Saturday, 29 February 2020

తాను నేను

అనుకోకుండా అందుకున్న 
వరానివి నువ్వు..

నువ్వు ఎదురైన ఆ క్షణం
కాలం ఘడియ పాటు ఆగిపోయింది..

భరించే వాడిని నేనుండగా 
నీకెందుకా కష్టమని
నీ పాదా లపై 
నా పాదాలను ఉంచి కదిలావు..

మనం ఎదురు చూసిన కాలం ఇదేగా
చెప్పవే అంటూ.. 
చిరునవ్వుతో ఆహ్వానించావు 
నీ బాహువులలోకి..

ఒదిగిపోయా నీ ఎద పై నిన్ను చుట్టేసుకుని
కాసేపటికి నీ గుండె సడి నన్ను కదిలించింది..

నాలుగు కళ్ళు నిశ్శబ్దంగా పంచుకుంటున్న మాటలకు మన శ్వాసలు ఊ కొడుతున్నాయి..

ఎప్పుడు నీ పెదవి చెక్కిలిని తాకిందో
అప్పుడు తెలిసింది చినుకు తాకిన మట్టి ఎందుకు పరిమళిస్తుందో అని..

నాలుగు పెదవుల కలయికలో 
కరిగిపోయిన కాలం..

మూసిన కనులలో అలజడి... 
ఎద వేగం పెరిగి కళ్ళు తెరిచాన...
ఎదురుగా నువ్వు లేవు..

చుట్టూ చీకటి
గదంతా నిశ్శబ్దం
ఒంటరిగా నేను..

అదురుతున్న అధరాలు
నన్ను తాకిన నీ స్పర్శ
ఏది నిజం ఇందులో..

ఎద సడి గడియారంతో పోటీ పడుతుంటే
నిన్ను కలవరించిన కన్నులలో తడి చేరింది

కలలా వచ్చి
కలవరంలో వదిలేసావ
వేకువలో వెలుగై వచ్చేందుకు..

ఎదురు చూస్తునే ఉన్న
కలలని కావ్యంలా కాకుండా
కానుకగా చూడాలని..

✍️అరుణిమలు

Friday, 28 February 2020

తాను నేను

నువ్వు నా ఆప్షన్ కాదు
నా చాయిస్ వి..

నేను గెలుచుకున్న
నన్ను గెలిచిన మనసువి..

నువ్వు నా అవసరానివి కాదు
నా అభిమానానివి..

నువ్వు నా కోరికవి కాదు
నా కలల తీరానివి..

నన్ను వెతుకుతూ వచ్చిన
నాలో సగానివి..

నా ఆలోచనలకి ఒక రూపం ఇస్తే
అది నీ లానే ఉంటుంది..

అందుకే ఏమో
నా పంచ ప్రాణాలకు ఆయవు ఐపోయావు..

ఎవరెవరి ఙ్ఞాపకాలలో 
ఏ రూపంలో దాగున్నావో తెలియదు కానీ..

నాలో నువ్వు ఉన్నది
ఙ్ఞాపకంగా కాదు 
గతంగా కూడా కాదు..

నా పెదవి పై చిరునవ్వుగా
నా కనుల స్వేదంగా
నా మనసు మాగాణిలో
ఉదయించే మహారాజువై ఉంటావు.. 

✍️అరుణిమలు

తాను నేను

నీకు మాట్లాడాలి అనిపిస్తే ??

అనిపిస్తే ఏంట్రా...

నీతో మాట్లాడకుండా ఉండటం 
ఎలాగో నేర్చుకోకుండానే..

మనసుకు మౌనం 
అనే ఒట్టు పెట్టా..

ఇప్పుడు
నా మౌనం
నాకు అగ్ని పరీక్ష పెడుతుంది..

మాటలే లేవు మన మధ్య 
మాటలు మాత్రమే లేవు..

నీ మాటకు బదులు ఇవ్వని
నా మౌనం నీకు చాలా చెబుతుంది
వినే ఉంటావు అనుకుంటా..

బాధ పెడితే నిన్ను
మన్నించేయ్ నన్ను..

నా మనసు జాగ్రత్త
నీ మనసు ఇక్కడ పదిలంగానే ఉంది..

✍️అరుణిమలు

తాను నేను

ఒక్కసారి వెనక్కి తిరిగి 
రావాలని ఉంది..

ఈ గుండెల్లో ఉన్న భారాన్ని
నీ ఎద పై దించేయలని ఉంది..

వాలిన కనులకు
ఆనకట్టలు కట్టలేకున్న..

ఈ గుండె వేగాన్ని
అదుపు చేయలేక పోతున్న..

నిదుర మరిచిన రాత్రులను
ఆదమరిచిన నీ ఙ్ఞాపకాలు ఆక్రమించేసాయి..

ఇంత బరువుగా ఉన్నాయి ఏంటో
నీ ఆలోచనలు..

నన్ను ఉక్కిబిక్కిరి చేస్తూ
నాతో నన్ను ఉండనివ్వకుండా పోరు పెడుతు..

ఈ శక్తి ఎంత వరకో
ఈ చింత తీరేది ఎప్పుడో..

నువ్వే ఒకసారి ఎదురై పోకూడదా
నే గీసిన గిరిని చెరిపేసి
నన్ను తీసుకు పో..

✍️అరుణిమలు (550 😍😍😇😇)

తాను నేను

నిన్ను అర్థం చేసుకోవడంలో ఓడిపోలేదు
సర్దుకుపోవడంలో ఓడిపోయా..

ఎందుకో ఈ అభిమానం...
ఏం మిగిల్చింది..

ఎవరు లేకపోయినా నేను నీకు ఉన్న అంటు
కావాలి అనుకున్న వారికి దూరంగా
నిలబెట్టింది..

చాలా భరువైన ఆభరణం 
ఆత్మాభిమానం..

బాధని మోయమంటుంది నవ్వుతూ
బంధీని చేస్తుంది మనసును..

ఆదరిస్తుంది కానీ
ఆదరణ కోరుకోనివ్వదే..

మారాలని ఉన్న
మారనివ్వదు కదా..

నీవలన తల ఎత్తుకుని ఉన్న
నాతో నేను ఓడిపోతు..

✍️అరుణిమలు

తాను నేను

మళ్ళీ తిరిగి వస్తా నీ దగ్గరకు... కానీ ఉపయోగం ఏముంది..

నేను ఎక్కడ నిన్ను వదిలి వెనుతిరిగానో
నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు..

ఇప్పుడు ఏంటి
తప్పు నాదే అంటావు
నీది ఏం లేదంటావు..

నీ ఆవేశం
నీ ఆలోచనలు
నేను నేను అనే నువ్వు..

ఇంతేగా నిజం..
తప్పు ఒప్పుకోవడానికి వెనక్కి తిరిగి రావడం దేనికి..

నాదే తప్పు...
సరేనా...

నా తప్పుకు 
నాకు నేను వేసుకున్న శిక్ష
మన మధ్య ఈ దూరం అనుకో..

నేను వేసుకున్న శిక్ష చాలదా
నువ్వే వేయాల..
తిరిగి నా మాటలు నాకు ఇచ్చేయాలి అంతేగా..

మళ్ళీ మళ్ళీ చంపడానికి
ఇక్కడ దేహం మాత్రమే మిగిలి ఉంది..
మనసు ఎప్పుడో చచ్చిపోయింది..

మనిషి మీద కొడితే కసి తీరదు
మనసు మీద కొడితే కదా కోపం తగ్గుతుంది..

మనసు మీదే కొట్టేసావు
మనం అనుకున్న ప్రతీసారీ నేను, నా అహం అంటూ...నన్ను వేరు చేసి పడేసి..

పిచ్చి దానిని...
నా అనే హక్కు ఉంది అనుకున్న..

అభిమానమో, ఆపేక్ష నుండి వచ్చిన మందలింపులను కూడా...
జవాబులు కావాలి అన్న రోజునే మనసు చచ్చిపోయింది..

దెబ్బ తగిలించుకున్నావని 
అమ్మ నడవడం చేతకాదా అని రెండు తగిలిస్తే..
అవకాశం దొరికింది అని కొడతావ, తిడతావ...నువ్వు ఎందుకు ఇలా చేసావంటే... 

తల్లి ఏం నిరూపించుకోవాలి అక్కడ, 
తన ప్రేమకు అర్థం ఏమని చెప్పాలి,
తన బెంగను ఏ విదంగా బయట పెట్టాలి...

నన్ను అదే చోటున నిలబెట్టావు...
నేను నీ తల్లిని కాను కనుకేమో నా సమాధానాన్ని మౌనానికి వదిలి వచ్చేసా...

సమాధానం ఇవ్వగలిగిన రోజున తిరిగి వస్తా..
నువ్వు పరాయి వాడివి ఐతే జవాబు ఇవ్వగలను..

