Thursday, 14 November 2019

తాను నేను

నా భావాలలో నువ్వు ఎప్పుడు
బందీవే ఇక్కడ..

కంటి నిండా
కన్నీరు ఉన్న చెరగని రూపానివే నువ్వు...

నీ తలపే
ఇప్పుడు తపస్సు నాకు..

నువ్వు వద్దు నాకు
అనే పదాన్ని పలకడానికి
అధరాలెంత బెదిరాయో...

నువ్వు పలికించాలి అనుకున్న
ఆ పదాన్ని పలకడానికి
నాతో నేను ఎంత పోరాడానో..

మనసు వేస్తున్న ప్రశ్నలకు
మౌనాన్ని జవాబుగా ఇస్తూ
ఎదురొస్తున్న కాలంలో ఎదురీదుతున్న..

భరించలేనప్పుడు
బాధ్యతగా తీసుకోలేనప్పుడు
నీకెందుకు ఈ ప్రేమంటూ
ఎద రొద పెడుతుంది..

మెదడు లెక్కలు
మనసుకు అనవసరం కదా
ఏదైనా భరించేయ్ అంటుంది..

అందుకే
మనసు గుచ్చి గుచ్చి
గాయాలను చేస్తుంది
నాకెందుకు ఈ వేదన అంటూ..

ముణ్నాళ్ళ ముచ్చట్లు
అంటే ఇవేనా..

సరదాగా ఉన్నప్పుడు
సర్దుకుపోయి..

భారంగా ఉన్నప్పుడు
భరించలేనంటు
మనసును తుంచేయడం
ఇంత తేలికా..

ఒసే మనసా...
నాలో ఉన్న నువ్వు
నన్ను వదిలేసి ఎవరి కోసమో
ఏడుస్తావేమే..

స్వార్ధం నేర్చుకో కొంచెం
నువ్వు బతుకు
నన్ను బతకనివ్వు..

✍️అరుణిమలు

తాను నేను

ప్రియతమ నీవచట కుశలమా
నేనిచట .........

నీవు లేని కుశలం
నా దరికి చేరుతుందా..

దిగులేదో
పెదవి మాటున దాగుని ఉంది..

ఏ క్షణానైనా
కనుల ఆనకట్టలను
దాటి వచ్చేందుకు..

ఎదకెందుకు
ఇంత యాతన..

మన దూరాన్ని
నువ్వు ఎదురించ లేవంటు
సవాలు విసురుతుంది..

చెల్లాచెదురైన
మనసును ఊరడిస్తున్న
ఇంకా తీరదే...

నాకే తెలియని
నేను వివరించలేని
పదాలకు అందని పేచి పెడుతుంది..

కుశలమే..
నీ తలపులలో
తలో దారైన నా ఆలోచనలలో..

✍️అరుణిమలు

తాను నేను

సరదాగా గడిపి పది నిమిషాలు కాదు
ఏదో ఒక‌ గొడవ మొదలు..

రాక రాక వస్తావు
దాచుకున్న నవ్వులను
కన్నీరు పాలు చేసి పోతావు...

అయినా మళ్ళీ మళ్ళీ
ఎదురు చూస్తుంది
ఇదేం పాడు మనసో..

అర్థం చేసుకుని
మనసు ముందు గొంతు చించుకు అరిచిన మనమేంటో అర్థం కాదు ఎప్పటికి...

నేను మాట్లాడటమే గొప్ప,
నేను దొరకడమే ఎక్కువ అని
నేను నేను అనే వారిలో..

మనల్ని, మనకున్న చోటును
ఎంత వెతికిన శూన్యమే...

నేను కాదురా...
మనం అనుకుని చూడు ఒక్కసారి
నీకై అలమటించే ప్రాణంలో నీ ఆయువే కనిపిస్తుంది..

✍️అరుణిమలు

తాను నేను

మాటలు ఆడుకోని రోజులు
ఎన్నో మన మధ్య..

కానీ ఒకరి గురించి
ఒకరం ఆలోచించని రోజు మాత్రం లేదు..

మన బంధానిది అర్ధాయుష్షే
ఙ్ఞాపకాలు మాత్రం పూర్ణాయుష్షు పోసుకున్నాయి..

ఎక్కడ
నువ్వు ఉన్న..

నీ గురించి
ఆలోచించే ఒక మనిషి ఉందని మరచిపోకు..

నిన్ను తలచే
ఒక మనసు నీ పిలుపు కోసం ఎదురు చూస్తుంది అని..

నిన్ను వలచే
ఒక జీవి నీ పేరుతో ఊపిరి పోసుకుంటుందని..

మరచిపోకే
నవ్వే ఈ పెదవుల మాటున
నలుగుతున్న నీ ఎడబాటు గాయాలను దాస్తున్న అని...

✍️అరుణిమలు

తాను నేను

నిను చేరని నా పలుకులన్ని
పదాలుగా మారుస్తున్న..

నీతో చెబుదామన్న
మాటలన్ని అక్షరాల మాలలు కడుతున్న..

నీతో పంచుకోని
నా ఇష్టాలు, కష్టాలు కవిత్వాలు అవుతున్నాయి..

నువ్వు కదిలించిన
అక్షర రాశిని నేను..

భావాలలో బందీని చేసి
ఏకాంతాన్ని ఇచ్చేసావుగా రాసుకోమంటు..

దేనికోయ్ ఈ అక్షరాలు
ఓదార్చేవే ఇవి కానీ లాలించేవా నీలా..

కదిలిపోతున్న కాలంలో
గడుపుతున్న ఒంటరి ఘడియలను
లిఖిస్తున్న కలంలో సిరా ఈ కన్నీరేగా..

నిన్ను చేరని ఈ లేఖలు
నీ చిరునామా కోసం వెతుకుతున్నాయి..

కనిపించకే వాటికి
నీ ముందు మౌనమై దాగిపోతాయి..

ఇవి అక్షరాల విన్నపాలు
చెరగని నీ ఙ్ఞాపకాలు..

✍️అరుణిమలు

తాను నేను

ప్రేమకు దూరం అన్నావు
అందుకేనా..

ప్రేమించే వారిని
కోరి దూరం పెడతావు..

ఎక్కడ
నీ విలువ తగ్గిపోతుందో
ఇష్టంగా నైనా ఎక్కడ తగ్గాలో అని..

అహం ముందు నీ గెలుపే
నా ఓటమి కూడా..

వలచిన మనసు ముందు
ఓటమి కూడా గెలుపేనోయ్..

తెలుసుకుంటే ఆ తీయదనాన్ని
వద్దన్న వదల్లేవు..

అలవాటు కాలేవు
మరెందుకు నిన్ను అలవాటు చేస్తావోయ్..

నిన్ను నువ్వు
దూరం పెట్టుకుని గర్వపడుతున్నావ
నీకై ఎదురు చూసే వారున్నారంటు..

నిరీక్షణ ఒక పరీక్షరా
సమయం ఇవ్వలేని బంధంతో
సమరమే చేస్తుంది ఈ మనసు....తెలుసా

✍️అరుణిమలు

తాను నేను

నోరార పిలిచి
నెలలు గడిచి పోయాయి...

మనసార తలచి
గడియ కూడా కాలేదింకా..

కంటి నిండా గంగే
కునుకు కు చోటు లేకుండా..

తనివితీరా నవ్వి
ఎన్నో తరాలు అయ్యినట్టే ఉంది..

తనువు ఇక్కడ
మనసెక్కడో దాని జాడేది
అని ఎవరిని అడిగేది..

ఓయ్........
నిన్నే రా

నింగి అంతా నీదే అంటూ
తారలు చుట్టూ తిరిగితే..

కొంగుకు చుట్టుకు పోతా
నిన్ను జాగ్రత్త...

పిలవాలని ఉంది
కలవాలని ఉంది
అలగాలని ఉంది
మనసుకు..

కానీ
మెదడు కసిరి పొమ్మంటుంది
వెనక్కి...

దూరాన ఉన్నావు
అంతే...
దూరం కాలేదు
కాలేవు..

నే పిలిస్తే
నీ తలపకు వచ్చే దూరమే మనది..

నువ్వు తలచితే
తడబడే మనసే నాది..

✍️అరుణిమలు

తాను నేను

ప్రేమకు దూరం అన్నావు
అందుకేనా..

ప్రేమించే వారిని
కోరి దూరం పెడతావు..

ఎక్కడ
నీ విలువ తగ్గిపోతుందో
ఇష్టంగా నైనా ఎక్కడ తగ్గాలో అని..

అహం ముందు నీ గెలుపే
నా ఓటమి కూడా..

వలచిన మనసు ముందు
ఓటమి కూడా గెలుపేనోయ్..

తెలుసుకుంటే ఆ తీయదనాన్ని
వద్దన్న వదల్లేవు..

అలవాటు కాలేవు
మరెందుకు నిన్ను అలవాటు చేస్తావోయ్..

నిన్ను నువ్వు
దూరం పెట్టుకుని గర్వపడుతున్నావ
నీకై ఎదురు చూసే వారున్నారంటు..

నిరీక్షణ ఒక పరీక్షరా
సమయం ఇవ్వలేని బంధంతో
సమరమే చేస్తుంది ఈ మనసు....తెలుసా

✍️అరుణిమలు

తాను నేను

నీ ఇష్టాలు గుర్తు ఉన్నాయి...
నీ అలవాట్లను మరచిపోలేదు...

నీ ఆలోచనలను గమనించగలను...
నీ వెంటే నా ఆలోచనలు నడిచాయి ఎప్పుడు...

నీ సుఖంలో భాగం
కోరుకోలేదు ఏనాడు..

నీతో నువ్వు గడిపే
ఏకాంత క్షణాల్లో నేనో భాగం కావాలి...

భారమైన నీ మనసును
నేనున్న నీ వెంట అంటూ హత్తుకోవాలి...

నేనో లాలన మాత్రమే
కావాలి అనుకున్న....

కానీ ఏనాడు నాకు మిగిలింది
నిరీక్షణ, నిరుత్సాహమే...

ఐనా నీకు దగ్గరై పెనవేసుకుంటున్న
మనసును చూసి భయం వేసింది...

రేపటి రోజున నువ్వనే అలవాటు
నన్ను ఎక్కడ, ఎలా నిలబడుతుందో అని..

నీ మీద కోపంతో
నీకు దూరంగా జరగలేదు..

ఇష్టం ఎక్కువై
అదెక్కడ రేపు నిన్ను కష్టపెడుతుందో
అని దూరం జరిగా..

నేను పడుతున్నది చాలు
నువ్వు కూడా దేనికని..

✍️అరుణిమలు

తాను నేను

అలవాట్లకి బానిసైన మనిషి
మారగలడేమో కానీ...

ఇంకొక మనసుకు బానిసైన మనిషి
తననే కోల్పోతారు చివరకు...

నువ్వు అలవాటువు కాదోయ్
మరచిపోవడానికి..

నా వ్యసనానివి
నిన్ను మరచిపోయే కన్నా
నన్ను నేను మరచిపోవడం సులువుగా ఉంది...

కలలా వచ్చావు
కథలా మిగిలిపోయావు..

✍️అరుణిమలు

తాను నేను

మన్నించడం మనసుకు అలవాటు
మెదడుకు కాదే...

కష్టంగా ఉందోయ్
గడుస్తున్న ప్రతీ ఘడియ...

నీ ఙ్ఞాపకాలకు, ఆలోచనలకు
మధ్య మనసు నలుగుతుంటే
కళ్ళు తడుస్తున్నాయి...

కానీ వెనక్కి రావాలని లేదు
మళ్ళీ మళ్ళీ ఏకాంతాలతో సహవాసం చేస్తూ..

నేనా
మనమా అనే సందిగ్ధంలో
ఎన్నాళ్ళిలా..

నన్ను నేను మోసం చేసుకోవడం కన్నా
వాస్తవంలో జీవించాలి..

నువ్వు మాత్రమే లేవేమో
అలల్లా నీ తలపులు పలకరించి పోతున్నాయి..

నీ పేరే పలుకుతుంటే
పెదవికెందుకో ఈ తీయదనం..

నీతో గడిపిన క్షణాలను
తలచే కొద్ది ఇప్పుడే మొదలైందా మన కథ
అని కొత్తగా ఉంది...

దారులన్ని మూసేసా
కానీ...మనసు ద్వారం నీకై తెరిచే ఉంది ఇంకా..

నా ప్రేమవే నీవు
కానీ నా ఆశలన్ని
ఇసుక మీద రాసిన
అక్షరాలలా చెరిగిపోతుంటే ఆపలేక పోతున్న..

నా ఇష్టానివే
కానీ బెంగగా ఎప్పుడు మారావో
తెలుసుకోలేక పోయా..

బెంగ తీరేది
ఎలా........

