Thursday, 14 November 2019

తాను నేను

అనగనగా ఒక రోజు అంటు
మొదలయ్యిందో కథ...

నాలా ఉండే
ఓ మనసు నన్ను వెతుక్కుంటూ వచ్చింది..

నా కోసమే
నువ్వున్నావని పలకరించింది పొగరుగా..

నేను ఎవరినో
చెప్పుకో అంటూ ఎదకో సవాలు విసిరావు..

అడుగడుగులో
నీ పదం కలిపి నన్ను తప్పించుకోలేవన్నావు..

కోపంలో
కసిరి..
అలిగితే
అక్కున చేర్చుకుని
భరించేవాడిని నేనే అన్నావు..

మాటిస్తున్న అన్నావు
మరో ప్రపంచానికి పయనమయ్యే వరకు ఈ చేయి వదలనని..

కాలం ఏ కథని
సుఖాంతం కానివ్వదేమో..

సెలవని నీతో పలికించింది
ఈ మనసుకు శిలువ వేసింది..

తడికన్నులలో
నీ రూపు చెదరకుండా ఉండాలనే
రాలిన ప్రతీ చినుకును దొసిలి పడుతున్న..

తాత్కాలికమేనా నీ రాక అని మనసు శంకించింది....కాదు క్షణికమే అంది నీ వీడ్కోలు..

నిన్నలో నువ్వు ఉన్నావు
రేపు ఉంటావు
ఙ్ఞాపకాలేగా
వాటిలో నువ్వు ఎప్పుడు సజీవమే..

✍️అరుణిమలు

No comments:

Post a Comment