అభిమానాన్ని వదిలేసిన రోజు తిరిగి వస్తా..
నువ్వు కావాలంటు,తప్పులను ఒప్పుకుని నిన్ను పొందేందుకు..

నువ్వు వేసిన ఒక్క ప్రశ్న
మనం అనే నా భ్రమను లాగిపెట్టి కొట్టింది..

ఇంకా అదే గాయాన్ని మోస్తున్న
బహుశా ఇది ఎప్పటికి మానదేమో..

నీలోనే, నీతోనే ఉన్నా ఇంకా
ఉంటా కూడా...
తిట్టిన, అలిగిన, కోప్పడిన,ఏడ్చిన,నవ్విన,ప్రేమించిన
అన్ని నీతోనే...
నీకు దూరంగా మనసుకు దగ్గరగా..

✍️అరుణిమలు

తాను నేను

చాలా చెప్పాలని ఉంది
అక్షరంగా మారి..

ఎంత రాసిన 
తరగని నా భావానివి నువ్వు..

అంతులేని ఈ అక్షర ప్రవాహం
చివరికి చేరేది నీ చెంతకే..

విశ్వమంత ఈ భావాన్ని
అణువంతగా మార్చి చెబుతున్న ఇనుకో..

❤❤❤ఐ లవ్ యు ❤❤❤

✍️అరుణిమలు

తాను నేను

మనసు నిశ్శబ్దాన్ని
కన్నీటితో కదిలించకు..

అక్కడ ఉన్నది...కష్టమో, సుఖమో
ఆశలో, నిరాశలో..

రెప్ప చాటున
దాగిన ఉప్పెనకు తెలుసు..

మౌన రాగాన్ని
ఆలపిస్తుంది మనసు..

భావం ఎరుగని
గీతమేదో పెదవిని చేరి ఆగిపోయింది..

ఎద లోతుని తవ్వుతున్న
ఙ్ఞాపకాలలో దాగిన అపార్ధాలను చదువుతూ..

ఆపేక్షలో, అభిమానమో
తెలుసుకోలేని మనసు వేసిన తప్పటడుగులు..

జవాబులు తెలిసినా
తెలియనట్లు దాటేసిన ప్రశ్నలు ఎన్నో..

చీకటి ఒడిలో
చిదిమేసిన ఇష్టాలను
కన్నీరుగా ఒలకనివ్వని మొండి తనం..

అక్షర వ్యాసమా ఇది
కాదే....

మనసు ఒక నిశాని
దానికి తెలిసిందల్లా నమ్మేయడమే
మనసుకు దగ్గర ఐన వారిని..

✍️అరుణిమలు

తాను నేను

ప్రేమంటే నమ్మకం లేదు అనేవారే నిజాయితీగా ప్రేమిస్తారు...

వాళ్ళకు ఈ డే లు గట్రా పట్టింపులు ఉండవు
పాటించరు కూడా...

చాక్లెట్ అడిగితే... 
చాక్లెట్ ఇచ్చి మాయ చేయడానికి 
నేనేం మాయగాడిలా కనిపిస్తున్నాను ఏంటే
కావాలంటే కొనుక్కొని తిను
లేదా చాక్లెట్ తింటా కొనరా అని అడుగు అంటాడు..

బండ సచ్చినోడు...

ఒక ముద్దు, ముచ్చట
సరదా, సంబరం లేదంటే..

తాయిలాలు ఇచ్చి అడుక్కోవడం దేనికే
ఆడుకుందాం కావాలంటే అంటాడు..

(ఇలాంటి ఒక జంటను చూసాను నేను....ఈ పోస్ట్ నేను రాయలేదు.... నా ఐడి హాక్ అయ్యింది ఇప్పుడు)

తాను నేను

మనసును చీల్చే నీ మాటల పై 
ఎదురు దాడి చేయడానికి‌.. 

నేను ఆయుధాన్ని అవ్వను..
మౌనాన్ని ఆశ్రయిస్తాను..

మనసు విరిగిన రోజే వస్తే
నీ నుండి దూరం జరగడమే తప్ప తిరగబడలేను..

నిన్ను శిక్షించను
నన్ను పరీక్షించుకోను..

నా ప్రేమ ఇంతే 
దాని తీరు అంతే...
నిన్ను నొప్పించి నేను పొందేది అశాంతే కదా..

బతికించే ఙ్ఞాపకాలు కావాలి
బాధించేవి దేనికి..

దూరమో, దగ్గరో
నా బలంగా నువ్వు మిగిలిపో చాలు..

✍️అరుణిమలు

తాను నేను

ఆత్మీయురాలినో
అర్ధాంగినో బంధమేదైతే ఏముంది
నన్ను ఏనాడో నీ బంధీని చేసేసావు...

జీవిత చివరి క్షణం కొరకు
వాగ్ధానాలు వద్దు..
ఈ క్షణం నువ్వు
నాతో పంచుకునే కాలమే ముద్దు..

నీ బాహు బంధనం
నా బందీ ఖానా ఐతే చాలు..

నీ వ్యాపకాలన్ని తీరాకైనా
నేను గుర్తు వస్తే నాకో క్షణ కాలాన్ని ఇచ్చేయ్..

ప్రపంచమంతా నీదే ఐనా
నా ప్రపంచంలో ఉన్నది నువ్వు ఒక్కడివే..

నాకోసం నువ్వు వెతుకుతూ వచ్చే
దారి వేపే చూపులని వదిలేసా..

పెదవి విప్పి చెప్పాల ఇవన్నీ
తెలుసుకోలేవా ఈ శ్వాస పడుతున్న ఆశ నీవేనని..

మనం అనే మాటను
విడదీయను..
మనసు నుండి
నిన్ను దూరం చేయను..

నా నుండి నా ప్రయాణం
చేరేది నీ దగ్గరకే..
మలుపులు ఎన్ని ఉన్న
ముగిసేది అక్కడే..

✍️అరుణిమలు

తాను నేను

కసిరే కోపం నీదే
అక్కున చేర్చుకునే మనసు నీదే..

ఆవేశాన్ని చూపిస్తావు
అధికారం ఇస్తావు..

నా కోపాన్ని భరిస్తావు
నే గీసిన దూరాలను చెరిపేస్తావు..

అలకంటే చిరాకంటావు
అలిగితే లాలిస్తావు..

తగ్గడమే తెలియని వాడివి
తలొంచి ఒడిలో వాలిపోతావు..

నన్ను దూరం చేసుకోలేని
నువ్వు దూరం జరగని బంధం ముడి వేస్తావు..

మాటలతో దాడి చేయడం
ఆనక గంధాన్ని గోముగా రాయడం..

నా కోపాన్ని చూసి నవ్వడం
యుద్దానికి రమ్మంటు ఆహ్వానం ఇవ్వడం..

నువ్వంటే నేనంటు
నేనంటే నువ్వంటు 
వేరుకామంటు..
 
వెనుతిరిగిన ప్రతీసారీ
నన్ను నీ గుండెల్లో దాచేసుకున్నావు..

ఏ బంధమో తెలియని
బంధనంలో బంధీని చేసావు.‌.

అరె.........
నిన్ను ఎందుకు వదులుకుంటార
ఎంత దూరంలో ఉన్న
ఈ మనసు నీ చెంతనే ఉంటుంది
చూసుకో కావాలంటే..

✍️అరుణిమలు

తాను నేను

నువ్వో వరమనుకున్న కానీ 
శాపమయ్యవురా..

హా....శాపమే

ఎక్కడో ఉంటావు నువ్వు
ఇక్కడ నన్ను శాసిస్తావు, అదుపు చేస్తావు, వేదిస్తావు..

ఎప్పుడో వచ్చి పోతావు
నీ పలకరింపు కోసం పడిగాపులకు నన్ను వదిలేసి
ఎదురు చూడమంటావు..

నువ్వు వద్దురా నాకు అంటే
నా వెన్నంటి ఉంటా అంటావు..

ఒంటరిగా ఉన్న నీ ఆలోచనలే
ఎక్కడ నన్ను వదలవా కాసేపైనా..

నన్ను నాకు ఇచ్చేయ్ అని వరమడగాలని ఉంది..
కానీ మనగలనా నీ తలపుకు దూరమై అనిపిస్తుంది..

నువ్వు నాతో లేని ప్రతీ క్షణం
నిన్ను ఎన్నెన్ని విధాలుగా తలంచుతానో
తెలయదే నీకు..

నాకు నేను లేను నువ్వు వచ్చాక
నాకు ఉన్నది నువ్వే ఇప్పుడు... నేను ఉన్నది నీ లోనే కనుక..

నన్ను నాకు దూరం చేసి ఆడుకుంటున్న నువ్వు వరానివి ఎలా అవుతావు...
శాపానివే కదా...

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను వెతికే కనులు
నిన్ను తలచే మనసు
అలోచన ఒకటే

నువ్వే ఎదురు వచ్చిన రోజున
నన్ను నేను నిలువరించగలనా

నీ కళ్ళ లోకి చూడగలనా
నా కళ్ళతో కబుర్లు చెప్పగలనా

మాటలే కరువై
కాలాన్ని ఆగమని ఆగిపోనా..
 