తీరే దారి లేదని
తీరానికి ఇవతల ఆగిపోయా
నీ జ్ఞాపకాల తోడుగా..

✍️అరుణిమలు

తాను నేను

నీ పలకరింపు
సొమ్మ సిల్లిన మనసు మీద
ఆశల నీరు జల్లినట్టు ఉంటుంది..

నువ్వు వద్దంటు
ఒక అడుగు వెనక్కి వేసినా
మనసు పది అడుగుల ముందే ఉంటుంది
నీకు దగ్గరగా..

అయినా
నువ్వు వద్దు..

పదే పదే
మనసు చచ్చి బతికే కన్నా
ఒకసారే పూర్తిగా చంపేయాలని ఉంది..

నిన్ను వెతకడం
నీకోసం ఆలోచించడం
నా అలవాటు..

ఎలా వదిలేది
ఏమని ఎద గొంతు మూసేది..

నేను వెతికిన
కనపడని దూరానికి నువ్వే పోరాదు..

నా పిలుపుకు అందని దూరంలో
నువ్వు ఉండిపో...

వెతికి వెతికి
అలసిపోవాలి ఈ కళ్ళు..

పిలిచి పిలిచి
ఈ గొంతు మూగబోవాలి..

తలచి తలచి
ఈ మనసు నీరసించి పోవాలి..

నాతో నేను
మాత్రమే మిగలాలి
నీ ఙ్ఞాపకాలతో..

వరమే అనుకో
శాపమే అవ్వని..

ఏదవ్వని.... కలవని ఈ దూరాల
నడుమ ఉన్న ఈ బంధాన్ని తెంచేయవోయ్

చాలు...
నువ్వనే అలవాటు
నుండి నన్ను వెలివేసేయ్ ఇక..

✍️అరుణిమలు

తాను నేను

నువ్వు వదిలేసిన ఏకాంతంలో
నిన్నే వెతుకుతుంది ఇంకా ఈ పిచ్చి మనసు...

ఓదార్చే వారు లేరు
ఓర్చుకోమని నా చేయి నన్ను తడుతుంది..

మాట్లాడాలి అంటే భయం
ఏ గొడవ వస్తుందో అని...

మాట్లాడకూడదు అనుకున్న
నీ పిలుపు విన్న మనసు ఆగదే
బదులు ఇవ్వకుండా..

దూరంగా ఉందామంటే
ఎదలో ఏదో తుఫాను రేగుతుంది..

ఒంటరి క్షణంలో
నన్ను వేదించే నీ ఆలోచనలు ఎన్నో..

ఎలా చెప్పను...
దూరంగా ఉండలేని
దగ్గర కాలేని
నిన్ను మరచిపోలేని నా స్థితిని..

నా కళ్ళతో చూడగలవా
నా స్థానంలో ఉంటే కానీ తెలియదు
విప్పి చెప్పలేని ఈ మనసు గతి..

✍️అరుణిమలు

తాను నేను

విరిగిన మనసు
చెదిరిన‌ ఆలోచనలు

కరిగిన కలలు
కదలని కాలం

పోగేసిన ఙ్ఞాపకాలు
పొందిక లేని ఊహలు

పడమటింట నువ్వు వీడ్కోలు చెబితే
తూర్పు దిక్కున నే కాచుకుని ఉన్న

మళ్ళీ సరికొత్తగా నాకోసం ఉదయిస్తావని
మరో ప్రపంచాన్ని నాకు పరిచయం చేస్తావని

✍️అరుణిమలు

తాను నేను

అనగనగా ఒక రోజు అంటు
మొదలయ్యిందో కథ...

నాలా ఉండే
ఓ మనసు నన్ను వెతుక్కుంటూ వచ్చింది..

నా కోసమే
నువ్వున్నావని పలకరించింది పొగరుగా..

నేను ఎవరినో
చెప్పుకో అంటూ ఎదకో సవాలు విసిరావు..

అడుగడుగులో
నీ పదం కలిపి నన్ను తప్పించుకోలేవన్నావు..

కోపంలో
కసిరి..
అలిగితే
అక్కున చేర్చుకుని
భరించేవాడిని నేనే అన్నావు..

మాటిస్తున్న అన్నావు
మరో ప్రపంచానికి పయనమయ్యే వరకు ఈ చేయి వదలనని..

కాలం ఏ కథని
సుఖాంతం కానివ్వదేమో..

సెలవని నీతో పలికించింది
ఈ మనసుకు శిలువ వేసింది..

తడికన్నులలో
నీ రూపు చెదరకుండా ఉండాలనే
రాలిన ప్రతీ చినుకును దొసిలి పడుతున్న..

తాత్కాలికమేనా నీ రాక అని మనసు శంకించింది....కాదు క్షణికమే అంది నీ వీడ్కోలు..

నిన్నలో నువ్వు ఉన్నావు
రేపు ఉంటావు
ఙ్ఞాపకాలేగా
వాటిలో నువ్వు ఎప్పుడు సజీవమే..

✍️అరుణిమలు

తాను నేను

నీ మీద ఉన్న ప్రేమ
ఇంత బరువుగా ఎప్పుడు మారిందో...

మరుపుకు రానంటుంది
భారం మోయలేనంటుంది

దూరాన్ని హత్తుకోమంది
వెనుతిరిగి చూడకంటుంది

మనసు గొంతు నొక్కేసి
మౌనమై మిగిలిపో అంది

కన్నీరు కూడా చప్పుడు చేయడం లేదు
నీకై చూసి చూసి అలసిన కనులకు ఊరటగా మారినందుకు ఏమో..

మరో లోకం నాకు తెలియదు
నేను ఉన్న ప్రపంచం అంతా నువ్వే అని
ఈ ఎదకే తెలుసు..

నీ ముందు నా మనసు ఓడిపోలేదు
నా నిరీక్షణ ఓడిపోదు

కానీ....నువ్వే గెలిచావు
నన్ను పోగొట్టుకుని
నీకు కావలసిన ఏకాంతాన్ని గెలిచావు

✍️అరుణిమలు

తాను నేను

వద్దనుకున్నది నిన్నే
నీ ఙ్ఞాపకాలను కాదు..

అవే లేకపోతే
నాతో నేను మిగిలేది ఎలా..

నా వెంట వచ్చేవి
నన్ను నడిపించేవి అవేగా..

ఎక్కడో నువ్వు
ఇక్కడ నేను
మధ్య వారధిలా గడచిన కాలం..

కొన్ని చేజారక ముందే
అందంగా వదిలి పక్కకు జరిగి పోవడం మంచిది..

మనసు ముక్కలు అవ్వక మునుపే
మరో దారి దూరమే అని తప్పుకోవడం ఉత్తమం..

ఓయ్......ఈ పిలుపు నీకే సొంతం
నీ చోటు ఎప్పుడు పదిలమే ఇక్కడ..

✍️అరుణిమలు

తాను నేను

మనసు అలసిన, శరీరం అలసిన ప్రతీసారీ
నీ ఒడి కోసం వెతుకుతా....

ఎప్పుడు నిరాశే మిగులుతుంది
ఆశలను తుంచేసి...

కాసింత పలకరింత, కూసింత చేయూత
కూడా ఎండమావేనా...

ఎవరి పలకరింపుకు
ఈ మనసు పులకరించదు ఎందుకో...

ఎందుకో నీ పిలుపు కోసం
తనువెల్లా కనులై ఎదురు చూస్తుంది...

కాలక్షేపం కోరిక కాదు నాది...జీవితాంతం మోయమనే భారాన్ని కాను...
మరి ఎవరు నువ్వు అంటే మన మనసులకే తెలుసు....

ఓయ్... అని నువ్వు అంటే.....
ఏ లోకాన ఉన్న
ఏ చింతలో ఉన్న
నీ ముందు వాలిపోవడమే తెలుసు ఈ మనసుకు

ఏయ్... అని కసిరిన, నన్నేగా అని
నన్ను నేను సర్దుకుని, నచ్చచెప్పుకోవడమే నేర్చుకున్న..

ఎందుకో తెలియదు
అదేం విచిత్రమో మరి

నువ్వే మాయవో
నేనేం వింతనో మరి

నీ నుండి కొంచెం ఆశించి, ఎక్కువ నిరాసపడిన...
నిన్ను మాత్రం నా వలన నిరాశపరచలేని
ఈ లక్షణానికి....... ఏమివ్వను ఋణం తీర్చుకోవడానికి..

✍️అరుణిమలు

తాను నేను

దాచడానికి ఏముంది నా దగ్గర
సమస్తం నువ్వు దోచేసాక..

వద్దన్న మనసుని
వశం చేసుకుని..

కాదన్న కాలాన్ని
మళ్ళీ వెనక్కి మళ్ళించావు..

కోరింది కాదంటావు
అడిగింది లేదంటావు
ఏముంది అంటే నేనున్న చాలనా అంటావు..

రేపటికి పయనం ఎటో
తెలియదు..

కానీ....
నువ్వు నడిచే దారేదైన
నీ తోడుగా నే సాగలనే కోరికుంది..

కరిగి పోతున్న
కాలాన్ని వెనక్కి తిరిగి చూస్తున్న
నువ్వు, నేను గడిపిన క్షణాలను ఙ్ఞాపకాలుగా..

ఒంటరి ఆలోచనలలో
జంటగా నీతో సాగుతున్న పయనమే నాది..

అంతే...
మధురమైన ఘడియలన్ని
మత్తులో వదిలి కలగా మిగిలిపోతాయి..

మళ్ళీ మళ్ళీ దొరకడానికి
మరో తపస్సు చేయమనే ఆ సమయం కోసం
మరుజన్మ వరకు ఉండిపోగలను ఇలా..

మరి..
నువ్వు రాగలవా
ఈ జన్మ కైనా
అని మనసు అడుగుతుంది
మౌనంగా..

✍️అరుణిమలు

Saturday, 9 November 2019

తాను నేను

నీ ఊహాలలో కాలక్షేపం
నీ ఙ్ఞాపకాలతో జీవితం
అలవాటు అయ్యాక..

నువ్వు సమయం ఉంది
కలిసి గడుపుదామన్న
నాలో ఏ భావం కలగదేమో..

నీకు తీరిక అయ్యాక
నాకు నీకై ఆశలే
మిగలవేమో..

సమయమా తొందరపడి పోకే
అని వేడుకుంటున్న
నాలో మార్పులు కలిగే
ఆ క్షణాలకు..

వేచి వేచి
మనసు మరో మజిలీ
ఎందుకులే అని నిట్టూరుస్తుంది..

కాలం అంచున
కాచుకుని ఉన్నా

నిన్నే చూస్తున్న
నీలో నువ్వు మునిగి ఉన్నావుగా
నన్ను గమనించలేనంతగా..

ఎదలో ఏదో గుబులౌతుంటే
ఒక నవ్వు పలకరించింది
నీకు నువ్వు ఉన్నావని మరవకంటూ..

నిన్ను మరువలేను
నన్ను ప్రశ్నగా మిగిల్చుకోలేను..

✍️అరుణిమలు

తాను నేను

ఉండిపోవా......
అని అడగాలనిపిస్తుంది
నువ్వు వచ్చిన ప్రతీసారీ..

నీ తలపులతో
నే సాగిస్తున్న ప్రయాణం
నీకు చూపించాలని..

నీకై నేను
ఎదురు చూసే కాలాన్ని
కాగితంగా మలచి నే రచిస్తున్న ఎన్నో..

అవన్నీ
నీ ముందు చదవాలని
నువ్వు ఏమంటావో అని చూడాలని కోరిక..

నీ ముందు
పెదవి తెరవని భావాలని
కళ్ళల్లో దాచేసానని నీకు చూపులతో
చేరవేయాలని కోరిక..

నువ్వు లేని
ఒక్కో గడియని ఎదెంత
భారంగా మోస్తుందో
నీ గుండెలపై వాలి చెప్పాలని ఉంది..

కనులు తెరవని స్వప్నాలలో
నువ్వు నాతో ఉంటే
ఈ లోకాన్నే మరచిపోతున్న..

ఎక్కడ కనులు తెరిస్తే
కనుమరగు అవుతావో అని
కంటి గడపకు కాటుకను కావలి పెట్టా..

ఏ చుప్పనాతి
చూపులు నిను తాకరాదనే
చిలిపి చేతల చుక్కనై నీ చుట్టూ అల్లుకుపోతున్న..

కలలకు ఆవల గడిపిన
కాలాన్ని లెక్క కట్టి ఇచ్చేయ్ ఇక
నువ్వు వచ్చి...

చాలిక...
చాలించిక
చెలగాట మాడకు మనసుతో..

నువ్వు వచ్చే దారి
వేపు నేనో వేగుచుక్కనై ఉన్న..
మరువకు..

✍️అరుణిమలు

తాను నేను

ఏదో తెలియని
ఎద యాతనను ఏమని చెప్పేది..

