Saturday, 9 November 2019

తాను నేను

అక్షరాల ప్రవాహంలో భావాల చప్పుళ్ళు
ఎదకు మాత్రమే వినపడే సవ్వడి అది..

కలతలలో కనులు వెతికే తీరం
దప్పికతో ఉన్న మనసు దాహం తీర్చే దారి..

నేల చూపులను వీడని మౌనం
పాదాలతో పదాలను చిత్రిస్తుంది..

అరచేతిలో రాసి దాచుకున్న పేరు
గాలిలో ఏవేవో రాసి చెరిపేస్తున్న ఇష్టాలు..

నేల రాలుతున్న చుక్కలను కలుపుతూ
ఏ చిత్రాన్నో ఊహించేంతలో ఆవిరౌతున్న చెమ్మ..

ఏ ఊహా లలోనో ఊరేగే కురులు
కొత్త చిక్కులను ముడి వేస్తూ ఉసూర్మనిపిస్తున్నాయి..

రెండు అక్షరాల పదం మధ్య
మనం ఇరుకున పడి
రెండు మనసులకు మౌనపు శిక్షను వేసాం..

ఎంత దూరమోయ్...
పిలిస్తే పలకలేనంత
తలిస్తే తడిసిపోయేంత

✍️అరుణిమలు

No comments:

Post a Comment