ఈ క్షణం చాలని
ఇంకే వరం వద్దని

నీ ఎదపై సోలి 
అదర సంతకంగా
మిగిలిపోనా..

ఏ కాలమో
నాకోసం మిగిల్చిన
కానుకవు నువ్వు..

✍️అరుణిమలు

తాను నేను

చెల్లాచెదురుగా పడిన నా మనసు ముక్కలను...
ఒకచోట పేరుస్తున్న...

మళ్ళీ ఒకసారి నీ రూపాన్ని చూడాలని
నిన్ను గుండెలకు హత్తుకోవాలని...

కుదురుతుందా
నా వలన అవుతుందా..

రెప్పవెయ్యనివ్వని
నీ ఆలోచనల పోరులో అలసిపోతున్న...

ఎందుకే నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావు 
నన్ను బాధ పెడతావు అంటావు...

తలొంచలేను,నప్పుకు పోలేను
నటించలేను, నిందించలేను..

వీటిన్నిటి కన్నా నన్ను నేను హింసించుకోవడం‌ తేలికగా, హాయిగా ఉంటుంది..

నాతో నేను చేస్తున్న ఈ యుద్దంలో
ఓడిపోయి మరోసారి నిన్ను గెలుచుకోవాలని ఉంది..

నా చేతుల్లో పనే కదా
కానీ చేత కావడం లేదు రా..

ఎలా.....ఎలా...
నా అడుగులను నీ వేపుకు మళ్ళించేది..

✍️అరుణిమలు

తాను నేను

నన్ను చూస్తే నువ్వు గుర్తు వస్తావు..
నిన్ను చూస్తే నేను గుర్తు వస్తాను..
మనం తెలిసిన వారికి..

ఇంతకన్నా గుర్తింపు ఏముంది
నువ్వు, నేను వేరు కాదని
కాలేమని..

మనం విడిపోవడం
కలే అని..

సర్వాధికారాలు నీవే అంటు
ఈ సారికి ఇలా సరిపెట్టుకో అంటే ఏమంటా ఇక..

మాటల్లో ముంచేసి
మాయలో ఉంచి దోచేసావు మనసును..

మనం అనే పదం నుండి
నన్ను వేరు చేయలేను
నిన్ను విడదీయ లేను..

✍️అరుణిమలు

తాను నేను

మన నిర్ణయాలను
ఒప్పుకోదే ఈ మనసు..

మనం ఎటో చూస్తే
దాని చూపులు వేరోక చోట ఆగిపోయి ఉంటాయి..

మన అడుగులు ముందుకు పడుతుంటే
అది మాత్రం గతం దగ్గర నుండి కదలనంటుంది...

పెదవులపై నవ్వులు ఎన్నో
మనసు నిండా దిగులు మబ్బులే..

ఎలా ముడేసావో నీ మనసును
విప్పతరం కావడం లేదే నాకు..

నా కథలో నువ్వో మజిలీ అనుకున్న
నాతోనే కదిలే నా కలవని తెలియలేదు..

నువ్వు వచ్చిన దారి తెలియదు అప్పుడు
నువ్వు వెళ్ళిన దిక్కు వేపే చూస్తుంది
ఏ దిక్కులేని ఈ మనసు..

కాలం నదిలో కదిలిపోతున్న నావని
ఏ తీరాన ఉన్నావో తెలియని నీకోసం ప్రయాణం..

కలం కదలనంటుంది
కాలం ప్రశాంతంగా లేక..

అల్లకల్లోలమే ఈ మనసు
ఐనా బయట పడదే నీ ముందర..

అప్పుడు ఇప్పుడు
నువ్వు నువ్వే
నేను నేనే..

అనుకోకుండా కూడా
ఎప్పుడు ఎదురు పడకు నాకు
నన్ను నేను నిలువరించడం ఎలాగో తెలిసే వరకు..

✍️అరుణిమలు

తాను నేను

నేను అలిగితేనో
బెట్టు చేస్తేనో
నువ్వు మాటలు కలుపుతావు..

లేదంటే
యాంత్రికమే కదా
మన జీవితాలు..

ఒకరికి సమయం కావాలి
ఒకరికి తీరిక దొరకాలి..

నువ్వు నాతో ఉండే కొద్ది క్షణాల కోసం
ఎన్నో యుగాల సంఘర్షణ ఎదుర్కొంటున్న..

మనసెలా ఉన్న
నువ్వు ఎదురైన క్షణాన 
నన్ను నేను మరచిపోతుంటా కావాలని..

ఙ్ఞాపకాల కాలాన్ని హత్తుకుంటున్న
ఎదలో రాలిపోతున్న ఆశలకు శ్వాసను నింపేందుకు..

ఎలా... ఎలాగోయ్
ఈ గుప్పెడు గుండెల్లో నిన్ను
గుప్పెట దాచిన‌ దుఃఖాన్ని 
భరించేది...

✍️అరుణిమలు

తాను నేను

గతంలా మారిపోయింది నిన్నటి కాలం
నువ్వు వెళ్ళిపోయావు...ఙ్ఞాపకాలను వదిలేసి

రేపటి వేపు చూస్తు
ఆ శూన్యంలో నీ రూపుని చిత్రిస్తున్న..

వెనక్కి తిరగని కాలం
ముందుకు కదలని పాదం..

కలం...పదం
కలిసే చోట రాలిందో
కన్నీటి చుక్క..

చెదిరిన భావాలను
చెరిపేయ లేను..
చెమర్చే కన్నులను
ఓదార్చలేను..

అప్పుడప్పుడు వస్తుంది
వసంతం..
ఆశలను చిగురించి
చిదిమేసి పోతుంది..

అందుకే ఆశించకే మనసా
అలవాటు పడకే అనేది..

మళ్ళీ నువ్వు వస్తావ
మన్నులా మారిన మనసుకు రూపాన్ని ఇస్తావ..

✍️అరుణిమలు

తాను నేను

అడగాలని ఉంటుంది నిన్ను ఒక మాట...అభిమానం ఎందుకు అని అడ్డు పడుతుంది..

పెదవి దాటని మాటని చదవడం నీకు రాదు...
మనసు విప్పి చెప్పడం నాకు చేత కావడం లేదు...

అందుకే నువ్వు అక్కడ
నేను ఇక్కడ..

ఇలా ఎద గడపకు ఇవతలే
మౌనంలో సమాధి అయ్యే బంధాలు ఉంటాయి అందరి జీవితాల్లో..

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను వెతకని కనులకు కునుకు రాదు
నిన్ను వెతికే కనులకు అలసట రాదు..

అక్కడెక్కడో వదిలేసిన నా ఆశలకు
వెనక్కి పెట్టి నిల్చున్న..

మొండితనమా, 
పంతమా..

మౌనంలో నలుగుతున్న ఆలోచనలకు
దారి వెతకాలని లేదు..

కలవరపడుతున్న మనసుకు
ఊరడింపు మాటల పూత పూయాలని లేదు..

కోరికలన్ని కష్టపెట్టేవి
ఆశలన్ని అస్తమించేవే..

కష్టాలు కావాలని రావు
కోరి తెచ్చుకున్న మన ఇష్టాల మరో రూపమే అవి..

కొన్ని పరిచయాలు పరీక్షలు పెడతాయి
జీవితమంత ఎదలో చోటు ఇచ్చే
జత కూడని జంటలు ఎన్నో ఈ లోకంలో..

అస్తమిస్తున్న ఈ సూరీడుని 
వెతుకుతూ వచ్చే ఆ చందమామలా..
కలిసి ఉండలేరు ఇద్దరు
కలవరించకుండా ఉండలేరు..

✍️అరుణిమలు

తాను నేను

తలచావేమో
పిలిచినట్టు వినిపించింది..

నీ పిలుపు కోసం
పరితపించే పిచ్చి మనసు
మాటిమాటికీ వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది..!!

✍️అరుణిమలు

తాను నేను

రెండు పదాలలో ఇమడ్చలేనంత
చెప్పాలని ఉంది నీకు..

ఏ భావాలను 
ఈ పదాలలో పొదగను..

మనసు నిన్ను పెనవేసిన
ఆ చోటనే నా ఆలోచనలు సంచరిస్తున్నాయి..

ఏ చోట నువ్వు ఉన్న
నేను చెప్పాలని అనుకున్న మాటలు 
నిన్ను పలకరించి వస్తాయి అని తెలుసు..

ఇదేగా మనం
తనువులు వేరైనా, మనసులు జతకట్టేసాయి..

దారులు వేరైనా
గమ్యం ఒకరిలో ఒకరు కలవడమే కదా..

మనిషిగా ఇక్కడ ఉన్న
నీ ఊహల నీడన దాగుని..