ఆ భావానికి భాష లేదా
అన్నట్టు ఉంది..

కానీ, కదిలిస్తునే ఉంది
కన్నీటి కొలనను..

మనసు విప్పి చూస్తే
మౌనం దాగుంది..

పెదవి తెరవమంటే
తడబడుతుంది నీ ముందు..

ఏకాంతంలో కూడా బయట పడని
ఈ కాంత మనసులో
ఏ కాస్తంత చోటు ఉంది అంటే
అది ఈ అక్షరాలకే కదా..

అల్లంత దూరాన ఉన్న నువ్వు
కనులలో బందీగా మారావు కానీ
బాహువులలో కాదుగా..

బంధం బలమైనదే
కానీ సమయమే లేదు దానికంటు..

ఇష్టాలు, కష్టాలు, కోపాలు
అన్ని నిరీక్షణలో నిర్వీర్యం అవుతున్నాయి
నిను చేరకుండా
నీతో పంచుకో కుండానే..

రాలిన చుక్కలలో రాతలు
ఆరిపోతుంటే..
నన్ను పలకరిస్తుంది
ఓ అరనవ్వు..

ఆశలే ఉన్నాయో
ఆవేదనే ఉందో
అందులో..

అభిమానం అడుగు ముందుకు వేయనివ్వదు
మనసు దూరాన్ని చూపించి నుసి చేయడం మానదు..

ఎలా మొదలైందో తెలియని ఈ గాధ
ఎటు వైపు పోతుందో చూస్తూ ఉన్న ఇలా..

ఙ్ఞాపకాలే మిగులుతాయో
నిర్వేదమే మిగులుతుందో చివరకు..

✍️అరుణిమలు

తాను నేను

ఎన్నాళ్ళో అయ్యింది మాట్లాడి అంటావు
నిజమే........

చెప్పమంటే...
ఏముంది అంతా ఓకే
అంటావు...

ఇంకేంటి
అనే కంచె ఒకటి మధ్యలో...

కలుసుకోలేం...
కనీసం మాటకు కూడా కాలమే
లేనిచోట చెరో వేపు ఉన్నాం...

నువ్వు లేని
సమయంలో‌ పోగేసిన ఊసులు ఎన్నో
నేను ముందు అంటే నేను ముందు అంటుంటే..

గడియారం చప్పుడుతో పాటు
పరిగెత్తడం నచ్చక నీరసించి పోతుంటాయి
నా మాటలు, నా రాతలు..

నా చూపులు నిను
వెతికినంత సమయం‌ కూడా
నువ్వు నా ముందు నిలవవు...

గాలిలా వచ్చి
మెరుపులా మాయం అవ్వడం
నీ గొప్పతనం ఏమో...

నీతో కన్నా
నీ ఙ్ఞాపకాల‌‌ సహవాసం అలవాటుగా మారితే
రేపు నువ్వు ఎదురుగా ఉన్న
ఏ చోటనున్న ఒకటే ఏమో నాకు...

కావాలని ఎదురుచూసే వారు
ఎప్పుడు ఉంటారు
కాకపోతే ఎదురుచూపులే ఉండవు తర్వాత...

నీ లోకం వేరైనప్పుడు
నీ దారి నా వేపు కానప్పుడు
నా పరిధిలోకి ఎందుకు వచ్చావోయ్..

✍️అరుణిమలు

తాను నేను

ఈ దూరాలను
ఏ తీరాలకో విసిరేయాలని ఉంది..

నీ తలపో
పరీక్షగా మారి ప్రశ్నలను సంధిస్తుంది..

ఇద్దరు కలిసి
గడిపిన కాలం గుప్పెడంత..

కానీ.......
ఈ గుండెలో నీ ఙ్ఞాపకాలు
ఉప్పెనలా ఎగసి పడుతుంది...

క్షణమైన విడవలేనంత
నా ఆశ కాస్త..

నీ ఆలోచనల హారతిలో
కర్పూరమై కరిగిపోతుంది..

కాలమంత ఎదురు చూపుల
నావలో సాగిపోతుంది..

నా ఒంటరి ఊహల్లో
జంటగా మాత్రం సాగేది నువ్వే కదూ..

హ్మ్......
జగమంతా కుటుంబమే
నీ జతే లేని ఈ లోకంలో

కాసిన్ని కలలు
కొన్ని ఊహలు
మరికొన్ని నిరాశలతో..

కాలం గడిచిపోతుంది
నిర్లిప్తంగా, నిశ్శబ్దంగా
మనసు నిండా తుఫానుల తాకిడితో..

✍️అరుణిమలు

తాను నేను

ప్రతీ చీకటికి ఓ వెలుగు అవసరం
ప్రతీ ఒంటరి మనసుకు ఒక‌ తోడు అవసరం..

ఏకాంతాన్ని చీల్చే
నీ ఙ్ఞాపకాలలో నన్ను వెతుకుతూ
ముందుకు కదిలా..

ప్రతీ మలుపులో
నీ తలపులు నన్ను
తరుముతూ ఉన్నాయి..

ప్రతీ అడుగులో
నీ జాడలను వెతుకుతున్న
ఆ వెన్నెల సాక్షిగా...

ఎటు నుంచో
వినిపించిన నీ పిలుపు
నన్ను శాసిస్తుంది..

అటు కాదంటు
ఇటు రమ్మంటూ
ఎటు వద్దంటూ..

నీ శ్వాస నన్ను తాకుతుంది
ఓ చిరుగాలిగా వచ్చి..

నీ ఊహా
నన్ను అల్లేసుకుంటుంది
రెప్పలు దుప్పటి కప్పుకుని..

నీ గుండె లపై
తాలవాల్చానేమో
నీ ఎద చప్పుడు తట్డిలేపింది..

చుట్టూ చీకటి
పైన చుక్కల్లో చంద్రుడు
ఒంటరిగా నేను..

హా.........
తలచిన ప్రతీసారీ పలక లేవు
పిలిచిన ప్రతీసారీ వెనక్కి రాలేవు..

నువ్వు ఉన్నది
నా మనసులో..
నేను ఉన్నది
నీ ధ్యాసలో..

ఒకరినొకరు
అలంకరించిన తారలమే
పగలు, రాత్రిలా..

కలిసి ఉండలేం
కలిసే ప్రయత్నాలు మానం..

మనమింతే..
మన కథ ఇంతే..

✍️అరుణిమలు

తాను నేను

ఎన్నో ఎన్నో రాయాలని ఉంటుంది
ఎంత రాసిన తరగనంటుంది..

ఎన్నో ఎన్నో చెప్పాలని ఉంటుంది
నీ ముందు పెదవి పలికేందుకు బెదురుతుంది..

ఎలా వచ్చావని అడగను
అవకాశం నేనే ఇచ్చాను కనుక..

ఎలా వదిలి పోయావని
నీ గుండెలపై చేయి పెట్టి చెప్పమని అడగాలని ఉంది
కానీ జవాబు వినాలని లేదు..

నువ్వు ఇచ్చిన ఏకాంతంలో
నన్ను చుట్టేసిన ప్రశ్నలను నీ ముందు ఉంచాలని ఉంది...
జవాబు కోసం కాదు...
కొన్ని చర్యలకు ఫలితం ఇదని చూపిద్దామని...

నువ్వు ఇచ్చిన బహుమతి "నిర్లక్ష్యం"
అది వేసిన శిక్ష ఎన్ని లక్షల చుక్కలో ఈ కళ్ళను అడగవా అని అనాలని ఉంది..
ఆ గంగలో నా మనసు స్నానాలే చేసిందని చూపిస్తుంది..

నువ్వు మిగిల్చిన చీకటి రాత్రులలో
నన్ను నేను కూడా వెతుక్కోలేని ఒంటరినై పోయా
వెతికి తెస్తావా నన్ను అని అడగాలని ఉంది..

నువ్వు ఆడి పారేసిన బొమ్మను నేను..
నేను పోగొట్టుకున్న అనేక క్షణాలను మళ్ళీ నాకు తెచ్చి ఇవ్వగలవా అని అడగమంటుంది మనసు..

అప్పుడు వెనక్కి చూస్తే శిధిలమైన మనసే కనిపించేది..
ఇప్పుడు వెనక్కి చూస్తే నా పొరపాట్లు కనిపిస్తున్నాయి..

మళ్ళీ చేయనా పొరపాటు
నిన్ను వెతుకుతూ వచ్చి..

మళ్ళీ నన్ను నేను నడిపించుకోన
వెనక్కి రాలేని అగాథాల త్రోవ లోకి..

ఇప్పుడు కోపం లేదు
ఇష్టం లేదు
ఙ్ఞాపకాలు మాత్రం మిగిలే ఉన్నాయి..

నన్ను నేను పొందేందుకు చేసిన ప్రయాణంలో
ఎన్నో అనుభవాలు మిగిలాయి..

నువ్వో భావంగా
నన్ను కదిలించే అక్షరానిగా నాతో మిగిలావు..

చాలోయ్ ఇది
ఇలా అక్షరాలలో ఒదిగిపో..

✍️అరుణిమలు

తాను నేను

మనసు నిశ్శబ్దంగా మారిపోయింది
గడియ పాటు...
మౌనంలో చిక్కుకున్న ఆలోచనలలో
ఎన్నో ప్రశ్నలు..

అలిగి దూరం జరిగిన
ఆ గడియలే బాగుండేవి...

కోరి చేయకపోయినా
నీ ముందు మాట మూగ పోయింది..

పెదవి తెరిచి సంజాయిషీలు ఇవ్వడానికి
అభిమానం అడ్డు పడింది..

చేతిలో లేని రాతలేమో
చేజేతులా జారిపోయాయి..

గాయపడిన ఎదకు
ఓదార్పుకు బదులు శిక్ష పడితే ఎలా ఉంటుంది
అలాగే ఉంది ఇప్పుడు..

మాటలతో తూట్లు పొడిచే
అవకాశ వాదులు ఒకపక్క..

మర్మం ఎరగని
మూర్ఖుల గేలి ఒకపక్క..

నీ మాటలలో సేద తీరాలని ఉన్న
నీ సుతిమెత్తని ప్రశ్నలు తల ఎత్తనివ్వలేదింకా..

భారంగా రాలే ప్రతి కన్నీటి చినుకులో
ఎన్నో చిక్కు విడని
ముడులు ఉంటాయి....

ఏ చినుకు ఏ‌ మనసుకు ఏ కథను చెబుతుందో వినగలిగే శక్తి ఉంటే వినిపించే తీరుతుంది..

నన్ను నేను కూడగట్టుకోవడానికి
కాసిన్ని నవ్వులను పులుముకున్నాను ఇప్పటికి..

గాయం చేసిన నాలుక క్షేమంగా ఉంది
గాయానికే గాయం అయ్యి బాధ మిగిలింది..

✍️అరుణిమలు

తాను నేను

నువ్వో ఉద్వేగానివి నాలో
నన్ను నేను స్థిమిత పరచలేని భావోద్వేగానివి..

నన్ను వసం చేసుకున్న
మాయగాడివి ఏమో..

నీ వేపుకు పడిన
నా అడుగుల జాడలు గుర్తు లేదు కానీ..

నీ వెంట నేను వేసిన
ఆశల అడుగులు ఇప్పటికీ ఙ్ఞాపకమే..

ఏం కొత్తగా రుచి చూపించావో తెలియదు
కానీ.....నీ తోడులో ఏదో బలం అనిపించేది..

మాటల మాంత్రికుడివే
ఆ మాయాజాలం నుండి నువ్వు తట్టి లేపే వరకు తెలియ లేదు
నేను ఎంత దూరం నీతో వచ్చేసానో..

నీ దూరం ఏదో దిగులును మిగిల్చింది
కాలం ఆగినట్టే ఉంది, కలం మాత్రం ఆగనంది
నువ్వు మిగిల్చిన భావాలను ఒంపేయమని..

నీతో మాట్లాడాలి అనుకున్న ఎన్నో రోజులను
మౌనంగా గడిపేసానేమో..
ఇప్పుడు నాతో నేను మాట్లాడుకోవడమే మరచిపోయా..

అక్షరాలు నన్ను పలకరిస్తున్నాయి
వాటి లక్షణాలలో ఉన్నది నువ్వే కనుక..

సంవత్సరాలు మారిన ఈ పిచ్చి మనసు మారలేదు...
మారిందల్లా ఒకటే....నిన్ను చూస్తూ కూడా నువ్వు నాకేం కావంటు బతికేయడం..

నమ్మలేని నిజాలను నమ్మించి నువ్వు గెలిచావు
నమ్మకూడని నిన్ను నమ్మి నేను ఓడిపోయా..

✍🏻అరుణిమలు

తాను నేను

కలిసి రాని కాలంలో
కొన్ని ప్రయాణాలు ఏ తీరానికి చేర్చవు..

