Saturday, 9 November 2019

తాను నేను

అప్పుడప్పుడు అనిపిస్తుంది
నా జీవితం లోకి నువ్వే రాకపోతే ?!

నేను ఎవరని
ఏమౌతానని
ఎలా ఉండే దానినో అని..

సంతోషాలంటే పెదవి పై విరిసే నవ్వు కాదని తెలిసింది నిన్ను కలిసాకే..

కలలంటే నిదురోయిన మనసు కోర్కెలు కాదని
మేల్కొన్న నా రేపని..

ఇష్టాలంటే నే కోరినవే కాదని..
ప్రేమంటే నన్ను వెతుకుతు వచ్చేదని చెప్పింది నువ్వు..

ఎంతెంత దూరం నువ్వు జరుగుతూ
అంతంత చేరువ ఎప్పుడు అయ్యావో తెలియలేదు..

కలిసి రాని కాలాన్ని ఒక్కోసారి నిందించిన
జీవితానికి సరిపడే ఙ్ఞాపకంగా నిన్ను ఇచ్చినందుకు మెచ్చుకుంటునే ఉన్న..

మన్నంటని మన బంధం
మట్టిలో కలిసే వరకు

తీపి ముద్దుగా
అల్లరి అలకగా
చేదైన నిజంగా
చెక్కిలి కానుకగా

ఇలా మిగిలిపోతే చాలోయ్
❤❤❤

✍️అరుణిమలు

No comments:

Post a Comment