్లె వేస్తుంటే నువ్వు ఇవ్వాళ....నవ్వు వస్తుంది తనివి తీరని నీ దాహాన్ని,...అలుపే లేని నీ ఆటలను చూసి.....ఏం సిత్రాలురా సీ..

మది మధనం

నిదరకు చేరితే కళ్ళు నీ కలల తాయిలం కోరుతున్నాయి..
మెలకువలో ఉంటే మనసు మురిపాల కోసం మారాం చేస్తుంది..
పిచ్చి మనసు 
❤❤❤

మది మధనం

విశ్వమంతా నీవైతే..
నీలో ఒదిగి, నిను అలంకరించిన తారకను నేను..అరుణను నేను శివా..
❤❤❤

మది మధనం

మనిషి ఒంటరిగా అయినా బతకగలడు కానీ మనసు ఒంటరిగా బతకలేదు.. అందుకే తనకో తోడు చూసుకుంటుంది..మనం అవునన్న కాదన్న..!!

మది మధనం

#అతిగా చేరువ కాకు ఏ #మనసుకు..
#అంగుళం దూరం కూడా #అగాధం లా కనిపిస్తుంది..

#అలవాటు పడకు ఏ #ఇష్టానికి
#వ్యసనంగా మారాక నువ్వు #పతనమయ్యే వరకు నిను విడువదు..

మది మధనం

అందరూ పిలుస్తారు పేరు పెట్టి...దగ్గరైన వారు ముద్దు పేరులతో...కానీ మనసుని తాకేది ఎవరో ఒకరిదే...ఏయ్ అన్నా చాలు...హేవిటో ఆ మాయ
😉😉😉

మది మధనం

అందరినీ మళ్ళీ మళ్ళీ భరించే అంత శక్తి ఉండదు కానీ... లొంగిన మనసు ముందు మాత్రం ఎన్నిసార్లు ఓడిపోడానికి అయినా సిద్దమే...

మది మధనం

ఫలితం మోసేది ప్రాప్తమనుకొని కాదు..కోరి తెచ్చుకున్నది కొరివి అయినా కనకమే కదా మనసుకు..

మది మధనం

త్వరత్వరగా పడే అడుగులు కూడా ఆగి వెనుతిరిగి చూసేది పక్కన తోడు ఉన్నప్పుడే...అదే బంధం తాలూకా అర్థం కూడా...!!

మది మధనం

ఒకనాడు నిన్ను విలువుగా చూసుకున్న నా మనసుకు 
నీ ఆలోచన కూడా భారంగా మారిందంటే అర్థం..!!

మది మధనం

ప్రేమ, విరహం ఒకరి పేరుకి అంకితం..
పెళ్ళి, జీవితం ఇంకొక తోడుకి రాసిచ్చేస్తాం..ఏవిటో ఈ మాయ..😱😱

మది మధనం

కసరాలనే తాపత్రయమే కానీ...
నీ పిలుపుకు కరిగి పోయాక...మాటలే కరువు ఇక్కడ
❤❤❤

మది మధనం

ఆ చూపులు చాలింక...వెన్నెల బాణాలై ఎదలో గుబులు రేపి..చెంతకు చేరమని చెలి మంటలు రేపుతున్నాయి ఇక్కడ..
😍😍😍

మది మధనం

తెలిసో, తెలియకో చేసిన తప్పులకు.. కొన్నిసార్లు శిక్ష అనుభవించడం కూడా బాగుంటుంది..మన మీద మనకు అసహ్యం వేసినప్పుడు అదొక్కటే దారి

మది మధనం

దగ్గరయ్యే వారికి చోటివ్వం..
దూరమైన వారిని మరవం..
హేవిటో మాలోకాలం

మది మధనం

అర నవ్వు వెనుక అంతరార్ధాన్ని చేదించి చూడు ఒకసారి..సంతృప్తి ఉందో లేదా అసహనం ఉందో తెలుస్తుంది..అన్నిటికి మాటలు ఉండవు..

మది మధనం

కాని వారి అరుపులు కాకుల గోలలా ఉంటుంది..మన అనే వారి విసురైనా, కసురైనా కదిలించి పారేస్తుంది..

మది మధనం

ఏందిరో ఈ చిత్రం ఎదురొస్తే నీతో ....రాకుంటే నీ తలపుల తో నాకు ఈ చింత...
💚💚💚

మది మధనం

నాకు పరకాయ ప్రవేశం రాదు...వచ్చుంటే బాగుండేది...నీలో నిను చేరి నిలిచిపోయేదాన్ని మనమై ఎప్పటికీ

మది మధనం

అనుభవాలు ఏ ఒక్కరి సొత్తో కాదు...తరచి చూస్తే ప్రతి క్షణం ఒక అనుభవమే

మది మధనం

కన్నీరు అడిగి రాదు....కానీ కదిలించి కడిగి మరీ పోతుంది మనసును..!!

మది మధనం

కొందరిని మనసు చేరువ చేస్తే...మాటలు దూరం చేస్తాయి...ప్రవర్తన ఏమో అగాధాన్ని సృష్టిస్తుంది..‌.ఏదో రాసేసా లాజిక్ తీయకండి

మది మధనం

నా చుట్టూ వేల తారలున్నా కూడా అమావాస్య నీడలను తరమ లేక పోతున్నాయి ఈనాటికీ...

మది మధనం

చేతలతో గాయాలు చేయడం...
మాటలతో మందేయడం
హేవిటో...

మది మధనం

కోతకు గురవుతునే ఉంది తీరం...
ఎదలో ఆవలి గట్టున నీ వుంటే...
💔💔💔

మది మధనం

మన అని కలుపుకోవడం ఎంత సులువో
..... 
 దానిని తెంపుకు పోవడం అంటే...ఒక మినీ యుద్దమే..

మది మధనం

మనసున్న మనిషికి జీవితం
 "కత్తి మీద సామే" 
ప్రతి క్షణం

మది మధనం

ఉలుకు లేని ఊసులకు కులుకెక్కువే మరి ఊహలలో  నువ్వు ఉంటే
😉❤❤😉

మది మధనం

మానిపోని గాయం ఉండదు కానీ... మాసిపోని జ్ఞాపకాలు ఎన్నో...

మది మధనం

నమ్మకాల నీడన...మనం ఎప్పుడు వెర్రి వాళ్ళం లానే కనిపిస్తాం లోకానికి...

మది మధనం

గొడుగెందు కంట 
నీ గుండెల్లో దాగున్నాక..

పిలుపెందుకంట 
నీ పెదవులలో బంధీని అయ్యాక..

కునుకెందుకు అంట 
నీ రెప్పల దుప్పటి కప్పుకున్నాక..
😍😍😍

✍️అరుణిమలు

మది మధనం

వానలో తడవడం అప్పటి సరదా..
నీ మాయలో తడవడం ఇప్పటి సరదా..

ముంచేయవోయ్ నీ ధ్యాసలో
మురిపించేయ్ నీ ఊహలతో

ఉరుముల ఉరకలు
మెరుపుల విరుపులు
చూపించక ఇక...
❤❤❤

✍️అరుణిమలు

మది మధనం

మాటలు రాజ్యాలు ఏలిన సీమలో
మౌనం పహారా కాస్తుంది నేడు
మనకు మాత్రమే తెలిసిన అంతర్యుద్ధం కదా ఇది..

మనసుకు మనసుకు మధ్య
జరుగుతున్న మౌన పోరాటం
మాయే చేస్తుందో..మసి చేస్తుందో...!!

✍️అరుణిమలు

మది మధనం

ఒక్కో వీడ్కోలు, ఒక్కో అధ్యాయానికి ముగింపు పలికి ఙ్ఞాపకమై మిగిలి పోతుంది కదూ...నువ్వు ఎప్పుడు ఙ్ఞాపకానివి అయ్యావు పొట్టి

మది మధనం

ముందుగ ఊహించినవే అయినా.... 
కొన్ని సంఘటనలకు ఎదురు పడటానికి మనసు వెనుకడుగు వేస్తుంది....
ఊహకు అందినవే అయినా ఆ మలుపులకి ఊసులు కూడ తోడు రావు.....
చుట్టూ ఎందరున్న మనసు నిండా ఒంటరి తనమే....
మాటలెన్ని చెవిన పడిన మనసును తాకేందుకు జంకే....
పూసిన నవ్వులన్ని వాడినవై రాలుతుంటే....
ఏవిటో ఎదురు చూసేవారికి ఇంతేనేమో చివరకు మిగిలేది.... !!!!

#స్వీటు 😘😘😘

మది మధనం

చీకటిని హోరెత్తించే కీచురాళ్ళు నయమే..
నాలుగు చుక్కలకు చేరిన కప్పల అరుపులు నయమే..
మౌనమై చలనం మరచి నిలిచిన తారల నిర్లక్ష్యం నయమే..
అహం దెబ్బతిన్న మనిషి నోటి వెంట వచ్చే నొసటి విరుపుల మాటల కన్నా...
తానేంటో చెవుతున్న చేష్టలు కన్నా...

నయమే....

మసి మధనం

కరువొచ్చింది మన మధ్యలోకి...
మనసు ఆకలితో అలమటిస్తుంది
💔💔💔

మది మధనం

చాలామంది అవసరం తీరాక నిర్లక్ష్యం చూపిస్తారు..నాకు మనసు విరిగితే కానీ ఆ నిర్లక్ష్యం చూపించడం రాదు..ఎదురుగానే ఉంటా ఎవరినో అన్నట్లు.

మది మధనం

కోపానికి #కారణాలు చెప్పు...
ఇష్టాన్ని మాత్రం #చేతలలో చూపించు...

#ఇష్టాన్ని మాటలలో చెప్పి...#కోపాన్ని చేతలలో చూపించకు...

అక్కడ #అవసరం మాత్రమే కనబడుతుంది...#బంధం కాదు..

#గెలిచి_ఓడుతావో....#ఓడి_గెలుస్తావో మరి 
పై చేయి అంటే ఎదుటివారిని వంచడం కాదేమో
ఆలోచించుకో...

#దూరాలు ఎప్పుడు #దగ్గర చేయవు
అప్పుడప్పుడు తప్ప..

#ఙ్ఞాపకాలుగా మిగులుతామో...#చెదిరి పోతామో 
అంతా మన చేతిలోనే ఉంది సుమీ...!!

మది మధనం

తలంచావేంటోయ్....
వెన్నెల కూడా వేడేక్కిస్తుంది.
😍 😍😍

మది మధనం

వందమందిలో ఒకరం అవ్వడం కన్నా... ఒంటరితనమే మేలేమో ఒక్కోసారి..‌.

మది మధనం

ఎదుట పడితే పెదవి విరుపులు..‌.
కనపడక పోతే కలవరం..‌.
ఇదేం పులపరం
😉😉😉

మది మధనం

తాకట్టు పెట్టావా నీ వలపులను..
వడ్డీ అంటూ ఊహల తలుపులు తడుతున్నాయి మాటిమాటికి..
❤❤❤

మది మధనం

ఎదుట పడితే పెదవి విరుపులు..‌.
కనపడక పోతే కలవరం..‌.
ఇదేం పులపరం
😉😉😉

మది మధనం

మనసు వదిలేసాను నువ్వున్న చోటున..
మనిషిగా మిగిలాను నా మాటున..
😊😊

మది మధనం

#ప్రేమ_బంధాలు అనేవి #సాలె_గూడు లాంటివి...
ఆ గూడు సొంతమైతే పర్వాలేదు...

అదే పరాయిది అయితే 
ఇక అంతే...

బయటకు రాలేం, లోపల ఉండలేము
గజిబిజి గందరగోళమే అంతా...!!

మది మధనం

మనసున ఏ మూలనో మరుగున పడేసిన విషయాలే...మనిషిని నాశనం చేసేవిగా మారుతాయి చివరికి..!!

మది మధనం

విస్తరి అనేది ఒకసారి వడ్టనకే కానీ మళ్ళీ మళ్ళీ అంటే ఎంగిలే కదా..శరీరమైనా,మనసైన అంతే అనుకుంటా నేను.. నేనింతే పిచ్చి దాన్ని..

మది మధనం

కనురెప్ప అలుగుతుందా కనుపాప పై..
చెక్కిలి అలుగుతుందా కన్నీరు పై..
నా అలక కూడా అంతేనోయ్ నీపై..
😍😍😍

మది మధనం

మాటలతో వాదనకు పదును పెంచుకో 
పర్వాలేదు కానీ...!!

మనసు మీద దాడి చేయకు అదే మాటలతో..
ఆ దుఃఖం విప్పి చెప్పడానికి 
ఏ మాటలు కూడా పనికిరావు...!!

మది మధనం

అధరాలమే ఇరువురం... 
కలిస్తే మధురం, కలవకుంటే కలవరం 
😍😍😍

మది మధనం

నా ఊహల్లో...నీతో అలవోకగ ఎన్నో ఊసులు
ఎదురు పడిన నాడేమో మౌనమే నా భాషయ్యింది 

ఈ మనసుకి ఇన్ని చిలిపి చేష్టలు తెలుసని
నువ్వు కలిసాకే తెలిసింది.. 
<3 <3 <3 <3

✍️అరుణిమలు

మది మధనం

ఎక్కడివి అక్కడే వదిలేయాలి 
         మనుషులు కావాలంటే.... 
     
లేదా మన చుట్టూ కారణాలే మిగులుతాయి.... 
  ‌‌‌‌                ఛీ ఎక్కడ చూడు రాజీ పడటమే ఉఫ్..    
                           😏😏😏

మది మధనం

ఎవ్వరైనా మన జీవితంలోకి 
 ఏ హోదాలో వచ్చిన...   
   వారి వలన మనం ఏం పోందామన్నది 
     తరువాత విషయం..

మన చుట్టూ ఉన్న వారిని
 మనలో ఉన్న సంతోషాన్ని 
   సమయాన్ని 
     నష్టపోకుండా ఉంటే చాలు...

ఎందుకంటే...కొన్ని పోగొట్టుకున్నాక 
మళ్ళీ మళ్ళీ కావాలన్న తిరిగి రావు...

ఒకరి కోసం అన్ని వదులు కోవడం మూర్ఖత్వం
ఇక్కడ ఎవరికి ఎవరు శాశ్వతం కాదు కనుక..

మది మధనం

ఆడవారితో
వాదనలో గెలిచే అవకాశం ఉన్న
కూడా మగాళ్ళు 
ఒక అడుగు తగ్గి సర్లే అని
ఓడి గెలిపించే సంధర్బం ఉంది చూసారు
(ఇష్టమైన వారి దగ్గరే సుమీ)

హౌ క్యూట్ ❤❤❤😍😍😍

మది మధనం

మనసెప్పుడు తాను ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటుంది..
అందుకేనేమో అదెప్పుడు మన మాట వినదు..

మది మధనం

ఒకరికి అలవాటు పడటం 
అంత చెత్త పని ఇంకొకటి ఉండదు..
😣😣😣

ఎంచక్కా..
మనలో మనమే మాట్లాడుకొని, 
పోట్లాడుకోవడం అంత ఉత్తమం లేదు 
మహా అయితే పిచ్చోళ్ళు అంటారు 
అంతే కదా..
😄😄😄

గొడవలు పడి 
దూరమయ్యాక చేసే పని
ముందే చేస్తే మంచిది కదా...
😅😅😅

అంటాం కానీ ఇలాంటివి
చేస్తామా, పాడా
మాటలకే కానీ చేతలకు 
సున్నా వీటిలో 
😝😝😝

మది మధనం

మనసు గోల వినపడనంత ఏకాంతం కావాలి..

వెధవ మనసు అవునంటే కాదు,కాదంటే అవును అంటుంది..

అందరిని నమ్మమంటుంది, నమ్మకం వమ్ము అయ్యాక దుఖః పెడుతుంది..

ఇష్టమైన పనే చేయమంటుంది, చేసాకేమొ తప్పులను ఎంచుతుంది..