అనుభవాల సుడిగుండంలో
అర్ధాంతరంగా వదిలి పోతాయి..

మనల్ని మనం పోగొట్టుకుని
మనసు తపిస్తుంటే..

ఙ్ఞాపకాల తుఫానులు
వెంబడిస్తూ వేదిస్తునే ఉంటాయి..

భవిష్యత్తు ఆశలను వదిలేసి
ఈ క్షణాన్ని జీవించడానికి పోరాటం..

నిదుర చెదిరిన రాత్రులలో
ఎన్నెన్ని కన్నీటి రాతలో..

ఏకాంతాన్ని వదిలి
పోవాలని చీకటి చాటున గడిపిన రోజులు..

నువ్విచ్చిన అనుభవాల సాక్షిగా
నాకు నేను విదించుకున్న అగ్ని పరీక్షలు ఎన్నో..

చితివై నువ్వు చెంతకు వచ్చావు
మనసును చిదిమేసి దహించి పోయావు..

కాలమే ఋజువు
నన్ను నేను నీ నుండి దూరం చేసుకుని
నాకు నేనుగా ఎలా మిగిలానో ఈ నాటికి అని..

✍️అరుణిమలు

తాను నేను

ఇష్టం బరువు ఎంతంటే
నీ అంతేగా అనే నీ ఒడుపు మాటలు..

పొదుపే లేని నీ ప్రణయంలో
పొదివి పట్టుకునే నీ చేతులలో బంధీనయ్యా..

పాలించే ఎదలో గుబులు రేపి
పరువాల వేటలో విజేతవై నిలిచావుగా..

సాగర తీరంలో మరో సంద్రమై
నువ్వు కల్లోలానికి సిధ్దమంటే అలలే ఉలిక్కి పడ్డాయి..

గొడుగై నిలిచిన ఆకాశానికి
ఉలుకొచ్చిందా
మనల్ని తడిపేద్దామని త్వరపడుతుంది..

ఇసుకు రేణువుల పానుపులో
మరో ఙ్ఞాపకాల గూడు కట్టేసుకుందాం..

కోరికల తీరానికి ఎన్ని ఒంపులో
కోతలు పాలవతున్న దేహంలో అన్ని వింతలు..

కలిసిపో ఈ మనసులో
కరిగిపోతా నీ కౌగిలి నీడలో..

✍️అరుణిమలు

తాను నేను

విశ్రాంతి లేని మనసు
అటు, ఇటు, ఎటో తిరుగుతుంది...

దేహానికి అలుపుంది
ఆలోచనలకు తప్ప...

నా ఆలోచనలను ఆక్రమించేసి
నాతో నేను చేయని, చూడని ప్రయాణాలు చేయిస్తున్నావు..

ఈ ఎద కష్టం నీ ఇష్టం ముందు
ఎంత అంటే..

నువ్వు నా కళ్ళల్లో
కళ్ళు పెట్టి నన్ను చదివేంత...

నన్ను నేను నీ ముందు దాచలేక
నువ్వు దోచేసిన మది ముచ్చట్లు చెప్పలేక..

కనికరం లేని నీ చిరునవ్వుల కోతలో
నేనో తీయని గాయాల పాలవుతున్న...

ఈ దేహంలో నువ్వు చేరని చోటేది
నీకు తెలియని దారేది నన్ను శోధించేందుకు..

గిచ్చి గిచ్చి ఆట పట్టించే నీ మాటలలో
నేనో అల్లరినై నిన్ను అల్లేసుకుంటున్న..

ఓయ్......నడిరాత్రిలో
మరో మేలుకొలుపు పాడుకుందామా..
మరో సంగ్రామానికి నాంది పలుకుదామా..

కలిపేసుకోవోయ్
మరో జన్మకు కూడా దూరం రానంత దగ్గరకు..
మరో ఇష్టానికి అంటు చోటేదని అడిగేంతలా..

✍️అరుణిమలు

తాను నేను

దేహానికి దాహంగా ఉంది
మనసేమో ఎండమావిలా మారింది..

ఉరుములు లేని
మెరుపులే నీ కలలు..

నీ ఊహల‌ జడివానలో నడుస్తూ
ఏకాంతాల కోనలో..

చైత్రాన్ని మరిచిన ఒక కోయిల గీతం
ఏ కాన లోనో రానున్న నీకై..

నలుదిశలా
నన్ను ధరణినై పరుచుకున్న నీకై..

మానసాన మండు వేసవిలా
మంట పెడుతుంది..

నిశి రాత్రిలో ఏ తారవై
తొంగి చూస్తున్నావో నిదుర మాని..

వేకువలో ఓ చినుకై
ఆ నింగి నుండి జారిపోవోయ్ నాపై..

అప్పటి వరకు ఆగదుగా ఈ అక్షరాల ప్రవాహం..!!

✍️అరుణిమలు

తాను నేను

అలిగిన కలల్లో
నీ అలికిడి ఏది..

మనసు ఒళ్ళంతా
కళ్ళు చేసి ఎదురు చూస్తుంది..

నింగిలో చుక్కలన్ని
నువ్వు ఉండే చోటిదని
దారి చూపిస్తుంటే...

కలత నిద్రలో
నీకై నా కలలు వెతకని చోటేది..

తలగడ దీవిలో
నా తలపుల కథలు ఎన్నో
నిశ్శబ్దంగా పయనిస్తున్నాయి..

చిరుగాలి విసుర్లన్ని
నీ రుసరుస లను గుర్తు చేస్తుంది..

నా కనుల
నవ్వులలో నువ్వు కనిపిస్తూ..

నా పెదవి పలుకులలో
పూతరేకువై తీయంగా చేరావు..

విశ్వంలో ఓ తారనే
శూన్యమైన నీలో నా రంగుల ఆశలను వెతుకుతూ..

అనంతమైన
నీలో నా చోటును శోధిస్తున్న..

✍️అరుణిమలు

తాను నేను

నువ్వే నా అలంకారానివి
ఇక అలంకరణ దేనికోయ్..

నీ చేతులు చెక్కిన
శిల్పాన్ని..

నువ్వు ఇష్డంగా
మలిచిన రూపాన్ని..

నీ మనసులో
కొలువైన మురిపాన్ని..

నాకై ఎదురైన
నా కలల సౌధానివి నువ్వు..

నా కాటుక రేఖల నడుమ
నే దాచుకున్న నా మరో రూపానివి..

మనమైన
ఇరు దేహాలం..

నువ్వనే ఆశను
తిలకంగా దిద్ది..

నీ ముద్దులన్ని
ముక్కేరని చేసి ..

దేహామే నాదై
శ్వాస వై నువ్వు
అలంకారమై పోయావోయ్ ఏనాడో..

తనువులు మధ్య చనువు ఎంతో
మనసుల మధ్య దూరం రానంత దగ్గర ఉంది..

✍️అరుణిమలు

తాను నేను

ఎదురు చూపుల దారులలో
ఈ ఆలోచనలు చేసే ప్రయాణాలు ఎన్నో...

అలసి పోని కన్నులకు
నీ రూపమే ఆయువు పోస్తుంది..

రెప్ప వేయనివ్వని ఆరాటం
నీ రాకను తనివి తీరా చూడాలని..

ఎంతెంత దూరమో
నువ్వు చెంత లేని ఘడియలు..

వేచి వేచి ఉన్న ఎద
నీ ఎద పై సోలిపోయే నిముషాలు..

నిన్ను హత్తుకుని
క్షణ కాలం ఆగిపోయే నా ఊపిరి..

ఏకాంతాల కాలాన్ని
వడ్డీతో సహా నీ నుండి తిరిగి తీసుకునే క్షణాలు..

అన్నిటిని అనుభవించేయని ఇలా
గంధపు చెక్కలా నీలో కరిగిపోతూ..

నిన్ను విడువని కౌగిలి నడుమ
గాలిని కూడా చొరబడనివ్వకు..

ఒంటరి దేహానికి
జంటగా మారి శిక్షను అనుభవించేయ్..

✍️అరుణిమలు

తాను నేను

ఏదో అడగాలని ఉంటుంది...
అదేంటో తెలియదు..
ఎలా మొదలు పెట్టాలో తెలియదు...

మనసు తొందర పెడుతుంది
పెదవి జంకుతుంది..
కళ్ళల్లో కలవరం
ఎద శరవేగంతో పరుగులు పెడుతుంది..

చుట్టూ వేడేక్కుతున్న వాతావరణాన్ని
నిట్టూర్పులతో ఆర్పుతూ..

నేనే అడగాలా
నువ్వే ఏదైనా అడగొచ్చు కదా..

ఏదోకటి..
నువ్వే ముందుకు అడుగేసి
ఈ గుండె వేగాన్ని అదుపు చేయొచ్చు కదా..

ఇలా...
నీకోసం ఎన్ని ఆలోచనలో
ఎన్ని తలపులో
చెప్పాలని ఉన్న చెప్పుకోలేక పోయిన మాటలు ఎన్నో..

ఈ మనసు పుస్తకంలో
లిఖిస్తునే ఉన్న...

నీ చేతులతో ఎప్పుడు సంతకం చేసావో
ఈ ఎదపై...
ఆనాటి నుండి నువ్వనే భావాల అక్షరాలలో తప్పిపోయా...

ముగింపు ఎరుగని పదాలివి
మరో ప్రారంభానికి త్వర పడుతూ
నువ్వనే గమ్యాన్ని వెతుకుతూ సాగుతున్నాయి..

✍️అరుణిమలు

తాను నేను

కొన్ని అనుభవాలు
నీటి తరంగాలు లాంటివి..

కదులుతూ ఉంటాయి
కదిలిస్తుంటాయి..

కంటిలో వాన చినుకులా
మదిలో ఆశ తునకలా..

ఏ పరిచయం ఏ జన్మ వరమో
గుండెలకు హత్తుకున్న అనుభూతులు..

ఎదను కదిలించిన
రేపటి జాడలు..
నిన్నటితో
ముడి వేసిన ఙ్ఞాపకాలు..

నమ్మకాల జాడలలో
నమ్మించలేని వాస్తవాలలో
నలిగిన మనసు చేజారింది..

నిన్ను విడిచి
నిజాన్ని చూసానేమో..
నన్ను విడిచి నా నమ్మకం వదిలి పోయింది..

అవాస్తవాల నీడన
హాయిగా గడిచిన కాలం ఒకపక్క..
వాస్తవాల నిప్పులపై
ఒంటరి నడకలు నేడు ఇక్కడ..

అవసరాల లోకంలో
అన్ని అంగడి సరుకులే
నమ్మకమే పెట్టుబడి
మనసే లోకువ ఇక్కడ

గెలుపోటముల గాలి వానలో
ఈ మనసు ఏ గూటికి చేరేనో..

నిన్ను అందుకోవాలని లేదు
భవిష్యత్తులో నువ్వో అలజడి కాకూడదు
ఈ మనసులో..

పొరపాటు మాటున
నువ్వో మరుపువైన పాఠానివి ..

అంతే..!!

✍️అరుణిమలు

తాను నేను

నిదురించిన మేను మేల్కొంది
నీ శ్వాసలో తడి తగిలి..

నీ ఎద పానుపు పై
లోకాన్ని మరిచి నేను..

ఏ సంబరాలు లేని
నా ఆలోచనలు అలిసిన వేళ
నీ తలపే ఒక తుంపరగా నన్ను తాకుతుంది..

నీ పెదవులు అద్దిన రంగులలో
నా నవ్వుల చాటు దాగిన సిగ్గు ఎన్ని రంగులను అద్దుకుందో చూడగలవా..

బయట లోకమంతా ఏదో హడావుడి
నా మది గది నిండా మౌనమే..

నువ్వు, నేను మాత్రామే కదా అక్కడ
మాటలే ఉన్నాయో
కోపాలే దాగాయో
అలకలే అడ్డు పడ్డాయో..

మనం, మన మధ్య నడిచే కాలంలో
మన చేయి ఎప్పుడు ఒంటరి కాలేదు..

ఎన్నో రోజులు క్రితం
ఎప్పుడో మనం వదిలేసిన
కొన్ని మాటలు
కొంత అల్లరి
కొన్ని చేతలు
నిను ముడివేసిన ఏ కోరికో
మళ్ళీ కొత్తగా ఇవ్వాళ పలకరించింది..

పండుగే మదికి ఇవ్వాళ
మరో ఉత్తేజాన్ని ఇచ్చిన ఈ కల
నిజమేనా అనిపించింది

మనిషిని ఇక్కడ
మనసు ఏమో అక్కడ

అందుకే కలలో కథలా
మనసును నిమిరి పోయింది
నీ చేతి స్పర్శను..

