ఓయ్......
ఒక చిన్న చిరునవ్వు చాలోయ్
నీ పెదవిపై పుట్టి నా పెదవిపై విరబూసేందుకు
❤❤❤
కౌగిలింతల కెరటాలెన్నో కాచుకుని ఉన్నాయి
నిను బందించేందుకో... తాను బందీ అయ్యేటందుకో
😍😍😍
✍️అరుణిమలు
ఓయ్......
ఒక చిన్న చిరునవ్వు చాలోయ్
నీ పెదవిపై పుట్టి నా పెదవిపై విరబూసేందుకు
❤❤❤
కౌగిలింతల కెరటాలెన్నో కాచుకుని ఉన్నాయి
నిను బందించేందుకో... తాను బందీ అయ్యేటందుకో
😍😍😍
✍️అరుణిమలు
ముసురు వేసిన మనసు
నీ జాడకై వెతుకుతుంది
ఏ దిక్కున ఉన్నావో
ఏ చుక్కలలో దాగావో
నన్ను వెతకగలవా అన్నావు
నేను లేని నువ్వు మనగలవా అన్నావు
వెతకడానికి దారి తెలియదు కానీ
నా గమ్యం నువ్వే...గమనం నువ్వే
పిల్లగాలివై నువ్వు ఏ మూలన ఉన్న
జడివానై... నిన్ను చూసి కరిగిపోనా
నువ్వు నేను ఒకటైతే అహ్లాదమే కదూ
పరవశించే లోగిలిలో పరవళ్ళే మన ప్రాయాలు
ఓయ్.....ఎదురు రావోయ్
మరో ప్రణయ కావ్యాన్ని రచించేయడానికి
✍️అరుణిమలు
పిలిస్తే పలుకుతుందా అని సందేహపడకు
నువ్విచ్చిన గరళం ఉన్నది గొంతుకులోనే అయినా
నీ పిలుపుకు బదులు ఇవ్వకుండా అది ఆపలేదు
కానీ తీయగా ఉంటుంది అని నమ్మకం ఇవ్వలేనోయ్..
నేను గుర్తింపు కోరిన రోజున
నీ చూపు చిన్న బోయింది
నువ్వు ఎదురైతే నేడు
నా చూపులు నేలను తాకుతున్నాయి
నువ్వు దండించి మరీ నేర్పిన పాఠం కదా
ఎలా మరచిపోగలను...మరచిపోతే మళ్ళీ శిక్ష తప్పదు కదా...!!
✍️అరుణిమలు
మనసుకు ఎన్ని కథలు చెప్పను
నువ్వుంటే ఒక రకంగా
నువ్వు లేకుంటే ఒక రకంగా..
అసలు నిజం ఎరగనిదా ఈ మనసు
ఏవి తెలియకనేనా ఇది ఇంత తల్లడిల్లి పోతుంది
మరి తెలుసని అంటుంది అన్ని..
ఏం తెలుసని పద పద మంటుంది ముందుకు
ఒప్పుకున్నట్టే ఒప్పుకుని మళ్ళీ ప్రశ్నల పంజరంలో నిలబెడుతుంది..
పరితపిస్తూనే పరి పరి విధాల ఆలోచనలలో ముంచేస్తుంది
కావాలని ఉంటుంది అని అంటూనే అడగకు అంటూ అడ్డుపడుతుంది..
అలుపెరగని పోరాటమే చేయమంటుంది, అలిసాక నేనేం చేయనని అడుగుతుంది
అలిగిన చోటనే చాలింక అంటూనే అలకను తీర్చవేం అని సణుగుతుంది..
మరచిపోయి ముందుకు పదమంటూనే వెనుతిరిగి చూస్తుంది
ఏకాంతం కావాలంటుంది కానీ భరించలేనంటూ తోడు కావాలంటుంది..
ఎవరే మనసా నువ్వు... ఏవిటే నీ నస
ఇంత జిడ్డువా నువ్వు... చాలింక అన్నా చాలించవు
✍️అరుణిమలు
నీ ప్రతీ తలపు మరో ప్రపంచానికి పదమంటుంది
నీ ప్రతీ వలపు వయసును తడుముతుంది
పట్టపగలు ఇంద్రధనుస్సుల నీడన వెలిగిన సూర్యచంద్రులను ఒకచోట చూసావా..