మరుపు సహజమంటుంది కానీ అదంత తేలిక కాదంటు మెలిక పెడుతుంది..

ఏం మనసువే నువ్వు అంటే నా చేతిలో కీలుబొమ్మవే నువ్వు అంటుంది..

చిన్న ఉలిక్కిపాటుకే గంగను దించేస్తుంది ఆనకట్టలే లేని జలాసయంలా..

మనస్సున్న మనిషికి సుఖము లేదని ఉత్తినే అనలేదు కోతి మనసు..                                 

✍️అరుణిమలు

మది మధనం

మనసు గోల వినపడనంత ఏకాంతం కావాలి..

వెధవ మనసు అవునంటే కాదు,కాదంటే అవును అంటుంది..

అందరిని నమ్మమంటుంది, నమ్మకం వమ్ము అయ్యాక దుఖః పెడుతుంది..

ఇష్టమైన పనే చేయమంటుంది, చేసాకేమొ తప్పులను ఎంచుతుంది..

మరుపు సహజమంటుంది కానీ అదంత తేలిక కాదంటు మెలిక పెడుతుంది..

ఏం మనసువే నువ్వు అంటే నా చేతిలో కీలుబొమ్మవే నువ్వు అంటుంది..

చిన్న ఉలిక్కిపాటుకే గంగను దించేస్తుంది ఆనకట్టలే లేని జలాసయంలా..

మనస్సున్న మనిషికి సుఖము లేదని ఉత్తినే అనలేదు కోతి మనసు..                                 

✍️అరుణిమలు

మది మధనం

పట్టుకోవాలంటే పట్టు దొరకదు..
వదిలేసినంత మాత్రాన వదిలి పోదు..
అంతే... అదంతే అది బంధం కనుక

మది మధనం

కనిపించని చోట వెతుకులాట..
కనికరించని చోట పాకులాట..
హేవిటో

మది మధనం

మనసుకి, కన్నీళ్ళకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో...
మనసు చివుక్కుమంటే ఇవి ఆగనంటాయి...

ఆర్పేందుకో, ఆర్చేందుకో... ఏం తీర్చేందుకో..ఎందుకో మరి..!!

మది మధనం

లోకం ఎన్ని రంగులను అద్దుకుని, ఎన్ని వింతలుగా కనిపించిన.....ఒక్కోసారి లోకాన్ని తెంచేసిన ఏకాంతమే బాగుంటుంది... 

మాటలు ఉండవు... ఆలోచనలు ఉండవు... ప్రశ్నలు ఉండవు... జవాబులు ఉండవు... మనల్ని మనమే వెలివేసిన ఏకాంతం...అదే చాలనిపిస్తుంది..

మది మధనం

ఏ చినుకు దాహం తీరుస్తుందో
ఏ మాట మనసును మీటుతుందో
ఏ వాక్కు నిజమై ఎదురౌతుందో
ఏ తడి కంటిని అంటుతుందో..

దాహం వేసినప్పుడు ఒక చుక్క నీరు మహా గంగ లా కనిపిస్తుంది..
కృంగిన మనసుకు ఒక పలకరింపు కూడా వేదమంత్రంలా అనిపిస్తుంది..

తాను నేను

విలువ లేని చోట ఇమడలేను
మనసు లేని చోట నిలువలేను..

కారణం " నువ్వే "

నీ‌ దగ్గర ఉండలేను
నువ్వు లేకుండా 
అసంపూర్ణంగా మనలేను..

ఈ పరీక్షకు 
గెలుపు లేదు
ఓటమి లేదు..

అంతర్మధనం తప్ప
మిగిలేది ఏం లేదు.. 

✍️అరుణిమలు

తాను నేను

ముసురేసిన మనసు
వర్షిస్తుంది..

చీకటి తాకిడికి
చెల్లాచెదురు అవుతుంది..

తెల్లారేసరికి
తీరం చేరిన తుఫానులా మారిపోతుంది..

ప్రతీ రాతిరి
చీకటి సాక్షిగా
ఆ మనసు ఓ తుఫానులో
చిక్కుకుని విలవిల లాడుతుంది..

తనని తాను
ఓదార్చుకుని తెల్లారికి తేరుకుంటుంది.. 

✍️అరుణిమలు

Sunday, 16 August 2020

మది మధనం

నీ జ్ఞాపకాలు ఆపడం తప్ప అన్ని సాధ్యమే నాకు..

మది మధనం

ఇరు దేహాల రాపిడి కాదు శృంగారం అంటే
రెండు శరీరాలు మాట్లాడుకునే మాటలకందని భాష శృంగారం...

Saturday, 15 August 2020

మది మధనం

తనను తాను తక్కువ చేసుకునేదే ప్రేమంటే..

మది మధనం

కథో, కావ్యమో అయితే ముగింపు మన చేతిలో పని...జీవితాలైతే పై వాడి చేతిలో పని..ఆశ ఎప్పుడు చిటారు కొమ్మన మిఠాయి పొట్లమే..

మది మధనం

నిర్లక్ష్యం చేయడం ఈరోజు నీ వంతు
ఏదో రోజు నా వేపు నుండి వస్తుంది
ధైర్యంగా ఉండవోయ్ ఆ రోజు...

మది మధనం

నేనే ఓ అక్షరాన్ని ఐపోయా
నీకోసం
నిన్ను నాలో చూసుకునేందుకు..

మది మధనం

నిర్లక్ష్యం చేయడం ఈరోజు నీ వంతు
ఏదో రోజు నా వేపు నుండి వస్తుంది
ధైర్యంగా ఉండవోయ్ ఆ రోజు...

మది మధనం

కాలక్షేప పరిచయాలు ఒక్కోసారి
కంటిలో నలుసుగా మిగిలిపోతాయి

మది మధనం

తనివి తీరని ఇష్టానివి ఏమో
తనువు తపో నిష్టలో ఉంది
నీ దర్శనం కోసం..
❤❤❤

మది మధనం

కాలక్షేప పరిచయాలు ఒక్కోసారి
కంటిలో నలుసుగా మిగిలిపోతాయి

మది మధనం

ఒక్కోసారి మాట వలనో, వ్యక్తి వలనో మనల్ని మనం పోగొట్టుకున్నంత బాధ పడతాం....... ఆ స్థితి అలాంటిది ఏమో కానీ..... కాలం గడిచాక, నిజం జీర్ణం అయ్యాక, ఇంత వ్యధ అవసరమా, ఏ మాత్రం అర్హత లేని వారి వలనా ఇదంతా అనిపిస్తుంది...... మనం ఇచ్చే విలువ తీసి పక్కన పెడితే అప్పుడు, ఇప్పుడు అవతలి వారు సున్నా నే అసలుకు....

*మనం ఇచ్చే విలువే గాడిదను గుర్రం చేయగలదు...గుర్రాన్ని గాడిద చేయగలదు...మనల్ని బాధ పెట్టగలదు🙋🙋🙋

మది మధనం

బాధని వర్ణించడానికి పదాలు చాలవు....సంతోషాన్ని వర్ణించడానికి పదాలే ఉండవు..

మది మధనం

మనసెందుకో ఒక్కోసారి ఉత్తుత్తినే అలసి పోతుంది...లోన ఏమంత భారం దాగుందనో ఈ అలసట..

మది మధనం

మొక్కుబడి బంధాలతో
మనసుకు వనవాసమే తప్ప
వైభోగం ఉండదు..

మది మధనం

అక్షరాలకు కూడా పండుగ సెలవులు ఉంటాయి ఏమో.....రాద్దామంటే ఆలోచనలు మొరాయిస్తున్నాయి....!!

మది మధనం

ఎవరికో చాయిస్ అవ్వడం కన్నా...ఎవరికి చాన్స్ ఇవ్వకపొవడం బెటర్ కదా...!!

మది మధనం

మనిషికి ఆర్ధిక బలం ఎంతో... మానసికంగా ఒక మనిషి తోడు ఇచ్చే బలం కూడా అంతే అవసరం..

మది మధనం

జ్ఞాపకాల ఆయుష్షు నూరేళ్ళు ఉంటే
మనిషి ఆయుష్షే దినదిన గండం..

మది మధనం

నేనో అర్థం కాని‌ పదాన్ని
మాటకు ఒక భాష
భావానికి మరో భాషగా మారుతుంటాను..

మది మధనం

వద్దు అనుకోవడం తేలికే కానీ...మనసు మాత్రం ఆ వద్దు అనే దాని కోసం వెతకడం మానదు

మది మధనం

అదేంటో...... ఉన్నట్టుండి ఆలోచనలు ఎటో పోతాయి.....తప్పిపోతాయి కూడా కాసేపు......అదీ ఎదురుగా లేని వారి కోసం...🙄🙄🙄

మది మధనం

స్వాభిమానం ఉన్న ఆడది
బంధంలో ఇమడాలన్న
సమజాంలో నిలబడాలన్న
ఒక మినీ యుద్దమే చేయాలి..

మది‌ మధనం

ఎక్కడెక్కడ నా ఆలోచనలు తిరిగి దారి తప్పిపోయినా... నిన్ను వెతుక్కుంటూ నువ్వు ఉన్న చోటుకు రావడం మాత్రం మానవు ఎందుకో...!!

మది మధనం

నా కోపం వెనుక
చూపించలేనంత ప్రేమ
నా అలక వెనుక
నిన్ను ఏమనలేని నిస్సహాయత మాత్రమే ఉన్నాయి..

మది మధనం

చాలామంది మగవారికి వారి అవసరాలు, ఆలోచనలు వారివే.... పక్కనే ఉన్న ఆడదాని అవసరం, పరిస్థితి అనవసరం.... అడగరు, గ్రహించరు.....ఆడదానికి చెప్పడం వచ్చినా, అక్కర్లేని ఆ స్వభావం ముందు మనసు పరిస్తే.... తిరిగి నిర్లక్ష్యం వస్తుందనే నమ్మకం కలుగుతుంది ఏమో ఇక పెదవి ఎక్కడ విప్పుతుంది....అన్ని అంతరంగంలోకి స్వాహా అయిపోతుంటాయి...లోపల నిశ్శబ్ద యుద్ధాల ఫలితమే చిరాకులుగా బయటకు వస్తాయి...

ఎన్నో అడగాలని, పంచుకోవాలని ఉంటుంది చివరాఖరుకు అన్ని పెదవి గడపకు ఇవతలే ఆగిపోతాయి ఎందుకులే అని..!!

ఒంటరితనం మించిన తోడు లేదేమో కదూ...అదెప్పుడు మన తోనే ఉంటుంది, చెప్పింది వింటుంది, ఓదార్చుతుంది....నలుగురిలో ఇక చెక్కిన నవ్వులన్ని ఈ నాటకాల జగతిలో మామూలే..!!

మది‌ మధనం

తోడంటే ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు వచ్చేవారు కాదు..!!

మది మధనం

నీతో స్నేహం
ఏకాంతాల వనవాసమే..

మది మధనం

ఎవరినైనా నమ్మి దగ్గరైన ప్రతీసారీ వారో గుణపాఠంగా మారి దూరమౌతున్నారు...నిజంగానే మనుషులంటే భయమేస్తుంది...పైకి ఒకలా లోన ఒకలా మారుతుంటే..

మది మధనం

ఇష్టం పుట్టడానికి క్షణ కాలం చాలేమో కానీ 
మరచి పోవడానికి మాత్రం ఒక జీవిత కాలం పడుతుంది..

మది మధనం

ఆడదానికి ఆస్తులు, అంతస్తులు కన్నా ఆదరణ కావాలి అనే బలహీనత దేనికో
అర్థం కాదు..

మది మధనం

మనల్ని వద్దనుకున్న వారికోసం ఏడ్చినంత...మనల్ని కావాలి అనుకున్న వారికోసం ఏడ్వము అదేంటో..

మది మధనం

ధ్యాసంతా ఎక్కడో ఉంది రా...పరధ్యానం మాత్రం నా దగ్గరే ఉంది చిరాకుగా...

మది మధనం

మనసుకు ఇంకొక మనసుతో అంటు కట్టడమే ప్రేమంటే...రెండు ఒకటైనట్టు కలిసిపోయాక మళ్ళీ రెండుగా విడిపోవడం అసాద్యమే..

మది మధనం

మనసు చెదిరిన, మనసు విసిగి‌న 
ఆ దారి నుండి పక్కకు తప్పుకోవడం మనిషికి పెద్ద కష్టం కాదేమో..

మది మధనం

కొందరిని మరచిపోలేం అలాగని గుర్తు చేసుకుంటూ కూర్చుంటే కాలం కదలనంటుంది ...అందుకే ఙ్ఞాపకానికి మరుపుకు మధ్యలో ఉంటారు వాళ్ళు...

మది మధనం

గడిచి పోయిన కాలమే అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకో
🤔🤔🤔

మది మధనం

అభిమానం ఉన్న బంధం పరీక్షలు మాత్రమే ఎదుర్కొంటుంది...అహం ఉన్న బంధం అగ్ని పరీక్షలనే పెడుతుంది..!!

మది మధనం

పూటకూళ్ళమ్మ కాదురా మనసు
వచ్చిపోయే అందరికి వడ్డించడానికి..
ఆదరించిన మనసుకు మాత్రమే
అన్నపూర్ణ అది..

మది మధనం

ఏ జన్మ రుణాలో ఈ పరిచయాలు... కొన్ని కలలా, కొన్ని కథలా, కొన్ని ఙ్ఞాపకాలుగా మరికొన్ని కంటిలో నలుసులా మిగిలిపోతాయి...

మది మధనం

వారు ఇద్దరు అంటారు... కానీ ఎప్పుడు ఒక్కరే కనపడతారు...అంతే, కొన్ని బంధాలు కలిసి కనపడరు కానీ ఒకరిలో ఒకరు కనిపిస్తారు 😍😍😍

మది మధనం

కొన్ని ఙ్ఞాపకాలే జీవితం అవుతాయి...
కొన్ని జీవితాలే ఙ్ఞాపకాలలో బతికేస్తాయి..!!

మది మధనం

ఆడదాని మనసులో చోటు దొరికే వరకు మగాడు వెంట పడతాడు... తరువాత బంధాన్ని కాపాడుకోవడానికి ఆడది మగాడి వెంట తిరుగుతుంది...మగాడికి ఒక‌ క్లారిటి లేదబ్బ... అందుకే బొంగరంలా తిరుగుతాడు చుట్టూ చూస్తే అందాలు అంటూ 🙄🙄🙄

మది మధనం

కొన్ని ఙ్ఞాపకాలే జీవితం అవుతాయి...
కొన్ని జీవితాలే ఙ్ఞాపకాలలో బతికేస్తాయి..!!

మది మధనం

నీ ఆలోచనల ఆక్రమణలో
నేనో శరణార్థిగా మిగిలా నేడు..
మనసే నాది నీ తలపే
దానికి ఊపిరి..

మది మధనం

కొన్ని ఙ్ఞాపకాలే జీవితం అవుతాయి...
కొన్ని జీవితాలే ఙ్ఞాపకాలలో బతికేస్తాయి..!!

మది మధనం

నువ్వు జాగ్రత్త
నీ జ్ఞాపకాలలో నేను జాగ్రత్త

మది మధనం

కాపలా ఎన్నాళ్ళు కాస్తాం 
        ఎవరికైనా..

మనిషికి‌ కాపలా ఉండగలం
        మనసుకు కాదుగా..

కాస్త నమ్మకాన్ని ఇచ్చి, 
        నమ్మకంగా ఉంటే..

ఎక్కడెక్కడ తిరిగి అలసిన వారి తల
       చివరికి మన ఒడినే కదా సేద తీరేది..

మది మధనం

I don't want u back
But I still love you & your memory's
I enjoy the space between us
Because there is no pain & gain
😘😘😘 

మరచిపోయా...