✍️అరుణిమలు

తాను నేను

నేనో తీపి ఙ్ఞాపకాన్నై
నీకు మిగిలిపోతా అన్నావు..

నిజమే...
కాలాన్ని వ్యర్ధం చేసుకోకూడదు...
నీతో గడిపే ప్రతీ క్షణాన్ని దాచేసుకోవాలనుకున్న..

నీతో ఉన్న ప్రతీ ఘడియని అందంగా మలచుకోవాలని ఆశ పడ్డా..

ఒక జీవితానికి సరిపడే సంపద నాకు కావాలి..
నిరాశలో ఉన్నప్పుడు నన్ను నవ్వించేవి..

నైరాశ్యంలో ఉన్నప్పుడు బలాన్ని ఇచ్చేవి..
నేను ఒంటరినే నా మనసు కాదనే నీ ఇష్టాన్ని నమ్మకంగా పొందాలని..

కన్నీరయ్యే వేళ నీ చిరునవ్వు రూపం నా కళ్ళ ముందు కదలాడాలని..
ధైర్యం దూరమయ్యినప్పుడు నా బలం నువ్వే అనే తలంపు నాలో పాతుకు పోవాలని..

ఎన్నో ఎన్నెన్నో అనుకున్న.
కానీ...జరిగేది జరుగుతున్నది ఇంకేదో..

నువ్వు పరుగులు పెడుతున్న కాలంలో నేను భాగం కాలేకపోయా
నేనంటు ఎవరని అనే ప్రశ్నల నడుమ చిక్కుకున్న..

పంచుకోవాలనుకున్న క్షణాలన్ని పరిక్షలు పెడుతుంటే..
నన్ను నేను నీకోసం నీకనువుగా మలుచుకునే క్రమంలో ఎన్ని గాయాలో ఈ మనసుకు..

అభిమానం ఒకపక్క..
నువ్వో పక్క..
వదిలేది ఎవరిని..!?

నువ్వు పిలిస్తే పలికి
నా పలుకు కి నువ్వు అందని రోజున మౌనమై గడిపి
ఎలా...నన్ను నేను నా నుండి తీసేసి నీ ముందు మోకరిల్లేది..

ఙ్ఞాపకాన్ని అవుతా అని నువ్వు అన్నావు...
గాయాలు మాత్రమే మిగులుతున్నాయి వింతగా..
అలసిపోయిన మనసు కష్టమైనా సరే ముందుకు కదలనివ్వడం లేదు..

నదినై నిను చేరా నీలో సంగమించేందుకు
దారేది, తీరేది ఆ సాగరానికి..
ఎదను కోతలు పాలు చేసి
మనసు దాహానికి కన్నీటిని ఇచ్చి
ఙ్ఞాపకాల గవ్వలని తన లోనే దాచేసుకున్నాడు..

✍️అరుణిమలు

తాను నేను

అడగక ఇచ్చే వరాలు
ఎదలో దాగే తీపి ఙ్ఞాపకాలే ఎప్పటికీ..

అడిగడిగాక తీర్చే వరం
అద్దంలో చందమామ లాంటిదే మనది కాదు..

తలపుంటే దారి ఉంటుంది
వలపుంటే చోటు ఉంటుంది

ఇష్టం ఉంటే ఇరుకైన చోటు విశాలమవుతుంది
కలిసి ఉందామంటే గడిపేందుకు కాలం మిగులుతుంది..

నాది అనుకుంటే
నిరీక్షణకు వదిలేయవు..

మనం అనుకుంటే
మరో అవకాశం ఉందా
అనే ప్రశ్న మధ్య లోకి రానివ్వవు..

ఏదైనా....
మనసులో చోటు ఉంటే
మరుగున పడే గతం కాము ఎప్పటికీ..

ఇద్దరు దగ్గరవడం కష్టం కాదు
కలిసి కడవరకు ఉండటమే కష్టం..

శ్రధ్ధ లేని బంధం
అశ్రద్ధ ఉన్న తోడు
ఎంత వరుకో ఆ పయనం..

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను కలవాలంటే కలవరం
మళ్ళీ నిన్ను వదిలి రాలేనేమో అని..

నిను చేరాలంటే దిగులు
నిన్ను వదిలే క్షణాలు వస్తే ఎలా అని..

ఎటో విసిరేసిన నా ఆలోచనలను
ఒకచోట పేర్చి చూస్తే కనిపించేది నువ్వు..

ఎక్కడో దాగిన నా చిరునవ్వు
నీ పేరు వినిపిస్తేనే కనిపిస్తుంది..

నాలో నేనున్న
నా చూపులు ఆగింది నీ గడప దగ్గరే..

మనసేమో ముందుకు పదా అంటుంటే
వెనక్కి చూస్తున్నా ఎందుకో..

ఎదను లిఖించిన పేరు నీదే
పఠించేది నీ నామ జపమే..

అయినా వద్దు
నీ దగ్గర తనం..

అందని దూరంలో
అందాల ఆ చందమామలా
కళ్ళ ముందు మిగిలిపో ఒక జత కట్టని తోడుగా..!!

✍️అరుణిమలు

తాను నేను

రాయడం అంటే అనే రోజుల నుండి
అక్షరాల నీడలో మనసును నిమిరే వరకు
చేరిన నా ప్రయాణంలో..

నా ప్రతీ పదంలో
నా ప్రతీ పలుకులో
నా భావంలో
కనిపించేది నీ రూపే
వినిపించేది నీ మాటే

గాయాలకు లేపనంలా
ఎదకు ఊరటలా మారిన పదాలు ఇవి..

మానును కాదు మనిషినే అని తట్టి లేపిన నీ దెబ్బ
ఎప్పటికి మరచిపోలేను
మనసుందని అది మట్టి ముద్ద కాదని తెలిసేలా చేసింది నువ్వేగా..

నువ్వో మట్టిలో మాణిక్యమే నాకు మాత్రం
ప్రపంచాన్ని మొత్తం నీలో ఎన్నో రకాలుగా నువ్వు మారి చూపించావుగా..

అందుకేగా అక్షాలలో నిన్నో భావం చేసి
మెచ్చే మెచ్చుకోలులో నిన్నో భాగం చేసా..

నేను నీకు ఎంతో ఋణపడి ఉన్నాను
కానీ నువ్విచ్చింది నీకు తిరిగి ఇవ్వగలిగే ధైర్యం లేదు...

నువ్వు ఎంత బాకీ ఉన్నావో
నిన్ను నువ్వు ప్రశ్నించుకోవోయ్
ఈ మనసుకు అయితే తీర్చగలవా..

ఇది మన ఇద్దరి కథ
రచన నీది
ఫలితం నాది..

ఏనాడు రుచి చూడని వ్యదను నాకు కానుకను చేసావు
నేనెప్పుడు ఆశించని ప్రేమను పంచావు..

నమ్మకాన్ని మాత్రం చిదిమేసావు ‌
మరెవరిని నమ్మడం ఎలా అనే
ప్రశ్న పరిధిలో నన్ను ఉంచేసావు..

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను చూడాలనే ఆశే తప్ప
ఏ కారణాలు తెలియని ఈ నయనాలకు ఏమని చెప్పేది..

నీ రాక
సందేహమే అని..

ఎన్నో  చిక్కు ప్రశ్నలకు
మౌనాన్ని జవాబుగా వదిలేస్తున్న..

అలసట ఎరగని కోరిక ఏదో అంటుంది
దేహం మాత్రం నీరసించి పోయింది..

నలుదిక్కుల నడుమ ఒంటరిగా
నిలబడిన ఒకనాటి ధైర్యం, నమ్మకం నన్ను వదిలి పోయాయి ఏమో ఇప్పుడు..

కొత్తొక ఆశ
నీ తోడు ఒక‌ బలం
నీ తలపే నా శ్వాస
నీకై నీరీక్షణ ఒక తీయని బాధ..

నిన్ను అనే వ్యసనాన్ని
ఈ ఏకాంతం నెమ్మది నెమ్మదిగా తుడిచేస్తుంది ఏమో..

నీకన్నా నీ ఙ్ఞాపకాలే నాతో గడిపిన కాలం ఎక్కువ
ఎప్పుడు వచ్చి, ఎప్పుడు దూరమౌతావో అనే బేల చూపులు నావి...

నువ్వు గమనించలేదు కదూ ఏ రోజు
అంత తీరిక నీకు లేదు
నువ్వు తప్ప నాకేం పని లేదు
ఎంత తేడానోయ్..

నీ అడుగులకు అడ్డొచ్చి
నిన్ను కదపలేను..
నీ వెనుక ఉండి నిను చూస్తూ
వెనుతిరిగి పోలేను..

ఇప్పుడు వచ్చినా, రాకున్నా
ఒకటే అనుకుంటా..

నీ రాక ఒక కల
నీ దూరం ఓ శూన్యం ఈ కళ్ళకు..

నీ కాలంలో ఒక భాగం పంచ లేని
బంధమేదైనా కలకాలం నిలవలేదోయ్..

నువ్వో అలవాటు అవ్వాలి కానీ
తీరిక దొరికాక కాలక్షేపానికో అవసరానివి కాకూడదు కదా...

✍️అరుణిమలు

తాను నేను

నే ఊహించని ఊహలు
నీ చేతిలో రూపం పోసుకుంటున్నాయి...

నే ఏనాడు ఆశించని ఒక మనసు
నన్ను వెతుకుతూ నీలా
నాకు ఎదురు వచ్చి ఈ ఎదలో దాగుంది...

నే కనని కలలు
నిజమై కలవర పెడుతున్నాయి..

నీ ముందర పడని ఈ పదాలు
అక్షరాల మాలగా మారి నిన్ను వరించేందుకు సిధ్ధమంటున్నాయి..

నీ వెంట నడిచే
కోరికల కోటలో నేనో మహారాణినే కదూ..

ఏనాడు నే చవి చూడని
సాంగత్యం అనే రుచిని నువ్వు గోరు ముద్దలుగా అందిస్తున్నావు..

ఎద విందులో ఎన్ని ముద్దులో
చేయి విడువని భరోసా
చెలిమిని వదలని అడుగుల జత

నుదుటి పై కదిలే నీ పెదాల రచనలో
నువ్వు లిఖించిన నమ్మకం గుండెలను తాకుతుంది..

ఇంకేం కావాలోయ్...
మరో జన్మకు ముందస్తు హామీ తప్ప...

✍️అరుణిమలు

తాను నేను

కొన్ని కొన్ని ఆలోచనలు ఏంటో
కొత్త కొత్తగా నన్ను నాకే పరిచయం చేస్తుంది..

నిర్మలమైన మనసులో
నీ తలపో తరంగమై తీరాన్ని తాకుతూ
నన్ను ఊరిస్తుంది..

నీ ఙ్ఞాపకాలను
ధరించిన ప్రతిసారీ ఎదకో కొత్త కానుక అందుతునే ఉంది..

నువ్వెక్కడోయ్
ఇలా వచ్చి అలా కదిలే కాలంలా ఆగనంటు..

నన్ను మీటి పోయే చిరుగాలివై
చేతిలో చేరి జారిపోతు
నిను వదలనని ఒట్టు శ్వాసగా మారి వేస్తున్నావు..

అల్లరి చేసి ఎన్నాళ్ళు అయ్యిందో
అలిగి కొన్నాళ్ళు అయినా ఎన్నేళ్ళో అయినట్లు ఉంది...

నీ ముద్దులలో మనసును పారేసుకుని
నీ హగ్గులలో కోరికనై
కోపంలో కొరివి కారాన్నై..

నీ బుజ్జగింపులలో పాపాయి నై
నీ చిలిపి నవ్వులలో చిత్తై..

నీ ఎత్తి పొడుపులలో పొగరునై
కోరి మనం పెట్టుకునే గిల్లికజ్జాలు..

ఓయ్.......
ఆటలు లేని
మనసు మూగబోయింతి ఇలా..

✍️అరుణిమలు

తాను నేను

మాటలతో మనసును చేసిన గాయం కన్నా
నిర్లక్ష్యంతో నువ్వు నా మనసుకు కట్టిన సమాధి ఎంత దృఢంగా ఉందో..

కళ్ళకు కమ్మిన చీకట్లలో
నా కంటికి కనిపించే రూపం నీదే..

గతాన్ని చీకటి పొరల్లో కూడా
తొలిచి తొలిచి చూపిస్తుంది..

వెనక్కి వేయాలని ఉంది ఒక అడుగు
నిను నిందించడానికి కాదు..

నీ వేపు పడిన పాదాన్ని మందలించి
నిను నమ్మిన నమ్మకాన్ని మందలించాలని ఉంది..

నిన్ను మరచిపోలేదు, మరచిపోలేను
గుర్తు తెచ్చుకోవడం లేదు అంతే..

నీపై కోపం లేదు
అలాగని నువ్వు ఇచ్చిన బాధ పోలేదు..

