ఒకరు మనల్ని గుర్తుంచుకునే తీరు
చెబుతుంది...
మనం ఎంత వరకు వారి వారమో అని..
ఙ్ఞాపకం ఉండటమంటే
ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు రావడం కాదేమో కదూ...
పదిమందిలో ఉన్న అలజడి రేపే వారి తలపు
ఏకాంతాన్ని హింసించే దూరం చెబుతుంది నేను నీకు ఎంతో..
నా తోడుతో ఉన్నప్పుడు
సమయాన్ని సైతం ఆగిపో అంటూ మందిలించడం ..
మనసుతో మనసు చెప్పే మాటలకు
చుట్టూ ఉన్న లోకాన్ని మరచి మురిసిపోవడం...
అలకంటు మురిపించుకుంటు
మారాం చేసి నీ ముందు ఓడిపోవడం..
ఒకటా, రెండా
నువ్వే లోకం అయ్యాక
చుట్టూ ఉన్న లోకంతో పనేమనే పొగరు..
ఎదురు చూపుల నుండి విముక్తి
కోరే చిన్ని మనసు పడే వేదన..
చిన్న నిర్లక్ష్యాన్ని సైతం
భరించలేక అలసిపోతు..
ఎందుకోయ్ ఈ తపన
చెప్పడం ఎలాగో నాకు రాదు
చూపించడం ఎలాగో నీకు రాదు
చేసి చూపించడం చేతకాదు కానీ
ఒక పలకరింపుకే కరిగిపోయే ఈ పిచ్చి మనసు..
మధ్యలో ఈ అక్షరాల మధనం
మనసు గోడును మౌనంగా లిఖించేస్తూ..
✍️అరుణిమలు
No comments:
Post a Comment