అలవాటే ఒక పొరపాటు ఏమో
ముందుకు అడుగు వేద్దామంటే దారేది
వెనక్కి పోదామంటే మనసుకు ఆ ధైర్యం ఏది..
గడిచిపోతున్న ప్రతీ క్షణం
చేజారిపోతున్న ఒక అవకాశమే కదా..
మళ్ళీ మళ్ళీ తిరిగి రాని కాలాన్ని
బేలగా చూస్తూ...
నీకై నువ్వు వచ్చే తోవ వేపు చూస్తూనే
కనులు అలసి పోతున్నాయి..
కాలంతో పరుగులు పెడుతున్నావో
కాలాన్ని దాటేయాలని వడివడిగా అడుగులు వేస్తున్నావో కానీ..
నీకై కాలానికి ఎదురుగా వెళ్ళి, నన్ను దాటి పోతున్న
నిన్ను చూస్తూ....
నిన్ను పిలిచేందుకు అభిమానం అడ్డు వస్తుంటే...
అధికారం చేయడానికి నేనెవరిని అని ప్రశ్నల మధ్య నలిగి పోతున్న ఈ ఎద పాట్లు ఎన్నో...
మనసును మరోవైపు మళ్ళించలేను, మందలించలేను..
మనసు విప్పి నీ ముందు పరచలేను..
మౌనమే ఈ మనసు భాష
మదిని మదిస్తునే ఉంది ఇలా..
✍️అరుణిమలు
No comments:
Post a Comment