నిను వెతకని నా ఆలోచనలలో
నే ఒంటరిగా ఉన్న..

కనులను తడిపేసిన ఓ తుఫాను
విలయానికి ఆనవాలుగా నా మనసును వదిలి పోయింది..

రేయి, పగలుకు మధ్య
వేగు చుక్కలా ఏ ఆశో ఇంకా ఊపిరి పోస్తుంది
నువ్వు చెరిపేసిన నా రేపటికి..

✍️అరుణిమలు

తాను నేను

ఎన్నో చెప్పాలనుకుంటా నీతో
ఏవేవో అడగాలని..
ఏదేదో చేయాలని..

నిను చూసిన మనసు
నీ ముందు గువ్వలా వాలిపోతుంది..

నీ మాటలలో పడి ఊ కొడుతూ
నీ నవ్వులలో నగిషీనై మెరుస్తూ
నీ ఎదపై పసిపాపలా వాలిపోయి

ఏదో చెబుదామని కళ్ళు తెరిచినంతనే
నువ్వు ఎక్కడ..

కంటిపాపలో ఏదో కలవరం
ఎలా వచ్చావు
ఏమయ్యావని..

కలలు కన్నానా..
పగటి ఊహల్లో
నన్ను నేను మరచిపోయానా..

నీ ఎదపై నా చేతి రాతలు అబద్దమా
నిను హత్తుకున్న వెచ్చదనం నిజం కాదా
అల్లరిగా నే చెరిపిన నీ జుట్టు...

అన్ని కలవరింతలే
హ్మ్.......
తొందరగా వచ్చేయ్

ఓయ్...
అయితే ఇవన్నీ నిజాలు చేద్దాం
లేదా గొడవ ఆడేసుకుందాం..

ఏదో ఒకటి చేసేద్దాం
దూరాన్ని మాత్రం చెరిపేద్దాం
రెండు మనసుల సాక్షిగా..

✍️అరుణిమలు

తాను నేను

పదిమందిలో మన నవ్వులను చూసేది ఎన్నో కళ్ళు
మన మనసును కమ్మేసిన ఏకాంతం కనిపించేది ఒక్కరికే..

ఎవరిలోనో మన సంతోషాన్ని దాచేసి
ఎవరితోనో మన ఇష్టాన్ని ముడివేసాక

నేను ఎప్పుడు ఒంటరే
నా చుట్టూ మిగిలేది ఏకాంతమే

నువ్వు ఉంటే ఒక చింత
ఎప్పుడెప్పుడు వస్తావో అని చూడటం
మనసు పెదవి తెరిచే లోపే మళ్ళీ వస్తా అనే మాటను నిట్టూర్పు సాక్షిగా చూస్తూ నిలిచిపోవడం...

నీ నుండి దూరంగా జరిగితే ఒక తంట
నిన్నటి రోజులలో ఇవ్వాల్టిని గడిపేస్తూ
రేపటి వరకు ఎలా ఆగేది నిను వదిలేసి అనే యాతన..

అలిగిన మనసును బుజ్జగిస్తూ
ఎందుకులే.......ఈ దూరాన్ని ఇలా అలవాటు చేసేసుకుని మరుపుకు వసమై పోదామా అనిపిస్తుంది...

అంత తేలికా అది....
అదే అంత సులువైతే
ఇలా ఈ అక్షరాల అరణ్యవాసం దేనికి..

✍️అరుణిమలు

తాను నేను

ఇష్టం ఇద్దరిని దగ్గర చేస్తుంది
బాధ్యత బందీ చేస్తుంది

కొన్ని బంధాలకు లొంగడానికి
కారణం తెలియదు

ఎందుకు...
ఎలా....
ఈ ప్రశ్నలకు జవాబు తెలియదు..

నీ చుట్టూ తిరుగుతున్న ఆలోచనలు
నిన్ను వదిలి రాని మనసు
నీకై నలుదిక్కుల నడుమ కాచుకుని ఉన్న చూపులు

ఎన్నెన్నో జన్మలు వేచినట్టు గడచిన కాలం
నువ్వు వచ్చిన క్షణంలో భ్రమలా అనిపిస్తుంది..

రెప్ప పాటు కలలా
ఇలా వచ్చి అలా నువ్వు కదిలి పోతుంటే
కనుల మూలన దాగిన కన్నీరు
తొంగి చూస్తూ జారిపోతుంది మౌనంగా

ఎందుకీ ఈ నిరీక్షణ
నువ్వు వద్దు
నీ మాటలు వద్దు
ఒంటరి ఈ ఆలోచనలు వద్దు
ఆ ఎదురు చూపులు వద్దనిపిస్తుంది

అంతలోనే
నిన్ను వదిలి నేనెలా
నువ్వు లేకుండా ఎలా
నీ చోటున ఇంకొకరు ఎవరో
ఈ ఊహకు ఉలిక్కిపడి తనను తానే నిందించుకుంటుంది

ఓయ్......
కసిరినా, విసుక్కున్న
అలిగిన, వద్దన్న
పొమ్మన్న, రమ్మన్న
ఈ జన్మకు నువ్వేనోయ్

భరించేద్దాం ఒకరినొకరు ఇలా
ఒకరి కోసం ఒకరమని

✍️అరుణిమలు

తాను నేను

ఏముందని ఈ ఆలోచనలు
ఏం మిగిలిందనో ఈ తలపులు

కాలం ఆగనంటు కదిలి పోతున్న
నిన్న, మొన్నటిలో ఆగిపోయిన నేను
నేటిని ప్రశ్నార్థకంగా చూస్తున్న..

ఎలా వచ్చావో
ఎటు పోయావో
అంతా మాయ

ఇంకా నీ రాక కొత్తగా
నీ దూరం వింతగా
అనిపిస్తుంది

ఆనాటి నవ్వులన్ని వాడి పోయినా
జ్ఞాపకాలు మాత్రం చప్పుడు చేస్తూనే ఉన్నాయి..

బహుశా
గాయం ఎప్పటికీ మానేది కాదనుకుంటా

ఏం మాయ చేసావో
నీ దూరం కూడా కొత్తగానే ఉంది

నీతో ఏం ముడి పడి‌ ఉందో
బాధ కూడా తేలికై పోతుంది నీ పలకరింపుకు
దోసిట నిండిన కన్నీరే సాక్షి అందుకు

✍️అరుణిమలు

తాను నేను

చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు లేవు
చూపించాలి అనుకున్నప్పుడు ఇటు చూడవు

అడగాలి అనుకున్నప్పుడు నువ్వు కనపడవు
చూద్దామంటే నువ్వు ఎటు ఉన్నావో తెలియదు

వినిపించేలా అరుద్దామంటే వినే దూరంలో నువ్వు లేవు
విసుక్కుందామంటే నువ్వు ఎవరో ఈ లోకానికి వినిపిస్తుంది ఏమో

అడుగేద్దామంటే పక్కన నువ్వు ఉండవు
కలగందామంటే కన్నీళ్ళు అడ్డు వస్తున్నాయి

నిజం ఏంటని అందామంటే మాట పెగలదు
అసలు నువ్వు ఎక్కడ ఉన్నావంటే
నా భ్రమ కూడా చూపించదు నాతో నిన్ను జంటగా

ఒంటరి ప్రయాణం...
నా జంటగా ఉన్నది నువ్వనే ఏకాంతమే ఎప్పుడు

ఇక నువ్వు వచ్చినా, రాకపోయినా ఇచ్చేందుకు, నొచ్చుకునేందుకు
నా దగ్గర మిగిలింది ఏం లేదు
నేను అనే శూన్యం తప్ప..!!

✍️అరుణిమలు

తాను నేను

అప్పుడప్పుడు అనిపిస్తుంది
నా జీవితం లోకి నువ్వే రాకపోతే ?!

నేను ఎవరని
ఏమౌతానని
ఎలా ఉండే దానినో అని..

సంతోషాలంటే పెదవి పై విరిసే నవ్వు కాదని తెలిసింది నిన్ను కలిసాకే..

కలలంటే నిదురోయిన మనసు కోర్కెలు కాదని
మేల్కొన్న నా రేపని..

ఇష్టాలంటే నే కోరినవే కాదని..
ప్రేమంటే నన్ను వెతుకుతు వచ్చేదని చెప్పింది నువ్వు..

ఎంతెంత దూరం నువ్వు జరుగుతూ
అంతంత చేరువ ఎప్పుడు అయ్యావో తెలియలేదు..

కలిసి రాని కాలాన్ని ఒక్కోసారి నిందించిన
జీవితానికి సరిపడే ఙ్ఞాపకంగా నిన్ను ఇచ్చినందుకు మెచ్చుకుంటునే ఉన్న..

మన్నంటని మన బంధం
మట్టిలో కలిసే వరకు

తీపి ముద్దుగా
అల్లరి అలకగా
చేదైన నిజంగా
చెక్కిలి కానుకగా

ఇలా మిగిలిపోతే చాలోయ్
❤❤❤

✍️అరుణిమలు

తాను నేను

మరచిపోయా ఆ ఘడియలను
నీతో పంచుకున్న‌ ఆ క్షణాలను

నన్ను నీలో చూసుకుంటు
నీతోనే నన్ను ఊహించుకుంటు

ఇది చాలంటు
ఈ జన్మను మెచ్చుకున్న నిమిషాలను
సైతం మరచిపోయా..

అవునా...నిజమేనా
అనే ప్రశ్నకు జవాబు మౌనంగా మారిపోయింది..

నిన్ను మరచిపోలేని
నా మనసును మరచిపోవాలని ఉంది..

కాల గర్భంలో కలిసిపోయిన ఆ సమయం
వెనుతిరిగిన కనిపించని నేటి తరుణంలో ఒక ఉల్కై నేల రాలింది కంటి నుండి..

నేను వద్దనుకున్న నీ ఆలోచనలు
నా జ్ఞాపకాల సంపదలో అపురూపమైనవిగా మారిపోయాయి ఇప్పుడు...

చెరిపేదెలా....
చెరగని ముద్రని మన చరితకు సాక్షిగా స్వహస్తాలతో లిఖించేసాక ఇప్పుడు..

కలతకు నెలవు నేడు నువ్వు
కల్లోల మనసుకు కారణం నువ్వు

నే రచించని ఈ రాతను
చెరిపి రాయలేని నిస్సహాయత నాది..

ఆ ఇష్టం బాగుంది
ఈ కష్టం బాగుంది

రెండింటిలో ఉన్నది నువ్వే కదూ
అందుకే నేమో...

✍️అరుణిమలు

తాను నేను

అలవాటే ఒక పొరపాటు ఏమో
ముందుకు అడుగు వేద్దామంటే దారేది
వెనక్కి పోదామంటే మనసుకు ఆ ధైర్యం ఏది..

గడిచిపోతున్న ప్రతీ క్షణం
చేజారిపోతున్న ఒక అవకాశమే కదా..

మళ్ళీ మళ్ళీ తిరిగి రాని కాలాన్ని
బేలగా చూస్తూ...
నీకై నువ్వు వచ్చే తోవ వేపు చూస్తూనే
కనులు అలసి పోతున్నాయి..

కాలంతో  పరుగులు పెడుతున్నావో
కాలాన్ని దాటేయాలని వడివడిగా అడుగులు వేస్తున్నావో కానీ..

నీకై కాలానికి ఎదురుగా వెళ్ళి, నన్ను దాటి పోతున్న
నిన్ను చూస్తూ....
నిన్ను పిలిచేందుకు అభిమానం అడ్డు వస్తుంటే...

అధికారం చేయడానికి నేనెవరిని అని ప్రశ్నల మధ్య నలిగి పోతున్న ఈ ఎద పాట్లు ఎన్నో...

మనసును మరోవైపు మళ్ళించలేను, మందలించలేను..
మనసు విప్పి నీ ముందు పరచలేను..

మౌనమే ఈ మనసు భాష
మదిని మదిస్తునే ఉంది ఇలా..

✍️అరుణిమలు

తాను నేను

కలలా వచ్చావు కథలా మిగిలావు
కల్పనా ఇదంటే..
వాస్తవంలో విషపు చుక్కవై అడుగడుగునా కనిపిస్తున్నావు..

ఆలోచనలలో వెనక్కి అడుగులు
వేసిన ప్రతీసారీ..
తడబడిన అడుగుల గురుతులు
వెక్కిరిస్తున్నాయి...

భావాలను కదిలించావు
నీపై భ్రమలను తొలగించావేమో
ఇదిగో... ఇలా అక్షరాలకు భానిసనై పోయాను

మరచిపోయేందుకు ఏ మంత్రమైన
ఉంటే బాగుండేది అనిపిస్తుంది..

వెంటాడే నీ నీడను చూసి
వడివడిగా పడే అడుగులకు కూడా
నీ జ్ఞాపకాలు ముళ్లై గాయాలు చేస్తున్నాయి..