నిను చూసిన క్షణంలో నా కన్నులలోకి తొంగి చూడవోయ్ కనిపిస్తుంది ఆ అధ్బుతం..
ఏ గాలి తెమ్మెర తాకినా నీ పిలుపై వినిపిస్తుంది
తేరి చూస్తే ఏది నీ జాడ..
నీకై దాచిన ఊసులు ఎప్పుడెప్పుడా అని ఆరాట పడుతుంటే...
మనసు నన్ను వదిలి నీకై వెతుకులాటలో తిరుగుతుంది..
మనవని రాసుకున్న భావనలను తిరగేస్తూ
ఊసుపోని ఊహలను బుజ్జగిస్తూ
ఇక్కడ నీ మనసు నీడన సేదతీరుతున్న...
✍️అరుణిమలు
ఒకసారి కంట పడతావేమో అని దారిన కాచిన చూపులు
నేడు....నీ ఎదురుని కూడా గుర్తించడం లేదు...
నీ నీడను పలకరించి ముందుకు పోతున్న...
నా ఆవేదన నీకన్నా నీ నీడ చక్కగా గ్రహించగలదు...
కుశలే ప్రశ్నలే కన్నుల నిండుగా...
కానీ అవి కరిగిన కలలుగా, కన్నుల అలలలో కలిసిపోయాయి...
ప్రతీ ఙ్ఞాపకం మధురమే ఇప్పటికీ
నీ చిరునవ్వు నుండి చీత్కారం వరకు...
ఒకటి నీకు దగ్గర చేస్తే...మరోకటి నీ నుండి దూరానికి దారి వేసింది కదూ...
నీతో సాగిన ప్రతి మలుపు విచిత్రమే
నన్ను నాకు చిత్రంగా పరిచయం చేసావేమో...
ఇవ్వడంలో తృప్తి తెలుసుకున్న
ఆశించడంలో ఆశా భంగం అనుభవించా..
నీలో మునిగి పోయాను కానీ
నాకు ఈదడం వచ్చని ఆనకే తెలిసింది
కాదు నువ్వే తెలిపావు...
కనుక...నువ్వెప్పుడు పదిలమే ఇక్కడ
కానీ నీకు పంచేందుకు మాత్రం ఏం లేదిక్కడ...!!
✍️అరుణిమలు
పలకరింపు కోసం పరితపించే రోజులను వెనుదిరిగి చూస్తున్న ఇప్పుడు...
ఒక్కమాట కోసం ఎదుదు చూసిన ఆ రోజులు...
ఎలా గడిపేది ఈ క్షణాలను, ఆ కాలాన్ని అని సమయం నలిపి నలిపి ప్రశ్నిస్తుంటే...
రాలుతున్న కన్నీటి చుక్కలకు బదులు లేక...
నన్ను నేను దాచుకొని కుచించుకు పోయిన ఆ రోజులు...
నేనేనా, ఎలా దాటానో ఈ గుండె చెరువుగా మారాక..
ఎలా చేరానో ఈ తీరానికి కన్నీటి సంద్రానికి సెలవు చెప్పి...
దహించే ఙ్ఞాపకాలను కడిగి కడిగి మంచు ముత్యాలుగా మార్చుకున్నానా.....ఏమో
రేయి చాటున మొదలయ్యే కడగళ్ళను
కటిక చీకట్ల మధ్య కుదిపేసిన దుఃఖాన్ని
దాచేసుకున్న ఏ మూలనో....రేపటికి అడ్డు కాకుండా...
ఈరోజు నిన్ను చూస్తున్న తేరి పార...
కన్నుల నిండా వెలుగును నింపుకొని
నువ్వు తిరిగిచ్చేసిన నమ్మకాన్ని బలంగా మార్చుకుని...
మునుపటిలా ఉన్నాను కదోయ్...
నీ అదుపాఙ్ఞాలకు... నువ్వనే ప్రభావానికి
లొంగని ఆ ఒకనాటి నీకేం కాని మనిషిలా...
✍️అరుణిమలు
నేలపై నీటి రాతలు..
ఆవిరౌతున్న మనసాక్షరాలు..
చెమ్మగా మొదలైన గీతలు... గతులను తప్పిన ఆశలకు అద్దం పడుతున్నాయి..
ఒక్కో చినుకు ఒక్కో సునామీలా నను చేధించుకుని ఈ విశాల జగతిలోకి దుఃఖమై చేరుతున్నాయి...