✍️అరుణిమలు

తాను నేను

మన గురించి ఆలోచించడం అలవాటు... 
అందులో నీకోసం ఆలోచించేదే ఎక్కువ..

నీతో గొడవ పడతా
నీకోసం గొడవ పడతా..

నీ దగ్గర అలుగుతా
నీకోసం నాలో నేను మదనపడతా..

నువ్వు తిడితే ఏడుస్తా
నిన్ను తిట్టినా ఏడుస్తా..

నీకు దగ్గర అవ్వాలంటే భయం
దూరం అవ్వాలంటే బాధ..

నువ్వు ఎందుకు వచ్చావు అనిపిస్తుంది
నువ్వే రాకపోతే నాకు నేను సరికొత్తగా పరిచయం అయ్యే దానిని కాను..

నీ మీద అరుస్తా 
నువ్వు నాకు ఇచ్చిన హక్కని మురిసిపోతా..

మన ఇద్దరికి రాసి పెట్డి లేదని తెలుసు
అందుకే మన ఙ్ఞాపకాలను నేను రాసుకుంటున్న ఇలా..

మనసులో చోటిచ్చా అనుకున్నా కానీ
మరుజన్మకు కూడా ఈ మనసు నీదే అని ఎద పై చెక్కేసా..

✍️అరుణిమలు

తాను నేను

నా మౌనం నీకు మాత్రమే వేసిన శిక్ష కాదు
నీతో పాటు నాకు సగభాగం ఉంది అందులో..

నా ఆంక్షలలో నిన్ను ఖైదుని చేయలేదు
నా ఆలోచనలు బంధీలయ్యాయి నీలో..

నిన్ను చేరని నా తలపులు
నా వద్దే అలిగి కూర్చున్నాయి..

ఎన్నో చెప్పాలని ఉంది కానీ
పెదవికి ఎందుకో ఈ బింకం..

మాటలు మరచిన మనసుకు
నీ ఙ్ఞాపకాలే ఓదార్పు..

ఎందుకో...
ఈ కాలానికి పరీక్షలు పెట్టడం అంటే
ఇంత ఇష్టం..

ఇద్దరి మధ్య దూరమనే గిరి గీసి
చోద్యం చూస్తుంది..

లెక్క పెడుతున్న చుక్కలు లెక్క తేలడం లేదు
నేను నీకు దూరంగా జరిగిన ఈ రోజులు గడవడం లేదు..

కలిసిపొమ్మని ఎద నస పెడుతుంది 
కానీ....తీరానికి చెరో వేపు ఉన్న తీరాలమని
కలవడం కుదరదని దానికేం తెలుసు..

✍️అరుణిమలు

తాను నేను

నీకై ఎదురు చూపులలో
అలసి పోయింది తనువే కానీ మనసు కాదు..

మనసు మేల్కొనే ఉంది
నిన్ను తన తలపు లలో దాచుకుని ఇంకా..

నువ్వు వచ్చే దారిలో
నా కన్నుల వెలుగులను వెదజల్లి వేచి ఉన్న..

ఎదనే పరచా నీకై
ఏలుకోవడానికి రావయ్య 
ఏడేడు జన్మల నా దొర ..

✍️అరుణిమలు

తాను నేను

ఎలా మొదలయ్యిందో మన ప్రయాణం
గుర్తు లేదు...

ప్రతీ మలుపు మరుపు రానిదే..
ప్రతీ ఘడియ విలువైనదే..

నిన్ను కలిసాకే కదా
నన్ను నేను తెలుసుకున్నది..

నాలో మరో కొత్త వ్యక్తిని చూసింది
నిన్ను చూసాకే కదా..

మాటలు నుండి మనసుకు ఎలా దారి వేసావో తెలిసే సరికే...నా అడుగులు నీ ఎద గడపకు అవతల చేరుకున్నాయి..

నిన్ను గెలిచానో
నన్ను నేను ఓడించానో 
తెలియదు కానీ నువ్వు అనే బహుమతి
నా ఎదను అలంకరించింది.. 

నువ్వే కానుకగా మారాక
ఇక నా ఆనందానికి హద్దులే లేవు..

ఇది ఏ మజిలీలో ముగింపు అవుతుందో
అనే భయం వెంట నీడలా నడుస్తుంది..

కాలం ఇచ్చిన కానుకను
క్షణం కూడా కాలయాపన కానీయ్య కుండా 
ఙ్ఞాపకాలుగా దాచుకోవాలి అనుకున్న..

కానీ నీ దగ్గర నాకోసం ఆ కాలమే లేదని
తెలిసే సరికి.. 
మనసు చాలా దూరం ప్రయాణించేసింది నీ ఊహల్లో..

ఎలా మనసుకు చెప్పాలో
ఎలా నీకు చెప్పాలో తెలియని
అయోమయం నాది అయ్యింది..

నీ ప్రయాణంలో నేనో పాత్రని మాత్రమే అని నాకు తెలుసు..
మరి నా ప్రయాణంలో నువ్వో భాగం కాదు, నా పయనమే నువ్వని అని నీకు తెలుసా..

తెలిసీ తెలియనట్లు నువ్వు ఉంటున్నావని అర్ధమయ్యే..
ఈ మజిలీకి నేనే ఓ ముగింపును నిర్ణయించా నీ జీవితం నుండి తప్పుకుని...

చాలా ఇబ్బంది పడిపోయావు కదు..
ముసలోడివి అయ్యాక గుర్తు తెచ్చుకుని గర్వపడిపో...నీకోసం ఎక్కడో ఒక మనసు నిన్ను తనలో ఇంకా ఙ్ఞాపకంగా దాచుకుందని...

✍️అరుణిమలు

తాను నేను

ఎలా ఉన్నావో అని మనసు పదే పదే ప్రశ్నలు వేస్తుంది..

మారం చేస్తున్న మనసుకు నా జవాబు ఇదే..

నీ తలపే లేని చోట నేను ఉండలేను..
నీ వలపే లేని రోజు నేనే మిగిలి ఉండను..

నీ క్షేమమే నా శ్వాసకు కారణం కనుక..
ఎక్కడ ఉన్నా నిన్ను నువ్వు నాకోసం జాగ్రత్తగా చూసుకుంటావని తెలుసు..

నేనెలా ఉన్నాను అని అనుకుంటున్నావ..
నీ ఆలోచనలలో మునిగి ఉన్న హాయిగా..

నీకోసం ఎంత ఆలోచిస్తున్నానో అనేది
నీ ఆలోచనకు కూడా అందదు..

✍️అరుణిమలు

తాను నేను

నువ్వు నాకొద్దంటు వెనుతిరిగా...

ఐనా అడుగడుగునా నా మనసు వెనక్కు తిరిగి చూడమంటుంది.‌..

ఎదురుగా నీ రూపే చూపిస్తూ, 
నీ తలపే సృష్టిస్తూ, 
నువ్వు పిలవని పిలుపుని వినిపిస్తూ, 
భ్రమలు కల్పిస్తూ నాకు పరీక్షలు పెడుతుంది...

✍️అరుణిమలు

తాను నేను

నీపై ఇష్టాన్ని చూపించలేను...కోపాన్ని ప్రదర్శించలేను..

ఇదేగా నువ్వు కోరుకున్నది... ఇలాగే కదా నేను ఉండాలని నువ్వు ఆశించినది..

నేను నేనులా ఉండేదే నీ ముందర...ఇప్పుడు నీ ఎదుట ఉన్నది నువ్వు మలుచుకున్న నేను కాని నేను..

నా భావోద్వేగాలన్ని మౌనంలో సమాధి అయిపోయాయి...నీపై నా భావాలన్ని అక్షరాలకు పరిమితమై పోయాయి..

కలతలు లేని, అలకలు రాని అన్యోన్య జంట మనం... ఒకరి కోసం ఒకరమై, ఎవరికి ఎవరమో తెలియని మనసులు మనవి..

✍️అరుణిమలు

తాను నేను

నా ఙ్ఞాపకాలను దాచుకున్న నిన్ను
ఈ గుండెల్లో దాచుకోవడం నాకు ఎంత ఇష్టమో తెలుసా..

ఊహల కౌగిళ్ళల్లో
ఉవ్వెత్తున ఎగిసే మన శ్వాసలు చేసే సమరంలో
ఇద్దరం విజేతలమే..

అవును...
బంధమే లేని బంధనంలో
ఇరువురం బంధీలమై ఒకరికొకరికి ఖైదీలం అయిపోయాం ఎప్పుడో..

ఓయ్......
పిలుపు విని చిరునవ్వులు నవ్వకు
చిరుగాలిలా నిన్ను అల్లుకుపోతా ఈ క్షణమే..

ఆయువుగా మారిపోయి
నా అణువణువునా నిండిపోయావు ఎప్పుడో..

మనసుకు దగ్గరగా
మనిషికి దూరంగా..

✍️అరుణిమలు

తాను నేను

ఎన్నో విస్పోటనాల మధ్య కూడా
మనసు మౌనం గానే ఉంది..

