Saturday, 9 November 2019

తాను నేను

ఏముందని ఈ ఆలోచనలు
ఏం మిగిలిందనో ఈ తలపులు

కాలం ఆగనంటు కదిలి పోతున్న
నిన్న, మొన్నటిలో ఆగిపోయిన నేను
నేటిని ప్రశ్నార్థకంగా చూస్తున్న..

ఎలా వచ్చావో
ఎటు పోయావో
అంతా మాయ

ఇంకా నీ రాక కొత్తగా
నీ దూరం వింతగా
అనిపిస్తుంది

ఆనాటి నవ్వులన్ని వాడి పోయినా
జ్ఞాపకాలు మాత్రం చప్పుడు చేస్తూనే ఉన్నాయి..

బహుశా
గాయం ఎప్పటికీ మానేది కాదనుకుంటా

ఏం మాయ చేసావో
నీ దూరం కూడా కొత్తగానే ఉంది

నీతో ఏం ముడి పడి‌ ఉందో
బాధ కూడా తేలికై పోతుంది నీ పలకరింపుకు
దోసిట నిండిన కన్నీరే సాక్షి అందుకు

✍️అరుణిమలు

No comments:

Post a Comment