Wednesday, 29 March 2017

అడగాలనుంది

అడగాలనుంది ఒక్కటి కాదు ఎన్నో
నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడగాలని ఉంది
నిలకడలేని వాడివని తెలిసి ఎందుకు వచ్చావని
నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఎందుకు చేసావని
నమ్మకాన్ని ఎందుకు వాడుకున్నావని
అబద్ధంతో మొదలైన దానిని అదే అబద్దంలో ఎందుకు ముగించలేదని
ఇలా నిజాలను నా ముందు నిష్ఠూరంగా ఎందుకు చూపించావని
నీ ప్రేమ, నీ ఇష్టం, నీ ఆపేక్ష, నీ శ్రద్ధ అంతా మూడునాళ్ళ ముచ్చటని ఎందుకు చెప్పలేదు
నేను నీకిచ్చే కానుక నా నిర్లక్ష్యం అని ఎందుకు చెప్పలేదు
ప్రతి ఉదయం నీ పలకరింపు నిజం కాదని
ప్రతీ రేయి నువ్వు జోకొట్టిన జోల కాలక్షేపం అని ఎందుకు చెప్పలేదు
మాటల వెనుక మర్మం తెలుసుకోలేని పిచ్చిదాన్ని
ఎన్ని అడగలాని ఉన్న నిన్ను ప్రశ్నించలేని నిస్సహాయురాలని
అడిగితే వచ్చే జవాబు తెలుసు కనుక తప్పు అయిపోయింది అంటావు అదే కదా
నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన నువ్విచ్చిన ఈ గాయాలు మానేవా..
నిన్ను నేను చూసిన దృష్టి వేరు అదే నువ్వు చూపించుకున్న ఆ నువ్వే నా నువ్వు
ఆ దృష్టి మారకూడదు అలా నిన్ను ఊహించలేను ఇంక ఎలా చూడగలను
అందుకే ప్రశ్నలన్నీ పెదవిపై ఆవిరై పోతున్నాయి

No comments:

Post a Comment