కొన్ని నిర్ణయాలు సవాలు విసురుతుంటే
కాలం పరీక్ష పెడుతు వేడుక చూస్తుంది..

ఎక్కడ నుండి వచ్చిందో
ఈ మొండితనం..

ఎవరిచ్చారో
ఈ శక్తిని..

నువ్వు లేని క్షణాలను ఊహించలేని
ఈ ఎదను
నీ ఆలోచనల కడలిలో నిర్ధయగా పడేసా..

అలసిపోతున్న‌ మనసుకు
నీ ఙ్ఞాపకాల ఊపిరి పోస్తున్న నేడు..

ఒకటి మాత్రం నిజమొయ్
ఏ దూరం నా మనసు నుండి నిన్ను దూరం చేయలేదు.... మరే మనసుకు అక్కడ చోటు లేదు..

✍️అరుణిమలు

తాను నేను

లోకమంతా నిశ్శబ్దంలో కునుకు తీస్తుంది
అక్కడక్కడ కొన్ని మనసులు మేల్కొనె ఉంటాయి..

రాత్రులు నిద్ర లేచే ఆలోచలలో
నాతో నేను చేసే మౌన పోరాటాలు ఎన్నో..

అవకాశం లేని చోట ఆశలు పెంచుకోవడం
జీవం లేని చోట చిగురించాలి అనుకోవడం
ఎంత పిచ్చి తనం..

కొన్ని పరిచయాలు బంధాల కన్నా
బలీయంగా ఎదలో నాటుకు పోతాయి..

కానీ...ఎవరు మనం అంటే
ఎవరికెవరో లోకానికి... మనసుకే ఒకరికొకరు

ఎక్కడో ఒకచోట ముగింపు ఇవ్వాల్సిందే వాటికి
ఒకరికొకరు ఇబ్బందిగా మారక మునుపే..

సాగరంలా పైకి కళకళలాడుతూ
గర్భాన కన్నీటిని దాచేయాలి..

ఎన్నో బంధాల నడుమ
మనసు గెలిచిన వారికి దూరంగా..

ప్రతీ రాత్రి నీ కలల్లో మేల్కొంటు
కల లాంటి ఉదయాలను ఆహ్వానిస్తూ బతికేస్తున్న సంతోషంగా..

✍️అరుణిమలు

తాను నేను

అక్షరాల తోవలో నాకు ఎదురైన 
నా భావానివి నువ్వు... 

నువ్వు లేని నా పదం లేదు... 
నువ్వు లేని కాలం మన కథ కాదు...

నువ్వు లేని పదాలలో నా కలలు కూడా లేవు... నువ్వు లేని నేను ఎవరనే ప్రశ్నను అవుతా...

నీ చుట్టూ నువ్వు చూసిన స్నేహాలలో ఇచ్చిపుచ్చుకునే అవసరాలే ఎక్కువ కదా...

నేను నీ అవసరాన్ని కాలేను 
నిన్ను అవసరంగా చూడను...
నువ్వు నా మనసు తోడువు మాత్రమే
నాతో ఉన్న, లేకున్న..

✍️అరుణిమలు

తాను నేను

ఎవరి కోసమైన ఎదురు చూసే చోట 
కాలం కూడా క్షణికమై పోతుంది...

ఎవరి ఆలోచనల్లోనో మది అలలు అలలుగా ఎగిసి తీరాన్ని కోతలు పాలుచేసిన బాగుంటుంది...

ఎవరో కలిసే చోట యుగాల నిరీక్షణ కూడా ఇష్టంగా దొర్లి పోతాయి...

ఎవరి తలపో మనసును తాకి, పెదవిని చేరగనే
కళ్ళు చెమ్మగిల్లి మది తేరుకుంటూ ఉంటుంది...

ఎవరు....... అనే ఈ ఎవరు లేనిచోట 
ఆలోచనకు, ఎదురు చూపులకు, ఆశలకు, ఊహలకు వేటికి చోటు ఉండదు.‌‌..

చివరికి 
మనకు కూడా..

✍️అరుణిమలు

తాను నేను

అలిగానో, కోపంతో కాదనుకున్నానో 
బాధతో వద్దు అనుకున్నానో..

ఏమనుకున్న నువ్వు లేని 
చోటు మరొకరికి తావు ఇవ్వదు ఈ మనసు..

నువ్వు లేవు కానీ నీ ఙ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి అక్కడ... ఇంకెక్కడ ఖాళీ

సరదాకైనా ఇంకొక ఊహకు
ఇక్కడ చోటు లేదు
ఎవరికి ఆహ్వానం లేదు..

నాలో నేను
నా ఆలోచనల నిండా నువ్వు
ఏకాంత తీరాలని తాకుతూ గడిచి పోతున్న కాలం..

✍️అరుణిమలు

తాను నేను

నాతో నేనే మాట్లాడుకుంటున్న
నాలో నిన్ను చూస్తూ..

పిలవాలని ఉంది నిన్ను ఒక్కసారి
ఎవరికి వినపడకుండా
నీకు కూడా..

మనసులో వందల సార్లు
జపిస్తున్న నీ పేరును..

కానీ....పెదవికి తనివి 
తీర లేదు..

నీ ఙ్ఞాపకాలలో తడిసి ముద్దౌతున్న మనసుకు
ఇవేం కోరికలో..

నువ్వు లేని ఈ కాలాన్ని
కలగా మార్చే ఏ వేకువో రావాలని ఉంది..

నీ చిరునవ్వుల‌ మేల్కొపులలో
నేనో మంచు బిందువై మెరిసిపోవాలని..

ఆశలు కాదు అత్యాశలు 
అని తెలుసులే..

✍️అరుణిమలు

తాను నేను

నీ కొంటె తలపులలో కొట్టుకు పోనా
నిన్ను కొంగుకు కట్టేసుకోనా..

కవ్వించే నీ మాటలలో
ఏ మంత్రముందో...

ఎంత కోపమైనా 
నీ పిలుపు తాకగానే ఆవిరైపోతుంది..

ఆ నవ్వులో ఏ గమ్మత్తు ఉందో
నీ మత్తులో‌ నేనెప్పుడో చిత్తుగా ఓడిపోయా..

ఎదురు పడనంత సేపే ఎడబాటు
నువ్వు ఏయ్ అంటే ఇక్కడ తడబాటు మొదలవ్వదా..

చుట్టూ ఉన్న లోకాన్నే మరచిపోతా
నువ్వు ఎదురైన క్షణంలో..

ఇక నాకు నేను ఎక్కడ గుర్తుంటా
నీలో వెతుకుతూ నీలోనే తప్పిపోతుంటే..

వచ్చేయ్ వోయ్ వసంతమై 
ఈ పెదవిపై సిగ్గును 
ఈ కళ్ళల్లో ఆనందాన్ని
నీ ముందు దాచలేక ఇబ్బంది పడాలని ఉంది..

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను ప్రేమించడం మాత్రమే 
తెలిసిన మనసుకు.. 

ద్వేషించాలంటే 
మరో జన్మ ఎత్తాలి...

అదే మరచిపోవాలి అంటే..?!

ఎన్ని జన్మలు ఎత్తిన‌ 
నీకోసమే ఎదురు చూసే ఈ మనసుకు 
మరుపు అనేది మరణంగా మారినా 
నా నుండి నిన్ను వేరు చేయలేదు ఎప్పటికి..

ప్రేమించేటప్పుడు ప్రేమంటే
ఏంటో అనుకున్న..

దూరం జరిగాక..నువ్వే ఆ ప్రేమని
నా ప్రేమ లోకం నీలోనే ఉందని తెలుసుకున్న..

✍️అరుణిమలు

తాను నేను

అలసిన నా మనసు తేరుకునేది 
నువ్వు నా వాడివి అనే 
ఆలోచన వచ్చాకే కదా..

నీ ఆలోచనలు వచ్చి పలకరిస్తూ
ఉంటాయి..
మనసును పదమంటూ ఎటో ఎటో
నడిపించి ఏడిపిస్తాయి..

అలసిన కనులలో నిన్ను దాచుకుని
పెదవుల నిండా నవ్వులు పులుముకుని
నా పనిలో నేనుంటా కదా..

ఓయ్.......
అనే పిలుపుతో తుళ్ళి పడతాను
బదులు ఇద్దామంటే 
ఎక్కడ నువ్వు కనపడవే..

రాత్రి మేల్కొనే కలలు
పగలు కూడా ఇలా కలవర పెడతాయి అని
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది..

నువ్వనే ముద్ర ఈ శరీరం మీద పడలేదోయ్
మనసు మీద రాసుకున్న... 

మనసా, వాచ 
నేను నీ దానినే ఎప్పటికి..

✍️అరుణిమలు

తాను నేను

నా ఆలోచనలలో నువ్వు ఎక్కడో ఉన్నావు...