విశ్రాంతి, ఇదని తెలియని మది నీ ఆలోచనల ముందు మోకరించింది...
చిన్న చిన్న ఇష్టాలకు ఇన్ని కష్టాలా అంటే..?
అవునంటూ చెంపన తడి వేడిగా తాకింది..!!
తెగింపు తెలియని తాపత్రయం మాత్రం...తడిని తాకుతూ అంది తలొంచేయవా అని..
అప్పుడప్పుడు పాదాలను తాకుతున్న తడి క్షమాపణలను కోరుతుంది కరుణించమంటూ..!!
కనుల కోనేరు ఏమో నేలను కళ్ళాపి జల్లుతుంటే
కలువలు రెండు కనికరం మరిచాయి..
భావాలన్ని రెండో కంటికి కనపడకుండా కొట్టుకు పోతున్నాయి ఇక్కడ మా వలన కాదంటూ..!!
✍️అరుణిమలు
అడుగులకెందుకో ఈ తడబాటు...
అంచనాలను అందుకోలేక...
ఎటు వైపా అంటూ చూసే బేల చూపుల నడుమ చిక్కుకున్న చిక్కుముడులను విప్పలేక....!!
అడుగడుగున పడిన సంకెళ్ళను మోయలేక
తెంచాలనే మనసు ఆరాటాన్ని తప్పించుకోలేక...!!
అటా, ఇటా అనే తూకంలో ఎటో ఈ మనసు
ఏకాంతం కూడా బదులు ఇవ్వలేని ప్రశ్నలు...!!
నిన్ను చేరిన పూల దారి ముళ్ళ దారిగా మారాక
నే వేసిన ప్రతీ అడుగుకు కార్చిన కన్నీరు ఇంకా ఇంకిపోనే లేదు...!!
నన్ను నేను పొగొట్టుకొని...తిరిగి పొందలేక
సాగిస్తున్న నిర్జీవ ప్రయాణంలో...
మళ్ళీ నీ ఎదురు ఏ బాటకు దారి వేస్తుంది...!?
కానరాని కల్లోలంలో మనసు మసై పోయింది
ఏముంది ఇక్కడ ఇంకా మిగిలి...?
నటన
ఆత్మవంచన
నీ తలపు తప్ప...!!
నేనెక్కడ...
నువ్వు వదిలిన చోటుకు...
తిరిగి చూడవోయ్ ఒకసారి...
ఎలా కనిపించానో...కదిలించానో చెప్పకు
వినాలని లేదు...చూడాలని లేదు నన్ను నేను అలా...
ఇప్పుడు అందుకుంటావా...
చేరుకోగలవా ఆ చోటుకు...
చెరిపేయగలవా ఆ కాలాన్ని ఈ ఎద నుండి...!!
✍️అరుణిమలు
గుచ్చి గుచ్చి చూడమాకోయ్
గుట్డులన్ని బట్టబయలు అవుతున్నాయి...
పట్టి పట్టి పలకరించకోయ్
జలదరిస్తున్న తనువు తడబడుతుంది...
శ్వాస కూడా సరిగమలు అందుకుంటుంటే
సిగ్గంటున్న చీకటిని చిదిమేసా...
✍️అరుణిమలు
రాజుకున్న నా కోపంలో నువ్వో నిప్పు కణికవు
ఎగసే గాలిలో కలిసి సెగలు పెంచుతూ
అదిరే నా పెదవుల రంగుని చూసి మురిసేవు..!!
కసిరే విసురుల నడుమ సర్దుకుంటు
నన్ను అల్లుకుపోయే తాపానివి..!!
చల్లని చూపులను నా ఎదను చేర్చి హత్తుకున్న గంధానివి...
లో లోన విసురతున్న విరుపులను ఒడిసి పట్టి, నీ ఎదపై చేర్చి లాలించే లలనుడివి..!!
ప్రశ్నలుగా జారుతున్న కన్నీటి చుక్కలకు నీ పెదవుల ఆనకట్టగా కట్టి
నీ చూపుల కాగడాల వెలుతురులో కరిగి చల్లారిన నా కోపం స్వేదమై జారుతుంటే..!?
చిరుగాలై నను అల్లుకుని... నుదుటిన మధుర దరఖాస్తులను కానుకలు చేసి....రాసులుగా పోసి అలంకరించేసావు నీ హృదయరాణిగా...!!