నిన్నేనోయ్...
నీకే పంపుతున్న గాలిలో 
ఎటు పోనివ్వకుండా అందుకో
😘😘😘

మది మధనం

పరిచయం అవ్వడానికి పెద్ద కారణాలు ఉండవు ఒక చిరునవ్వు లేదా పలకరింపు చాలు...అదే ఇద్దరి మధ్య దూరానికి ఎన్నో కారణాలు ఉంటాయి...

కలుసుకోవడం సులువే నిలుపుకోవడమే కష్టం
ప్రయత్నం ఇద్దరిలో ఉండాలి
ఒకరిలోనే అంటే కష్టం
🙄🙄🙄

మది మధనం

నువ్వుంటే చేతినిండా పనేరా... 
😍😍😍

నువ్వు లేకుంటే 
కలం, కాలం కూడా కదలదే
😉😉😉

నీ తలపుల జడివానలో
తడిసిపోతున్న కూడా తనివి తీరడం లేదు..
👉❤❤👈

మది మధనం

ఎవరి ఆలోచనలలో మునిగి ఉన్నామో 
వారే కళ్ళ ముందుకు ఎదురు వస్తే 
ఎలా ఉంటుంది...😍😍😍

ఆ ఊహే గొప్పగా ఉందబ్బ..
ఊహలు ఎప్పుడు అంతే...నిజాలు మాత్రం వేరేలా ఉంటాయి..

మది మధనం

పలవరింత ఏదో పలకరించింది...
నువ్వు తలచావ నన్ను..
💕💕💕

మది మధనం

కొత్తగా శిక్షించాలని, శిక్షించానని అనుకోకు.....

పాత గాయాలే ఇంకా 
పచ్చిగా ఉన్నాయి... 
కొత్త గాయాలకు చోటు ఎక్కడ ఉంది..

మది మధనం

ఎంత నష్టం నాకు జరుగుతున్న... తీసుకున్న నిర్ణయం మీద చలనం లేకుండా నిలబడిన ప్రతీసారీ అనిపిస్తుంది...

నేనింత మొండి దానిని, మూర్ఖురాలిని, బండరాయినా అని..

ఈ విషయంలో మారాలని ఉన్న మారను, మార్చుకోలేను...
నేను అంటే... ఇంతే కనుక..

#నాతో_నేను

మది మధనం

చూపులతో దాడి చేయకు అలా
ఊపిరి ఆగిపోతుంది ఇక్కడ
🙈🙈🙈

మది మధనం

చూపులతో దాడి చేయకు అలా
ఊపిరి ఆగిపోతుంది ఇక్కడ
🙈🙈🙈

మది మధనం

అలిగితే రెచ్చకొడతావు
కోపంగా ఉంటే నవ్వుతావు
బాధపడితే ఓదార్పు అవుతావు

అరే.....ఎక్కడ దొరికావురా
నువ్వు నాకు 
😎😎😎

మది మధనం

నన్ను నన్నుగా నువ్వు చూడవు..
నీకెంత అవసరం ఉంటే అంతవరకే చూస్తావు..

నన్ను నేను పూర్తిగా నీకూ చూపించను...
నువ్వు ఎంతవరకు నన్ను తెలుసుకుంటే చాలో... అంతవరకే నీకు నన్ను చూపించేది..

ఇక్కడ ఎవరు, ఎవరికి తెరిచిన పుస్తకం కాదు...కాలేరు

ఏ బంధంలోనైనా ఒక మనిషి ఇంకొకరి దగ్గర పూర్తిగా ఓపెన్ కారు....కాలేరు

ఒకరిని ఒకరు చదవడం, అర్థం చేసుకోవడం అంత సులువు కాదు...

మది మధనం

నీటి మీద అలలు...
చిరుగాలి తగిలిన వస్తాయి...అలజడి రేగిన వస్తాయి...

చూసే కంటికి అదో అందమైన దృశ్యం... కడలికి మాత్రమే తెలిసిన కోత అది...
💔💔💔

మది మధనం

నచ్చిన వారి పలకరింపు
ప్రశంస
చిరునవ్వు
ఓదార్పు
ఇచ్చే సమయం..

ప్రపంచంలో వీటికన్నా విలువైనవి ఏవి ఉండవు...మనసును సంతోష పరచడానికి..!!

మది మధనం

నీకు నచ్చినట్టు మాట్లాడితే నేను మేధావిని...
నాకు నచ్చింది చెబితే అఙ్ఞానిని..

మది మధనం

నీకు నచ్చినట్టు మాట్లాడితే మేధావిని...
నాకు నచ్చింది చెబితే అఙ్ఞానిని..

మది మధనం

తనువు తడిమే వారికి మనసుతో పనిలేదు.

ఆకలి దేహానికి 
రుచి కావాలి కానీ 
సుచితో పనేముంది.

మది మధనం

కలత నిద్రను ఆలోచనలకు
కన్నీళ్ళని తలగడ 
మింగేసే రాత్రులు ఎన్నో
గుట్టు చప్పుడు కాకుండా గడిచి పోతుంటాయి..

తెలవారితే
మన పాత్రలో మనం మామూలే...

చీకటికి చెప్పే కథలెన్నో
ఆ గదిలో నిశ్శబ్దానికే తెలియాలి..

✍️అరుణిమలు

మది మధనం

అహం చావని చోట
బంధాలు బలై పతుంటాయి..

మది మధనం

దినదిన గండం లాంటి బంధాలకు... 
నూరేళ్ళ ఆయుష్షును ఎందుకు పోస్తాడో దేవుడు

తెంచేయలేక...తలొంచలేక
మనసుకు ఎందుకో ఈ శిక్ష..
👉💔💔👈

మది మధనం

నా మీదకు విసిరే రాళ్ళనే 
తిరిగి విసిరేంత గొప్ప మనసు నాకు లేదు...

అన్ని చోట్ల ముల్లును 
ముల్లుతోనే  తీయ కూడదు కదా...

సాధు జీవిని కాను, 
మృగాన్ని కాను మనిషిని మాత్రమే నేను..

మది మధనం

అర్థం చేసుకునే 
అద్దం లాంటి తోడు దొరకడం 
అదృష్టమే నిజంగా...దేనికైనా రాసి పెట్టి ఉండాలి..

మది మధనం

కొన్ని నవ్వులలో సంతోషం తప్ప అన్ని ఉంటాయి... 
అది‌ కూడా నవ్వు భూతద్దం పెట్టి వెతకనంత వరకు...

మది మధనం

కొన్ని నవ్వులలో సంతోషం తప్ప అన్ని ఉంటాయి... 
అది‌ కూడా నవ్వు భూతద్దం పెట్టి వెతకనంత వరకు...

మది మధనం

అర్థం చేసుకునే 
అద్దం లాంటి తోడు దొరకడం 
అదృష్టమే నిజంగా...దేనికైనా రాసి పెట్టి ఉండాలి..

మది మధనం

ప్రతీ #అనుభవం ఒక #పరీక్ష పెడుతుంది... ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడుతాం..

ప్రతీ #పరిచయం ఒక #పాఠం చెబుతుంది... ఎలా ఉంటే ఏమౌతుందని... ఐతే నేర్చుకుంటాం లేదా మనల్ని మార్చుకుంటాం..

మది మధనం

ఏ కంట పడకుండా
కన్నీటిని దాచేయగలం...కన్నీరు ఒలికించిన కళ్ళను దాచలేం..

మది మధనం

#కన్నీరు కూడా #అలిగితే 
ఎంత బాగుంటుంది......

అర్థం లేని మాటలకు...
అర్థం చేసుకోని వారి కోసం నేను రానంటు.....

కాస్త కళ్ళ బరువైనా తగ్గుతుంది కదా..

మది మధనం

నీ #సంతోషాన్ని ఎవరిలోనో వెతుక్కోకు...
నీ #బాధకు ఏ భుజాన్నో ఆసరాగా తీసుకోకు...

నీకు నువ్వే బలం, 
నీకు నువ్వే తోడని తెలుసుకో...

ఈ జీవన ప్రయాణంలో 
ఎన్నో బంధాలు నీతో ఉంటాయి... 
కానీ నువ్వు చేసేది ఒంటరి ప్రయాణమని మరువకు..

మది మధనం

రాతిరి రాసిన రాతలు
పగలు వెగటుగా ఉంటాయి..

చీకటి చూడగలిగే నిజాలను
వెలుగు చదవలేదు..

మది మధనం

నా ఇష్టం 
నేనింతే అనేది రహదారి....

కానీ... ఆ దారి నిండా ముళ్ళు పరచి ఉంటాయి..!!

మది మధనం

మనతో లేని వారు మన ఆలోచనలలో మాత్రం ఎందుకు తోడుగా ఉంటారో... 
మనతో లేని వారి ఆలోచనలు కూడా మనల్ని వదిలి పోతే ఎంత బాగుందును...

మది మధనం

ఆకాశంలో చుక్కలు లెక్క...
మనసులో చిక్కుముడులు తేలేవి కాదు...

మది మధనం

నటిస్తేనే నా
ఈ బంధాలకు నూరేళ్ళ ఆయువును
పోయగలిగేది..

నిన్ను నిన్నుగా
స్వీకరించలేని బంధాలు దేనికి..

ఆంక్షలలో బంధీ
ఐతేనే నా
మనం కలిసి ఉండేది..

ఇది వ్యాపారమా
వ్యభిచారమా..

మది మధనం

కనుల కౌగిలింతలలో దాచేయకు నన్ను...
నీ చూపుల కోకను తొలగించేసి
👉❤❤❤👈

మది మధనం

ఎవర్నైతే ఎక్కువగా చూస్తామో... వారే మనల్ని తక్కువ చేసి పోతారు..
జీర్ణం కాని చేదు నిజాలు ఇవి..

మది మధనం

కిటికీ నుండి వెన్నెల పడుతుంటే పాన్పు పై... ఆ ఎన్నెలలో ఎవరినో తలచుకుంటే 
కునుకు పట్టేది ఎలా, కలలు కనేది ఎలా..

మది మధనం

తనకేం_కావాలో అడిగేవారే కానీ.....
నీకేం_కావాలని అడిగేవారు అరుదుగా దొరుకుతారు..

Friday, 14 August 2020

మది మధనం

మన మీద మనకు 
     జాలి కలిగేది ఎప్పుడో తెలుసా...
మనం పెంచుకున్న నమ్మకం 
     నీటి_బుడగ అని తెలిసినప్పుడు...

మది మధనం

ఎవరు నిన్ను కాదనుకున్న...... నువ్వు ఎవరిని వద్దనుకున్న...... నీకు నువ్వు తోడుగా ఉంటే చాలు...

నిన్ను నువ్వు పోగొట్టుకున్నాక..... ఎవరు నీతో ఉన్న, లేకున్న ఒకటే......ఎవరి కోసమో నువ్వు నటించకు......నిన్ను నిన్నుగా స్వీకరించిన వారే నీ వారు......మిగతావారు పరాయి వారే...

మది మధనం

ఎవరికైనా మనం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే.... ఏ జన్మ లోనో రుణపడిన బాకీ ఏమో అనుకుంటాం..

అలాగే కొన్ని పరిచయాలు కూడా.......ఏ జన్మ రుణాలో తీర్చుకోవడానికి వస్తాయి....అవసరం లేదా ఆయువు తీరాక ముగిసి పోతాయి....

మది మధనం

బాధ, బాధ్యత 
అనేవి మనసు నుండి రావాలి..

పెదవులు పలికితే 
సరిపోదు..

మది మధనం

మరిచిపోయాన నిన్ను అనుకుంటా... 
మరచిపోతే ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అని నవ్వుకుంటా..

ఈ నవ్వుకు అర్థం అడగకు
చెప్పడం చేతకాదు నాకు..

ఆలోచించడం మానేసాన 
అనిపిస్తుంది...

అప్పుడప్పుడు పలకరిస్తున్న కన్నీరు 
నీ తాకిడి తగిలి చలించినవే అని తెలిసినా..

నీకోసం నేను ఆలోచించడం లేదని
చెప్పుకుంటా నాతో నేను..

✍️అరుణిమలు

మది మధనం

ఒకరిని కాపీ చేయొచ్చు ఏమో కానీ.......ఎవరినో చూసి ఎవరు అంత తొందరగా మారిపోరు.......సరైన దెబ్బ తగిలితేనే దారి మారేది ఎవరికైనా...

మది మధనం

ఒక వ్యక్తిని లొంగదీయాలన్న, కించపరచాలన్న, తగ్గి ఉంచాలన్న మొదట చేసేది మాటల దాడి.....మనకి నచ్చినట్టు మలుచుకోవడానికి, మనకింద లొంగి ఉంచడానికి చాలా తేడా ఉంది...

నీ ఆలోచనలను, అభిప్రాయాలను కించ పరుస్తూ, నిన్ను జడ్జ్ చేస్తూ సాగుతుంది మానసికమైన దాడి....నీపై ఉన్న నీ నమ్మకాన్ని, నీలో ఉన్న నిబ్బరాన్ని బలహీన పరిచేందుకు శతృవుకు ఉన్న ఆయుధమే మాటలు....

సొంత వారమంటు కూడా కొందరు చేసే పని ఇదే....దానికున్న పేరు నీ మంచి కోసం అనడం, నీకేం తెలియదు అనడం....చెడు అలవాట్లు ఉన్న వారికి కూడా చెప్పే విధానం ఒకటి ఉంటుంది.....ఉదాహరణకు మందు, సిగరెట్ లాంటి అలవాట్లు ఉన్న వారిని తాగుబోతువి, తిరుగుబోతువని చేసేది మానసికమైన దాడి అవుతుంది.... తాగితే ఇల్లు, ఒళ్ళు గుల్ల అవుతుందిరా అలవాట్లు మార్చుకో అనేది శ్రేయోభిలాషులు చేసే పని....మాట చాలా పదునైనది, వాడే విధానం మారితే బలాన్ని ఇచ్చే మాట కూడా గాయాన్ని చేస్తుంది...

శతృవుల మధ్య ఉండేది పోరు.....మిత్రులు మధ్య ఉండవలసింది గౌరవం....నీకు నచ్చినట్టు అందరు ఉండాలని అనుకుంటే నీకు నువ్వే ఈ లోకంలో తోడు అవ్వగలవు....మరెవరూ తోడు అవ్వలేరు....సొంతం అనుకునే వారికి నువ్వు ఇవ్వాల్సింది స్వేచ్ఛ, ధైర్యం, విలువ కానీ ఆంక్షలు, తీర్పులు కాదు....

శతృవుకు, మిత్రుడుకి ఒకటే పద్దతి అంటే.... నీ స్నేహం(బంధం) అనే చెరసాలలో ఎవరు ఎక్కువ రోజులు ఉండలేరు....ఆదరించే చేయే ఆయుధమై గాయాలు చేస్తే భరించేది ఎన్నాళ్ళు.... మన, పరాయి అనే వాటికి తేడా లేకుండా మాటలను వాడితే ఙ్ఞాపకాలు కూడా మిగలవు అక్కడ....చులకన చేయడం కాదు స్వీకరించడం చేతనవ్వాలి....నీకు నచ్చినట్టు ఉంటేనే నీ వారంటే, నీ చుట్టూ నటించే వారికే చోటు ఉంటుంది....

మది మధనం

నీ కన్నీటికి విలువ ఇవ్వని వారి గురించి కన్నీటిని వృధా చేసుకోకు.... అనే మాట చాలామంది రాస్తుంటారు.......అసలు విలువ ఇచ్చే వారైతే ఏడిపించరు కదా, మనం వారిని విలువగా చూసుకున్నాం కనుకే ఏడుస్తాం....ఇక్కడ ఏడ్చేది వారు చేసిన పనికి, అన్న మాటకు కాదు.....మనం పెట్టుకున్న నా అనే నమ్మకం మనల్ని ఎగతాళి చేయడం వలన...

అర్థం అయ్యిందా.....ఇంతకు మించి చెప్పడం కష్టం...

మది మధనం

ఇదొక   #ప్రేమలేఖ 

ఇప్పటికీ....