నా చూపులు నిన్ను తల ఎత్తే వెతకాలి 
కానీ..... ఏనాడు మౌనంగా నేల చూపులు చూడకూడదు..

ఇంతకు మించి నా గర్వాన్ని నేను ఇంకేం ఆశించను..
ఇస్తావ ఆ మాట...

ఆత్మతో ముడిపడ్డావు నువ్వు 
ఎప్పుడు దూరం కావు, కాలేవు నాకు..

కానీ నువ్వు పక్కన ఉన్నప్పుడే కాదు...
నీ తలపు కూడా నన్ను గర్వపడేలా చేయాలి..

నీ పిలుపులో 
నా పొగరు కనపడాలి..

ఇంతే
ఇంకేం వద్దు..

✍️అరుణిమలు

తాను నేను

నన్ను మేల్కొలిపే నీ తలపులు జోకొట్టవు కదా రెప్ప వాలనివ్వమంటు కావల కాస్తున్నాయి...

నీ ఊహలలో అలసిన క్షణంలో మూసిన కనులను ఉలిక్కిపాటుతో లేపుతావు..

ఏ మాత్రం దయ లేదా స్వామి నా మీద...

అలసిన మనసుకు విశ్రాంతి ఎలాగూ లేదు... శరీరానికి కూడా ఇవ్వవా..

కనుల మూసిన ఘడియకే ఏవేవో కలవరింతలు..

జాలి దయ లేదు
నీకు... నీ మీద ఉన్న నా ప్రేమకు

సంతోషంగా ఉండమని కబురు పంపకు...నువ్వు లేని సంతోషం ఎక్కడ ఉందో ఇప్పుడు వెతక లేను..

నువ్వు ప్రశాంతంగా ఉండు....నీ దిగులు పోయి అయినా నా చిరునవ్వు అయినా నా దగ్గర మిగులుతుంది..

✍️అరుణిమలు

తాను నేను

నిన్ను కలవాలని కోరిక లేదు
నిన్ను చూడాలని తపన లేదు

ఎక్కడున్న నువ్వు క్షేమంగా ఉండాలని 
ఏ ఆపదలకు ఎదురు పోకూడదని

మాత్రమే కోరుకుంటున్న..

నాతోనే ఉండాలని అత్యాశ లేదోయ్
నీ మనసులో ఏ మూలనో నీ మేలు కోరే ఒక ఙ్ఞాపకంగా మిగిలిపోతే చాలు..
నీ జీవితపు చివరి ఘడియలు వరకు నీతో నేను ఉన్నట్టే కదా..

నీ ఎద గుడిలో కొలువైతే చాలు
కోటి జన్మలను నా కాలి‌ గోటికి కూడా చాలవనుకుంటా..

వరించిన మనసు వరాలు అడగదు
తానే ఒక వరమై నీలో కలిసిపోతుంది..

✍️అరుణిమలు

తాను నేను

నీ ప్రేమ పరిచయం అయ్యాక ప్రశాంతత పోయిందిరా నాలో...

ఎలా ఉన్నావో
ఏం చేస్తున్నావో
అనే చింత..

ఎదురు చూసి చూసి
అలసిపోతున్న తరుణంలో వస్తావు...నీ పలకరింపుతో తట్టి లేపుతావు..

చెప్పాలి అనుకున్నవి ఏవి చెప్పను...
ఇంతలోనే ఏదో జగడం మన మధ్య..

నీ అహం వేసే ప్రశ్నలు
చేసే గాయాలు..

నీతో నేను గొడవ పడిన
నాతో నువ్వు గొడవ పడిన
ఏడ్చేది నేనే..

నీ దూరాన్ని భరించలేను
నీ మౌనాన్ని సహించలేను
నా అభిమానాన్ని చంపుకుని ఉండలేను..

ప్రశాంతత నీలో ఉంటేగా 
నాకు పంచగలవు.‌.

ఎదురుపడనంత వరకు నీ తలపులతో పోట్లాటలు
ఎదురు పడ్డాక నీతో..

ఏవో ఙ్ఞాపకాలను పోగేసుకుందామనుకున్న..
కానీ కన్నీటిని దోసిట నింపుతున్న నేడు..

నీతో ఉన్న బాధే
నువ్వు లేకున్న బాధే..

ఏ బాధైనా ఇష్టమే అనిపిస్తుంది
నువ్వు నాతో ఉంటే చాలు..

కానీ కలిసి ఉంటే 
నీ మీద ఉన్న విలువకి భంగం వస్తుంది ఏమో అనిపించింది..

అందుకే...నా మనసులో మొదటి సారి 
నువ్వు నా వాడిగా కలిగిన భావాన్ని దాచుకోవడానికి దూరంగా వచ్చేసా..

నన్ను నేను నీ నుండి దూరంగా ఉంచలేను 
కనుకే...ఒట్టుతో నా మనసును శాసించాను..

మనకోసం మనం మాట్లాడుకోము
పోట్లాడుకోము..
మనకంటు, మన కోసం అంటు మనం పంచుకున్న సమయం ఉందా అసలు..

✍️అరుణిమలు

తాను నేను

నా ఆలోచనలలో నువ్వు ఉన్నావో లేదో అనుకోకు...అక్కడ నీకున్న స్థానం నాకు కూడా లేదు...

మాటకు మాట
దెబ్బకు దెబ్బ
ఎక్కడ తగ్గవు కదా..

ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయాలి
అంటావు కదా...

మరి నాలా నువ్వు 
నీ ఆలోచనలలో నాకు చోటు ఇవ్వగలవా..

ఓడిపోతావేమో....ఇక్కడ

ఎక్కడైనా గెలుపు నీదే
ఈ విషయంలో గెలుపు నాదేనోయ్..

✍️అరుణిమలు

తాను నేను

నా గురించి రాద్దామని 
రాసేసా ఏదేదో...

కానీ చదువుతుంటే ప్రతి భావంలో 
నువ్వే కనిపిస్తున్నావు..

నిన్ను నువ్వు అన్వేషించుకునే 
దారిలో ఎదురైనా ఒక అనుభవాన్ని మాత్రమే నేను..

నీ ఎదలో దాగిపోయా
చిన్ని వెలుగునై నీ వెంట..

ఏనాడైనా ఒంటరిగా
అనిపించినప్పుడు 
నాకోసం,నన్నే లోకంగా భావించే వారు 
ఎవరున్నారని ప్రశ్నించుకో..

ఆ తలపులో 
ఏ వరుసలోనైనా 
నీ మనసును తాకి పోతాను..

మనం ఎవరం
అని మాత్రం బదులు అడగకు ఏనాడు...

నిజం చేదుగా 
అబద్ధం తీయగా 
ఉండటం అంటే 
ఇదేనేమో అనిపిస్తుంది...

✍️అరుణిమలు

తాను నేను

ఎదురు చూపులో 
ఎన్ని ప్రశ్నలో..

ఎలా ఉన్నారో, 
ఏం చేస్తున్నారో, 
ఎప్పుడు వస్తారు, 
మనం గుర్తుకు వస్తామ, 
గుర్తుకు వస్తే పలకరింపేది..

తీరికగా తీరిక అయ్యాక వచ్చి 
ఏం చేస్తున్నావు అంటావు..

ఈ మాట కోసమేనా
తనువంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసేది..

ఏ మాత్రం ఆత్రం కనపడదే
ఆ స్వరంలో...

ఏదేదో చెప్పాలి, చూపించాలని
అనుకున్నవన్ని ఆవిరై పోతాయి..

ఐనా నీకోసం చూసే అలవాటు పోదు
నీ గురించి ఆలోచనలు నన్ను వదలవు..

ఈ మనసుకు ఉన్న
తొందర అంతా ఇంతా కాదు..

అంతలోనే సంతోషం
ఇంతలోనే నీరసం..

తనువును వదిలి
ఎక్కడెక్కడో తిరుగుతుంది 
మనల్ని తిప్పుతుంది..

అది వలచిన వారి చేతిలో 
మనల్ని కీలుబొమ్మలను చేస్తుంది..

✍️అరుణిమలు

తాను నేను

అలలా వస్తావు 
అలికిడి చేసి వెళిపోతావు..

వెళుతున్నానని చెప్పవు 
మళ్ళి వస్తానని అనవు
జాగ్రత్త అని చెప్పవు.. 

అయినా నువ్వు 
మళ్ళీ వస్తావని నాకోసం 
ఎదురు చూస్తూ.. 

జాగ్రత్తగా వెళ్ళి రమ్మని 
ఈ మనసు తనతో తను 
చెప్పుకుంటుంది ఎప్పుడు..

చప్పుడు చేయని ఎన్నో ఊసులు 
ఈ గుండె చప్పుడులో కలిసిపోతునే ఉన్నాయి..

కరిగి పోతున్న కాలపు కాగితం పై
మన కథ మరో చెరిగిపోతున్న స్వప్నంలా ఉంది..

అంతే కలలు నిజం కావు
నిజాలు కలలు అవ్వవు..

