ఉండిపోవా......
అని అడగాలనిపిస్తుంది
నువ్వు వచ్చిన ప్రతీసారీ..
నీ తలపులతో
నే సాగిస్తున్న ప్రయాణం
నీకు చూపించాలని..
నీకై నేను
ఎదురు చూసే కాలాన్ని
కాగితంగా మలచి నే రచిస్తున్న ఎన్నో..
అవన్నీ
నీ ముందు చదవాలని
నువ్వు ఏమంటావో అని చూడాలని కోరిక..
నీ ముందు
పెదవి తెరవని భావాలని
కళ్ళల్లో దాచేసానని నీకు చూపులతో
చేరవేయాలని కోరిక..
నువ్వు లేని
ఒక్కో గడియని ఎదెంత
భారంగా మోస్తుందో
నీ గుండెలపై వాలి చెప్పాలని ఉంది..
కనులు తెరవని స్వప్నాలలో
నువ్వు నాతో ఉంటే
ఈ లోకాన్నే మరచిపోతున్న..
ఎక్కడ కనులు తెరిస్తే
కనుమరగు అవుతావో అని
కంటి గడపకు కాటుకను కావలి పెట్టా..
ఏ చుప్పనాతి
చూపులు నిను తాకరాదనే
చిలిపి చేతల చుక్కనై నీ చుట్టూ అల్లుకుపోతున్న..
కలలకు ఆవల గడిపిన
కాలాన్ని లెక్క కట్టి ఇచ్చేయ్ ఇక
నువ్వు వచ్చి...
చాలిక...
చాలించిక
చెలగాట మాడకు మనసుతో..
నువ్వు వచ్చే దారి
వేపు నేనో వేగుచుక్కనై ఉన్న..
మరువకు..
✍️అరుణిమలు
No comments:
Post a Comment