" ఐ లవ్ యు "

ఎప్పటికీ....

" ఐ హేట్ యు "

ఇంకేం కథ.......ఇంతే కథ

కథ కంచికి పోయింది..... మనం వేరే పోస్ట్ కి పదా
🏃🏃🏃

మది మధనం

నువ్వు మాట్లాడటం మొదలు పెడితే నేను ఎదుర్కోలేను...

నిజమే...

మాటకు మాట జవాబు ఇవ్వడం 
వచ్చు కానీ.......
ఎదుట వ్యక్తి గుండెల్లో చేయి దూర్చి 
పిండేసే మాటలు చేతకాక....

గాయాన్ని దాచుకుని
మౌనమై తప్పుకుంటా 
గెలుపును నీకు వదిలేసి...

మది మధనం

ఆకాశాన్ని కడిగేసిన వాన.... 
మనసును కడిగేసిన కన్నీరు...

రాలిపోతాయి నేల పై 
అలిసిపోయి..‌

ఇంకిపోతాయి 
బాధని ఆవిరి చేసి...

మది మధనం

మాట చేసే గాయానికి
మందు లేదు
మనసు చేసే మాయకి
మహత్తు లేదు

మది మధనం

మనసుకో తోడు దొరికింది
ఎదపై తన్ని ఎగతాళి చేసింది

మది మధనం

నచ్చినప్పుడు రావడానికి
నచ్చనప్పుడు పోవడానికి
నా మనసేం సత్రం కాదు గుడి

మది మధనం

నవ్వే నా కళ్ళల్లో
నీటి చెలమలే 
నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలు

మది మధనం

నిశ్శబ్దంలో జరిగే యుద్ధాలు ఎన్నో
గెలిస్తే మౌనం ఓడిపోతుంది
ఓడితే మనసు గెలుస్తుంది

నా ఆలోచనలతో అంతర్యుద్ధం
కాలానికి మాత్రమే తెలిసిన జవాబులు కోసం వెతుకులాట..

విచిత్రమైన జీవాలు
విచిత్ర వేషధారణలు

సుఖానికి అమ్ముడు పోయే దేహాలు
మనసుకు మేకప్ వేసి మురిసే మాలిన్యం
జీవితానికి పేకప్ చెప్పే పనులలో మునకలు 
బంధాల వెనుక కొందరు
అనుబంధాలను తెంచుకుని కొందరు

ఎన్నెన్నో అనుభవాలు చెబుతున్న
నడక చేతకాని నిర్ణయాలు

ఎన్ని విచిత్రాలో నా చుట్టూర
తప్పటడుగు వేయలేని వారు అంతర్యుద్ధాలు చేస్తారు
తెగించిన వారు లోకంతో యుద్ధం చేస్తారు నేనే నిజం అంటూ

నిశ్శబ్దం చెప్పే నిజాలను వినగలిగే దమ్ము ఉంటే
నీ వేపు వేలెత్తే అవకాశం ఈ లోకంలో ఎవరికి ఉండదు
ఆ దమ్ము లేని పిరికిపందకు మూర్ఖత్వమే ఆయుధం...

జవాబులు ఇవ్వడం కన్నా
ప్రశ్నించుకోవడం నేర్చుకుంటే ఎవరికి నువ్వు జవాబుదారీగా నిలబడవు...

నిశ్శబ్దం చాలా చెబుతుంది
నిశ్శబ్దంగా వినగలిగితే

✍అరుణిమలు

మది మధనం

గతం నిన్ను 
పరిచయం చేసింది
గాయం నిన్ను మరువనివ్వను అంది.. 

మది మధనం

అయ్యిందేదో అయిపోయింది వదిలేయ్ 
అని అనేటప్పుడు..

మనసులో ఒకటి 
అనిపిస్తుంది..

నువ్వు చేసిన గాయాలకు
నేను జారవిడిచిన కన్నీటి చుక్కలను తిరిగి ఇచ్చేయగలవా అని..

రాలిన కన్నీరు
నోరు జారిన మాట
తిరిగి వెనక్కి రావు..

అందుకే
అనేముందు ఆలోచించాలి..

Monday, 29 June 2020

తాను నేను

ఎదకో‌ కోరిక ఉంది
ఎదుట పడనంటుంది..

మనసుకో‌ గాయమయ్యింది
మదిలో అదో భాగమయ్యింది..

కోరికలు ఎప్పుడు 
గాయాలనే మిగులుస్తాయి...

మనసుకో‌ తోడు దొరికింది
తీపి గాయాల గేయాలను రాయడానికి..

కథ నాది
కథనం తనది..

✍️అరుణిమలు

తాను నేను

నాతో నీ కన్నా
నీ ఆలోచనలే  ఎక్కువ తోడుగా ఉన్నాయి..

నువ్వో భావంగా
నువ్వో తలపుగా
నువ్వో ఊహగా
నువ్వో ఙ్ఞాపకంగా
నాతో బాగుంటావు..

ఎన్నో ఎన్నో ఆశలు
ఎన్నో కోరికలు
మరెన్నో ఇష్టాలని
బోలెడు కబుర్లను
పోగేసుకుంటుంటా నీ రాక కై ఎదురు చూస్తూ..

ఎప్పుడు నిరాశే మిగిలింది..
ఖాళీ చేతులతో
మనసు భారంగా
కళ్ళ బరువుతోనే వెనుతిరిగాను..

సంతోషం ఇవ్వడం తెలియని వారికి
బాధని ఇవ్వడం మాత్రం బాగా తెలుసు..

అసలు అన్ని తెలిసి
ఎందుకు ఆశిస్తామో
ఎందుకు నిరాశ పడతామో
ఎదను గాయాలు చేసే అవకాశం 
ఎందుకు ఇస్తామో కదా..

ఇష్టమైన చోట కష్టం తేలికగా ఉండేది 
అర్థం చేసుకునే తోడు దొరికినప్పుడు కానీ...

కష్టమే తోడుగా దొరికితే 
ఇక ఇష్టం కూడా ఒక కల్పనే ఏమో..

✍️అరుణిమలు

తాను నేను

నీ దగ్గర ఓడిపోవడం ఇష్టం
నీ ముందర తగ్గడం ఇష్టం

నీ మీద గెలవడం ఇష్టం
నిన్ను గెలుచుకోవడం ఇంకా ఇష్టం

నీతో‌ పంతానికి పోవడం ఇష్టం
నీతో మాటల యుద్దానికి సిద్దం

నీకోసం ఎదురు చూడటం ఇష్టం
నీకోసం ఏడ్వడం ఇష్టం

నీతో గొడవ పడటం ఇష్టం
నీకోసం గొడవ పడటానికి సిద్ధం

నిన్ను తిట్టడం అంటే ఇష్టం
నీతో తిట్టించుకోవడం ఇష్టం

నీ ఆలోచనలలో‌ నన్ను నేను మరచిపోవడం ఇష్టం
నీ మీద అలగడం ఇష్టం..

ఏదైనా ఇష్టమే, నువ్వు నా పక్కన ఉంటే
దేనికైనా సిద్దమే నీకోసం..

నువ్వు అంటే ఎంత ఇష్టమో 
నా అభిమానం అన్న అంతే ఇష్టం నాకు..

నీకోసం తగ్గుతా
నీకు లొంగిపోతా

కానీ నేను తగ్గితేనో
నీకు నచ్చినట్టు ఉంటేనో 
నీ దగ్గర నాకు స్థానం అంటే

మనం అనే మాటకు
నువ్వు ఆంక్షలు పెడితే

నిన్ను మెప్పించడానికి
నన్ను నేను మోసం చేసుకోలేను, నిన్ను మోసం చేయలేను..

ఐనా నేను నీకు పెట్టని ఆంక్షలు
నాకే ఎందుకు ?!

నా అభిమానం లేకపోతే
నేనే ఉండను....అసలు నేను ఎవరిని...నా ఉనికి ఏంటి... జీవశ్చవాన్ని ఐపోతా..

నాకు నువ్వు కావాలి
నా అభిమానం కావాలి

మీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా
నేను అసంపూర్ణమే..

✍️అరుణిమలు

తాను నేను

నువ్వో కనిపించని గాయానివి 
ఏమని వర్ణించేది నిన్ను..

ఎవరితోను పంచుకోలేని బాధవి నువ్వు
ఏమని చెప్పుకునేది..

కన్నీటికి మాటలు వచ్చిన బాగుందును
నా పదాలకు అందని వ్యధని వివరించేవి కదా..

గుండెల్లో దాచుకున్న నమ్మకానివి 
ఎద పై తన్ని వెనుతిరిగావు..

నాలో నాకు చోటు లేనంతగా నిన్ను నింపేసుకున్న
నే అందుకోలేనంత ఎత్తులో నిన్ను ఉంచానేమో..

నిజంగానే నా ఆలోచనలకు అందనంత స్థానం నాకు బహుమతిగా ఇచ్చేసావు కదా..

అసలు ఎందుకు నిన్ను నన్ను మించి ప్రేమించానో..
ఏ రోజైనా నవ్వులను పంచావనా
సమయాన్ని ఇచ్చావనా
కష్టాన్ని పంచుకున్నావనా
గుండెల్లో దాచుకున్నావనా..

కారణాలు లేకుండా పెంచుకున్న ప్రేమకు...
ఎన్ని అకారణాలను చూపించావు చివరకి...

నా అభిమానాన్నే గాయ పరిచి
నువ్వు వెళిపోతుంటే...

నీ కోసం బాధ పడనా, 
నేనంతో‌ విలువగా చూసిన మనిషి 
నాకు ఇచ్చిన విలువ చూసి కరిగిపోన..

ఎలా స్పందించాలో
ఏమని‌ రోదించాలో
ఎలా ఊరడించుకోవాలో
ఎలా గతాన్ని వదిలేయాలో
ఏమని నిందించాలో, నిందించుకోవాలో
తెలియని స్థితిలో‌ నిలబెట్టావు కదా..

✍️అరుణిమలు

Friday, 15 May 2020

తాను నేను

ఓదార్చే చోటే 
కన్నీరు ఒలుకుతుంది..

బాధని 
అర్థం చేసుకోని చోట
మౌనమే రాజ్యమేలుతుంది..

విసిగిన చోట
బాధని కూడా చూపించాలని ఉండదు..

ఏ ఓదార్పుని
మనసు కోరుకోదు..

ఇష్టమనే నా తప్పుకు
నువ్వనే కష్టమే కానుకగా దొరికాక..

అంతరంగంలో 
ఆహుతి ఐపోవాలని ఉంది..

కన్నీరు కూడా
బరువుగా ఉంది నేడు..

అక్షరాలకు కూడా
విన్నవించలేను ఎద కోతను..

✍️అరుణిమలు

తాను నేను

కోపంలో ఉన్న
సంతోషంగా ఉన్న
పరధ్యానంగా ఉన్న

అనుకోకుండా
నా పెదవులు పలికే పేరు నువ్వు..

తలపుల్లో నీవే
తల్లడిల్లేది నీకోసమే..

ఊహలో నువ్వే
ఉప్పెనగా ఎగసే బాధవి నువ్వే..

ఎప్పుడు
నాలో నువ్వు ఇంతలా 
ఏకమయ్యావో తెలియదు..

నేనంటు లేనని
నాకంతా నువ్వేనని
ఎందుకు నమ్మేసిందో ఈ మనసు..

నీ నుండి విడిపోవడం అంటే
నా నుండి నేనే దూరమౌతున్నట్టు ఉంది..

అందుకేనేమో
నీకు దూరమవ్వడానికన్నా
నీ ఆలోచనల నుండి
నువ్వనే అలవాటు నుండి బయట పడటానికి
నాతో నేనే తలపడుతున్న..

ఓడిపోతున్న ప్రతీసారీ
మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్న..

దారి నీకు తెలిస్తే
మనసు మీద కొట్టి పోకు
మనసులో నుండి వెళ్ళిపో..

✍️అరుణిమలు

తాను నేను

చీకటికి చాలా చెప్పుకుంటా...
దానికి పక్కవారికి పంచే అలవాటు లేదనే ధైర్యంతో..

నిశ్శబ్దంగా ఉన్నచోట
గుండె సడి ఎన్నో చెబుతుంది..

అలుపో....ఆశలో
ఎదలో‌ దాగిన కందకాన్ని తవ్వుతుంది..

ఇన్నాళ్ళు మన మధ్య ఉన్నది అబద్దమా
నువ్విచ్చిన మాట నిజమేనా..

మన దారులు వేరంటు
నా నీడ నన్ను వదిలి పోతుంది నేడు..

గుండెల మీద గుద్ది
నువ్వు కదిలి పోతుంటే...

మనసెందుకో ఇంకా బతికే ఉంది
మరుజన్మ దేనికి ఈ జన్మకు నా మనసుకు తోడు నువ్వనుకున్నందుకా...

నిన్ను ఎంత ఎత్తున నేను ఊహిస్తే దేనికి...
నాకు నువ్వు ఇచ్చిన‌ చోటు నీ పాదాల దగ్గర అని తెలిసాక...

అంతా శూన్యంలా ఉంది
మనం అనే మాట మూగబోయింది..

కత్తి మీద సాము చేస్తుంది ఈ మనసు ఇప్పుడు
గాయాలు తప్ప ఙ్ఞాపకాలు లేవు అక్కడ..

కంటిలో ఏ నలుసు ఉందో
కళ్ళకు‌ అలసట తీరడం లేదు..

అధికారం దండించడానికే కాదు 
దగ్గర తీసుకోవడానికి కూడా ఉండాలి..

కొట్టడానికి తప్ప 
కళ్ళు తుడవ లేని చేతులు దేనికి...

రాత్రి వెళ్ళిపోయింది చీకటిని చెరిపేసి
ఏ కన్నీరుతో కడుగుతున్నావో వేకువ కోసం...

✍️అరుణిమలు

తాను నేను

రాయాలని ఉంది 
తడి కన్నులలో చెమ్మ ఇంకే వరకు...

మనసు విసిగే వరకు
తనువు అలిసే వరకు..

తెల్లని కాగితంపై ఇది నల్లని అక్షరం కాదు
ఈ ఎద పై నువ్వు చెక్కిన గాయాలు..

రాతిరిని మింగేసిన నిదుర
చెబుతున్న కలత రాతలు..

అలసిన కనులకు
ఊరడించే పదాల అన్వేషణ సాగుతుంది..

✍️అరుణిమలు

Sunday, 12 April 2020

తాను నేను

కొన్ని నవ్వులను ఏరుకుందామని వస్తే
కాసిన్ని కన్నీళ్ళను ఇచ్చి పంపుతావు..

మౌనంలో దాగిన వేదన
చదవ లేవు..
కన్నీటి చుక్క బరువు
తూయలేవు..

ఎందుకు మరి
ఎదను కోతల పాలు చేస్తావు..

సంతోషాన్ని ఏనాడైనా ఇచ్చావ
లేదు కదా...
మరి కన్నీటిని ఇచ్చే అధికారం నీకు ఎక్కడిదని అడగాలని ఉంది..

తప్పు నీది కాదు
ఆ అధికారం ఇచ్చిన నా మనసుది కదా తప్పు..

నిన్ను నన్ను మించి అభిమానించడమే
నా మనసు చేసిన తప్పేమో..
అందుకే నీ మాటలకు మనసు రోదిస్తుంది...

నీకు చేతనైతే 
మరో గాయాన్ని చేయకు..
మాను, మాకులా చూడకు మనిషిలా చూడు
అని అడగాలని కూడా లేదు ఇప్పుడు..

గుర్తింపును కూడా అర్ధించే చోట
బంధాలు ఏముంటాయి..
మానసిక మరణాలు తప్ప..

✍️అరుణిమలు

తాను నేను

మనసంటే లెక్క లేని చోట
కన్నీటికి విలువ ఉంటుందా..

కఠినమైన మాటలలో
కారుణ్యపు కోతలు ఎన్నో..