ఏకాంతమనే శాపం మనసుకు ఇచ్చావు
నమ్మకాన్ని గాయాలు చేసి
వేడుక చూస్తున్నావు..

చెలిమి అనే పదానికి చెదలు పట్టించావేమో
మరో నీడను కూడా నమ్మడానికి
మనసు జంకుతునే ఉంది..

✍️అరుణిమలు

తాను నేను

అలవాటే ఒక పొరపాటు ఏమో
ముందుకు అడుగు వేద్దామంటే దారేది
వెనక్కి పోదామంటే మనసుకు ఆ ధైర్యం ఏది..

గడిచిపోతున్న ప్రతీ క్షణం
చేజారిపోతున్న ఒక అవకాశమే కదా..

మళ్ళీ మళ్ళీ తిరిగి రాని కాలాన్ని
బేలగా చూస్తూ...
నీకై నువ్వు వచ్చే తోవ వేపు చూస్తూనే
కనులు అలసి పోతున్నాయి..

కాలంతో  పరుగులు పెడుతున్నావో
కాలాన్ని దాటేయాలని వడివడిగా అడుగులు వేస్తున్నావో కానీ..

నీకై కాలానికి ఎదురుగా వెళ్ళి, నన్ను దాటి పోతున్న
నిన్ను చూస్తూ....
నిన్ను పిలిచేందుకు అభిమానం అడ్డు వస్తుంటే...

అధికారం చేయడానికి నేనెవరిని అని ప్రశ్నల మధ్య నలిగి పోతున్న ఈ ఎద పాట్లు ఎన్నో...

మనసును మరోవైపు మళ్ళించలేను, మందలించలేను..
మనసు విప్పి నీ ముందు పరచలేను..

మౌనమే ఈ మనసు భాష
మదిని మదిస్తునే ఉంది ఇలా..

✍️అరుణిమలు

తాను నేను

కళ్ళ నిండా కానుకలే
నీ చూపుల కౌగిలిలో దాచుకున్నవి..

కనురెప్పల నీడన
కావలి కాస్తున్న కోరికలు ఒకపక్క..

పెదవి ఒలకపోస్తున్న
పరువపు ఊసులలో తడబాటులు ఎన్నో..

నా శ్వాస పదే పదే పలికే
నీ పేరుకి అంకితమే ఈ ప్రాణం..

కనుబొమ్మల మధ్య బంధీవైన
కోర మీసపు రోషం ఎర్రని రంగులలో వెలుగుతుంది..

నువ్వు నా దానివనే నీ హక్కులో
నా గర్వం తల ఎత్తుకుని ఉందోయ్...

నేను నీ మనిషిని అనే బలం
బాధ్యతను కూడా ఇచ్చింది..

నీ బంధంలో బంధీనై పోయానేమో
చిన్న అలజడి కూడా బాధిస్తుంది..

భయమో, ఏ భావమో తెలియదు కానీ
మన మధ్యలో మన నీడలను కూడా సహించలేనంత అసూయ నన్ను చుట్టేస్తుంది..

మనమనే కథలో
ప్రతీరోజు ఒక కావ్యమే ఈ ప్రేమ పుస్తకంలో..

✍️అరుణిమలు

తాను నేను

అక్షరాల ప్రవాహంలో భావాల చప్పుళ్ళు
ఎదకు మాత్రమే వినపడే సవ్వడి అది..

కలతలలో కనులు వెతికే తీరం
దప్పికతో ఉన్న మనసు దాహం తీర్చే దారి..

నేల చూపులను వీడని మౌనం
పాదాలతో పదాలను చిత్రిస్తుంది..

అరచేతిలో రాసి దాచుకున్న పేరు
గాలిలో ఏవేవో రాసి చెరిపేస్తున్న ఇష్టాలు..

నేల రాలుతున్న చుక్కలను కలుపుతూ
ఏ చిత్రాన్నో ఊహించేంతలో ఆవిరౌతున్న చెమ్మ..

ఏ ఊహా లలోనో ఊరేగే కురులు
కొత్త చిక్కులను ముడి వేస్తూ ఉసూర్మనిపిస్తున్నాయి..

రెండు అక్షరాల పదం మధ్య
మనం ఇరుకున పడి
రెండు మనసులకు మౌనపు శిక్షను వేసాం..

ఎంత దూరమోయ్...
పిలిస్తే పలకలేనంత
తలిస్తే తడిసిపోయేంత

✍️అరుణిమలు

తాను నేను

రాత్రి చెప్పే ఊసులు వింటూ
నిదురకు జోకొట్టిన రోజులు ఎన్నో...

పెదవి పలక లేని ప్రశ్నలు
జవాబులు వినలేని సంఘటనలు
ఎన్నో పోటీ పడుతుంటాయి..

చెప్పేది ఒకటైతే వినేది ఇంకొకటిలా
మధ్యలో ఏవో ఊహాలు
వాస్తవాలకు లేపనంగా..

కనులు ఒలకపోస్తున్న గంగలో
ఎంత ఓదార్పో ..
తలగడ ఊ కోడుతుంది
తడి చెంపలను తడుముతు..

గతమంతా గతుకుల అతుకులై
గేలి చేసి మనసును గిల్లేస్తుంటే..

గాయమైన నమ్మకాల నీడన
భవిష్యత్తును అనుమానంగా చూస్తూనే
గడిచిపోతుంది ప్రతీ రాత్రి...

✍️అరుణిమలు

తాను నేను

లోకమంతా నిశ్శబ్దంగా కనిపిస్తుంది
ఆలోచనలు ఒంటరిగా మిగిలాయి మనసును ఎక్కడో వదిలేసి..

మనసును వెలి వేయాలని ఉంది
వెతికి పెట్టలేని నా ఇష్టంలో నన్ను ఇంకా బంధీగా ఉంచినందుకు..

గుప్పిట దాచిన దుఃఖం
గుండెల్లో చిచ్చుపెడుతుంటే..

ఆ చితిలో రగులుతున్న నమ్మకం
నవ్వుతుంది ఇంతలా ఎందుకు నమ్మావే సాటి మనిషిని అని..

నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఒకలా
దూరంగా జరిగాక ఒకలా
నిన్ను నమ్మిన వారిని నీ అవసరాలకు వాడుకుంటుంటే..

ఛీ.....నువ్వు మనిషివేనా
అని అడగాలని ఉంది..

ఆటలలో ఆరితేరావు
ఓటమి ఎరగని వాడివే
కానీ..నీది ఓ గెలుపేనా..

✍️అరుణిమలు

తాను నేను

వెనక్కి వెనక్కి తిరిగి చూసే చూపులో
ఏదో ఆశ దాగుంటుంది..

నా వెంట నీ పిలుపు నన్ను చేరుతుందా అని
నా జంటగా నీ అడుగు పడుతుందా అని..

నేను పిలవడానికి మొహమాటం
నిన్ను అడగడానికి అభిమానం
అడ్డుపడి పెదవిని మూసేస్తా ఉంటే..

అడిగితే ఇచ్చేది ఎందుకోయ్
అడగకుండా ఇచ్చేదే కదా అమృతం..

కళ్ళు మాత్రం నీకై కలవరిస్తూ
ఎందుకు, నీలో ఏ అలజడి లేదని సందేహిస్తూ...

కోరికలన్ని నావేనా
నీకు నేను ఎవరిని అని కదల లేక...

వదిలి పోవడానికి మనసు రాక
ఆగి ఉండటానికి ఆత్మాభిమానం ఒప్పుకోక..

ఎందుకోయ్...
ఈ నడమంత్రపు బంధాల బాకీలు

నీతో భాగం పంచుకోని ఈ క్షణాలను
మళ్ళీ తిరిగి ఇవ్వగల శక్తి నీకుందా..

చేజారిపోతున్న కాలాన్ని నిస్సహాయంగా చూస్తూ
అరనవ్వు చాటున భవిష్యత్తును ప్రశ్నగా బంధిస్తున్న..

చిన్న చిన్న సంతోషాలే కదా జీవితం
అవే అందని ద్రాక్షలా ఊరిస్తే
మనసు ఆకలి తీరేదెలా..

కష్టమే అయినా ముందుకు కదిలి పోవాలని ఉంటుంది...
కానీ ఎక్కడ.. నీ వశమైన నా మనసు మాట వింటుందా..

గాయం నువ్వే..
లేపనం నువ్వే..

✍️అరుణిమలు

తాను నేను

మనసును ఒప్పించలేని నిర్ణయాలు దేనికో
పెదవి పలికే వద్దనే పదం చిన్నదే కానీ
పదునైనదే మెదడును తొలిచి వేయడంలో..

వద్దు అనుకోవడం ఎంత తేలికో కానీ
ఆ వద్దనే మాటని మనసు ఒప్పుకోదే..

మనసుకు, మెదడుకు మధ్య యుద్ధం సాగుతుంటే
ఆలోచనలు ఒకపక్క పరిగెడుతుంటే
ప్రస్తుతం మౌనమై పోతుంది..

వాస్తవాన్ని అంగీకరించలేను
అబద్దంలో బతకలేను
నడి మధ్య నాటకమే కదా ఈ జీవితం..

మాటకే తప్ప చేతలలో చేతకాని వదిలేయ్ అన్న మాట...
ఒకడుగు ముందుకు పది అడుగులు వెనుకకు లాగుతుంటే ఈ పయనం సాగేదెలా..

మనసు ముందు ఓడిపోవాలని ఉంది
కానీ బతుకులో గెలిచే దారేది...

నిను వెతికే కనులకు అలసట లేదు
నిన్ను స్మరించే పెదవులకు విసుగు రాదు
కానీ... కలవని తీరాలమని కాలం ఖచ్చితంగా చెబుతుంటే..

గమ్యం లేని పయనం వేపు
విననంటు ముందడుగు వేయనా..
గతి తప్పిన నాది కాని దారిలో
నీ జతగా నా అడుగులను ఆపేయనా..

చాలింక.....అని ఎన్నిసార్లు అన్న
నా మనసు చెలించదేమి..

చూడకింకా అన్న
నా చూపులకు నువ్వో వ్యసనానిగా మారావే..

ఇక వదిలేయ్
అనే మెదడు ఇచ్చే హెచ్చరికలు
మరిచానేమో పదే పదే
కళ్ళ నిండా చెలమలే నిండుగా..

నిను కలవడం ఓ వరం అయితే..
నీకు జరగాలన్న ఈ దూరం ఒక అగ్నిపరీక్షే నాకు..

దహిస్తుందో
దారి వేస్తుందో
కాలమే చెప్పాలి ఆ జవాబు

✍️అరుణిమలు

తాను నేను

అలలా వస్తావు అల్లరి చేస్తావు
ఒడ్డున ఙ్ఞాపకాల కోతను మిగిల్చి పోతావు..

ఇసుక తెన్నెలపై రాసుకున్న పేరులు చెరుగుతుంటే
మళ్ళీ మళ్ళీ లిఖించడంలో ఏదో ఆనందమోయ్..

అలవై తీరాన్ని కౌగిలిలో బంధించి‌న క్షణ కాలంలా
నీ ప్రేమ బంధనంలో బంధీనై పోయా..

ఎంత ఆశో ఈ పిచ్చి మనసుకు
ఇష్టంగా వచ్చిన నిన్ను నా వద్దే ఆపేయాలని..

అలుపెరగని సంద్రానివే నువ్వు నిలకడ ఏది
అలుపెరగనిదే ఈ మనసు కూడా నీకై ఎదురు చూడటంలో..

మనసులో నీ ఆలోచనల తుఫానులు ఎన్నో
అలజడి రేపుతుంటే
చిరునవ్వుల తెరచాపనై నీకోసం పయనిస్తున్న...

వెన్నెల నీడన వయసు తపస్సు చేస్తుందోయ్
నీ జతగా ఆ తీరంలో అడుగులు వేయాలని..

ఈ కంట నీరు ఉప్పనే
నువ్వు రాని రోజున ఇదే ఉప్పెనై నన్ను ముంచేస్తుంది కూడా..

పేరులో భాగం
జీవితంలో చోటు కాదోయ్ ముఖ్యం
మనసుతో మనువు కావాలి

ఇచ్చేస్తావా
కొద్ది చోటును నాదని

పంచేస్తావా
పట్టపురాణి చోటును నాకై

✍️అరుణిమలు

తాను నేను

ఒకరు మనల్ని గుర్తుంచుకునే తీరు
చెబుతుంది...
మనం ఎంత వరకు వారి వారమో అని..

ఙ్ఞాపకం ఉండటమంటే
ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు రావడం కాదేమో కదూ...

పదిమందిలో ఉన్న అలజడి రేపే వారి తలపు
ఏకాంతాన్ని హింసించే దూరం చెబుతుంది నేను నీకు ఎంతో..