😍😍❤❤😘😘
✍️అరుణిమలు
రచించడానికి నువ్వు ఊహావి కాదే
నా అనుభవాలలో దాగిన
మన అనే భావానివి...
నా అక్షర సేద్యంలో నే దాచుకున్న సొత్తువి
భరించే బాధ్యతవి ఏమో
నా అనే పదంలో బందీవి...
ఈ అక్షరాలకు బందువువి
నే లిఖించే నా కలంలో బిందువువి...
నా తాను నేను అనే పంజరంలో
నువ్వో స్వేచ్ఛా విహంగానివి..
మనమే ఈ తాను నేను
మనమే ఆ నువ్వు నేను
❤❤
✍️అరుణిమలు
పిలిచినట్టే ఉంది కానీ పలకడానికి జంకు
పలకరించినట్టే ఉంది ఏ తొలకరో నన్ను తాకినట్టు
కానీ అనుభూతి చెందడానికి భయం
అది గాలి వాటుగా వచ్చిందేమో అని...!!
పడి లేచే నీ పలుకలలో
ఏది నాదో....ఏది పరాయిదో తెలియదు
బెదురుగా నా వైపు పడుతున్న నీ అడుగులు
గుబులు రేపుతున్నాయి...
ఎవరి కను సన్ననల నీడన మస్తరు వేయించు కోవడానికి వచ్చావో అని...
నేనే అంటూ నువ్వు వచ్చిన
నువ్వు ఎక్కడ అని నా కళ్ళు వెతుకుతున్నాయి...
మనం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మనమే అంటుంటే...
నిజంగా మనం ఎక్కడ అని మనసు నవ్వుతుంది..
నేను ఎవరిని నీకు... అనే ప్రశ్నను నా ముందు ఏనాడో పెట్టేసావు...
మాటలలో నేను ఎప్పుడు ఒకటే నీకు
కానీ చేతలలో ఎవరినో...
ఎవరి అనుమానాలకు నేను ముగింపునో
ఎవరి వ్యంగ్య ప్రశ్నలకు నేను జవాబునో
నీకు మాత్రమే తెలిసిన ఆ జవాబులలో
నేనొక మార్కులు పడని ప్రశ్నని....
✍️అరుణిమలు
అక్షరాలను రాసులగా పోసి
ఆ అక్షర మాలికలను అల్లుతూ, పేరుస్తా ఉంటాం
అదే కవిత్వమా అంటే.... ఏమో
దోసిట నింపుకున్న పదాలను
అటు, ఇటు కలుపుతూ ఉంటాం...
పెదవి పలకని భావాన్ని రచించడానికి
మనసుకు మాత్రమే కనిపించే చిత్రాన్ని చూపించడానికి..
భారమైన మదిని తేలిక చేసే మంత్రం అక్షరం
గాయమైన నిన్నటికి ఇవ్వాళ వేసే ఔషధం...
దాచిన ఆశలకు ఊహలను జోడించి అల్లుకుపోతాం
చిలిపి చేష్టలకు అక్షరాలను ఊతగా తీసుకొని కవ్విస్తాం...
ఓర చూపులో ఏముంది నా పదంలో దాగిన పెదవుల పలుకులని చూడంటూ ఊరిస్తాం..
ఇష్టాలకు ముడుపులు కావాలంటూ మారాం చేసి మరీ మురిపిస్తాం...
కష్టాన్ని కరిగించి, దిష్టి తీయమంటూ అక్షరాన్ని కోరుకుంటాం...
భారమైన భావాలను, కన్నీళతో అర్చన చేస్తూ ఆరాదిస్తాం....
ఓయ్ అన్నా....ఏయ్ అన్నా....అన్ని నిన్నేనోయ్
మా అరచేతిలో ఒదిగిన, మా కలం నుంచి జారిన మా ఆంతరంగిక నేస్తానివి కదా...
కసిరినా, విస్కున్న, అలిగిన, ప్రేమను పొందిన ఏదైనా మొదట విన్నవించుకునేది నీతోనే ఎప్పుడు...
మన బంధం కలం, సిరా లాంటిది కదా ❤❤❤
ఇలాగే ఉండిపోవోయ్ 😍😍😍
✍️అరుణిమలు
గడచిన కాలం గమ్మున ఉండదే
అలా అలా వచ్చి మదిని తాకడం ఎందుకో దానికంత ఇష్టం....
