Saturday, 9 November 2019

తాను నేను

మనసు నిశ్శబ్దంగా మారిపోయింది
గడియ పాటు...
మౌనంలో చిక్కుకున్న ఆలోచనలలో
ఎన్నో ప్రశ్నలు..

అలిగి దూరం జరిగిన
ఆ గడియలే బాగుండేవి...

కోరి చేయకపోయినా
నీ ముందు మాట మూగ పోయింది..

పెదవి తెరిచి సంజాయిషీలు ఇవ్వడానికి
అభిమానం అడ్డు పడింది..

చేతిలో లేని రాతలేమో
చేజేతులా జారిపోయాయి..

గాయపడిన ఎదకు
ఓదార్పుకు బదులు శిక్ష పడితే ఎలా ఉంటుంది
అలాగే ఉంది ఇప్పుడు..

మాటలతో తూట్లు పొడిచే
అవకాశ వాదులు ఒకపక్క..

మర్మం ఎరగని
మూర్ఖుల గేలి ఒకపక్క..

నీ మాటలలో సేద తీరాలని ఉన్న
నీ సుతిమెత్తని ప్రశ్నలు తల ఎత్తనివ్వలేదింకా..

భారంగా రాలే ప్రతి కన్నీటి చినుకులో
ఎన్నో చిక్కు విడని
ముడులు ఉంటాయి....

ఏ చినుకు ఏ‌ మనసుకు ఏ కథను చెబుతుందో వినగలిగే శక్తి ఉంటే వినిపించే తీరుతుంది..

నన్ను నేను కూడగట్టుకోవడానికి
కాసిన్ని నవ్వులను పులుముకున్నాను ఇప్పటికి..

గాయం చేసిన నాలుక క్షేమంగా ఉంది
గాయానికే గాయం అయ్యి బాధ మిగిలింది..

✍️అరుణిమలు

No comments:

Post a Comment