బరువెక్కిన కను రెప్పలలో
భారం ఎంతో 
కనులలో ఉబికే గంగకే తెలుసు..

నీతో తలపడిన ప్రతీసారీ 
మనసు అలసిపోతుంది...

తిరగబడటానికి నేను ఆయుధాన్ని కాను అభిమానాన్ని...
మౌనమే నా జవాబు..

✍️అరుణిమలు

తాను నేను

నీ పేరు నా చిరునామాగా మారి
నీ తలపో చిరునవ్వుగా నన్ను చేరింది..

నీకై మానసాన నే చేసిన తపస్సు
ఆరడుగుల రూపంలో నన్ను వరించింది..

నీ ప్రేమ తిలకం
నా నుదుటిన చుంబనంగా చేరాక..

నన్ను నీ నుండి 
విడదీసే శక్తి కాలానికి కూడా లేదోయ్..

మూరెడు తాడు పెనవేయక పోయినా
మనసును పెనవేసుకున్న ముడులు ఎన్నో ఇక్కడ..

ఎద పై చెక్కిన నీ పేరును
ఈ గుండెసడి ఎవరికైనా వినిపిస్తుంది ఏమో అని
మరే మనసుకు చేరువ కాలేదు కూడా..

గుప్పెడు గుండెలో ఉన్నది నీవే
ఈ ఎద చప్పుడు ఆగే వరకు..

కాలమేదైనా...తీరమేదైనా
నా ప్రయాణం నీతోనే
నీ ధ్యానం లోనే..

నేను ఎవరంటే
నువ్వేనంటా..

మరో తలపు
నా తలుపు తట్టదు..
నిన్ను దాటి నన్ను చేరేది
మెప్పించేది ఎవరోయ్..

✍️అరుణిమలు

Friday, 27 March 2020

తాను నేను

రాత్రి మేల్కొంటుంది
నీ కౌగిలిలో చేరాక..

ఆకతాయి అల్లరేదో
అల్లేస్తుంది మేనును..

పెదవుల లిఖించే
భాషకు లిపి లేదు కానీ
భావం తనువుకు తెలిసిపోతుంది..

మనువాడిన మనసులు
మరో లోకంలో విహరిస్తూ
యుగాలను దాటి‌ పోతున్నాయి..

చుక్కలన్ని మేనిపై 
వలపు కానుకులుగా మెరిసిపోతున్నాయి..

కరిగిపోతున్న కాలంలో
కలిసిపోయింది ఒక కావ్యం..

నిశ్శబ్ద యుద్దంలో
గెలిచింది మరో ఉదయం..

✍️అరుణిమలు

(కరోనా కలవరంలో కూడా ఇలా రాయగలిగానంటే పర్వాలేదు బుర్ర పదునుగానే ఉంది ఇంకా...)

Tuesday, 24 March 2020

తాను నేను

మిస్ యు పదం చిన్నదే
చెప్పడానికి ఇంకొక పెద్ద పదం లేదు..

ఎంత చెప్పిన నేను వివరించలేను కూడా 
ఎంత మిస్ అయ్యానో అని..

నాలో నేనే ఎవరికి చెప్పుకోలేని 
పంచుకోలేని బాధవి నువ్వు, సంతోషానివి నువ్వు..

నీ జ్ఞాపకాలలో నా ప్రయాణం
ఒంటరిగా సాగలేదు ఏ క్షణం...

ప్రతీ ఆలోచనలో ప్రతీ పనిలో 
నిన్ను కలుపుకుని‌ బాధ పడ్డా, 
మురిసిపోయా కూడా..

నువ్వు ఎందుకు కలిసావని ప్రశ్న వేసుకున్న
నా మనసుకు ఒక తోడుగా ఉండటానికి అనుకున్న..

మన మధ్య ఏముంది అంటే 
ఇదని చెప్పలేం...
చెప్పడానికి చూపించడానికి ఏం లేదు..

కానీ ఏదో ఉంది
ఒకరినొకరిని కలిపి ఉంచుతుంది..

ఇది అదేనా
అది ఇదేనా..

✍️అరుణిమలు

Friday, 20 March 2020

తాను నేను

నా సంతోషం లోనే కాదు
నా కష్టంలో
బాధలో
నిరాశలో
ఆశలో కూడా నువ్వు గుర్తు వస్తావు..

అసలు మరచిపోతే కదా
గుర్తు తెచ్చుకోవడానికి..

అంటే...
నా కష్టం, సుఖం, ఆలోచనలు, అభిప్రాయాలు అన్ని నీతో పంచేసుకుని...
నీ దగ్గర ఓదార్పు పొంది, సలహాలు తీసుకున్నానని కాదు..

మన మధ్య అంత సమయం ఎప్పుడు లేదు
పలకరింపులు కూడా ముక్తసరే..

ఏదైనా ముందు నీతో పంచుకోవాలని ఉంటుంది
కానీ ఎప్పుడు నిరాశే మిగిలింది..

ఆశ పడటం 
అంతలోనే నిరాశ పడటం 
అలవాటు ఐపోయింది..

ఏ విషయం లోతుగా మాట్లాడుకోము..
మన మధ్య మాట్లాడు కోవడానికి ఏది లేనట్లు..

ఎక్కడ మనం ఇంకా ఇంకా దగ్గర అవుతామేమో అని నేను...
ఎక్కడ నీ ఇష్టం బయట పడిపోతుందో అని నువ్వు అంటీ అంటకుండా తిరుగుతున్నాం..

ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుసు...కానీ బయట పడం..
ఒకరికొకరం దూరంగా ఉండటానికి పడే కష్టం తెలుసు కానీ కలవము..

బాగా నటిస్తున్నాం ఇద్దరం
ఎవరిని మెప్పించడానికో మరి..

రాత రాయని ఆ దేవుడినా
రాతలో ఉన్న మన బంధాలనా

✍️అరుణిమలు

Sunday, 15 March 2020

తాను నేను

ఆశగా ఎదురు చూసిన కాలం
తోడుగా ఉంటా అంటూ వచ్చింది కాసేపు..

ఎన్నో కబుర్లను
తీపి తీపి తాంబూలాలను
పంచింది...

చిలిపి తగాదాల ఘాటు
చెక్కిలిని తాకిన కానుక
చేతిలో చేయి వేసిన నమ్మకం..

ఇంత అందమైన వాతావరణంలో...
ఎదలో ఏదో ఆందోళన..

కాలాన్ని ఇలా ఆగిపొమ్మనే చిన్న కోరిక
మాటల్లో చెప్పలేని దిగులు
నువ్వు లేని ఘడియల్లో నన్ను భయపెట్టే ఏకాంతం
ఉక్కిరిబిక్కిరి చేసే నీ ఆలోచనలు
మళ్ళీ నీ రాకకై ఎదురు చూసే చూపులు
ఒంటరితనాన్ని వెక్కిరించే నీ ఙ్ఞాపకాలు..

నన్ను పరీక్ష పెట్టడానికి ఇవన్నీ సిద్ధం
వాటిని ఎదుర్కొనేది ఎలా అనే
ఆలోచనల యుద్ధం చేస్తుంట అంతరంగాన‌‌..

చెప్పలేని బాధని
చూపించలేని అసహనాన్ని
పెదవి చివరన చేరగానే చిరునవ్వగా మార్చేస్తుంటా..

నా చిరునామా నువ్వే కావాలని
బ్రహ్మ రాయని రాతని చెరిపేయాలని..

మనసున ముడివడిన ఈ బంధం
మట్టిలో కలిసే వరకు తెగిపోదని..

ఎన్నో ఎన్నో చెప్పాలని ఉంటుంది
అన్ని మనసు గుమ్మంలో మౌనంగా ఆగిపోతున్నాయి..

చెరిపేదెలా...నా ఎద గోడ పై చెక్కిన నీ రూపాన్ని
చెప్పేదెలా...చెమ్మగిల్లిన గుండెల్లో ఊపిరి నువ్వే అని

ఇది అక్షరం కాదు
నేను నాతో పంచుకునే
నీ భావన..

ఐతే నువ్వు లేదా
ఈ అక్షరమే నా వ్యసనం
నాకు లేదే ఇంకే వ్యాపకం..

✍️అరుణిమలు

Sunday, 8 March 2020

తాను నేను

మన మధ్య ఎడబాటు 
కలవర పెడుతుంది..

నిన్ను పోగొట్టేసుకున్నాన
పోగొట్టుకుంటున్నాన అని..

దూరంగా ఉంటే 
ఈ భయం..

దగ్గరగా ఉంటే
ఎప్పుడు ఏ దూరం ఏ రూపంలో వస్తుందో 
అని భయం..

ఎందుకోయ్ ఇంత అభద్రత
మన మధ్య మాటలకు మనమే సాక్ష్యులం అ‌నా..

లోకానికి తెలియని బంధంలో బందీలుగా ఉన్నాం
పంచుకునేది ఎంతకాలమో ఈ బాధ్యతలు..

మనసులు వేసిన ముడిలో 
ఏ నూలుపోగు జారిపోదుగా..

ఎదను కట్టుకున్న కోటలో
ఏ ఆక్రమణలు, దోపిడీలు జరగవుగా..

మన కలల ప్రపంచంలో
ఏ కల్పనల కల్లోలం చెలరేగదుగా..

జతకట్టిన మన ఆత్మలలో 
ఏ విష భీజాలు మొలకెత్తవుగా..

ఎదలో ఎన్నో కలవరాలు
నీ తలపుల సరోవరంలో స్నానమాడుతుంది 
మనసు ఇలాగే...

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను తాకిన ఏ గాలో
నన్ను ఊహగా వచ్చి పలకరించింది..

నువ్వు వస్తావని 
వస్తున్నావని
ఎదకు కబురు పంపినట్లు..

మనసు గుబులుకు
పరిమళాలను అద్దుతు..

నీ తలపులలో విహరిస్తున్న
మనసు 
నీ పిలుపుతో మేల్కొంది..

సుడిగాలై చుట్టేస్తావోయ్
సుదూర తీరాలలోకి నన్ను చేర్చి..
 
గురుతులెన్నో వదిలేస్తావు
నీ ఙ్ఞాపకాలుగా దాచుకోమని..

కలలా వచ్చి
కడలిలా కదిలించి
కను సైగ చేసి కదిలి పోతావు..

నిలిచిపోవా ఇక్కడే
అని‌ మనసు మౌనంగా అంటుంది..

నీకు వినిపించదు
నాకు అనాలని‌ అనిపించదు..

కానీ... 
మనసు వేసే ప్రశ్నలను
మౌనంగా తుంచేస్తుంటా..

నీ ఎదుట
నవ్వులను విరబూయించేందుకు..

✍️అరుణిమలు

తాను నేను

#తాను...

అలిగి దూరంగా ఉంటావో..
కోపంతో కాదనుకుంటావో..
అసలు నన్ను వద్దని అనుకుంటావో...

ఏమనుకుని నువ్వు నన్ను వదిలి పోయిన..
నీకు రావాలని అనిపించిన రోజున..
నన్ను వెతుక్కుంటూ రా..

ఎప్పుడు వచ్చినా, 
అది జీవిత చివరి అంచులలో నైనా.. 
నీ చోటు పదిలంగా ఉంటుంది..

నా మనసు ఇప్పుడు ఎలా ఉందో, 
అప్పుడు అలానే ఉంటుంది నీకోసం..

నువ్వు నా ఇష్టం
నువ్వు నా కష్టం
భరించగలను చిరునవ్వుతో..

నీపై కోపం క్షణికం
నీకై నా భావం సజీవం..

మాటిస్తున్న..
మాట తప్పడం అంటే మరణించడమే 
అనుకున్న నీ వాడు..

ఎదురు చూడగలను
ఏదో రోజు తప్పక ఎదురు పడతావని..

✍️అరుణిమలు

Saturday, 29 February 2020

తాను నేను

అనుకోకుండా అందుకున్న 
వరానివి నువ్వు..

నువ్వు ఎదురైన ఆ క్షణం
కాలం ఘడియ పాటు ఆగిపోయింది..

భరించే వాడిని నేనుండగా 
నీకెందుకా కష్టమని
నీ పాదా లపై 
నా పాదాలను ఉంచి కదిలావు..

మనం ఎదురు చూసిన కాలం ఇదేగా
చెప్పవే అంటూ.. 
చిరునవ్వుతో ఆహ్వానించావు 
నీ బాహువులలోకి..

ఒదిగిపోయా నీ ఎద పై నిన్ను చుట్టేసుకుని
కాసేపటికి నీ గుండె సడి నన్ను కదిలించింది..

నాలుగు కళ్ళు నిశ్శబ్దంగా పంచుకుంటున్న మాటలకు మన శ్వాసలు ఊ కొడుతున్నాయి..

ఎప్పుడు నీ పెదవి చెక్కిలిని తాకిందో
అప్పుడు తెలిసింది చినుకు తాకిన మట్టి ఎందుకు పరిమళిస్తుందో అని..

నాలుగు పెదవుల కలయికలో 
కరిగిపోయిన కాలం..

మూసిన కనులలో అలజడి... 
ఎద వేగం పెరిగి కళ్ళు తెరిచాన...
ఎదురుగా నువ్వు లేవు..

చుట్టూ చీకటి
గదంతా నిశ్శబ్దం
ఒంటరిగా నేను..

అదురుతున్న అధరాలు
నన్ను తాకిన నీ స్పర్శ
ఏది నిజం ఇందులో..

ఎద సడి గడియారంతో పోటీ పడుతుంటే
నిన్ను కలవరించిన కన్నులలో తడి చేరింది

కలలా వచ్చి
కలవరంలో వదిలేసావ
వేకువలో వెలుగై వచ్చేందుకు..

ఎదురు చూస్తునే ఉన్న
కలలని కావ్యంలా కాకుండా
కానుకగా చూడాలని..

✍️అరుణిమలు

Friday, 28 February 2020

తాను నేను

నువ్వు నా ఆప్షన్ కాదు
నా చాయిస్ వి..

నేను గెలుచుకున్న
నన్ను గెలిచిన మనసువి..

నువ్వు నా అవసరానివి కాదు
నా అభిమానానివి..

నువ్వు నా కోరికవి కాదు
నా కలల తీరానివి..

నన్ను వెతుకుతూ వచ్చిన
నాలో సగానివి..

నా ఆలోచనలకి ఒక రూపం ఇస్తే
అది నీ లానే ఉంటుంది..

అందుకే ఏమో
నా పంచ ప్రాణాలకు ఆయవు ఐపోయావు..

ఎవరెవరి ఙ్ఞాపకాలలో 
ఏ రూపంలో దాగున్నావో తెలియదు కానీ..

నాలో నువ్వు ఉన్నది
ఙ్ఞాపకంగా కాదు 
గతంగా కూడా కాదు..

నా పెదవి పై చిరునవ్వుగా
నా కనుల స్వేదంగా
నా మనసు మాగాణిలో
ఉదయించే మహారాజువై ఉంటావు.. 

✍️అరుణిమలు

తాను నేను

నీకు మాట్లాడాలి అనిపిస్తే ??

అనిపిస్తే ఏంట్రా...

నీతో మాట్లాడకుండా ఉండటం 
ఎలాగో నేర్చుకోకుండానే..

మనసుకు మౌనం 
అనే ఒట్టు పెట్టా..

ఇప్పుడు
నా మౌనం
నాకు అగ్ని పరీక్ష పెడుతుంది..

మాటలే లేవు మన మధ్య 
మాటలు మాత్రమే లేవు..

నీ మాటకు బదులు ఇవ్వని
నా మౌనం నీకు చాలా చెబుతుంది
వినే ఉంటావు అనుకుంటా..

బాధ పెడితే నిన్ను
మన్నించేయ్ నన్ను..

నా మనసు జాగ్రత్త
నీ మనసు ఇక్కడ పదిలంగానే ఉంది..

✍️అరుణిమలు

తాను నేను

ఒక్కసారి వెనక్కి తిరిగి 
రావాలని ఉంది..