✍️అరుణిమలు

తాను నేను

అతిథిగా వచ్చావని మరచిపోయాను
ఆతిధ్యంగా నా మనసులో చోటిచ్చా...

సెలవని నువ్వంటుంటే 
వద్దని నిన్ను ఆపలేను
నీ వెంట నడవలేను...

ఏమని సర్ది చెప్పేదోయ్ 
ఈ మనసుకు ఇప్పుడు 
నువ్వు తన మనిషివి కాదని,కాలేవని..

నా నుదుటన రాయని నీ పేరు
ఈ గుండెల్లో రాసేసావు..

చెరపలేను
నీ చెరలో చిగురించలేను..

✍️అరుణిమలు

తాను నేను

మనసు నిండా భారం నిండిపోయింది
అయినా పెదవి తెరవాలని లేదు..

ఎదంతా ఆలోచనల అలజడే
అయినా మాటలే కరువయ్యాయి ప్రశ్నించడానికి..

రాయాలని ఉంది
కానీ.....ఏం రాయాలో తెలియక
అక్షరాలు అలిగాయి..

ఆకాశం ఉరుముతుంది
అచ్చంగా నా ఆవేదనలా...

మబ్బులు ఆకాశాన్ని కమ్మేసాయి
పదే పదే నా అభిమానం మీద దాడి చేసిన నీ మాటలు లా..

పెళ్ళుమనే శబ్దం కదిలించలేదు నన్ను
నా ఆత్మాభిమానం తీసుకున్న నిర్ణయం అంతకన్నా పెద్ద చప్పుడే చేసింది ఈ ఎదలో..

గుండె బద్దలైన ఆకాశం
ఒక్కో బొట్డుగా కరిగిపోతుంది..
‌నా కళ్ళలో మాత్రం నీటి బొట్టు లేదు..

బండ బారిన ఎదలో
ఏ ఆలోచన చలనాన్ని ఇవ్వలేక పోతున్నాయి..

నమ్మకాలు సమాధి చేసిన చోట
ఒంటరిగా మనసు మిగిలిపోయింది..

✍️అరుణిమలు

తాను నేను

మనసును చీల్చే నీ మాటల పై 
ఎదురు దాడి చేయడానికి‌ 
నేను ఆయుధాన్ని కాలేను..

నువ్వ నా గర్వానివి కదు
అందుకే
మౌనాన్ని ఆశ్రయిస్తాను..

మనసు విరిగిన రోజే వస్తే 
నీ నుండి వెనుతిరిగి చూడలేనంత 
దూరం జరగడమే తప్ప తిరగబడలేను..

నా ప్రేమ ఇంతే దాని తీరు అంతే...
నిన్ను నొప్పించి నేను పొందేది అశాంతే కదా..

నా అభిమానం నీ అహం 
అనేది లేకుండా ఉంటే మనం మనమే ఎప్పటికి..

మూడో వ్యక్తికి కూడా అవకాశం 
ఇవ్వన్నంత నమ్మకం ఒకరి మీద ఒకరికి ఉంది..

కానీ అహం చేసే గాయాలకు
అభిమానం పదే పదే తలొంచలేను అంటుంది..

నీ అహాన్ని జయించలేను
నా అభిమానాన్ని వదిలేయలేను..

అందుకే 
మనసు వనవాసాన్ని కోరింది ఇలా..

✍️అరుణిమలు

తాను నేను

ఎప్పుడో పుట్టే తలపువు కావు 
నాతో నడిచే వలపువు నువ్వు..

రెప్పలు మూయగానే
మెల్కొనే నా స్వప్నానివి నువ్వు..

అలల్లా అలుపే లేని నీ ఆలోచనలు
వచ్చి నన్నో ముద్దిచ్చి తడిపేస్తుంటాయి..

తొలిపొద్దులో ఏదో 
ఙ్ఞాపకంగా మేల్కొంటావు నాలో...

మలిపొద్దులో
నీ ఎదలో దాచుకుని జోల పాడతావు..

తీపి గాయాలను చేస్తు
మరచిపోలేని కానుకులను ఇచ్చి
నన్ను మాయ చేస్తావు..

ఎవరవోయ్ నువ్వు అంటే
నుదుటన ముద్దిచ్చి నవ్వుతావు..

నీ తోడు నా బలం
నీ దూరం ఒక శిక్ష
నీకై ఎదురు చూపులు ఒక పరీక్ష
నువ్వే నా బలహీనత..

నీకై పుట్టిన ఈ ప్రాణం
నీ పేరుకే అంకితం..

కలుసుకోలేం
విడిపోలేం
మరచిపోలేం కూడా..

మనం 
మన కథ ఇంతే..

✍️అరుణిమలు

తాను నేను

మనసు అప్పుడు, ఇప్పుడు ఒంటరిదే
ఒక్క నువ్వు లేవనే మాటే తప్ప..

నీకై ఎదురు చూపులలో గడిపిన కాలమే ఎక్కువ
ఎలా ఉన్నావనే పలకరింపుకు ఆశ పడిన రోజులే ఎక్కువ...

అందరు బాగున్నార, ఎలా ఉన్నారనే పలకరింపే తప్ప..
ఏం, ఎలా ఉన్నావు అంటే
నువ్వు ఇలా ఉంచావని నన్ను నేను చూపిస్తే చూడలేను అనుకున్నావ..

నీకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావో
ఏం ఇస్తున్నావో
నాకై నిన్ను నువ్వు పంచలేనప్పుడు
దేనికోయ్ ఈ బంధం..

నువ్వు ఏకాంతంగా గడిపే కాలంలో
నా ఆలోచనలు ఏనాడైనా నిన్ను పలకరించాయ
అని అడగాలని ఉన్న.... జవాబు రాదని తెలిసే ఆగిపోయాను..

నిన్ను నాకు అలవాటు చేయకూడదు అనుకున్నప్పుడు..
మనసుతో ఈ చెలగాటం దేనికి..

పదిమందిలో నన్ను ఒంటరిని చేయగలిగే నీ తలపులు...
ఏకాంతంలో నాతో యుద్ధం చేస్తున్నాయి
ఏం ఆశిస్తున్నావని
ఏం పొందావని..

అప్పుడు ఆశగా చూసే దానిని
ఎప్పుడు నీ రాక అంటూ
ఇలా వచ్చి అలా మాయమయ్యే ఆటలు నువ్వు ఆడుతుంటే ఎదకి అయ్యే గాయాలను
అక్షరాలుగా పోసి పేర్చే దానిని..

ఇప్పుడు ఙ్ఞాపకాలు తప్ప
ఆశలు లేవు
ఎదురు చూపులు లేవు
నీ ఆలోచనలలో నన్ను వెతుక్కుంటూ
నాతో నేను నిన్ను నీడగా 
నింపుకుని సాగిపోతున్న..

✍️అరుణిమలు

తాను నేను

కరిగిపోతున్న కాలంతో పాటు
కదిలిపోవాలి అని ఉంది..

కానీ...
నిన్ను వదిలిన ఆ చోట
ఆగే ఉన్న ఇంకా..

ఈరోజు ఎందుకో 
కన్నీరు ఆగనంటుంది..

కరిగి వరదలై పొంగి ఇంకి 
పోవాలని ఉంది 
నాలో నేను..

ఏ సాగరసంగమం దేనికి 
అంతరంగమే ప్రళయంగా మారాక..

అలల కోత
గాయాలను చేస్తుంటే
నవ్వులను అద్దుకుని నటిస్తున్న..

నీ ఆలోచనలను అణచాలని
చేసే ప్రయత్నంలో ఓడిపోతున్న మళ్ళీ మళ్ళీ..

అనంతమైన ప్రపంచంలో
ఏకాకిగా మనసు మిగిలింది
తనువే తిరుగుతుంది 
బాధ్యతల చట్రం నుండి తప్పుకోలేక..

నీ ఙ్ఞాపకాల లోకంలో విహరిస్తూ
ఎన్నోసార్లు గతం లోకి వెళ్ళి వస్తున్న..

కానీ...‌.
గతాన్ని మార్చలేక
భవిష్యత్తును తీరుగా మలచలేకపోతున్న..

ఎలా మలచేదోయ్...
ఉన్నది ఒక మనసు
అది పుట్టిందే నీకోసం ఏమో
నా మాట వినను అంటుంది..

✍️అరుణిమలు

తాను నేను

నీ ఙ్ఞాపకాల సంపద కోసం
ఆశ పడ్డాను...

రేపటి రోజున 
నాకు తోడుగా ఉంటాయని..

ఇప్పుడు
నీ ఙ్ఞాపకాలు అంటేనే
మనసు ఆరిపోయే దీపంలా
వణుకుతుంది..

ఇదే ఫలితం
నన్ను చేరుతుంది అని
నిన్ను కలిసిన మొదటి రోజున తెలియలేదు..

నన్ను వెతుకుతూ వచ్చిన
నా మరో ప్రాణానివి అనుకున్న..