చెదిరిన స్వప్నాలు
ఎదురు చూపులలో నిలిచిపోయాయి...
పోగేసిన ఙ్ఞాపకాలు
ఏమో దాచుకోమని సద్దు చేస్తున్నాయి...
అలికిన కళ్ళకు రంగులన్ని ఒకలానే కనిపిస్తున్నాయి...
కడిగిన మనసుకు వసంతాలను చూడాలని ఉంది...
కానీ, నా వసంతాల లోగిలిలో నీకై ఎదురు చూడకుండా ఆపగలనా ఈ మదిని...
అద్దమల్లే చూపిస్తుంది మనసు నిన్ను, నన్ను... ఇక ఆశలకు చిగురులు తొడిగేనా...
చూడాలని ఉంది ఒక్కసారి.... మరొకసారి
నాకై విరిసే ఒక నవ్వు ... నా కోసం నీ ఆరాటం
నా కోసం నీ తపన...
ఈసారి కాలాన్ని అయినా ఆపేయనూ..
నా ఆశలను రాలి పోనివ్వకుండా...
✍️అరుణిమలు
ఒక గూటి పక్షులు కావు...
ఒక కొమ్మకు పూయనివి...
కానీ ఒక పంచన చేరిన మనసులు..
వాటి కథలు...కతలు....కలలో...కల్లలో
పంచేందుకు ఏముందో అందుకునే చేతికే తెలుసు...
అందిన దానిని దాచిన దోసిలికి ఎరుకే
అవి సొంతం కావని...అరువే అని...
కానీ పెదవిన తాకిన చిరునవ్వుకు తెలుసు
మనమో మరువని ఙ్ఞాపకాలమని...
అతుకుల బతుకులలో అందమైన అల్లికలమని
మనసనే సంద్రంలో తీరని కలల కెరటాలమని...
అంతా యాంత్రికమో...కుత్రిమమో కానీ
అటా,ఇటా అనే గజిబిజి ఆటలో
నలిగే మనసుల, మమతల మౌన వేదనలో
రాలి పోతున్న ఆశలు ఎన్నో...
అవసరాల ముసుగులో
ఎన్ని రంగులో... ఎన్ని హంగులో
✍️అరుణిమలు
సిగ్గులన్ని ఏ పడుచు వాకిట్లో పహారా కాస్తున్నాయో...
పలకరింపుల పులకరింతల నడుమ
మనసు నువ్వనే పల్లకిలో విహరిస్తూ ఉంది...
యాడకి పోయాయి ఇన్నాళ్ళు
నీ పలవరింతల పరవశాలు...
నీ జాడ లేని జాగరణలో రవ్వంత రసికత
కూడా నా వేపు చూడనందే...
ఆలోచనల మడుగులలో
అలకల కొలనులో నేనో తామరనై ఎదురుచూస్తున్న...
కనికరం లేని వాడివి కాదు లేవోయ్
బెట్టులన్ని బాటకు వదిలేసి ఎదురొచ్చేయ్...
✍️అరుణిమలు
సూటిగా ఒక ప్రశ్న అడగాలని ఉంది...
ఏమనంటే......
.
.
.
.
ఏమో....పదాలకు దొరకని ప్రశ్నకు
జవాబును తెలుసుకోవాలనే ఆరాటం...
ఏముంది ప్రశ్నలో....మౌనాన్ని సైతం సాధిస్తుంది,
సాసిస్తుంది....
తపో వనంలో ఏ తపస్సులో మునిగుందో
ఈ మనసు...
తెలుసా నాకు.......
తెలియదే...
పలకరింపులు వాడిపోయిన చోట
రాలి పోయిన నిన్నలలో
దాగుందా నా ప్రశ్న...
మస్తిష్కానికి బదులు కావాలి అంటుంది
కానీ జవాబు తెలిసిన మనసు
పెదవి గడపకు చేరనంటుంది.....పలకును కాలేను అంటుంది...
ఏయ్......నువ్వనే ప్రశ్నల మాటున గతముంది
జవాబు కూడా అక్కడే ఉంది....
కానీ వినపడదు, కనపడదు...
నే అంగీకరించే వరకు...
చెప్పే ధైర్యం నీకుందా...నిన్నే
✍️అరుణిమలు
దగ్గరెంత బరువో కదూ.... దూరం అవుతామా అనే భయం వలనేమో...