ఈ గుండెల్లో ఉన్న భారాన్ని
నీ ఎద పై దించేయలని ఉంది..

వాలిన కనులకు
ఆనకట్టలు కట్టలేకున్న..

ఈ గుండె వేగాన్ని
అదుపు చేయలేక పోతున్న..

నిదుర మరిచిన రాత్రులను
ఆదమరిచిన నీ ఙ్ఞాపకాలు ఆక్రమించేసాయి..

ఇంత బరువుగా ఉన్నాయి ఏంటో
నీ ఆలోచనలు..

నన్ను ఉక్కిబిక్కిరి చేస్తూ
నాతో నన్ను ఉండనివ్వకుండా పోరు పెడుతు..

ఈ శక్తి ఎంత వరకో
ఈ చింత తీరేది ఎప్పుడో..

నువ్వే ఒకసారి ఎదురై పోకూడదా
నే గీసిన గిరిని చెరిపేసి
నన్ను తీసుకు పో..

✍️అరుణిమలు (550 😍😍😇😇)

తాను నేను

నిన్ను అర్థం చేసుకోవడంలో ఓడిపోలేదు
సర్దుకుపోవడంలో ఓడిపోయా..

ఎందుకో ఈ అభిమానం...
ఏం మిగిల్చింది..

ఎవరు లేకపోయినా నేను నీకు ఉన్న అంటు
కావాలి అనుకున్న వారికి దూరంగా
నిలబెట్టింది..

చాలా భరువైన ఆభరణం 
ఆత్మాభిమానం..

బాధని మోయమంటుంది నవ్వుతూ
బంధీని చేస్తుంది మనసును..

ఆదరిస్తుంది కానీ
ఆదరణ కోరుకోనివ్వదే..

మారాలని ఉన్న
మారనివ్వదు కదా..

నీవలన తల ఎత్తుకుని ఉన్న
నాతో నేను ఓడిపోతు..

✍️అరుణిమలు

తాను నేను

మళ్ళీ తిరిగి వస్తా నీ దగ్గరకు... కానీ ఉపయోగం ఏముంది..

నేను ఎక్కడ నిన్ను వదిలి వెనుతిరిగానో
నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు..

ఇప్పుడు ఏంటి
తప్పు నాదే అంటావు
నీది ఏం లేదంటావు..

నీ ఆవేశం
నీ ఆలోచనలు
నేను నేను అనే నువ్వు..

ఇంతేగా నిజం..
తప్పు ఒప్పుకోవడానికి వెనక్కి తిరిగి రావడం దేనికి..

నాదే తప్పు...
సరేనా...

నా తప్పుకు 
నాకు నేను వేసుకున్న శిక్ష
మన మధ్య ఈ దూరం అనుకో..

నేను వేసుకున్న శిక్ష చాలదా
నువ్వే వేయాల..
తిరిగి నా మాటలు నాకు ఇచ్చేయాలి అంతేగా..

మళ్ళీ మళ్ళీ చంపడానికి
ఇక్కడ దేహం మాత్రమే మిగిలి ఉంది..
మనసు ఎప్పుడో చచ్చిపోయింది..

మనిషి మీద కొడితే కసి తీరదు
మనసు మీద కొడితే కదా కోపం తగ్గుతుంది..

మనసు మీదే కొట్టేసావు
మనం అనుకున్న ప్రతీసారీ నేను, నా అహం అంటూ...నన్ను వేరు చేసి పడేసి..

పిచ్చి దానిని...
నా అనే హక్కు ఉంది అనుకున్న..

అభిమానమో, ఆపేక్ష నుండి వచ్చిన మందలింపులను కూడా...
జవాబులు కావాలి అన్న రోజునే మనసు చచ్చిపోయింది..

దెబ్బ తగిలించుకున్నావని 
అమ్మ నడవడం చేతకాదా అని రెండు తగిలిస్తే..
అవకాశం దొరికింది అని కొడతావ, తిడతావ...నువ్వు ఎందుకు ఇలా చేసావంటే... 

తల్లి ఏం నిరూపించుకోవాలి అక్కడ, 
తన ప్రేమకు అర్థం ఏమని చెప్పాలి,
తన బెంగను ఏ విదంగా బయట పెట్టాలి...

నన్ను అదే చోటున నిలబెట్టావు...
నేను నీ తల్లిని కాను కనుకేమో నా సమాధానాన్ని మౌనానికి వదిలి వచ్చేసా...

సమాధానం ఇవ్వగలిగిన రోజున తిరిగి వస్తా..
నువ్వు పరాయి వాడివి ఐతే జవాబు ఇవ్వగలను..

అభిమానాన్ని వదిలేసిన రోజు తిరిగి వస్తా..
నువ్వు కావాలంటు,తప్పులను ఒప్పుకుని నిన్ను పొందేందుకు..

నువ్వు వేసిన ఒక్క ప్రశ్న
మనం అనే నా భ్రమను లాగిపెట్టి కొట్టింది..

ఇంకా అదే గాయాన్ని మోస్తున్న
బహుశా ఇది ఎప్పటికి మానదేమో..

నీలోనే, నీతోనే ఉన్నా ఇంకా
ఉంటా కూడా...
తిట్టిన, అలిగిన, కోప్పడిన,ఏడ్చిన,నవ్విన,ప్రేమించిన
అన్ని నీతోనే...
నీకు దూరంగా మనసుకు దగ్గరగా..

✍️అరుణిమలు

తాను నేను

చాలా చెప్పాలని ఉంది
అక్షరంగా మారి..

ఎంత రాసిన 
తరగని నా భావానివి నువ్వు..

అంతులేని ఈ అక్షర ప్రవాహం
చివరికి చేరేది నీ చెంతకే..

విశ్వమంత ఈ భావాన్ని
అణువంతగా మార్చి చెబుతున్న ఇనుకో..

❤❤❤ఐ లవ్ యు ❤❤❤

✍️అరుణిమలు

తాను నేను

మనసు నిశ్శబ్దాన్ని
కన్నీటితో కదిలించకు..

అక్కడ ఉన్నది...కష్టమో, సుఖమో
ఆశలో, నిరాశలో..

రెప్ప చాటున
దాగిన ఉప్పెనకు తెలుసు..

మౌన రాగాన్ని
ఆలపిస్తుంది మనసు..

భావం ఎరుగని
గీతమేదో పెదవిని చేరి ఆగిపోయింది..

ఎద లోతుని తవ్వుతున్న
ఙ్ఞాపకాలలో దాగిన అపార్ధాలను చదువుతూ..

ఆపేక్షలో, అభిమానమో
తెలుసుకోలేని మనసు వేసిన తప్పటడుగులు..

జవాబులు తెలిసినా
తెలియనట్లు దాటేసిన ప్రశ్నలు ఎన్నో..

చీకటి ఒడిలో
చిదిమేసిన ఇష్టాలను
కన్నీరుగా ఒలకనివ్వని మొండి తనం..

అక్షర వ్యాసమా ఇది
కాదే....

మనసు ఒక నిశాని
దానికి తెలిసిందల్లా నమ్మేయడమే
మనసుకు దగ్గర ఐన వారిని..

✍️అరుణిమలు

తాను నేను

ప్రేమంటే నమ్మకం లేదు అనేవారే నిజాయితీగా ప్రేమిస్తారు...

వాళ్ళకు ఈ డే లు గట్రా పట్టింపులు ఉండవు
పాటించరు కూడా...

చాక్లెట్ అడిగితే... 
చాక్లెట్ ఇచ్చి మాయ చేయడానికి 
నేనేం మాయగాడిలా కనిపిస్తున్నాను ఏంటే
కావాలంటే కొనుక్కొని తిను
లేదా చాక్లెట్ తింటా కొనరా అని అడుగు అంటాడు..

బండ సచ్చినోడు...

ఒక ముద్దు, ముచ్చట
సరదా, సంబరం లేదంటే..

తాయిలాలు ఇచ్చి అడుక్కోవడం దేనికే
ఆడుకుందాం కావాలంటే అంటాడు..

(ఇలాంటి ఒక జంటను చూసాను నేను....ఈ పోస్ట్ నేను రాయలేదు.... నా ఐడి హాక్ అయ్యింది ఇప్పుడు)

తాను నేను

మనసును చీల్చే నీ మాటల పై 
ఎదురు దాడి చేయడానికి‌.. 

నేను ఆయుధాన్ని అవ్వను..
మౌనాన్ని ఆశ్రయిస్తాను..

మనసు విరిగిన రోజే వస్తే
నీ నుండి దూరం జరగడమే తప్ప తిరగబడలేను..

నిన్ను శిక్షించను
నన్ను పరీక్షించుకోను..

నా ప్రేమ ఇంతే 
దాని తీరు అంతే...
నిన్ను నొప్పించి నేను పొందేది అశాంతే కదా..

బతికించే ఙ్ఞాపకాలు కావాలి
బాధించేవి దేనికి..

దూరమో, దగ్గరో
నా బలంగా నువ్వు మిగిలిపో చాలు..

✍️అరుణిమలు

తాను నేను

ఆత్మీయురాలినో
అర్ధాంగినో బంధమేదైతే ఏముంది
నన్ను ఏనాడో నీ బంధీని చేసేసావు...

జీవిత చివరి క్షణం కొరకు
వాగ్ధానాలు వద్దు..
ఈ క్షణం నువ్వు
నాతో పంచుకునే కాలమే ముద్దు..

నీ బాహు బంధనం
నా బందీ ఖానా ఐతే చాలు..

నీ వ్యాపకాలన్ని తీరాకైనా
నేను గుర్తు వస్తే నాకో క్షణ కాలాన్ని ఇచ్చేయ్..

ప్రపంచమంతా నీదే ఐనా
నా ప్రపంచంలో ఉన్నది నువ్వు ఒక్కడివే..

నాకోసం నువ్వు వెతుకుతూ వచ్చే
దారి వేపే చూపులని వదిలేసా..

పెదవి విప్పి చెప్పాల ఇవన్నీ
తెలుసుకోలేవా ఈ శ్వాస పడుతున్న ఆశ నీవేనని..

మనం అనే మాటను
విడదీయను..
మనసు నుండి
నిన్ను దూరం చేయను..

నా నుండి నా ప్రయాణం
చేరేది నీ దగ్గరకే..
మలుపులు ఎన్ని ఉన్న
ముగిసేది అక్కడే..

✍️అరుణిమలు

తాను నేను

కసిరే కోపం నీదే
అక్కున చేర్చుకునే మనసు నీదే..

ఆవేశాన్ని చూపిస్తావు
అధికారం ఇస్తావు..

నా కోపాన్ని భరిస్తావు
నే గీసిన దూరాలను చెరిపేస్తావు..

అలకంటే చిరాకంటావు
అలిగితే లాలిస్తావు..

తగ్గడమే తెలియని వాడివి
తలొంచి ఒడిలో వాలిపోతావు..

నన్ను దూరం చేసుకోలేని
నువ్వు దూరం జరగని బంధం ముడి వేస్తావు..

మాటలతో దాడి చేయడం
ఆనక గంధాన్ని గోముగా రాయడం..

నా కోపాన్ని చూసి నవ్వడం
యుద్దానికి రమ్మంటు ఆహ్వానం ఇవ్వడం..

నువ్వంటే నేనంటు
నేనంటే నువ్వంటు 
వేరుకామంటు..
 
వెనుతిరిగిన ప్రతీసారీ
నన్ను నీ గుండెల్లో దాచేసుకున్నావు..

ఏ బంధమో తెలియని
బంధనంలో బంధీని చేసావు.‌.

అరె.........
నిన్ను ఎందుకు వదులుకుంటార
ఎంత దూరంలో ఉన్న
ఈ మనసు నీ చెంతనే ఉంటుంది
చూసుకో కావాలంటే..

✍️అరుణిమలు

తాను నేను

నువ్వో వరమనుకున్న కానీ 
శాపమయ్యవురా..

హా....శాపమే

ఎక్కడో ఉంటావు నువ్వు
ఇక్కడ నన్ను శాసిస్తావు, అదుపు చేస్తావు, వేదిస్తావు..

ఎప్పుడో వచ్చి పోతావు
నీ పలకరింపు కోసం పడిగాపులకు నన్ను వదిలేసి
ఎదురు చూడమంటావు..

నువ్వు వద్దురా నాకు అంటే
నా వెన్నంటి ఉంటా అంటావు..

ఒంటరిగా ఉన్న నీ ఆలోచనలే
ఎక్కడ నన్ను వదలవా కాసేపైనా..

నన్ను నాకు ఇచ్చేయ్ అని వరమడగాలని ఉంది..
కానీ మనగలనా నీ తలపుకు దూరమై అనిపిస్తుంది..

నువ్వు నాతో లేని ప్రతీ క్షణం
నిన్ను ఎన్నెన్ని విధాలుగా తలంచుతానో
తెలయదే నీకు..

నాకు నేను లేను నువ్వు వచ్చాక
నాకు ఉన్నది నువ్వే ఇప్పుడు... నేను ఉన్నది నీ లోనే కనుక..

నన్ను నాకు దూరం చేసి ఆడుకుంటున్న నువ్వు వరానివి ఎలా అవుతావు...
శాపానివే కదా...

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను వెతికే కనులు
నిన్ను తలచే మనసు
అలోచన ఒకటే

నువ్వే ఎదురు వచ్చిన రోజున
నన్ను నేను నిలువరించగలనా

నీ కళ్ళ లోకి చూడగలనా
నా కళ్ళతో కబుర్లు చెప్పగలనా

మాటలే కరువై
కాలాన్ని ఆగమని ఆగిపోనా..
 
ఈ క్షణం చాలని
ఇంకే వరం వద్దని

నీ ఎదపై సోలి 
అదర సంతకంగా
మిగిలిపోనా..

ఏ కాలమో
నాకోసం మిగిల్చిన
కానుకవు నువ్వు..

✍️అరుణిమలు

తాను నేను

చెల్లాచెదురుగా పడిన నా మనసు ముక్కలను...
ఒకచోట పేరుస్తున్న...

మళ్ళీ ఒకసారి నీ రూపాన్ని చూడాలని
నిన్ను గుండెలకు హత్తుకోవాలని...

కుదురుతుందా
నా వలన అవుతుందా..

రెప్పవెయ్యనివ్వని
నీ ఆలోచనల పోరులో అలసిపోతున్న...

ఎందుకే నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావు 
నన్ను బాధ పెడతావు అంటావు...

తలొంచలేను,నప్పుకు పోలేను
నటించలేను, నిందించలేను..

వీటిన్నిటి కన్నా నన్ను నేను హింసించుకోవడం‌ తేలికగా, హాయిగా ఉంటుంది..

నాతో నేను చేస్తున్న ఈ యుద్దంలో
ఓడిపోయి మరోసారి నిన్ను గెలుచుకోవాలని ఉంది..

నా చేతుల్లో పనే కదా
కానీ చేత కావడం లేదు రా..

ఎలా.....ఎలా...
నా అడుగులను నీ వేపుకు మళ్ళించేది..

✍️అరుణిమలు

తాను నేను

నన్ను చూస్తే నువ్వు గుర్తు వస్తావు..
నిన్ను చూస్తే నేను గుర్తు వస్తాను..
మనం తెలిసిన వారికి..

ఇంతకన్నా గుర్తింపు ఏముంది
నువ్వు, నేను వేరు కాదని
కాలేమని..

మనం విడిపోవడం
కలే అని..

సర్వాధికారాలు నీవే అంటు
ఈ సారికి ఇలా సరిపెట్టుకో అంటే ఏమంటా ఇక..

మాటల్లో ముంచేసి
మాయలో ఉంచి దోచేసావు మనసును..

మనం అనే పదం నుండి
నన్ను వేరు చేయలేను
నిన్ను విడదీయ లేను..

✍️అరుణిమలు

తాను నేను

మన నిర్ణయాలను
ఒప్పుకోదే ఈ మనసు..

