దాచడానికి ఏముంది నా దగ్గర
సమస్తం నువ్వు దోచేసాక..
వద్దన్న మనసుని
వశం చేసుకుని..
కాదన్న కాలాన్ని
మళ్ళీ వెనక్కి మళ్ళించావు..
కోరింది కాదంటావు
అడిగింది లేదంటావు
ఏముంది అంటే నేనున్న చాలనా అంటావు..
రేపటికి పయనం ఎటో
తెలియదు..
కానీ....
నువ్వు నడిచే దారేదైన
నీ తోడుగా నే సాగలనే కోరికుంది..
కరిగి పోతున్న
కాలాన్ని వెనక్కి తిరిగి చూస్తున్న
నువ్వు, నేను గడిపిన క్షణాలను ఙ్ఞాపకాలుగా..
ఒంటరి ఆలోచనలలో
జంటగా నీతో సాగుతున్న పయనమే నాది..
అంతే...
మధురమైన ఘడియలన్ని
మత్తులో వదిలి కలగా మిగిలిపోతాయి..
మళ్ళీ మళ్ళీ దొరకడానికి
మరో తపస్సు చేయమనే ఆ సమయం కోసం
మరుజన్మ వరకు ఉండిపోగలను ఇలా..
మరి..
నువ్వు రాగలవా
ఈ జన్మ కైనా
అని మనసు అడుగుతుంది
మౌనంగా..
✍️అరుణిమలు
No comments:
Post a Comment