దూరం ఎంత భారమో కదా.... గతంలో నిలబడి కదులుతున్న కాలంతో కలిసి నడవలేక...
ఊపిరి చెప్పిన గుసగుసలు.... చేతికి చిక్కని వాగ్దానాలు చెలిమిని చిదిమేస్తాయా...
దోసిలి నిండని ఆశలు జారిపోకూండా.... నా దోసిటని ఒడిసి పట్టవోయ్...
నమ్మకాన్ని అమ్మకానికి పెట్టకే.... నన్ను నేను నమ్మనంత నమ్మకం నీ మీద మదుపుగా పెట్టా...
లాభనష్టాలు మనలో దాచుకుని... కాలాన్ని గెలిపించి మనం శేషంగా మిగిలిపోవాలి...
గుప్పెడంత గుండెలో తలదాచుకుందాం.... గోరంత దీపాన్ని వెలిగించి...
వచ్చేయ్....😍😍😍
✍️అరుణిమలు
ఈ దూరాల మధ్య దుఃఖం ఉన్నా
కాలం కదలనని మొండి కేస్తున్నా
ఇంకా నిన్నో, మొన్నో నీకు ఎడమైనట్టు ఉంది భావన....ఎందుకిలా..??
నీకైనా తెలుసా!?...
ఎందుకీ ఎడబాటని....కారణం ఎవరని
ఊహించావా అసలు...
ఇలాంటి రోజులను నాకు కానుకగా ఇస్తావని...
అసలు నీ ఆలోచనలో అణువంత చోటైనా మిగిల్చావా నేనంటూ గురుతుండటానికి...
ఏ మేఘమో వర్షించింది అనుకున్న...!?
నీ ఙ్ఞాపకాల భారాన్ని మోయలేని మది జల్లులు అని తెలియక...!!
నడి రాత్రి మౌనాన్ని చదువుతూ ఉన్న...
ఏ చలనం లేని ఆ తారలకు నాకు పెద్ద తేడా లేదు అనిపిస్తుంది....!!
నీ ఙ్ఞాపకాలను వెనకేసుకొని
నే ఇలా స్తంభించి ఉండటం
నాకే కొత్తగా, వింతగా ఉంది..!!!
✍️అరుణిమలు
చైత్ర రాగాలు చరణాలై
శ్రావణ పొద్దులు తాళమై
కార్తీక దీపాల పల్లకిలో
మాఘమాస మంత్రాలలో
కలిసిపో మంటున్నాయి
మన ఆశల తోరణాల నడుమ
నా నుదుటిన నీవు చుంభమై
నీ ఎదను నేను లాలన నై
ఏడడుగులు, రెండు మనసులు సాక్షిగా
నమ్మకాన్నే బ్రహ్మ ముడిగా మలిచి సాగిపోదాం
😍😍😍😍
✍️అరుణిమలు
నీ చూపుల వెచ్చదనం
నా మేను చల్లదనం
కరిగిపోతుందోయ్ పున్నమి కాస్త చందనమై...❤❤❤
రెప్పల మాటున మేల్కొన్న కలల జాతరలో
మనం మునిగి తేలేది ఏ తీరానికో...😍😍😍
✍️అరుణిమలు
ఎదురు చూపులు అంత ఇష్టమా అంటే...
నీ ఎదను కావలి కాస్తున్నాను కదా నాలో భద్రంగా దాచి...
కనున ఈ నిరీక్షణ ఇష్టమే....
నిన్ను నీకు తిరిగిచ్చేంత వరకు ఈ నిరీక్షణ నాకు ఇష్టం...
రెప్ప వేయనంటోంది కనుపాప...
దారి తప్పుతుంది ఏమో నా చూపు అని...
సుదీర తీరాలను తాకుతున్న దృష్టి
నీ రూపం ఎండమావీలో ఊరిస్తున్న ఊటలా ఉంది..!!
ఎదలో గుబులు రేపుతున్న, నీ ఊహలలో
మనసు విహరిస్తూ ఉన్నా...
కనురెప్ప కాలం గడపన ఆనుకొని నిలబడే ఉంది...!!
భారంగా ఉందా......లేదోయ్
నీ రూపం నా తోడు లేదేమో కానీ
నువ్వనే అనుభూతులను ఆవహించి ఉన్న...!!