నా తోడుతో ఉన్నప్పుడు
సమయాన్ని సైతం ఆగిపో అంటూ మందిలించడం ..

మనసుతో మనసు చెప్పే మాటలకు
చుట్టూ ఉన్న లోకాన్ని మరచి మురిసిపోవడం...

అలకంటు మురిపించుకుంటు
మారాం చేసి నీ ముందు ఓడిపోవడం..

ఒకటా, రెండా
నువ్వే లోకం అయ్యాక
చుట్టూ ఉన్న లోకంతో పనేమనే పొగరు..

ఎదురు చూపుల నుండి విముక్తి
కోరే చిన్ని మనసు పడే వేదన..

చిన్న నిర్లక్ష్యాన్ని సైతం
భరించలేక అలసిపోతు..

ఎందుకోయ్ ఈ తపన
చెప్పడం ఎలాగో నాకు రాదు
చూపించడం ఎలాగో నీకు రాదు

చేసి చూపించడం చేతకాదు కానీ
ఒక పలకరింపుకే కరిగిపోయే ఈ పిచ్చి మనసు..

మధ్యలో ఈ అక్షరాల మధనం
మనసు గోడును మౌనంగా లిఖించేస్తూ..

✍️అరుణిమలు

తాను నేను

ఎక్కడ నువ్వంటు వెతికే కళ్ళకు తెలుసు
నా చూపుల అలసట..
రెప్ప వేయని కనుపాపలలో దాచుకున్న
రూపం కోసం ఈ నిరీక్షణ అని..

ఏ చల్లని చోట ఆగి ఉన్నావో
నీకోసం ఎదురు చూసే మనసును మరచి..

అధికారంగా అడగాలని ఉన్న
సున్నితమైన బంధాలను బంధించలేని బలహీనత ఒకపక్క మౌనానికి వంత పాడుతుంది..

గుర్తింపు ఏదని అడిగేయనా
కథలు ఎన్నో నా ముందు వినమ్రంగా
జవాబై నిలబడతాయి..

మాటలున్న చోట చేతలు ఉండవా
చేతలున్న చోట ఈ నిరీక్షణ ఉండదు కదూ..

వెర్రి ఆలోచనలు
జరిగేది నమ్ముతూనే
ఇంకొక వైపు
అబద్దమని నమ్మబలకటం

కళ్ళల్లో చేరిన చుక్కలలో
ఎన్నో ఆశలను నింపుకన్నా ఏమో
నిరాశతో జారనివ్వలేక పడుతున్న కష్టం
కంటి గడపకే తెలుసు..

చీకటిలో మిణుగురుల్లా నీ కలలు
వెలుగుల ఊహలను సృష్టించి ఊరిస్తున్నాయి..

జాడ తెలియని బాటసారికై
గమ్యం ఎరుగని ఒక బంధం ఎదురు చూసే చూపులు ఇంతేనేమో..

ఫలితం ఒక ప్రశ్న
ప్రస్తుతం ఒక మౌనం

✍️అరుణిమలు

తాను నేను

గోముగ గోరు ముద్దలా నీ చెంత చేరాక
గోరు వెచ్చని నీ శ్వాస లిఖిస్తున్న కవ్వింపుల లేఖలను మళ్ళీ మళ్ళీ చదివే ఙ్ఞాపకాలుగా దాచుకోనా...

ఎన్నో జన్మల దాహాన్ని తీర్చగ
ఈ జన్మలో నువ్విలా నా వాడివి అయ్యావనుకోనా..

ముద్దు గారే మోములో
ముసిముసి నవ్వుల రంగోళి
కనువిందు చేస్తుంది..

పడమటింటి దిక్కున పానుపేసి
మనసు తివాచీని పరిచానోయ్
నిన్ను ఆహ్వానిస్తూ..

ఎదలో గుబులుకున్న చీకటిని
నీ కళ్ళల్లో వెలుగు రేఖలు తరిమేస్తుంటే
రేయి కూడా వెలుగులు లీనుతుంది..

ఏకాంతపు చెరలో ఖైదీలం
అయిపోదాం..
చీకటి తాంబూలం ఆరగించి
గెలుపు లెక్కలలో మునిగిపోదాం..

మాటల కోటలలో
చప్పుడు చేయని యుద్దాలెన్నో
ఒకరినొకరు ఏలే సింహాసనాలే కదా ఈ దేహాలు...

ఈ క్షణాలకు
చెమటలు పట్టాలేమో
వేడెక్కిన వాతావరణాన్ని చూసి...

✍️అరుణిమలు

తాను నేను

అబద్ధంలో‌ బతికేయడం ఎంత‌ బాగుంటుందో
నిజాలను పక్కన పెట్టి

ఆ గడియకు నచ్చినట్టు
ఎవరి మెప్పుతో పనేంటంటు
మనసుకు మాసిక వేసి

నవ్వులను పులిమేసుకొని
సంతోషాన్ని కుమ్మరిస్తూ

ఎవరు‌ మనవారు అనే
లెక్కలతో‌ పనేముందని.. అందరి మనిషిగా బతికేయడం బాగుంటుంది

రేపటితో నాకెందుకని
ఈరోజులో మునిగి తేలుతూ

చిక్కులను చిరాగ్గా చూసి
కొత్త కొత్త చిక్కులను చేర్చే పనిలో మునిగి ఉండటం బాగుంటుంది..

ఎవరు నేను, ఎక్కడ మనం అనే ప్రశ్నలకు విరామం ఇస్తూ..
నువ్వే నేనంటు నమ్మేస్తూ జీవించడం ఇంకా బాగుంది..

నిన్నటిని చూడమంటే, ఎందుకులే అంటు
రేపటిని చూడమంటే కళ్ళు మూసేస్తూ నటించడం బాగుంది..

ఏది నిజమంటే
ఎక్కడ అబద్ధముంది అనే జవాబులను కాలాన్ని అడిగే ఆట బాగుంది..

అబద్ధం బాగుంది నా నవ్వులా
మౌనం బాగుంది నా కటుక రేఖలా

ఇంకా ఉందా..
అరిగిపోని పలక పై
అ నుండి బండీ రా వరకు ఎన్నిసార్లు రాసినా తరగనంత జీవితం ఉంది గజిబిజిగా...

✍️అరుణిమలు

తాను నేను

నమ్మించేసా మనసుని
నేను నీకోసం అని..

ఇప్పుడు నా కోసం
నా తోడుగా ఉండమంటే
పొమ్మంటుంది...

ఎక్కడ నువ్వంటు
వెతుకుతునే ఉంది ఇంకా మనసు..

నువ్వుండే చోటు తెలియదా
దానికి...!?

ఎదురు పడినా కూడా
చూపులు ఎందుకో నేలను వీడనంటున్నాయి..

ఆలోచనలలో ఉన్న దానికి
వాస్తవానికి ఉన్న వ్యత్యాసం చూసేందుకు జంకుతుంది.. 

కలలు ఎక్కడివి
మనసు మేల్కొనే ఉంటుంటే..

ఊహలకు, నిజాలకు
ఇంత తేడానా..

అందని ఊహలలో ఊరిస్తూ
నిజంలో వెనకడుగు వేయిస్తూ

అటా,ఇటా
ఎటు అంటూ పరీక్ష పెడుతుంది..

✍️అరుణిమలు

తాను నేను

గది నిండా నిశ్శబ్దం
గది అవతల సందడి..

ఎద నిండా చీకటి
కనులు నిండా వెలుగులే..

ఏకాంతం హాయిగా ఉంది
కొన్ని ఙ్ఞాపకాలను నెమరేయడానికి..

వదల లేని వాటిని వదిలేదెలా అనే మధనం
చేజారిన వాటిని చిరునవ్వుతో సాగనంపేదెలా..

ఇంతేనా...
కాదేమో...

కాలం ఇచ్ఛే కౌగిలింతల వెచ్చదనం
ఏనాడో చెక్కిలి పై నువ్వేసిన ముద్రను గుర్తు చేస్తుంది..

తడి పెదవుల ఉప్పదనం
ఏ ఉప్పెనగానో మారక మునుపే తేరుకోవాలని ఉంది...

ఎద సొద నుండి తప్పుకునేందుకు
మరుపనే వరం కోసం ఏ తపస్సు చేయాలి ఇప్పుడు..

దిగులు మబ్బులు
కన్నులను కమ్ముకుని ఉన్నాయి..

ఆపేదలా....
చెదరగొట్టేది ఎలా...

✍️అరుణిమలు

తాను నేను

అక్షరాలెందుకో అలిగాయి నాపైన
ఆలోచనలన్ని శూన్యంగా మిగిలాక..

నిదురకు దూరమైన కలలు
ఆశలు మిగలని చోట
మేమెందుకు అంటున్నాయి...

నాలో నేను చేస్తున్న నిశ్శబ్ద యుద్దాన్ని
చూసి భయపడ్డాయా..

నన్ను నేను వెతుకుతున్న, నేను లేని చోట
ఇలా ఎంతకాలమని అలసిపోయాయా..

మనసెక్కడో ఉంది
అనువు గాని చోట
నిస్సహాయంగా...

పదిమందిలో ఒంటరిని చేస్తున్న ఏకాంతం
పెదవి పై నవ్వు నిజమా
కళ్ళలో చెమ్మ నిజమా
అని ప్రశ్నిస్తుంది..

జవాబు ఎక్కడ ఉంది అని చూసా
మౌనమే జవాబుగా మిగిలింది

అక్షరాల వేపు చూసా
మొహం తిప్పుకుని పోయాయి..

✍️అరుణిమలు

తాను నేను

ఏది ఎవరి సొంతం
ఎవరు ఎవరికి ఏమౌతారో..

వరసలెన్నో
మనసుకు కలిసిన వరుసకు చోటేది..

గాలిలా నన్ను తాకి పోయింది
తనువుకు ఆ స్పర్శ కానుకై పోయింది..

ఏ పిలుపో ఎదను కదిలించింది
పలికనంతనే బదులే లేని ప్రశ్నగా మిగిలింది..

కళ్ళ నిండా వెలుగు ఆశలే
చుట్టూ చీకటని చీల్చలేనంత బాధ గూడు కట్టుకుని ఉంది...

ఎవరు నువ్వో
ఎవరు మనమో
ఎవరు నేనో

చివరకు
ప్రశ్నలు కూడా ఒంటరిగా మిగిలిపోయాయి..

✍️అరుణిమలు

తాను నేను

నన్ను గెలిపించి నువ్వు గెలిచే తీరు ఉంది చూసావు...

బతిమలాడటం నుండి
బుజ్జగింపుల దారి లోకి చేరి

మాటల యుద్దం నుండి
మూతి ముడుపుకు చేరాక

నువ్వు ఇచ్చే ముగింపే
మహా ముద్దుగా ఉంటుంది..

కాస్త పొగరును పక్కన పెట్టిన
నీ వగరు ఎంతెంత రుచిగా ఉంటుందో

గెలిచి నే ఓడిన ఆటలో
నా అల్లరి తనం సంపాదించిన సంపదకు
వెల కట్టగలరా ఎవరైనా..

లేదు కదా....
నువ్వనే నీపై నా అధికారం
నాకు దొరికిన కానుక..

దాచేసుకోనా ఆ బహుమతిని
నా మనసు మాటున
ఏ కంటి నీడ పడకుండా..

నీ ఎదలో ఒదిగిపోన
అందమైన ఙ్ఞాపకంగా ప్రతి జన్మకు..

✍️అరుణిమలు

తాను నేను

ఎన్నో అలజడులను దాటేసింది మనసు....ఙ్ఞాపకాల తీరానికి చెరువులో ఉన్న నేడు...ఇది కూడా దాటే రోజు వస్తుంది...

ఆ రోజు నేను ఎవరో నీకు
నువ్వు ఎవరో నాకు..

సంతోషంగా ఉండమంటావు......నువ్వు నాతో ఉండిపోతావా అయితే ??....ఉండలేవు, నువ్వు లేని సంతోషం ఎక్కడ ఉందో చూపించేయ్ కనీసం..!?

మొండి దానినే...మనసును రాయి చేసుకోవడంలో, ఎవరికి కాని దానిగా మిగిలి పోవడంలో....కోరుకున్న నీకే ఏం కాలేనిది, ఎవరికో చెందుతా అని అనుకోకు ఏనాడు...

ఎన్నో చెప్పాలని ఉంటుంది నీకు....ఎందుకీ మౌనం అని నువ్వు అడిగితే కదా...

నీటి మీద రాతలే నీ వాగ్ధానాలు....నా మనసులో మాటలు... ‌ఇట్లు అని రాయడానికి పేరు లేని బంధం ఇది....చిరునామా ఏముంది నా ఆలోచనలే కదూ...

✍️అరుణిమలు