Friday, 2 February 2018

తాను నేను

చీకటి పారిపోయింది నీ కన్నుల నుండి జారే వెన్నెలను చూసి...

రాత్రి కరిగిపోతుంది నీ వెచ్చని శ్వాసకు...

తనువు తడారిపోతుంది కోరికల సెగలలో...

స్వేదం ఆజ్యం పోస్తుంది అలసిపోకని...

నైవేద్యంగా మారింది నను వదిలిన ఆత్మ...

ప్రేమను పానుపును చేసి ఆరాధించా నీ వడిలో...

కునుకును కానుక చేసా కాటుక చీకటికి....

ఆత్మీయ చుంభనం నుదుటిన సిందూరమై అద్దుకుని ఉదయించింది...
మళ్ళీ మళ్ళీ మేల్కొని నీలో అస్తమించమని...

✍️అరుణిమలు

తాను నేను

వెన్నెల తాపం జలపాతమై ఉరుకుతోంది శూన్యాన్ని తాకుతూ....

కరిగిపోతున్న శూన్యం హిమ పాతమై కురుస్తుంది....

చలి కాపుకు నిప్పును రాజేయకు నీ చూపులతో నా మదిలో.....

నీడ లేని ఈ నిశిలో నీ ఆత్మనై నీలో ఐక్యమై పోయేందుకు వేళ కాలేదింకా ఆగవోయ్.....

అవని పానుపు పై నింగి నీడలో ప్రకృతై జోల పాడదాం మన దేహాలకి....

తారల ముచ్చట్లు తీరిగ్గా విందాం మన కథను చూపించి....

ఎక్కడున్నావోయ్ ఇన్నాళ్ళు నీలో సగమైన నన్ను వదిలి.....
ఎక్కడికి పోలేవు ఇకపై ఈ మనసును వదిలి.......

✍️అరుణిమలు

తాను నేను

కనుల కావ్యాలను కదిలించకోయ్.....
నీ ఎదలో నిండిన వెలుగును నేను.....
నీతో ఉంటే ఆశకు ఆశ పుడుతుంది......
క్షణ కాలం కూడా వ్యర్ధం చేసుకోకని.....

ఈ దూర భారాల భారం మనసుదే...
భరించేది అదే బాదించేది అదే మనిషిని.....

నీ ఊపిరి ఊసులు మెడ వంపున తాకిన తన్మయంలో...... నే నను విడి పోతున్న నీలోకి.....
మన నడుమన చిక్కిన గాలి నలిగి నలిగి.....
కవ్విస్తుంది కాస్త దారిమ్మని జారుకోవడానికి.....

ఓయ్......అలా చొరబడిపోకు ఈ ఎద పైకి....
ఇది నీకై పుట్టిన.... నీకై వేచిన తనువు....

వేడుకులన్నీ నీకోసమే.....వెతలన్నీ నీ కొరకే
అల్లుకుపో మెల్లగా మణి మాలికవై
హత్తుకుపో హరివిల్లు కోకవై
నింపేసుకో నను నీలో విశ్వానివై
రుచి చూసేయ్ పాల నురగల సోయగాన్ని

✍️అరుణిమలు

తాను నేను

గుబురు పొదరింట్లో గూడు కట్టుకున్నట్టే ఉంటుంది
నీ ఎద పై ఒదిగిన నన్ను నీవు పొదువుకున్న వేళ..

మది బావి నుండి తోడే కొద్ది తరగనంటుంది
నీపై నా ప్రేమ..

నీ ఊపిరి ఆనవాళ్ళు ఆవిరై నీలో నన్ను
మునకలేయిస్తున్నాయి...

మనసా మరీ మరీ మీటకే ఎదను తన పేరుతో
వలపుల రాగాలు వయసును తాకుతున్నాయి..

తలవంచిన నేను తలపుల స్నానాలు
చేస్తున్న  తనతో...

వెన్నెల వాయినాలు అందుకుందాం
జతగా జాము గడిచాక..

నీతో గడిపే ప్రతీ క్షణం నూతనమే 
ఇప్పటికి ఎన్ని సంబరాలో
మన మానస మందిరంలో..

లోకానికి తెలియని ఈ సంబరాలలో
మనం ఆడిందే ఆట పాడిందే పాట..

ష్్్్్్్్్
ఇవి మన మది కథలు
మనలోనే మనతోనే మిగిలిపోనీ...

✍️అరుణిమలు

తాను నేను

కలం గడపన రాలిన సిరా చుక్కలు
కనుల నుండి జారిన నీ జ్ఞాపకాలు
రెండు కలిసి రచనలుగా మారుతున్నాయి..

ముగింపు ఎరుగని పయనంలో
ఎటో పోయిన మనసు అడుగుల సవ్వడిని
లిఖిస్తూ...పఠిస్తుంటే..

మనసుకు ఎంత ఊరటో...!!

అచ్చు నీ ఒడిన చేరిన పాపలా
నీ చేతులలో ఒదిగిన గువ్వలా
నీ గుప్పిట దాచిన నా రేఖలా
నీ పెదవులు తాకిన నా నొసటి రాతలా

✍️అరుణిమలు

తాను నేను

పెదవి పై ఉన్న నీపై కోపం....
........ మనసు నుండి వచ్చిందేనా..... డౌట్ కొడుతుంది......లోపల ఒకటి, బయట ఒకటి ఉన్నట్టు....😉😉😉...........నిజమే, అవునంటే కాదంటుంది....కాదంటే అవునంటుంది పాడు మనసు.......దేవదాసు లేదా చంద్రముఖి చేసి కాని వదలదు కదా దాని సొద వింటే.....😱😱😱😱

✍️అరుణిమలు

తాను నేను

కళ్ళు తెరిచి చూస్తే కనుమరుగై పోతుందేమో...
కనుల నిండిన నీ రూపం...

రెప్పల గడపన దాచిన నిన్ను...రెప్ప పాటున కూడా దూరం చేసుకోలేని బేల తనం...

గుండెల నిండిన రూపాన్ని కళ్ళకద్దుకొని కలవరిస్తున్న...
ఎదురుగా ఉన్న రూపానివి....ఎదను నిండిపోయావు మది పీఠాన్ని అధిరోహించి...

ఏలేది నువ్వు...నీ ఏలుబడిలో నీ అడుగులలో నీడలలో కలిసిన అడుగును నేను...

మనసుకు సంకెళ్ళను వేసావు...తనువుకు స్వేచ్ఛను ఇచ్చి...
ఎగిరేది ఏ నాటికి నీ నుండి...

నీ నుండి అంటే... నాకు నేను దూరంగా పోవడమే !! అది ఎలాగో ఎప్పటికి తెలిసేది...

ఇవే.. కళ్ళుమూసి నిను చూస్తూ...కలవరిస్తూ...నే కంటున్న కలలు...
నను వదలని...నే విడువని...నిను వరించిన...నను నిలవరించే...నీ తలపుల తాపత్రయం..

✍️అరుణిమలు