ఈ జన్మకు పొందని
వరానివని తెలిసి
మరుజన్మకు నీ తోడు కోరుకున్న
పిచ్చి దానిని..

మనసంటే తెలియని నీతో
ఎన్ని జన్మల ప్రయాణం చేసిన
మనం ఒకటి కాలేం అని
ఎంత ఆలస్యంగా తెలిసింది..

నన్ను నేను నీ నుండి
దూరం చేసుకోవడం ఎంత కష్టమో అనుకున్న..

మాటలతో మనసు ముక్కలు చేసి
ఇంత సలువుగా నీ తలపును తీసి పారేస్తావని 
అనుకోలేదు..

పొందింది అంతా మాయగా ఉంది
పోయిన కాలమంతా ఏ జన్మ ఋణమో అనుకుంటు..

నన్ను నాకు తిరిగి ఇచ్చేసిన నీకు 
"కృతజ్ఞతలు" మాత్రమే చెప్పగలను..

పోవోయ్ బాటసారి
మరో మనసును వరించడం
ఎంత నేరమో చెప్పేసావుగా..

✍️అరుణిమలు

తాను నేను

తిట్టిన, కొట్టిన, మెచ్చిన
నువ్వే అనుకున్న...

మరి నువ్వే నా బాధవైతే
ఎలా ఉంటుందో
అని ఎప్పుడు ఊహించలేదు..

నువ్వు ఇచ్చిన ఏకాంతం
బాగుంది అనుకున్న
మన గురించి తెలుసుకోవచ్చని..

నీకై ఎదురు చూసిన 
చూపులలో మన రేపటిని వెతుక్కుని
ఇదో తీయని బాధ అని సరిపెట్టుకున్న..

నువ్వు చూపించిన
నిర్లక్ష్యాన్ని  
కాల పరీక్ష అనుకున్న..

నీ అహం గాయపడిన
ప్రతీసారీ
నువ్వు వేసిన శిక్షను 
మౌనంగా భరించా‌..

ఏం ఆశించానో నీ నుండి
ఎప్పుడో మరచిపోయా..
ఎలా ఈ దూరాలను చెరిపేయాలనే
తపనలోనే కాలం గడిచిపోయింది..

నువ్వు, నేను
అనే ప్రతీ క్షణాన్ని 
ఙ్ఞాపకంగా దాచుకుందామనే ప్రయత్నంలో
ఓడిపోయా..

నీకు నేను ఎవరిని అనే ప్రశ్నలో 
నన్ను ఎంత సునాయాసంగా పడేసావో...

నా అభిమానాన్ని ఒక్క వేటుతో
నరికేసావుగా..
మనసు విరిగిపోయింది ఇప్పుడు..

నన్ను నేను చూసుకోవడానికి
నాతో నేను మాట్లాడుకోవడానికే
ఏదోలా ఉంది..

ఇక నీ తలపు కూడా 
నన్ను కదిలించలేనంతగా బద్దలు చేసేసావు..

ఇది మలుపు కాదు
మన కథకు ముగింపు..

✍️అరుణిమలు

తాను నేను

మరచిపోవాలంటే తలంచాలి
తలంచేది మరచిపోవడానికా 
ఎలా అనే ఆలోచన ఒకనాటిది...

కొన్ని సంఘటనలకు స్పందించడానికి కూడా ఒక్కోసారి మనసు ఒప్పుకోదు...

తలంచను, స్పందించను, మరచిపోను 
నువ్వో‌ మౌనానివై సమాధి ఐ పోయావు నాలో నేడు.. 

నమ్మకాలను నడి వీధిన
వదిలేసాక..
ఎదలో గరళంలా
మింగేసిన ప్రశ్నలు ఎన్నో...

ఎంతటి ఘనమైన మొదటాఖరి
బహుమతి అందుకుందో 
ఈ మనసు నీ నుండి..

ఎన్నో అనుకున్న
చివరాఖరుకు నీ తలపుకు కూడా
చిగురాటుకులా మనసు వణుకుతుంది..

✍️అరుణిమలు

తాను నేను

ఏవేవో ఆలోచనలు
కాదు సందేహాలు
అది కాదేమో..

ఏదో భయం
నిన్ను తెలుసుకున్నాన పూర్తిగా..

నీ అంతరంగాన్ని
చదివాన లేదా...

రేపటి వేపు
పడుతున్న నా అడుగులు
తీయని ఙ్ఞాపకాలేనా...

ఎక్కడెక్కడో
జరిగిన కథలలో
మన కథ ఒకటై మిగిలిపోదుగా..

నీకై ఎదురు చూస్తున్న
ఈ కనులు చూసేదంతా నిజమే కదా..

ఏదేదో గుబులు
నువ్వు లేని గడియలలో
నన్ను వెంబడిస్తుంటే..

అప్పుడే 
వచ్చి పిలుస్తావు..

ఏయ్...
ఏంటా పరద్యానం అంటు..

నిజమే 
ఏ దూరమో నన్ను
మాయ చేయాలని చూసిన ప్రతీసారీ..

చేయి అందుకుని
చేర దీసుకుంటావు..

ఇదే...
ఈ స్పర్శే
గుండెల నిండా ధైర్యాన్ని నింపేస్తుంది..

✍️అరుణిమలు

తాను నేను

పిలిస్తే పలికానా
తలంచితే చూసాన..

ఇప్పటికి
సందేహమే..

ఎలా..
నీ రాకను ఊహిస్తానో
ఎలా..
నీ మౌనానికి బదులిస్తానో

కావాలనుకుని
పిలిచినప్పుడు నువ్వు పలకవు..

కానీ..
నీ తలపులో మునిగి
వెనుతిరిగి చూస్తే ఎదురుగా ఉంటావు..

మనసులో
ఆనందమంతా పెదవుల పై చేరి
కనులలో దాగుంటుంది సిగ్గై..

ఇదంతా నాకేనా
నీకు కూడా జరుగుతుందా
అని అడగాలని ఉన్న
అడగలేకున్న..

జరిగితే
మనం అనేది నిజం..
జరగకపోతే
నేను అనేది భ్రమే..

✍️అరుణిమలు

తాను నేను

ఈ ప్రేమలు గట్రా 
నాకు తెలియదంటావు..
నాలుగు రోజుల 
నా మౌనానికి చిన్నపిల్లాడిలా
అల్లాడి పోతావు..

ప్రేమించడం 
నాకు రాదంటావు..
ఎన్ని జరిగిన ఏమయ్యినా
నిన్ను వదిలేది లేదని 
మాటిస్తావు..

ప్రేమ మీద
నమ్మకం లేదంటావు..
నీ ఎద భారంగా ఉన్నప్పుడు
నా ఒడిలో చేరిపోవడానికి
నన్ను వెతుకుతూ వస్తావు..

నా నుండి ప్రేమను
ఆశించకంటావు..
కోపంలో నేను వదిలి
పోతుంటే 
ఎందుకు నన్ను ఆపలేదు
అంటావు..

ప్రేమంటూ అధికారం
చేయకంటావు..
నన్ను అనే హక్కు నీకే ఉంది
నే పడేది నీ దగ్గరే అని
నాతో క్లాస్ పీకించుకుంటావు..

అసలు
ఈ ప్రేమంటే ఏంటో
నీకు తెలియదా
నాకు తెలియదా
అనిపిస్తుంది..

మరి 
మన మధ్య
ఉన్నది ఏంటోయ్..

✍️అరుణిమలు

తాను నేను

వేచి వేచి 
వేసారిన‌ మనసు పై
నీ పలకరింపుల జల్లులతో
పులకరింతలు పుట్టించావోయ్..

నువ్వు 
ఏ ఋతువు వై
ఎప్పుడు వస్తావో..

ఏ కాలానికి
నా కలలను వదిలి
రమ్మంటావో‌ తెలియని ప్రశ్నవి...

మనం అంటావు
నేను నువ్వు ఎవరంటే
ఒకటే కదా....కాదా
అని ఎదురు ప్రశ్నించే నేర్పరివి..

నీ కలంలో పదాన్ని
నీ అక్షర భావాన్ని
కాలానికి ఎదురు వెళ్ళే తర్కాన్ని..

కాసంత దూరానికి
నిన్ను వదిలేసిన
బాధ్యతగా నిన్ను వెతుక్కు వచ్చే 
నీ వాడినే ఎప్పటికి అంటావు..

ఆ దూరాలలో రాలిన 
కన్నీటి బొట్లను
నీ చేతులతో తుడిచి
నీ స్థానం ఎప్పటికి మారదంటుంటే..

నన్ను ఓడిపోయి‌
నిన్ను జయించిన గర్వం
నా పెదవులపై తిష్ట వేసుకుని కూర్చుంది..

తనను తాను
అన్వేషించే వ్యక్తికి
నేనో మజిలీని..

నా భావ సంద్రంలో
నువ్వో జీవానివి..

✍️అరుణిమలు