నువ్వు ఇచ్చినవన్ని నాకు తోడుగా
నా వెంటే ఉన్నాయి..
నీ లోటును భర్తీ చేస్తూ...!!
ఫలించని నిరీక్షణ అంటావా..??
ఫలించకూడదనే నా తపన కూడా !!
మళ్ళీ నీ రాకపోకలను భరించే శక్తి ఈ తనువుకు,మనసుకు లేదు...!!
ఇలా తీరని ఆశను కోర్కెను చేసుకున్నది
జీవితంతో కాలక్షేపం చేయడానికే సుమీ...!!
✍️అరుణిమలు
ఈ ముక్కెరని అద్దిన ముద్దు...
ఆ చెవి కమ్మలకు అంటిన చెమ్మ...
నా పెదవుల పై విరిసిన నీ నవ్వు...
ముచ్చట్లు తెగ చెప్పుకుంటున్నాయి...
నీవు చెప్పని కథలు....
నీవు చేసిన చేష్టలు....
నీవు దిద్దిన పదాలు...
నీవు వేసిన చిక్కులను విప్పుతూ...
నవ్వుతున్నాయి...
నీకై నా తలపుల తపస్సును చూసి...
మురిసి పోతు నే... మూతి విరుస్తున్నాయి...
టెలీ పతిలా ఈ సతి మాటలు ఆ పతికి చేరే దారి లేదు కదా....
ఉంటే.... ఈ సతి సిగ్గుల చాటున ముడిచిన మొగ్గే మరి నీ ముందర...❤❤❤
✍️అరుణిమలు
కళ్ళకు దిద్దిన కాటుకను కాదు....కనుపాపలోని సంద్రాన్ని చూడగలవా....
రెప్పల గడపన ఆగిన బరువైన వేదనను తాకి చూడగలవా....
కనుల దారి గుండా పోయి హృదయాన్ని తడిమి చూడగలవా...
ముడిపడని కనుబొమ్మల మధ్య నలుగుతున్న ప్రశ్నలను చదవగలవా....
ముడుచుకున్న పెదవుల చాటు నక్కిన పలుకులను పటించ గలవా....
నీ మనిషిని అని పలికేవి నీ పెదవులే కానీ మనసు కాదు కదా....
నన్ను నన్నుగా నువ్వు చదవడానికి నేనున్నది నీ గుండెలలో కాదు కదా....
అవసరాన్నో....అందిన ద్రాక్షనో కదూ...
తెరిచిన పుస్తాకాన్నే నీ ముందర....
లిపి లేని బాషను నేను....
తాకితే కానీ తెలియని భావం నాది....
నువ్వు నిమిరేది శరీరాన్ని.... నువ్వు ఇచ్చిన, నే దాచిన పగుళ్ళే నిన్ను కదిలించలేదు...
ఇక నా ఆత్మ ఘోష నిను కదిపేదా...
కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడు చూడకు...
అదే మన చివరి కలయికగా మిగిలిపోతుంది....
✍️అరుణిమలు
కాలాన్ని తెంచుకు పోవాలి అనిపిస్తుంది...
అలికేసినట్టు నన్ను అల్లుకు పోతూ
గతమై నన్ను వదలనంటుంటే...
రచించాలని ఉంది
నాకై నేను... నే మెచ్చే నా కాలాన్ని కలం సాక్షిగా...
అక్కడ నేను ఉంటా....నువ్వు ఉంటావు
మనతో మనం మెచ్చిన ఏకాంత బంధం ఉంటుంది...
నిక్కచ్చిగా... ఒకమాట ఇటు, ఒకమాట అటు లేదోయ్
చందమామ గూటిలో కలల తారలమై సోలిపోదాం...
లోకాన్ని జోకొట్టి ప్రపంచాన్ని వేదిక చేసి
రచిద్దాం పదాలకు దొరకని అనుభూతుల భావనలను...
నచ్చే కాలమో....మెచ్చే కాలమో
మనకై మనం గడిపే కాస్త కాలాన్ని కానుకగా వదిలేయ్ ఇక్కడ....
ఓయ్......నిన్నే వినపడిందా
ఇలా అక్షరాలలో బతికేస్తావా బతుకంతా...
ఊపిరి ఎలా ఆడుతుందిరా ఈ అక్షర పంజరంలో...
✍️అరుణిమలు