మనం ఎటో చూస్తే
దాని చూపులు వేరోక చోట ఆగిపోయి ఉంటాయి..

మన అడుగులు ముందుకు పడుతుంటే
అది మాత్రం గతం దగ్గర నుండి కదలనంటుంది...

పెదవులపై నవ్వులు ఎన్నో
మనసు నిండా దిగులు మబ్బులే..

ఎలా ముడేసావో నీ మనసును
విప్పతరం కావడం లేదే నాకు..

నా కథలో నువ్వో మజిలీ అనుకున్న
నాతోనే కదిలే నా కలవని తెలియలేదు..

నువ్వు వచ్చిన దారి తెలియదు అప్పుడు
నువ్వు వెళ్ళిన దిక్కు వేపే చూస్తుంది
ఏ దిక్కులేని ఈ మనసు..

కాలం నదిలో కదిలిపోతున్న నావని
ఏ తీరాన ఉన్నావో తెలియని నీకోసం ప్రయాణం..

కలం కదలనంటుంది
కాలం ప్రశాంతంగా లేక..

అల్లకల్లోలమే ఈ మనసు
ఐనా బయట పడదే నీ ముందర..

అప్పుడు ఇప్పుడు
నువ్వు నువ్వే
నేను నేనే..

అనుకోకుండా కూడా
ఎప్పుడు ఎదురు పడకు నాకు
నన్ను నేను నిలువరించడం ఎలాగో తెలిసే వరకు..

✍️అరుణిమలు

తాను నేను

నేను అలిగితేనో
బెట్టు చేస్తేనో
నువ్వు మాటలు కలుపుతావు..

లేదంటే
యాంత్రికమే కదా
మన జీవితాలు..

ఒకరికి సమయం కావాలి
ఒకరికి తీరిక దొరకాలి..

నువ్వు నాతో ఉండే కొద్ది క్షణాల కోసం
ఎన్నో యుగాల సంఘర్షణ ఎదుర్కొంటున్న..

మనసెలా ఉన్న
నువ్వు ఎదురైన క్షణాన 
నన్ను నేను మరచిపోతుంటా కావాలని..

ఙ్ఞాపకాల కాలాన్ని హత్తుకుంటున్న
ఎదలో రాలిపోతున్న ఆశలకు శ్వాసను నింపేందుకు..

ఎలా... ఎలాగోయ్
ఈ గుప్పెడు గుండెల్లో నిన్ను
గుప్పెట దాచిన‌ దుఃఖాన్ని 
భరించేది...

✍️అరుణిమలు

తాను నేను

గతంలా మారిపోయింది నిన్నటి కాలం
నువ్వు వెళ్ళిపోయావు...ఙ్ఞాపకాలను వదిలేసి

రేపటి వేపు చూస్తు
ఆ శూన్యంలో నీ రూపుని చిత్రిస్తున్న..

వెనక్కి తిరగని కాలం
ముందుకు కదలని పాదం..

కలం...పదం
కలిసే చోట రాలిందో
కన్నీటి చుక్క..

చెదిరిన భావాలను
చెరిపేయ లేను..
చెమర్చే కన్నులను
ఓదార్చలేను..

అప్పుడప్పుడు వస్తుంది
వసంతం..
ఆశలను చిగురించి
చిదిమేసి పోతుంది..

అందుకే ఆశించకే మనసా
అలవాటు పడకే అనేది..

మళ్ళీ నువ్వు వస్తావ
మన్నులా మారిన మనసుకు రూపాన్ని ఇస్తావ..

✍️అరుణిమలు

తాను నేను

అడగాలని ఉంటుంది నిన్ను ఒక మాట...అభిమానం ఎందుకు అని అడ్డు పడుతుంది..

పెదవి దాటని మాటని చదవడం నీకు రాదు...
మనసు విప్పి చెప్పడం నాకు చేత కావడం లేదు...

అందుకే నువ్వు అక్కడ
నేను ఇక్కడ..

ఇలా ఎద గడపకు ఇవతలే
మౌనంలో సమాధి అయ్యే బంధాలు ఉంటాయి అందరి జీవితాల్లో..

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను వెతకని కనులకు కునుకు రాదు
నిన్ను వెతికే కనులకు అలసట రాదు..

అక్కడెక్కడో వదిలేసిన నా ఆశలకు
వెనక్కి పెట్టి నిల్చున్న..

మొండితనమా, 
పంతమా..

మౌనంలో నలుగుతున్న ఆలోచనలకు
దారి వెతకాలని లేదు..

కలవరపడుతున్న మనసుకు
ఊరడింపు మాటల పూత పూయాలని లేదు..

కోరికలన్ని కష్టపెట్టేవి
ఆశలన్ని అస్తమించేవే..

కష్టాలు కావాలని రావు
కోరి తెచ్చుకున్న మన ఇష్టాల మరో రూపమే అవి..

కొన్ని పరిచయాలు పరీక్షలు పెడతాయి
జీవితమంత ఎదలో చోటు ఇచ్చే
జత కూడని జంటలు ఎన్నో ఈ లోకంలో..

అస్తమిస్తున్న ఈ సూరీడుని 
వెతుకుతూ వచ్చే ఆ చందమామలా..
కలిసి ఉండలేరు ఇద్దరు
కలవరించకుండా ఉండలేరు..

✍️అరుణిమలు

తాను నేను

తలచావేమో
పిలిచినట్టు వినిపించింది..

నీ పిలుపు కోసం
పరితపించే పిచ్చి మనసు
మాటిమాటికీ వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది..!!

✍️అరుణిమలు

తాను నేను

రెండు పదాలలో ఇమడ్చలేనంత
చెప్పాలని ఉంది నీకు..

ఏ భావాలను 
ఈ పదాలలో పొదగను..

మనసు నిన్ను పెనవేసిన
ఆ చోటనే నా ఆలోచనలు సంచరిస్తున్నాయి..

ఏ చోట నువ్వు ఉన్న
నేను చెప్పాలని అనుకున్న మాటలు 
నిన్ను పలకరించి వస్తాయి అని తెలుసు..

ఇదేగా మనం
తనువులు వేరైనా, మనసులు జతకట్టేసాయి..

దారులు వేరైనా
గమ్యం ఒకరిలో ఒకరు కలవడమే కదా..

మనిషిగా ఇక్కడ ఉన్న
నీ ఊహల నీడన దాగుని..

✍️అరుణిమలు

తాను నేను

మన గురించి ఆలోచించడం అలవాటు... 
అందులో నీకోసం ఆలోచించేదే ఎక్కువ..

నీతో గొడవ పడతా
నీకోసం గొడవ పడతా..

నీ దగ్గర అలుగుతా
నీకోసం నాలో నేను మదనపడతా..

నువ్వు తిడితే ఏడుస్తా
నిన్ను తిట్టినా ఏడుస్తా..

నీకు దగ్గర అవ్వాలంటే భయం
దూరం అవ్వాలంటే బాధ..

నువ్వు ఎందుకు వచ్చావు అనిపిస్తుంది
నువ్వే రాకపోతే నాకు నేను సరికొత్తగా పరిచయం అయ్యే దానిని కాను..

నీ మీద అరుస్తా 
నువ్వు నాకు ఇచ్చిన హక్కని మురిసిపోతా..

మన ఇద్దరికి రాసి పెట్డి లేదని తెలుసు
అందుకే మన ఙ్ఞాపకాలను నేను రాసుకుంటున్న ఇలా..

మనసులో చోటిచ్చా అనుకున్నా కానీ
మరుజన్మకు కూడా ఈ మనసు నీదే అని ఎద పై చెక్కేసా..

✍️అరుణిమలు

తాను నేను

నా మౌనం నీకు మాత్రమే వేసిన శిక్ష కాదు
నీతో పాటు నాకు సగభాగం ఉంది అందులో..

నా ఆంక్షలలో నిన్ను ఖైదుని చేయలేదు
నా ఆలోచనలు బంధీలయ్యాయి నీలో..

నిన్ను చేరని నా తలపులు
నా వద్దే అలిగి కూర్చున్నాయి..

ఎన్నో చెప్పాలని ఉంది కానీ
పెదవికి ఎందుకో ఈ బింకం..

మాటలు మరచిన మనసుకు
నీ ఙ్ఞాపకాలే ఓదార్పు..

ఎందుకో...
ఈ కాలానికి పరీక్షలు పెట్టడం అంటే
ఇంత ఇష్టం..

ఇద్దరి మధ్య దూరమనే గిరి గీసి
చోద్యం చూస్తుంది..

లెక్క పెడుతున్న చుక్కలు లెక్క తేలడం లేదు
నేను నీకు దూరంగా జరిగిన ఈ రోజులు గడవడం లేదు..

కలిసిపొమ్మని ఎద నస పెడుతుంది 
కానీ....తీరానికి చెరో వేపు ఉన్న తీరాలమని
కలవడం కుదరదని దానికేం తెలుసు..

✍️అరుణిమలు

తాను నేను

నీకై ఎదురు చూపులలో
అలసి పోయింది తనువే కానీ మనసు కాదు..

మనసు మేల్కొనే ఉంది
నిన్ను తన తలపు లలో దాచుకుని ఇంకా..

నువ్వు వచ్చే దారిలో
నా కన్నుల వెలుగులను వెదజల్లి వేచి ఉన్న..

ఎదనే పరచా నీకై
ఏలుకోవడానికి రావయ్య 
ఏడేడు జన్మల నా దొర ..

✍️అరుణిమలు

తాను నేను

ఎలా మొదలయ్యిందో మన ప్రయాణం
గుర్తు లేదు...

ప్రతీ మలుపు మరుపు రానిదే..
ప్రతీ ఘడియ విలువైనదే..

నిన్ను కలిసాకే కదా
నన్ను నేను తెలుసుకున్నది..

నాలో మరో కొత్త వ్యక్తిని చూసింది
నిన్ను చూసాకే కదా..

మాటలు నుండి మనసుకు ఎలా దారి వేసావో తెలిసే సరికే...నా అడుగులు నీ ఎద గడపకు అవతల చేరుకున్నాయి..

నిన్ను గెలిచానో
నన్ను నేను ఓడించానో 
తెలియదు కానీ నువ్వు అనే బహుమతి
నా ఎదను అలంకరించింది.. 

నువ్వే కానుకగా మారాక
ఇక నా ఆనందానికి హద్దులే లేవు..

ఇది ఏ మజిలీలో ముగింపు అవుతుందో
అనే భయం వెంట నీడలా నడుస్తుంది..

కాలం ఇచ్చిన కానుకను
క్షణం కూడా కాలయాపన కానీయ్య కుండా 
ఙ్ఞాపకాలుగా దాచుకోవాలి అనుకున్న..

కానీ నీ దగ్గర నాకోసం ఆ కాలమే లేదని
తెలిసే సరికి.. 
మనసు చాలా దూరం ప్రయాణించేసింది నీ ఊహల్లో..

ఎలా మనసుకు చెప్పాలో
ఎలా నీకు చెప్పాలో తెలియని
అయోమయం నాది అయ్యింది..

నీ ప్రయాణంలో నేనో పాత్రని మాత్రమే అని నాకు తెలుసు..
మరి నా ప్రయాణంలో నువ్వో భాగం కాదు, నా పయనమే నువ్వని అని నీకు తెలుసా..

తెలిసీ తెలియనట్లు నువ్వు ఉంటున్నావని అర్ధమయ్యే..
ఈ మజిలీకి నేనే ఓ ముగింపును నిర్ణయించా నీ జీవితం నుండి తప్పుకుని...

చాలా ఇబ్బంది పడిపోయావు కదు..
ముసలోడివి అయ్యాక గుర్తు తెచ్చుకుని గర్వపడిపో...నీకోసం ఎక్కడో ఒక మనసు నిన్ను తనలో ఇంకా ఙ్ఞాపకంగా దాచుకుందని...

✍️అరుణిమలు

తాను నేను

ఎలా ఉన్నావో అని మనసు పదే పదే ప్రశ్నలు వేస్తుంది..

మారం చేస్తున్న మనసుకు నా జవాబు ఇదే..

నీ తలపే లేని చోట నేను ఉండలేను..
నీ వలపే లేని రోజు నేనే మిగిలి ఉండను..

నీ క్షేమమే నా శ్వాసకు కారణం కనుక..
ఎక్కడ ఉన్నా నిన్ను నువ్వు నాకోసం జాగ్రత్తగా చూసుకుంటావని తెలుసు..

నేనెలా ఉన్నాను అని అనుకుంటున్నావ..
నీ ఆలోచనలలో మునిగి ఉన్న హాయిగా..

నీకోసం ఎంత ఆలోచిస్తున్నానో అనేది
నీ ఆలోచనకు కూడా అందదు..

✍️అరుణిమలు

తాను నేను

నువ్వు నాకొద్దంటు వెనుతిరిగా...

ఐనా అడుగడుగునా నా మనసు వెనక్కు తిరిగి చూడమంటుంది.‌..

ఎదురుగా నీ రూపే చూపిస్తూ, 
నీ తలపే సృష్టిస్తూ, 
నువ్వు పిలవని పిలుపుని వినిపిస్తూ, 
భ్రమలు కల్పిస్తూ నాకు పరీక్షలు పెడుతుంది...

✍️అరుణిమలు

తాను నేను

నీపై ఇష్టాన్ని చూపించలేను...కోపాన్ని ప్రదర్శించలేను..

ఇదేగా నువ్వు కోరుకున్నది... ఇలాగే కదా నేను ఉండాలని నువ్వు ఆశించినది..

నేను నేనులా ఉండేదే నీ ముందర...ఇప్పుడు నీ ఎదుట ఉన్నది నువ్వు మలుచుకున్న నేను కాని నేను..

నా భావోద్వేగాలన్ని మౌనంలో సమాధి అయిపోయాయి...నీపై నా భావాలన్ని అక్షరాలకు పరిమితమై పోయాయి..

కలతలు లేని, అలకలు రాని అన్యోన్య జంట మనం... ఒకరి కోసం ఒకరమై, ఎవరికి ఎవరమో తెలియని మనసులు మనవి..

✍️అరుణిమలు

తాను నేను

నా ఙ్ఞాపకాలను దాచుకున్న నిన్ను
ఈ గుండెల్లో దాచుకోవడం నాకు ఎంత ఇష్టమో తెలుసా..

ఊహల కౌగిళ్ళల్లో
ఉవ్వెత్తున ఎగిసే మన శ్వాసలు చేసే సమరంలో
ఇద్దరం విజేతలమే..

అవును...
బంధమే లేని బంధనంలో
ఇరువురం బంధీలమై ఒకరికొకరికి ఖైదీలం అయిపోయాం ఎప్పుడో..

ఓయ్......
పిలుపు విని చిరునవ్వులు నవ్వకు
చిరుగాలిలా నిన్ను అల్లుకుపోతా ఈ క్షణమే..

ఆయువుగా మారిపోయి
నా అణువణువునా నిండిపోయావు ఎప్పుడో..

మనసుకు దగ్గరగా
మనిషికి దూరంగా..

✍️అరుణిమలు

తాను నేను

ఎన్నో విస్పోటనాల మధ్య కూడా
మనసు మౌనం గానే ఉంది..

కొన్ని నిర్ణయాలు సవాలు విసురుతుంటే
కాలం పరీక్ష పెడుతు వేడుక చూస్తుంది..

ఎక్కడ నుండి వచ్చిందో
ఈ మొండితనం..

ఎవరిచ్చారో
ఈ శక్తిని..

నువ్వు లేని క్షణాలను ఊహించలేని
ఈ ఎదను
నీ ఆలోచనల కడలిలో నిర్ధయగా పడేసా..

అలసిపోతున్న‌ మనసుకు
నీ ఙ్ఞాపకాల ఊపిరి పోస్తున్న నేడు..

ఒకటి మాత్రం నిజమొయ్
ఏ దూరం నా మనసు నుండి నిన్ను దూరం చేయలేదు.... మరే మనసుకు అక్కడ చోటు లేదు..

