Saturday, 9 November 2019

తాను నేను

పదిమందిలో మన నవ్వులను చూసేది ఎన్నో కళ్ళు
మన మనసును కమ్మేసిన ఏకాంతం కనిపించేది ఒక్కరికే..

ఎవరిలోనో మన సంతోషాన్ని దాచేసి
ఎవరితోనో మన ఇష్టాన్ని ముడివేసాక

నేను ఎప్పుడు ఒంటరే
నా చుట్టూ మిగిలేది ఏకాంతమే

నువ్వు ఉంటే ఒక చింత
ఎప్పుడెప్పుడు వస్తావో అని చూడటం
మనసు పెదవి తెరిచే లోపే మళ్ళీ వస్తా అనే మాటను నిట్టూర్పు సాక్షిగా చూస్తూ నిలిచిపోవడం...

నీ నుండి దూరంగా జరిగితే ఒక తంట
నిన్నటి రోజులలో ఇవ్వాల్టిని గడిపేస్తూ
రేపటి వరకు ఎలా ఆగేది నిను వదిలేసి అనే యాతన..

అలిగిన మనసును బుజ్జగిస్తూ
ఎందుకులే.......ఈ దూరాన్ని ఇలా అలవాటు చేసేసుకుని మరుపుకు వసమై పోదామా అనిపిస్తుంది...

అంత తేలికా అది....
అదే అంత సులువైతే
ఇలా ఈ అక్షరాల అరణ్యవాసం దేనికి..

✍️అరుణిమలు

No comments:

Post a Comment