✍️అరుణిమలు

తాను నేను

లోకమంతా నిశ్శబ్దంలో కునుకు తీస్తుంది
అక్కడక్కడ కొన్ని మనసులు మేల్కొనె ఉంటాయి..

రాత్రులు నిద్ర లేచే ఆలోచలలో
నాతో నేను చేసే మౌన పోరాటాలు ఎన్నో..

అవకాశం లేని చోట ఆశలు పెంచుకోవడం
జీవం లేని చోట చిగురించాలి అనుకోవడం
ఎంత పిచ్చి తనం..

కొన్ని పరిచయాలు బంధాల కన్నా
బలీయంగా ఎదలో నాటుకు పోతాయి..

కానీ...ఎవరు మనం అంటే
ఎవరికెవరో లోకానికి... మనసుకే ఒకరికొకరు

ఎక్కడో ఒకచోట ముగింపు ఇవ్వాల్సిందే వాటికి
ఒకరికొకరు ఇబ్బందిగా మారక మునుపే..

సాగరంలా పైకి కళకళలాడుతూ
గర్భాన కన్నీటిని దాచేయాలి..

ఎన్నో బంధాల నడుమ
మనసు గెలిచిన వారికి దూరంగా..

ప్రతీ రాత్రి నీ కలల్లో మేల్కొంటు
కల లాంటి ఉదయాలను ఆహ్వానిస్తూ బతికేస్తున్న సంతోషంగా..

✍️అరుణిమలు

తాను నేను

అక్షరాల తోవలో నాకు ఎదురైన 
నా భావానివి నువ్వు... 

నువ్వు లేని నా పదం లేదు... 
నువ్వు లేని కాలం మన కథ కాదు...

నువ్వు లేని పదాలలో నా కలలు కూడా లేవు... నువ్వు లేని నేను ఎవరనే ప్రశ్నను అవుతా...

నీ చుట్టూ నువ్వు చూసిన స్నేహాలలో ఇచ్చిపుచ్చుకునే అవసరాలే ఎక్కువ కదా...

నేను నీ అవసరాన్ని కాలేను 
నిన్ను అవసరంగా చూడను...
నువ్వు నా మనసు తోడువు మాత్రమే
నాతో ఉన్న, లేకున్న..

✍️అరుణిమలు

తాను నేను

ఎవరి కోసమైన ఎదురు చూసే చోట 
కాలం కూడా క్షణికమై పోతుంది...

ఎవరి ఆలోచనల్లోనో మది అలలు అలలుగా ఎగిసి తీరాన్ని కోతలు పాలుచేసిన బాగుంటుంది...

ఎవరో కలిసే చోట యుగాల నిరీక్షణ కూడా ఇష్టంగా దొర్లి పోతాయి...

ఎవరి తలపో మనసును తాకి, పెదవిని చేరగనే
కళ్ళు చెమ్మగిల్లి మది తేరుకుంటూ ఉంటుంది...

ఎవరు....... అనే ఈ ఎవరు లేనిచోట 
ఆలోచనకు, ఎదురు చూపులకు, ఆశలకు, ఊహలకు వేటికి చోటు ఉండదు.‌‌..

చివరికి 
మనకు కూడా..

✍️అరుణిమలు

తాను నేను

అలిగానో, కోపంతో కాదనుకున్నానో 
బాధతో వద్దు అనుకున్నానో..

ఏమనుకున్న నువ్వు లేని 
చోటు మరొకరికి తావు ఇవ్వదు ఈ మనసు..

నువ్వు లేవు కానీ నీ ఙ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి అక్కడ... ఇంకెక్కడ ఖాళీ

సరదాకైనా ఇంకొక ఊహకు
ఇక్కడ చోటు లేదు
ఎవరికి ఆహ్వానం లేదు..

నాలో నేను
నా ఆలోచనల నిండా నువ్వు
ఏకాంత తీరాలని తాకుతూ గడిచి పోతున్న కాలం..

✍️అరుణిమలు

తాను నేను

నాతో నేనే మాట్లాడుకుంటున్న
నాలో నిన్ను చూస్తూ..

పిలవాలని ఉంది నిన్ను ఒక్కసారి
ఎవరికి వినపడకుండా
నీకు కూడా..

మనసులో వందల సార్లు
జపిస్తున్న నీ పేరును..

కానీ....పెదవికి తనివి 
తీర లేదు..

నీ ఙ్ఞాపకాలలో తడిసి ముద్దౌతున్న మనసుకు
ఇవేం కోరికలో..

నువ్వు లేని ఈ కాలాన్ని
కలగా మార్చే ఏ వేకువో రావాలని ఉంది..

నీ చిరునవ్వుల‌ మేల్కొపులలో
నేనో మంచు బిందువై మెరిసిపోవాలని..

ఆశలు కాదు అత్యాశలు 
అని తెలుసులే..

✍️అరుణిమలు

తాను నేను

నీ కొంటె తలపులలో కొట్టుకు పోనా
నిన్ను కొంగుకు కట్టేసుకోనా..

కవ్వించే నీ మాటలలో
ఏ మంత్రముందో...

ఎంత కోపమైనా 
నీ పిలుపు తాకగానే ఆవిరైపోతుంది..

ఆ నవ్వులో ఏ గమ్మత్తు ఉందో
నీ మత్తులో‌ నేనెప్పుడో చిత్తుగా ఓడిపోయా..

ఎదురు పడనంత సేపే ఎడబాటు
నువ్వు ఏయ్ అంటే ఇక్కడ తడబాటు మొదలవ్వదా..

చుట్టూ ఉన్న లోకాన్నే మరచిపోతా
నువ్వు ఎదురైన క్షణంలో..

ఇక నాకు నేను ఎక్కడ గుర్తుంటా
నీలో వెతుకుతూ నీలోనే తప్పిపోతుంటే..

వచ్చేయ్ వోయ్ వసంతమై 
ఈ పెదవిపై సిగ్గును 
ఈ కళ్ళల్లో ఆనందాన్ని
నీ ముందు దాచలేక ఇబ్బంది పడాలని ఉంది..

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను ప్రేమించడం మాత్రమే 
తెలిసిన మనసుకు.. 

ద్వేషించాలంటే 
మరో జన్మ ఎత్తాలి...

అదే మరచిపోవాలి అంటే..?!

ఎన్ని జన్మలు ఎత్తిన‌ 
నీకోసమే ఎదురు చూసే ఈ మనసుకు 
మరుపు అనేది మరణంగా మారినా 
నా నుండి నిన్ను వేరు చేయలేదు ఎప్పటికి..

ప్రేమించేటప్పుడు ప్రేమంటే
ఏంటో అనుకున్న..

దూరం జరిగాక..నువ్వే ఆ ప్రేమని
నా ప్రేమ లోకం నీలోనే ఉందని తెలుసుకున్న..

✍️అరుణిమలు

తాను నేను

అలసిన నా మనసు తేరుకునేది 
నువ్వు నా వాడివి అనే 
ఆలోచన వచ్చాకే కదా..

నీ ఆలోచనలు వచ్చి పలకరిస్తూ
ఉంటాయి..
మనసును పదమంటూ ఎటో ఎటో
నడిపించి ఏడిపిస్తాయి..

అలసిన కనులలో నిన్ను దాచుకుని
పెదవుల నిండా నవ్వులు పులుముకుని
నా పనిలో నేనుంటా కదా..

ఓయ్.......
అనే పిలుపుతో తుళ్ళి పడతాను
బదులు ఇద్దామంటే 
ఎక్కడ నువ్వు కనపడవే..

రాత్రి మేల్కొనే కలలు
పగలు కూడా ఇలా కలవర పెడతాయి అని
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది..

నువ్వనే ముద్ర ఈ శరీరం మీద పడలేదోయ్
మనసు మీద రాసుకున్న... 

మనసా, వాచ 
నేను నీ దానినే ఎప్పటికి..

✍️అరుణిమలు

తాను నేను

నా ఆలోచనలలో నువ్వు ఎక్కడో ఉన్నావు...

నా చూపులు నిన్ను తల ఎత్తే వెతకాలి 
కానీ..... ఏనాడు మౌనంగా నేల చూపులు చూడకూడదు..

ఇంతకు మించి నా గర్వాన్ని నేను ఇంకేం ఆశించను..
ఇస్తావ ఆ మాట...

ఆత్మతో ముడిపడ్డావు నువ్వు 
ఎప్పుడు దూరం కావు, కాలేవు నాకు..

కానీ నువ్వు పక్కన ఉన్నప్పుడే కాదు...
నీ తలపు కూడా నన్ను గర్వపడేలా చేయాలి..

నీ పిలుపులో 
నా పొగరు కనపడాలి..

ఇంతే
ఇంకేం వద్దు..

✍️అరుణిమలు

తాను నేను

నన్ను మేల్కొలిపే నీ తలపులు జోకొట్టవు కదా రెప్ప వాలనివ్వమంటు కావల కాస్తున్నాయి...

నీ ఊహలలో అలసిన క్షణంలో మూసిన కనులను ఉలిక్కిపాటుతో లేపుతావు..

ఏ మాత్రం దయ లేదా స్వామి నా మీద...

అలసిన మనసుకు విశ్రాంతి ఎలాగూ లేదు... శరీరానికి కూడా ఇవ్వవా..

కనుల మూసిన ఘడియకే ఏవేవో కలవరింతలు..

జాలి దయ లేదు
నీకు... నీ మీద ఉన్న నా ప్రేమకు

సంతోషంగా ఉండమని కబురు పంపకు...నువ్వు లేని సంతోషం ఎక్కడ ఉందో ఇప్పుడు వెతక లేను..

నువ్వు ప్రశాంతంగా ఉండు....నీ దిగులు పోయి అయినా నా చిరునవ్వు అయినా నా దగ్గర మిగులుతుంది..

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను కలవాలని కోరిక లేదు
నిన్ను చూడాలని తపన లేదు

ఎక్కడున్న నువ్వు క్షేమంగా ఉండాలని 
ఏ ఆపదలకు ఎదురు పోకూడదని

మాత్రమే కోరుకుంటున్న..

నాతోనే ఉండాలని అత్యాశ లేదోయ్
నీ మనసులో ఏ మూలనో నీ మేలు కోరే ఒక ఙ్ఞాపకంగా మిగిలిపోతే చాలు..
నీ జీవితపు చివరి ఘడియలు వరకు నీతో నేను ఉన్నట్టే కదా..

నీ ఎద గుడిలో కొలువైతే చాలు
కోటి జన్మలను నా కాలి‌ గోటికి కూడా చాలవనుకుంటా..

వరించిన మనసు వరాలు అడగదు
తానే ఒక వరమై నీలో కలిసిపోతుంది..

✍️అరుణిమలు

తాను నేను

నీ ప్రేమ పరిచయం అయ్యాక ప్రశాంతత పోయిందిరా నాలో...

ఎలా ఉన్నావో
ఏం చేస్తున్నావో
అనే చింత..

ఎదురు చూసి చూసి
అలసిపోతున్న తరుణంలో వస్తావు...నీ పలకరింపుతో తట్టి లేపుతావు..

చెప్పాలి అనుకున్నవి ఏవి చెప్పను...
ఇంతలోనే ఏదో జగడం మన మధ్య..

నీ అహం వేసే ప్రశ్నలు
చేసే గాయాలు..

నీతో నేను గొడవ పడిన
నాతో నువ్వు గొడవ పడిన
ఏడ్చేది నేనే..

నీ దూరాన్ని భరించలేను
నీ మౌనాన్ని సహించలేను
నా అభిమానాన్ని చంపుకుని ఉండలేను..

ప్రశాంతత నీలో ఉంటేగా 
నాకు పంచగలవు.‌.

ఎదురుపడనంత వరకు నీ తలపులతో పోట్లాటలు
ఎదురు పడ్డాక నీతో..

ఏవో ఙ్ఞాపకాలను పోగేసుకుందామనుకున్న..
కానీ కన్నీటిని దోసిట నింపుతున్న నేడు..

నీతో ఉన్న బాధే
నువ్వు లేకున్న బాధే..

ఏ బాధైనా ఇష్టమే అనిపిస్తుంది
నువ్వు నాతో ఉంటే చాలు..

కానీ కలిసి ఉంటే 
నీ మీద ఉన్న విలువకి భంగం వస్తుంది ఏమో అనిపించింది..

అందుకే...నా మనసులో మొదటి సారి 
నువ్వు నా వాడిగా కలిగిన భావాన్ని దాచుకోవడానికి దూరంగా వచ్చేసా..

నన్ను నేను నీ నుండి దూరంగా ఉంచలేను 
కనుకే...ఒట్టుతో నా మనసును శాసించాను..

మనకోసం మనం మాట్లాడుకోము
పోట్లాడుకోము..
మనకంటు, మన కోసం అంటు మనం పంచుకున్న సమయం ఉందా అసలు..

✍️అరుణిమలు

తాను నేను

నా ఆలోచనలలో నువ్వు ఉన్నావో లేదో అనుకోకు...అక్కడ నీకున్న స్థానం నాకు కూడా లేదు...

మాటకు మాట
దెబ్బకు దెబ్బ
ఎక్కడ తగ్గవు కదా..

ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయాలి
అంటావు కదా...

మరి నాలా నువ్వు 
నీ ఆలోచనలలో నాకు చోటు ఇవ్వగలవా..

ఓడిపోతావేమో....ఇక్కడ

ఎక్కడైనా గెలుపు నీదే
ఈ విషయంలో గెలుపు నాదేనోయ్..

✍️అరుణిమలు

తాను నేను

నా గురించి రాద్దామని 
రాసేసా ఏదేదో...

కానీ చదువుతుంటే ప్రతి భావంలో 
నువ్వే కనిపిస్తున్నావు..

నిన్ను నువ్వు అన్వేషించుకునే 
దారిలో ఎదురైనా ఒక అనుభవాన్ని మాత్రమే నేను..

నీ ఎదలో దాగిపోయా
చిన్ని వెలుగునై నీ వెంట..

ఏనాడైనా ఒంటరిగా
అనిపించినప్పుడు 
నాకోసం,నన్నే లోకంగా భావించే వారు 
ఎవరున్నారని ప్రశ్నించుకో..

ఆ తలపులో 
ఏ వరుసలోనైనా 
నీ మనసును తాకి పోతాను..

మనం ఎవరం
అని మాత్రం బదులు అడగకు ఏనాడు...

నిజం చేదుగా 
అబద్ధం తీయగా 
ఉండటం అంటే 
ఇదేనేమో అనిపిస్తుంది...

✍️అరుణిమలు

తాను నేను

ఎదురు చూపులో 
ఎన్ని ప్రశ్నలో..

ఎలా ఉన్నారో, 
ఏం చేస్తున్నారో, 
ఎప్పుడు వస్తారు, 
మనం గుర్తుకు వస్తామ, 
గుర్తుకు వస్తే పలకరింపేది..

తీరికగా తీరిక అయ్యాక వచ్చి 
ఏం చేస్తున్నావు అంటావు..

ఈ మాట కోసమేనా
తనువంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసేది..

ఏ మాత్రం ఆత్రం కనపడదే
ఆ స్వరంలో...

ఏదేదో చెప్పాలి, చూపించాలని
అనుకున్నవన్ని ఆవిరై పోతాయి..

ఐనా నీకోసం చూసే అలవాటు పోదు
నీ గురించి ఆలోచనలు నన్ను వదలవు..

ఈ మనసుకు ఉన్న
తొందర అంతా ఇంతా కాదు..

అంతలోనే సంతోషం
ఇంతలోనే నీరసం..

తనువును వదిలి
ఎక్కడెక్కడో తిరుగుతుంది 
మనల్ని తిప్పుతుంది..

అది వలచిన వారి చేతిలో 
మనల్ని కీలుబొమ్మలను చేస్తుంది..

✍️అరుణిమలు